Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli Announces Test Retirement Ahead Of England Tour1
రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ కోహ్లి

అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్‌ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్‌ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్‌ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు.

Debate On Chandrababu Selling Amaravati Land For 20K Crore Per Acre2
బిల్డప్‌ బాబాయ్ బడాయి!

అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్‌ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

India And Pakistan Ceasefire DGMO Meeting Updates3
భారత్‌, పాక్‌ చర్చలు ప్రారంభం..

DGMO Meeting Updatesభారత్‌, పాకిస్తాన్‌ మధ్య చర్చలు ప్రారంభం,హాట్‌లైన్‌లో భారత్‌, పాక్‌ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్‌ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.

Ex Army chief Manoj Naravane Says War is not Bollywood movie4
యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్‌ సీరియస్‌

ఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్‌ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.మరోవైపు.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్‌ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్‌ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్‌ చేశారు.

End of the iPhone Era AI Powered Innovations and Industry Shifts5
ఐఫోన్‌ అంతరించనుందా..?

ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్‌ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్‌లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్‌ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ ‍క్యూ తెలిపారు.యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్‌ అసిస్టెన్స్‌, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్‌ అవేర్‌నెస్‌, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్‌ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.

MP Shashi Tharoor Praised Foreign Secretary Vikram Misri6
మీకు దమ్ముందా?.. విక్రమ్‌ మిస్రీపై ట్రోల్స్‌కు శశిథరూర్‌ కౌంటర్‌

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri) బహిర్గతం చేశారు. ఈ ప్రకటన అనంతరం కొందరు నెటిజన్లు.. సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. దీనిపై తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) స్పందిస్తూ ట్రోలింగ్‌ చేస్తున్న వారికి కౌంటరిచ్చారు.కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సమయంలో విక్రమ్‌ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచారు. భారత్‌ గొంతును వినిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. అలాంటి అధికారిని ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్నవారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో భారత ఆర్మీ కర్నల్‌ సోఫియా ఖురేషీ, నేవీ వింగ్‌ కమాండర్‌-హెలికాప్టర్‌ పైలట్‌ వ్యోమికా సింగ్‌ల పనితీరుపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. వారి పనితీరు అద్భుతమని కొనియాడారు.అంతకుముందు.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం ప్రకటన అనంతరం.. కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా విక్రమ్‌ మిస్రీపై ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్‌ చేయడం విచారకరమని ఐఏఎస్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Anurag Kashyap Reveals Who Help His Daughter marriage7
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్‌ డైరెక్టర్‌

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్‌ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.విజయ్‌ సేతుపతి గురించి అనురాగ్‌ కశ్యప్‌ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్‌ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్‌ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్‌ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్‌ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్‌ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్‌ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్‌ సేతుపతి వల్లే అని' అనురాగ్‌ కశ్యప్‌ తెలిపారు.గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్‌ పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌ నటించారు. నిథిలన్‌ స్వామినాథన్‌ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్‌ కశ్యప్‌.. రైఫిల్‌ చిత్రంతో పాటు డకాయిట్‌ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఆయన చేతిలో ఐదు సౌత్‌ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్‌గా బాలీవుడ్‌ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు.

Ahmed Sharif Chaudhry Says Pakistan Jet damaged Clash with India8
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్‌ అధికారిక ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ యుద్ధ విమానంపై అటాక్‌ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన సీనియర్‌ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌ జరిపిన దాడిలో పాకిస్తాన్‌ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్‌ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్‌-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్‌.. పాకిస్తాన్‌ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్‌ వార్త అని ఖండించారు. భారత్‌ పైలట్‌ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్‌ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌ విమానాలను నేల కూల్చామని ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్‌ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్‌ సూపర్‌ పవర్‌..ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో భారత్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్‌ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్‌ ట్యాంకర్‌ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్‌ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్‌ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

Meet Executive Chef Challa Laxminarayana Success Story In Telugu9
సక్సెస్‌ అంటే...‘సాఫ్ట్‌వేర్‌’ ఒక్కటే కాదు బాస్‌!

తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్‌ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్‌ఎంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొందారు. ఒక హోటల్‌లో ఉద్యోగంతోపాటు హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్‌ హైజీన్‌ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా హోటల్‌ మేనేజ్‌మెంట్, కేటరింగ్‌ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్‌ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్‌లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్‌లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చెఫ్స్‌ సొసైటీ, సౌత్‌ ఇండియన్‌ చెఫ్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఐసీఏ), ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కలినరీ అసోసియేషన్‌ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్‌ కలినరీ ఫెడరేషన్‌ (ఏసీఎఫ్‌) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్‌ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్‌ నట్స్‌’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్‌వెజిటేరియన్‌ వంటకాల విషయంలో, మటన్‌ కర్రీతో దోసెలా స్ట్రీమ్‌ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్‌ మొప్పాస్‌’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్‌ ప్రాన్స్‌’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్‌ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్‌ ఫ్రై బిట్‌ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్‌వేర్‌’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ

Qatar Royal Family 747-8 jumbo jet Gift To Trump10
ట్రంప్ ఖతార్‌ పర్యటన.. భారీ బహుమతి రెడీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఖతార్‌ భారీ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్‌ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. ఖతార్‌ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్‌ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement