Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Prabhutvam Non Stop Revenge on Posani Krishna Murali1
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు

తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(APFDC) మాజీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్‌పై సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్‌ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్‌లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి ఓబులవారీపల్లి పీఎస్‌కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది.

YS Jagan Mohan Reddy to meeting with leaders of joint Kurnool district2
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం నేడు!

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల)కు చెంది­న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురు­వారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లను ఆహ్వానించారు. వీరితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షు­లు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Today Gold Price April 10th 2025 in India3
ఒకేసారి రూ.2940 పెరిగిన గోల్డ్ రేటు: నేటి కొత్త ధరలు ఇవే..

వరుస తగ్గుదల తరువాత.. కొంచెం పెరిగిన బంగారం ధర ఈ రోజు (ఏప్రిల్ 10) ఊహకందని రీతిలో పెరిగింది. ధరల పెరుగుదలలో బహుశా ఇదే అల్‌టైమ్ రికార్డ్ అనే తెలుస్తోంది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2940 పెరిగి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 93,380 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు రూ. 2700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2940 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 85,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,380 వద్ద ఉంది.ఇదీ చదవండి: రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 85,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 93,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2700, రూ. 2940 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,04,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 95,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

IPL 2025 GT vs RR: Sanju Samson Fined Rs 24 Lakh By BCCI, Here's Reason4
సంజూ శాంసన్‌కు భారీ షాక్‌!

ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)కు మరో షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ పాలక మండలి అతడికి రూ. 24 లక్షల మేర జరిమానా విధించింది. అదే విధంగా.. గుజరాత్‌ టైటాన్స్‌ (GT vs RR)తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా ఫైన్‌ వేసింది.ఎదురుదెబ్బలుకాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయం నుంచి కోలుకున్న సంజూ.. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ జట్టును ముందుండి నడిపించాడు.ఈ క్రమంలో శనివారం (ఏప్రిల్‌ 5) నాటి మ్యాచ్‌ నుంచి కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ అందుబాటులోకి వచ్చాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్‌లో తొలుత పంజాబ్‌ కింగ్స్‌తో తలపడ్డ రాజస్తాన్‌.. 50 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.159 పరుగులకేఅహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో ఆతిథ్య గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ మాత్రం 159 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్‌ బౌలర్ల దెబ్బకు సంజూ సేన 19.2 ఓవర్లలోనే ఆలౌట్‌ అయి.. 58 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.సంజూకు రూ. 24 లక్షల జరిమానాఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున రాజస్తాన్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) పనిష్మెంట్‌ ఇచ్చింది. గతంలో రియాన్‌ పరాగ్‌ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ ఇదే తప్పిదానికి పాల్పడింది. అప్పుడు అతడికి రూ. 12 లక్షల ఫైన్‌ వేసిన బీసీసీఐ... రాజస్తాన్‌ మరోసారి ఇదే తప్పు పునరావృతం చేసినందున నిబంధనల ప్రకారం సంజూకు రూ. 24 లక్షల జరిమానా విధించింది.ఇందుకు సంబంధించి.. ‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నాం.వారికి కూడాఅదే విధంగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా తుదిజట్టులోని ప్రతి ఆటగాడు రూ. లక్షల జరిమానా కట్టాలి లేదంటే వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం మేర చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది’’ అని ఐపీఎల్‌ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం రెండే గెలిచింది.ఐపీఎల్‌-2025: గుజరాత్‌ వర్సెస్ రాజస్తాన్‌👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌👉గుజరాత్‌ స్కోరు: 217/6 (20)👉రాజస్తాన్‌ స్కోరు: 159 (19.2)👉ఫలితం: 58 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82).చదవండి: KKR: చేతులు జోడించి అడుగుతున్నా.. రింకూని కాస్త ముందే పంపండి! 🔝 of their Game. 🔝 of the Table. 💙#GT roar to the top of the points table with another strong display of cricket 💪Scorecard ▶ https://t.co/raxxjzYH5F#TATAIPL | #GTvRR | @gujarat_titans pic.twitter.com/ZDRsDqoMAT— IndianPremierLeague (@IPL) April 9, 2025

USA To Deny Visas And Green Cards Over Social Media Posts5
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రోజుకో ట్విస్ట్‌ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపించి వేయడమే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు)లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇక, తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్‌ చేసినా, పోస్టులు పెట్టినా వారికి వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని బాంబు పేల్చింది.అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని గ్రూపులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ క్రమంలో సదరు గ్రూపులకు ఎవరైనా మద్దతు తెలిపినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా.. వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని తెలిపింది. కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్‌ను ప్రతికూలంగా పరిగణిస్తామని హచ్చరికలు జారీ చేసింది. అలాగే, హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఇదే సమయంలో ఒక విదేశీయుడు ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలు, ఇతర వ్యతిరేకవీసా, గ్రీన్ కార్డ్ రద్దు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. వారు తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. స్టూడెంట్ వీసాలు (ఎఫ్ -1, జే-1 మొదలైనవి), గ్రీన్ కార్డు దరఖాస్తులు, వర్క్ పర్మిట్లు, వీసా పొడిగింపులతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం వచ్చింది.#NEW: U.S. Citizenship and Immigration Services (USCIS) will now start screening social media of any migrants for anti-semitism land any antisemitic activity the physical harassment of Jewish individuals will now be grounds for denying immigration benefit requests. This will…— Brooke Taylor (@Brooketaylortv) April 9, 2025ఇదిలా ఉండగా.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్‌ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.వీసా రద్దయితే అక్రమంగా ఉంటున్నట్లే..అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధికశాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్టు అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాఖీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, హెచ్‌1బీపై ఉద్యోగం చేయడానికి.. అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్‌ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్‌ పంపిస్తున్నారు.

Siddu Jonnalagadda Jack Movie Twitter Review6
Jack Movie Review: ‘జాక్‌’ట్విటర్‌ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్‌!

స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్‌’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్‌’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్‌(ట్విటర్‌)లో మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్‌.. తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో తెలియజేస్తూ.. యావరేజ్‌ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్‌ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్‌ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్‌ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్‌ 2 రేటింగ్‌ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్‌ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రాక్షని రాయల్‌గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్‌లైనర్‌తో సినిమా వర్కౌట్‌ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్‌లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్‌ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్‌ మిక్స్‌ వీక్‌ రైటింగ్‌, స్క్రీన్‌ప్లే కారణంగా ఫెయిల్‌ అయింది. సిద్దు హార్డ్‌ వర్క్‌ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్‌ గురించి మర్చిపోవాలి. విజువల్స్‌ కూడా పూర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన​్‌ ట్వీట్‌ చూస్తూ 2 రేటింగ్‌ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025

India Terminates Trans Shipment Facility For Bangladesh7
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్‌మెంట్‌ రద్దుతో భారత్‌ ప్రతీకారం?

న్యూఢ్లిల్లీ: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అందిస్తున్న కీలక ట్రాన్స్‌షిప్‌మెంట్ (Transshipment) సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని భారత్‌ 2020లో బంగ్లదేశ్‌కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.భారత ఎగుమతులకు ఆటంకంఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది.అసలు కారణం ఇదే..అయితే భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్‌లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్‌ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు.అమెరికా సుంకాలకు తోడుగా..భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ (Readymade garment industry) దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది.బంగ్లాకు ఆర్థిక సవాళ్లుఅస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తున్నదని పేర్కొన్నారు. భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం రద్దు భారత్‌- బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టనుంది.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!

Delay in re filing chargesheets in Chandrababu corruption cases in Vijayawada ACB court8
స్కిల్‌ కేసులో అటకెక్కిన చార్జిషీట్లు!

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు కుట్రదారు, లబ్దిదారుగా సాగిన కుంభకోణాల కేసులను నీరుగార్చేందుకు ఎంతకైనా తెగిస్తామని సీఐడీ పదే పదే స్పష్టం చేస్తోంది. న్యాయస్థానాల్లో ఆ కేసుల విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్రను పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ఎంతగా అంటే.. ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి బి.సత్యవెంకట హిమబిందు బదిలీ అయ్యేంత వరకు ఏకంగా 10 నెలలపాటు చార్జ్‌షీట్లు దాఖలు చేయకుండా సాగదీయడం గమనార్హం.తాజా బదిలీల్లో హిమబిందును రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో 2023లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు న్యాయమూర్తి హిమబిందు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అప్పట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పూర్తి ఆధారాలతో సహా దాఖలు చేసిన రిమాండ్‌ నివేదిక పట్ల సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరిణామానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. కేసులు నీరుగార్చే కుట్ర.. సాక్షులకు బెదిరింపులు రాష్ట్రంలో గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబుపై అవినీతి కేసులను సీఐడీ అటకెక్కించింది. ఆ కేసులను నీరుగార్చడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని న్యాయస్థానంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు, అధికారులను బెదిరించి బెంబేలెత్తిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేయిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను న్యాయస్థానంలో పునఃదాఖలు చేయకుండా సీఐడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్‌.. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను గత ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి సీఐడీ అధికారులు ఆ వివరణలతో సహా చార్జిషీట్లను సిద్ధం చేశారు. కానీ గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి హిమబిందు బదిలీ అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నించినా స్పందించని సీఐడీ చంద్రబాబు అవినీతి కేసుల్లో చార్జ్‌షీట్లను పునఃదాఖలు చేయక పోవడాన్ని కొన్ని నెలల క్రితం న్యాయమూర్తి ప్రశ్నించారు కూడా. చంద్రబాబు, నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్‌ భూముల కేసులో గతంలో సిట్‌ అధికారులు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. అసైన్డ్‌ భూముల కుంభకోణం అంతా వివరిస్తానని ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చెబుతూ తనను అప్రూవర్‌గా గుర్తించమని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొన్ని రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అప్రూవరా.. నిందితుడా.. అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సీఐడీ తరఫు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. న్యాయమూర్తి ప్రశ్నించిన ఐదారు నెలల తర్వాత కూడా సీఐడీ ఆ చార్జ్‌షీట్లను పునఃదాఖలు చేయకపోవడం గమనార్హం. అంటే న్యాయమూర్తిగా హిమబిందు ఉన్నంత వరకు సీఐడీ చార్జ్‌షీట్లను దాఖలు చేయకూడదని నిర్ణయించుకుందనే చర్చ రాష్ట్ర­వ్యాప్తంగా సాగుతోంది. న్యాయమూర్తిపైనే ఇంటెలిజెన్స్‌ నిఘా! చంద్రబాబు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టడం కలకలం సృష్టించింది. ఆ న్యాయమూర్తి ఇంటి పరిసరాల్లో ఇంటలిజెన్స్‌ అధికారులు తిష్ట వేసి, ప్రతి కదలికనూ గమనిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండటం గమనార్హం. నిఘా వేసిన ఇంటెలిజెన్స్‌ అధికారులను న్యాయమూర్తి సిబ్బంది గుర్తించారు. న్యాయమూర్తి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని కూడా వారు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పోలీసు అధికారిని ఆ అంశంపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్‌ అధికారులు ఎందుకు మాటు వేశారు? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు.

National Siblings Day: What Is It And Importance9
'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ.. అనుబంధాలకు ప్రతీక..!

ప్రపంచంలో ప్రతి అనుబంధం ప్రత్యేకమైనది. అయితే, కొన్ని బంధాలు మన హృదయంలో శాశ్వత స్థానం ఏర్పరచుకుంటాయి. అలాంటి ఓ అపురూపమైన బంధం – సోదర సోదరీమణుల అనుబంధం. ఈ బంధాన్ని గౌరవించేందుకు, జరుపుకునేందుకు ప్రతి ఏప్రిల్ 10న మనం "సిబ్లింగ్ డే" ను నిర్వహిస్తాం. ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ కాదు, మన వ్యక్తిత్వ వికాసం, మన భావోద్వేగ పరిణతిలో తోబుట్టువుల పాత్రను గుర్తించి గౌరవించాల్సిన రోజు.మన భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదర సోదరీమణుల బంధానికి గౌరవప్రదమైన స్థానం ఉంది. జీవితంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే మొదటి బంధం అమ్మానాన్నలతో అయితే, రెండోది తోబుట్టువులతో ఉన్న అనుబంధం. సోదర బంధం అనేది కేవలం కుటుంబ సంబంధం మాత్రమే కాదు, అది మన మానసిక అభివృద్ధిలో ఒక మూల స్థంభం. తోబుట్టువు అంటే కేవలం మనతో పుట్టిన వ్యక్తి కాదు, మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపించే వ్యక్తి.సోదర సంబంధాల మానసిక ప్రభావంఇతరులతో సురక్షితమైన అనుబంధం ఏర్పరచుకోవడం (secure attachment) మానసిక నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం. అది తల్లిదండ్రులతో ప్రారంభమైతే, తోబుట్టువులు దాన్ని స్థిరపరుస్తారు. బాల్యంలో తోబుట్టువులతో ఉన్న అనుబంధం జీవితంలో బలహీనతల్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.ఒక తమ్ముడు అన్న బాటలో నడుస్తాడు, ఒక అక్క చెల్లెల్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. ఈ అనుబంధం conflicting emotionsను సహజసిద్ధంగా ఎదుర్కొనటానికి ఒక విస్తృత ప్రయోగశాలలా మారుతుంది. అదే జీవితానికి సరిపడా సంస్కారాన్ని అందించే తొలి వేదిక.అనుబంధాల తొలి కిరణాలుబాల్యం అనేది మనసు మీద మొదటి ముద్ర వేసే దశ. ఈ దశలో తోబుట్టువులతో కలసి గడిపిన క్షణాలు – మన జీవితానికి పునాదిలా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ చేతినుంచి తొలి ముద్ద కోసం పోటీ పడిన సంఘటనలు, అమ్మానాన్నను ఫేవరెట్ అనిపించుకునే కుతూహలాలు, కలిసి తినడం, ఆడటం, తిరగడం – ఇవన్నీ కలిసి మనలో భావోద్వేగ నిబంధనలు (emotional rules) రూపుదిద్దుకుంటాయి. తోబుట్టువులు మనకు పాఠశాలలో చదవని పాఠాలు నేర్పుతారు. సహనం, సహకారం, పోటీ, సమన్వయం, పంచుకోవడంలాంటివి సహజసిద్ధంగా నేర్పుతారు. ఈ విలువలే ఎమోషనల్ హెల్త్ కు మూలం.సైకాలజీ దృష్టిలో, ఇది Social Referencing Phase. పిల్లలు తోబుట్టువుల ద్వారా – ఎలా స్పందించాలి? ఎలా సహనం వహించాలి? ఎలా స్పందన కనబర్చాలి? అనే మౌలిక విలువలు నేర్చుకుంటారు.విభేదాలు – మనస్సు ఎదిగే అవకాశాలువాస్తవానికి, తోబుట్టువుల మధ్య విభేదాలు లేకపోవడం అసాధ్యం. బాల్యంలో తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలుగుతాం, మాట్లాడకుండా ఉండిపోతాం. కానీ ఆ విభేదాల్ని ఎలా నిర్వహించామన్నదే మన భావోద్వేగ సామర్థ్యాన్ని (emotional intelligence) నిర్ధారిస్తుంది. మంచి సోదర బంధం ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ఘర్షణలను సులువుగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి.ముఖ్యంగా కౌమారంలో, అంటే టీనేజ్ లో వ్యక్తిత్వం విస్తరించటం మొదలవుతుంది. ఈ సమయంలో siblings మనకు ఒకరిపై ప్రేమ, ఒకరిపై అసూయ, ఒకరిపై గౌరవం, మరొకరిపై స్వార్థం అనే విరుద్ధ భావాల్ని అనుభవించే అవకాశం ఇస్తారు. ఇది complex emotions ని సరిగా అర్థం చేసుకునే దశ. ఇదే emotional literacy కు శిక్షణ అందించే వేదిక.అనుబంధాల పునర్నిర్మాణంవృద్ధాప్యానికి దగ్గరయ్యే దశలో – siblings మనసులోని మాటను పంచుకునే ఆత్మీయులుగా మారిపోతారు. తల్లిదండ్రులు మిగలకపోయినా, తోబుట్టువులే మనకు మిగిలే స్నేహితులు. జీవితపు అనుభవాలు, భిన్న దారుల్లో నడిచిన ప్రయాణాలు వేరువేరైనా, చివరకు చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనమే మనల్ని మళ్ళీ కలిపేస్తుంది. సైకాలజీ పరంగా ఇది Emotional Reconnection Phase. ఇది మన attachment history ని తిరిగి సవరించే అవకాశం. గతంలో జరిగిన దోషాలను అంగీకరించి, ప్రేమతో మళ్ళీ కలిసే బంధాన్ని పునఃస్థాపించుకోవచ్చు.ఈ రోజు ఏం చేయాలి? ఇప్పుడు జీవితాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఉద్యోగాలు, వ్యక్తిగత బాధ్యతలు, టెక్నాలజీ వల్ల కొందరిలో మానవ సంబంధాలు పెళుసుబారాయి. అనేకమంది తోబుట్టువులతో విభేదాల వల్ల దూరమైపోయి గిల్ట్ (guilt), శూన్యత (emptiness), లేదా మానసిక వ్యథను అనుభవిస్తూ ఉంటారనేది సైకాలజిస్ట్ గా నేను గమనించిన విషయం. అలాంటివారు ఈ రోజును భావోద్వేగం పునరాగమనానికి (emotional reconciliation) అవకాశంగా వినియోగించుకోవాలి. అందుకే ఈరోజు... • మీ సోదరుడికి / సోదరికి ఒక ఆత్మీయ సందేశం పంపండి.• చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేయండి.• సంబంధం తెగిపోయి ఉంటే, పునఃసంధానానికి ప్రయత్నించండి.• మీ బిడ్డల్లోనూ సోదర బంధం పట్ల గౌరవం పెరగాలంటే – మీరు మీ సోదర సంబంధాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వాళ్లు గమనిస్తుంటారని తెలుసుకుని మసలుకోండి.ఒక చెల్లెలి ప్రేమకు ప్రపంచ నివాళిక్లౌడియా ఎవర్ట్, న్యూయార్క్‌కి చెందిన మహిళ, తన సోదరి లిజా మరియు సోదరుడు అలాన్‌ను చిన్న వయసులోనే కోల్పోయారు. ఆ కోల్పోయిన బంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఏప్రిల్ 10 (లిజా పుట్టిన రోజు)ను సిబ్లింగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 1995లో Sibling Day Foundation ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ భావనను వ్యాపింపజేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ రోజును ఒక ప్రేమ సూచికగా, బంధాలను గుర్తచేసుకునే రోజుగా పాటిస్తోంది. సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com

Employees of Gurukul societies still not receiving their salaries10
ఏప్రిల్‌ వేతనాలేవీ?

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్‌ పదోతేదీ వచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదు. సాధారణంగా బీసీ, జనరల్‌ గురుకుల సిబ్బందికి ప్రతినెలా మొదటివారంలోనే వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేవి. కానీ పది రోజులవుతున్నా, ఇంకా వేతనం అందక ఉద్యోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని అరికడుతున్నామని, ప్రతినెలా మొదటి పనిదినం రోజున వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికాలంగా వేతన చెల్లింపులు సజావుగానే జరుగుతున్నాయి. కానీ ఏప్రిల్‌ నెలలో మాత్రం ఏ ఒక్క సొసైటీలోని ఉద్యోగికి పదోతేదీ వచ్చినా వేతనాలు మాత్రం జమ కాలేదు.» ఎస్సీ, మైనారిటీ గురుకుల సొసైటీల్లో ఉద్యోగుల వేతన చెల్లింపుల జాప్యానికి ప్రధాన కారణం ఆయా కార్యాలయాల్లోని సెక్షన్‌ అధికారుల నిర్లక్ష్యమే. వేతన బిల్లులు సాధారణంగా 20వ తేదీకల్లా తయారు చేసి సమర్పిస్తే ఒకటో తేదీన వేతనాలు విడుదలవుతాయి. కానీ ఈ రెండు సొసైటీల్లో కొద్ది నెలలుగా బిల్లుల తయారీ ప్రక్రియ నెలాఖరు వరకు నిర్వహిస్తుండడంతో వేతన చెల్లింపుల్లో సైతం అదే స్థాయిలో జాప్యం జరుగుతోంది. » మరోవైపు గురుకుల సొసైటీలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. దీంతో ఆయా ఉద్యోగులు సొసైటీ కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. సొసైటీ కార్యదర్శులకు వినతులు ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న తీరుపై గురుకుల ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బుధవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. » అన్ని సొసైటీల్లోని ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.బాలరాజు, ప్రధానకార్యదర్శి ఎన్‌.దయాకర్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. » గురుకుల ఉద్యోగుల వేతనాల్లో జాప్యంతో వారి ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్నదని, ఫలితంగా భవిష్యత్‌లో బ్యాంకు రుణాలకు అర్హత లేకుండా పోతోందని ఆల్‌ తెలంగాణ గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కూకుట్ల యాదయ్య, వై.పాపిరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement