Bigg Boss Non Stop Telugu OTT: Here 3rd Week Nomination Contestants List - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?

Published Mon, Mar 14 2022 7:18 PM | Last Updated on Mon, Mar 14 2022 7:41 PM

Bigg Boss Non Stop Telugu OTT: Here 3rd Week Nomination Contestants List - Sakshi

పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్‌ బ్యూటీ అరియానాను నామినేట్‌ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్‌ చేసింది.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల భవిష్యత్తును చెప్పేది నామినేషన్సే. ఈ ఒక్క గండం నుంచి బయటపడ్డారంటే ఆ వారం నిశ్చింతగా గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చారంటే వీకెండ్‌ వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే! విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉన్నవాళ్లకు ఆ చింత అక్కర్లేదనుకోండి, అది వేరే విషయం. ఇక బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో ముచ్చటగా మూడో నామినేషన్స్‌ జరిగాయి.

పక్కనే ఉండి గోతులు తవ్వేవాళ్లే అంటే నా జీవితంలో కూడా ఇష్టముండరంటూ తేజస్వి బోల్డ్‌ బ్యూటీ అరియానాను నామినేట్‌ చేసింది. ఇంతమాట అన్నాక అరియానా ఊరుకుంటుందా? తాను గోతులు తవ్వుతున్నట్లు అనిపిస్తే తేజు ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్నట్లు అనిపిస్తోందంటూ ఆమెను నామినేట్‌ చేసింది.

చదవండి: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎవరో చెప్పేసిన కౌశల్‌ మండా

ఇక నామినేషన్స్‌లో చైతూ ఎవరివో కాళ్లు పట్టుకుంటానంటూ నామినేట్‌ చేశాడు. యాంకర్‌ శివ, నటరాజ్‌ మాస్టర్‌ మధ్య మహేశ్‌, అనిల్‌ మధ్య కూడా ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే అఖిల్‌, బిందుమాధవికి అస్సలు పడలేదు. మొత్తంగా ఈ మూడో వారం సరయు, అషూ రెడ్డి, కెప్టెన్‌ అనిల్‌ మినహా మిగతా 12 మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement