
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్‌లో ఉన్నట్లు తెలిపింది. యశ్వంత్ రెడ్డి (Yashwanth)తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతేడాది జనవరిలో తాంబూలాలు మార్చుకోగా మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. 11 నెలలు కావొస్తున్నా ఇంకా పెళ్లెప్పుడనేది చెప్పడం లేదు శోభ.
తాజాగా శోభ.. ప్రియుడితో కలిసి పూజ చేసింది. దాదాపు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పూజ చేయడానికి గల కారణం గురించి శోభ మాట్లాడుతూ.. కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యశ్వంత్ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.
చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ