
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేష్ బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించిన ఒక్కడు చిత్రం 2003 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా ఒక్కడు నిలిచింది.

ఒక్కడు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్ రీరిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్స్‌పై సినిమా చూడొచ్చని ట్రైలర్ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని విశ్వనాథ్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్స్ టికెట్లను ఓపెన్ చేశారు. ఒక్కడు సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన సతీమణి ఇలా చెప్పారు. మహేష్ నటించిన సినిమాల్లో ఒక్కడు క్లాసిక్ హిట్ అని, ఎక్కువ సార్లు చూసే చిత్రమని తెలిపారు. అంతేగాక తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఈ సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా విడుదలైంది. తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది.