
సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్‌ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.
ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.
ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.
Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7
— prime video IN (@PrimeVideoIN) October 7, 2024