Naveen chandra
-
మేలో థ్రిల్
నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ లెవెన్’. డైరెక్టర్ సుందర్ సి. వద్ద ‘కలకలప్పు 2, వందా రాజావా దాన్ వరువేన్, యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన లోకేశ్ అజ్లస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అభిరామి, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషించారు.ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమాను మే 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి, నవీన్ చంద్ర పోస్టర్ విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ లెవెన్’. ఈ మూవీ ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్ అశోకన్. -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. -
జార్జియా అధికారులతో ఇబ్బంది పడ్డా: నిర్మాత
‘28°C’ సినిమా 2019లోనే పూర్తయింది. 2020లో మేలో విడుల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటే, అది నెలల తరబడి సాగింది. దీంతో మా సినిమా విడుదల ఆలస్యమై ఇప్పుడు (ఏప్రిల్ 4) రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం’ అన్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన నిర్మించిన తొలి సినిమా 28°C( 28 డిగ్రీల సెల్సియస్). నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాయి అభిషేక్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ సన్నిహిత స్నేహితులం. మాకిద్దరికీ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. అనిల్ "క్షణం" సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. నేను కూడా దర్శకత్వం వైపు కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని రోజుల తర్వాత, మేమిద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం. అనిల్ విశ్వనాథ్ "28°C" అనే టెంపరేచర్ ఆధారంగా చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో సినిమాను ప్రారంభించాం.మొదట్లో ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నప్పటికీ, చివరికి నవీన్ చంద్ర ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాం. హీరోయిన్గా మొదట అంజలిని ఎంచుకున్నాం, కానీ కొంత ఆధునికత కోసం కొత్త ముఖం ఉంటే బాగుంటుందని షాలినీని ఎంపిక చేశాం. షూటింగ్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టాం, ఆ తర్వాత గోవా, జార్జియాలకు వెళ్లాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత నాణ్యతతో సినిమాను రూపొందించాం. సినిమా కథాంశంపై మా బృందం అందరికీ గట్టి విశ్వాసం ఉండేది.హీరో నవీన్ చంద్ర మాకు చాలా సహకరించాడు. సినిమాపై మాతో పాటు అతనికి కూడా గట్టి నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. అతని పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. అలాగే, హీరోయిన్ షాలినీ కూడా అద్భుతంగా నటించింది. "28°C" టెంపరేచర్ వద్ద హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆ ఉష్ణోగ్రత దాటితే ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ జంట ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఒకే జానర్లో సాగదు, విభిన్న జానర్లను కలుపుతూ ఒక తీవ్రమైన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.సినిమా తీసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడే నా కాలు విరిగింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. మేము షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేశామని స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న జార్జియా అధికారులు చివరికి చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కథాంశంపై నమ్మకంతో ఇప్పటివరకు ధీమాగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్లలో మా సినిమాకు సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నాం.ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం. -
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తాజా పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. A family on edge.A cop at the door.And a story that’s about to explode💥Welcome to #SHOWTIME – First Look is out now!🌟ing @Naveenc212 #kamakshibhaskarla@SkylineMoviez @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop @gavireddy_srinu… pic.twitter.com/O2FSZA6IOt— Skyline Movies (@SkylineMoviez) March 30, 2025 -
ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. ధైర్యంతో ‘పొలిమేర’ స్క్రిప్ట్ రాశా: డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా అనిల్ మీడియాతో ముచ్చటిస్తూ తన తొలి సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఆయన మాటల్లో.. "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం. క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. "28°C" సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తాఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ షేడ్స్ ఉంటాయి. మెడికల్ గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్ గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది.ఈ సినిమాను మొదట అడివి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు. జార్జియాలో 25 డేస్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. అనివార్య కారణాలతో రెండుసార్లు జార్జియాకు వెళ్లకుండా అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ మేము అక్కడికి వెళ్లి షూట్ చేయగలిగాం. మూడోసారి కెమెరా కిట్స్ ఉన్నబ్యాగులు మిస్ అయ్యాయి. జార్జియాలో షాపింగ్ చేసి వాటిని కొని షూటింగ్ చేశాం. ఇలాంటి ఎక్సిపీరియన్స్ లు చాలా ఉన్నాయి కాబట్టే "28°C" సినిమా అనుభవాలతో పుస్తకం రాయాలని అనుకున్నా."28°C" రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సినిమా రిలీజ్ ఆగిపోయి నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉండేవాడిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పొలిమేర 2 చేశాను. ఇప్పుడు పొలిమేర సిరీస్ లో థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో "28°C" సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా.నా స్నేహితుడు వంశీ నందిపాటి "28°C" సినిమా చూసి ఇంతమంచి మూవీని రిలీజ్ చేయాలని ముందుకొచ్చాడు. ఇప్పుడు మా లక్ష్యం ఈ సినిమాతో డబ్బులు సంపాదించడం కాదు మా ఫస్ట్ మూవీని థియేటర్స్ లో చూసుకోవడం. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ఇప్పించమని వంశీని అడిగాను. "28°C" సినిమా చూసి నవీన్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు."28°C" సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్ డ్రాప్స్ తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్ అయ్యిందని భావిస్తా. సినిమాను క్రిస్ప్ గా 2 గంటలు ఉంటుంది. అనవసర సన్నివేశాలు తీసేసి టు ది పాయింట్ మూవీని తెరపై చూపించబోతున్నాం.నా నెక్ట్స్ మూవీ పొలిమేర 3 త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సీజీ వర్క్ భారీగా ఉండబోతోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పొలిమేర 3 పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూతో ఉంటుంది. ఇందులో ఓ స్టార్ కీలక పాత్రలో నటిస్తారు.నేను షో రన్నర్ గా నా టీమ్ మెంబర్ నాని కాసరగడ్డ డైరెక్షన్ లో అల్లరి నరేష్ తో 12ఎ రైల్వే కాలనీ మూవీ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాను. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా సపోర్ట్ లేదు. నాకున్న గుర్తింపుతో ఇప్పుడు నా కొలీగ్స్ కు నేను ఆ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నా. నాకు షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ఇష్టం. త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. -
'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్‌లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. -
గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు. -
ఓటీటీకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్‌ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు. Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7— prime video IN (@PrimeVideoIN) October 7, 2024 -
ప్రతి ఇంట్లో జరిగే కథ అనిపించింది
‘‘సారంగదరియా’ చిత్రం ట్రైలర్ చూస్తే ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి సందేశం ఇచ్చేందుకు ఈ మూవీ తీశారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూసి,ప్రోత్సహించాలి’’ అన్నారు హీరో నవీన్ చంద్ర. రాజా రవీంద్ర లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించారు. చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నవీన్ చంద్ర అతిథిగా హాజరయ్యారు. ‘‘ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. దీంతో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే విజయం సాధిస్తారనే కంటెంట్‌తో ఈ మూవీ రూపొందింది’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’’ అన్నారు పండు. -
ప్రతీ ఇంట్లో జరిగే కథే ‘సారంగదరియా’: నవీన్‌చంద్ర
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’. ఈ మూవీతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది.ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి’ అని ప్రేక్షకులను కోరారు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇలాటి కథ చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’అని దర్శకుడు పండు అన్నారు. ఈ ఈవెంట్లో నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ , నటి యశస్విని, లిరిక్ రైటర్స్ కడలి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క
కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్ చేసిన యాక్షన్స్ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్‌ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను. -
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను. -
ట్రెండ్ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్ బిజీ అయ్యారు: కాజల్
‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్‌కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.⇢ నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.⇢ శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.⇢ గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.⇢ సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.⇢ యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.⇢ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.⇢ నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.⇢ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.⇢ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి. -
‘సత్యభామ’ గుర్తుండిపోతుంది
‘సత్యభామ’ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అని అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.⇢ ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.⇢ "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.⇢ కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం. -
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
‘సత్యభామ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. ఈ కథ రాసేప్పుడు ఇది హీరోకా హీరోయిన్ కా అనేది ఆలోచించలేదు. ఒక పర్సన్ కోసం అని రాస్తూ వచ్చాం. కథలో అమ్మాయి విక్టిమ్ గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎమోషన్, యాక్షన్ రెండూ కాజల్ చేయగలరు అని నమ్మాం. ఎమోషన్ పండించడంలో తనకు మంచి పేరుంది. యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది. యాక్షన్ పార్ట్స్ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మేం చాలా భయపడ్డాం’అని అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల.కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుమన్ చిక్కాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. శశికిరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. అలా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నా. దర్శకుడిగా మారేందుకు శశి ఎంతో కష్టపడ్డాడు. తన సక్సెస్ నుంచి యంగ్ టాలెంట్ జర్నీ మొదలుపెట్టాలని అవురమ్ ఆర్ట్స్ స్థాపించాడు. కొందరికైనా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వగలుగుతాం అనేది ఆయన ఆలోచన. శశి వల్లే నేను దర్శకుడిగా మారాను.→ కొందరు పోలీస్ ఆఫీసర్స్ తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్ గా పనిచేస్తారు. అలా "సత్యభామ" ఒక కేసు విషయంలో పర్సనల్ గా తీసుకుంటుంది, ఎమోషనల్ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు.→ ‘సత్యభామ"లో నవీన్ చంద్ర కీ రోల్ చేస్తున్నారు. కాజల్ పెయిర్ గా ఆయన కనిపిస్తారు. నవీన్ చంద్రది రైటర్ క్యారెక్టర్. కాజల్ కు సపోర్ట్ గా ఉంటారు. కాజల్ ఒక వారం పది రోజుల షూటింగ్ తర్వాత మా టీమ్ మెంబర్ గా మారిపోయారు. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నటించారు. మాకు కూడా ఒక స్టార్ సెట్ లోకి వస్తున్న ఫీలింగ్ ఏరోజూ కలగలేదు.→ ఏపీలో దిశా యాప్ ఉంటుంది. తెలంగాణలో షీ సేఫ్ యాప్ ఉంది. మహిళలు తమకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ యాప్ లో నెంబర్ టైప్ చేసి సెండ్ చేస్తే వారి లొకేషన్ షీ టీమ్స్ కు వెళ్లిపోతుంది. వాళ్లు కాపాడేందుకు వస్తారు. మేము సెట్ లో ఉన్నప్పుడు యాప్స్ రెస్పాండ్ అవుతాయా లేదా అని చెక్ చేసి చూశాం. మాకు షీ టీమ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "సత్యభామ" చూస్తున్నప్పుడు మహిళలు ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని తమ లైఫ్ లో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక మెసేజ్ చేరినట్లే.→ "సత్యభామ" పూర్తిగా ఫిక్షన్ కథ. నాకు పోలీస్ డైరీస్ గురించి తెలుసుకోవడం, వారి ఇంటర్వ్యూలు వినడం అలవాటు. అలా కొందరు పోలీసుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథను డెవలప్ చేశాం. ముందు మా మూవికి ఈ పేరు లేదు. అయితే సత్యభామ అనే పేరు మన పౌరాణికాల్లో పవర్ ఫుల్ నేమ్. అందరికీ త్వరగా రీచ్ అవుతుందని ఆ పేరు పెట్టాం.ప్రస్తుతం కొన్ని కథలు ఉన్నాయి. త్వరలో నా నెక్ట్ మూవీ అనౌన్స్ చేస్తా. -
కాండ్రకోటలో ఏం జరిగింది?
‘జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’ (తనికెళ్ల భరణి) అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘నింద’ సినిమా టీజర్. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాను రాజేశ్ జగన్నాథం స్వీయదర్శకత్వంలో నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.లవ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాండ్రకోట మిస్టరీ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ మ్యూజిక్ డైరెక్టర్. -
హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
హీరో నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు -
‘హలో బేబీ’ లాంటి సినిమాలు చేయడం సాహసమే : హీరో నవీన్ చంద్ర
కావ్య కీర్తి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హలో బేబీ . రాంగోపాల్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్‌ని హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. హాల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ అంటూ సాగే ఈ పాటకు రాజేష్ లోక్నాథం లిరిక్స్ అందించగా.. సింగర్ సాయి చరణ్ ఆలపించారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రం కి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు దర్శకుడు రామ్ గోపాల్ రత్నం కు శుభాకాంక్షలు అని అన్నారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. దీని కొరియోగ్రాఫర్ గా మహేష్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సుకుమార్ పమ్మి ,ఎడిటర్ సాయిరాం తాటిపల్లి. ఈ చిత్రం ఒకే ఒక క్యారెక్టర్ తో కావ్య కీర్తి నటనతో త్వరలో ప్రేక్షకుల దగ్గరికి రాబోతుంది. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు. -
ఓటీటీలోకి 'ఇన్స్పెక్టర్ రిషి'.. ట్రైలర్‌తోనే దుమ్మురేపారు
హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా నవీన్ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సౌత్ ఇండియాలో సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ క్రమంలో జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన నటించిన ‘ఇన్స్పెక్టర్ రిషి’ అనే వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. మొత్తం 10 ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు,తమిళ్‌తో పాటు ఐదు భాషల్లో మార్చి 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. ప్రతి సీన్ ప్రేక్షకుడిని సస్పెన్స్ సన్నివేశాలతో మెప్పిస్తుంది. ఊహించలేనంత విజువల్స్‌తో వస్తున్న ఈ సిరీస్ తప్పకుండా ప్రేక్షకులను భయపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతు చిక్కని హత్యల వెనక ఎవరున్నారనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మిస్టరీని ఇన్స్పెక్టర్ రిషి ఎలా ఛేదించారన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలకపాత్రల్లో నటించారు. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ అనే క్యాప్షన్ పెట్టడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈనెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
భయపెట్టేందుకు రెడీ అయిన హారర్ సిరీస్.. అప్పుడే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ ఉన్నా ఓటీటీలో మాత్రం అదరగొట్టేస్తుంటాయి. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ వీక్షకులు క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఓటీటీలు థ్రిల్లర్, హారర్ జానర్లను సొంతంగా రూపొందిస్తుంటారు కూడా! తాజాగా ఓ తమిళ హారర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతోంది. అదే ఇన్స్పెక్టర్ రిషి. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు నందిని జేఎస్ దర్శకత్వం వహించగా మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుక్దేవ్ లహిరి నిర్మించాడు. ఈ సిరీస్‌లో సునయన, కన్న రవి, మాలిని జీవర్తనం, శ్రీకృష్ణ దయాల్, కుమారవేల్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఇన్స్పెక్టర్ రిషి కేసులు చేధించే క్రమంలో దాని వెనకాల అతీత శక్తుల గురించి కూడా తెలుసుకుంటాడు. ఆ కేసులకు, దెయ్యాలకు మధ్య సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే! ఈ నెలాఖరు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్స్పెక్టర్ రిషి తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ పోస్టర్‌తో సహా వెల్లడించింది. the laws of state don’t bind the supernatural!#InspectorRishiOnPrime, Mar 29@MBP_ProdCo @Naveenc212 @TheSunainaa @shukdev_lahiri @nandhini_js @jithinthorai #SrikrishnaDayal #Kumaravel @iamkannaravi @MalniJevaratnam #BargavSridhar @editorsuriya @MusicAshwath @MishMash2611… pic.twitter.com/2M3oPzZFyB — prime video IN (@PrimeVideoIN) March 14, 2024 చదవండి: హిట్ సినిమా 'ప్రేమలు' ఓటీటీ వివరాలు.. ఒకేసారి అన్ని భాషలలో రిలీజ్ -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..
అష్టాచెమ్మా సినిమాలో తెగ హడావుడి చేస్తూ భలే హుషారుగా కనిపిస్తూ ఉంటుంది కలర్స్ స్వాతి. ఈ మూవీతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో జనాలకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన స్వాతి ఈ మధ్య స్పీడు తగ్గించింది. ఈ ఏడాది ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా మంత్ ఆఫ్ మధు. నవీన్ చంద్ర హీరోగా నటించగా, శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద అంతంత మాత్రమే ఆదరణ అందుకున్న ఈ సినిమా ఆ మధ్య ఓ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. తాజాగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసిందీ చిత్రం. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సినిమా కథేంటంటే? మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి) ఎప్పటికైనా తన దగ్గరకు తిరిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటాడు. మద్యానికి బానిసవుతాడు. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే) బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఈ సందర్భంలో ఆమెకు హీరో పరిచయం అవడంతో అతడి ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుంటుంది. మరి తర్వాత ఏమైంది? మధుసూదన్- లేఖ కలిసిపోయారా? విడిపోయారా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూసేయండి.. If you've ever loved someone, this is a movie you will love ❤️ Watch #MonthOfMadhu today ❤️🔥 Now streaming on @PrimeVideoIN 💥 - https://t.co/LI1dFUBPLH@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @Yashmulukutla @harshachemudu @ragz46 @Rajaraveendar pic.twitter.com/X6L1v2DHom — Krishiv Productions (@KrishivOfficial) December 8, 2023 చదవండి: ఆ హీరో సీరియల్ కిస్సర్.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల.. -
నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి
నటనపై విమర్శలు చేస్తే స్వీకరిస్తా కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పర్సనల్ విషయాలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని హీరోయిన్ స్వాతి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్‌పై దర్శకుడు అసహనం వ్యక్తం చేశారు. ‘మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ రాశారు. లైఫ్‌లో ఎవరైతే ఓపెన్‌గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటి వాళ్లు దయ చేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా’ అని దర్శకుడు అన్నారు. ఇదే ప్రెస్ మీట్లో స్వాతి మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చదివి ఎంతగానో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి చాలా కుమిలిపోయా. నా గురించి తెలియని వాళ్లు ఆ వార్తలు చదివి అదే నిజం అనుకుంటారు. చాలా మంది నమ్మారు కూడా. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. దానిపై మీరు(జర్నలిస్టులు)విమర్శకులు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది’అని స్వాతి చెప్పుకొచ్చింది. -
'మంత్ ఆఫ్ మధు' రివ్యూ
టైటిల్: మంత్ ఆఫ్ మధు నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు మ్యూజిక్: అచ్చు రాజమణి సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్ డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల నిడివి: 2h 20m కథేంటి? అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ. ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు. 2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు! ఎవరెలా చేశారు? మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే! - చందు, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా నవీన్ చంద్ర, స్వాతి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అతని మాటలు విన్న కలర్స్ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గడుసు కావాలి. మా సిస్టర్ జాబ్ చేస్తుంటారు. తాను బస్సు, ఆటో, మెట్రోలో రోజు ప్రయాణం చేయాలి. తన కుటుంబం కోసం కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ పర్సన్. తనను నేను మా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తాను. తను కష్టపడడమే కాకుండా.. తనతో పనిచేసే వారిలో నమ్మకం కలిగిస్తుంది. ఆ దేవుడిని ఇంతకంటే ఏమీ అడగలేను. అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్. భవిష్యత్తులోనూ ఏదైనా అవకాశమొస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం. మేం మంచినటులం. మీ అందరు మా జోడీని ఇంత బాగా గుర్తిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.' అని అన్నారు. అయితే నవీన్ చంద్ర మాటలకు స్వాతి వేదికపైనే ఏడ్చేసింది. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అంటూ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు
‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి ట్రైలర్లో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం బెస్ట్. అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరని ట్రైలర్లోనే తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నవీన్ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ బాగుంది’’ అన్నారు కీరవాణి. ‘‘ఇలాంటి సినిమాలు, ఇందులోనిపాత్రలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘ఈ మూవీని ΄్యాషన్‌తో తీశాం.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శ్రీకాంత్ నాగోతి, యశ్వంత్ ములుకుట్ల. -
కలర్స్ స్వాతి 'మంత్ ఆఫ్ మధు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అమెరికాలో అందరూ ఇండియన్ అని అనుకుంటున్నారు'.. ఆసక్తిగా ట్రైలర్!
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల మధ్య జరిగే గొడవలే కథాశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సరికొత్త కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
కలర్స్ స్వాతి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. డేంజర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో త్రిపురలో కలిసి నటించిన నవీన్ చంద్రతో మరోసారి కనిపించనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చింది. (ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) ఈవెంట్లో పాల్గొన్న కలర్స్ స్వాతికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మీపై ఇటీవల డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటి అని అడిగారు. అయితే దీనికి స్వాతి సైతం అదే రీతిలో స్పందించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాటికి నేను సమాధానం కూడా ఇవ్వను అంటూ తెగేసి చెప్పింది. స్వాతి మాట్లాడుతూ..' నేను కలర్స్ ప్రోగ్రామ్‌లో చేస్తున్నప్పుడు నా వయసు కేవలం పదహారేళ్లు. అప్పట్లో అయితే సోషల్ మీడియా కూడా లేదు. నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండి ఉంటే నన్ను ఫుట్ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడేలా హ్యాండిల్ చేస్తున్నారే తెలియదు. ఒక యాక్టర్‌గా నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పను.' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: 40 ఏళ్లలో సంపాదించిన ఆస్తి, నగలు.. అన్నీ పోగొట్టుకున్నా: నటి) -
కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రమోషన్స్‌కు హాజరైన నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే గతంలో స్వాతిని పెళ్లి చేసుకున్నానంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ రూమర్స్ రావడానికి గల కారణాలను వెల్లడించారు. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు) నవీన్ చంద్ర మాట్లాడుతూ..'త్రిపుర సినిమా కోసం మొదటిసారి స్వాతితో కలిసి నటించా. ఆమె మంచి వ్యక్తి. మా ఇద్దరి ఫ్యామిలీస్‌కు మంచి రిలేషన్ ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చిత్రబృందం మొదట ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో నేను, స్వాతి పెళ్లి దుస్తుల్లో కనిపించాం. దీంతో ఆ ఫొటో సోషల్‌మీడియాలో కాస్తా వైరలైంది. అది చూసి చాలామంది నిజంగానే పెళ్లైందని భావించారు. కొన్ని రోజులకే మా చిత్రబృందం అదే ఫొటోని పోస్టర్‌గా రిలీజ్ చేసింది. ఆ తర్వాత కొంతమందికి క్లారిటీ వచ్చింది. ఆ ఫొటో వచ్చిన సమయంలో చాలామంది మీరు స్వాతిని పెళ్లి చేసుకున్నారా? అని నన్ను డైరెక్ట్‌గా అడిగారు. కానీ ఈ విషయాన్ని మేమిద్దరం సీరియస్‌గా తీసుకోలేదు.' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న విడుదల కానుంది. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) -
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్‌చరణ్‌కు గాయాలు!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్‌చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్‌చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్‌కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
నిజాన్ని నిజాయితీగా చెప్పాం
‘‘మంత్ ఆఫ్ మధు’లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. శ్రీకాంత్‌గారు అద్భుతంగా తీశారు. ఇది ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు’’ అని స్వాతి రెడ్డి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మేమెంత ΄్యాషనేట్‌గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా చేరువవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘ఈ చిత్రం 90 శాతం షూటింగ్‌ని వైజాగ్‌లో చేశాం’’ అన్నారు యశ్వంత్ ములుకుట్ల. -
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
నవీన్ చంద్ర హీరోగా తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ఎలెవెన్’ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లోకేశ్ అజ్లస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రేయా హరి కథానాయిక. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు లోకేశ్ అజ్లస్ . -
తండ్రైనా టాలీవుడ్ యంగ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రయ్యారు. ఇవాళ ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాబును ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నవీన్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవలో బాలరెడ్డిగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో బసిరెడ్డి పాత్ర వేసిన జగపతి బాబు కుమారుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. Me and orma ❤️ Blessed with baby boy 👶!!!!❤️ pic.twitter.com/db2N21fZOh — Naveen Chandra (@Naveenc212) February 22, 2023 -
త్వరలోనే తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు రివీల్ చేశాడు. వలైంటైన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ న్యూస్‌ను నెటిజన్లతో షేర్ చేస్తూ.. బేబీ మూన్.. నా చేతుల్లోకి నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకుని ముద్దాడుతానా అని ఎదురుచూస్తున్నా. పేరెంట్స్‌గా ప్రమోట్ అవుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం అంటూ భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశాడు. ఇది చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ప్రస్తుతం సహాయక పాత్రలతో పాటు విలన్ రోల్స్‌లో కూడా అలరిస్తున్నాడు.ఇటీవల విరాటపర్వం, రంగరంగ వైభవంగా, అమ్ము, రిపీట్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. BABY MOON 🌙 ❤️ Can't wait to hold you in our Arm's. Advancing towards parenthood excited!!! New phase , New life , New journey !!! Father to be !!!! Orma❤️ Welcome to 2023 ! . pic.twitter.com/VdSefyDOX9 — Naveen Chandra (@Naveenc212) February 14, 2023 -
మాయగాడు మూవీ రివ్యూ
టైటిల్: మాయగాడు నటీనటులు: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్, అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి ఎడిటర్: జునైద్ సిద్దిఖ్ నిర్మాత: భార్గవ్ మన్నె రచన, దర్శకత్వం: జి కార్తిక్ రెడ్డి విడుదల తేదీ: 03-02-2023 నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్‌గా అడ్డా ఫేం జీ.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: కాకినాడలో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సీడీల షాప్ ఓనర్. ఆకతాయిగా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవిని పోలీసులకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్‌గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్‌లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరికి నవీన్ చంద్రకి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్రని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ ఓపినింగ్లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తాడు. సినిమా రిలీజ్ తరువాత పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్‌గా చూపించే క్యారెక్టర్లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడకి వచ్చిన సిరి.. పైరసీ చేస్తున్న నవీన్ చంద్రకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైంలో పూజా ఝావేరి నవీన్ చంద్రకి పరిచయమవ్వుతుంది. తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా ఆమె చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్) తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్‌లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేశ్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్‌తో ఫస్టాప్ ముగుస్తుంది. సెకండ్ ఆఫ్ వచ్చేసరికి ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్‌లా మారిపోతాడు. అయితే కొన్ని సీన్స్‌లో ఎమోషన్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అభిమన్యు సింగ్ కామెడీ కాస్తా నవ్విస్తుంది. క్లైమాక్స్ పైరసీ కోసం ఫ్యాన్స్‌తో పోరాటం చేసిన తీరు బాగున్నప్పటికీ అంతగా మెప్పించలేదు. సినిమాలో కథ, డైలాగ్స్ మీద దర్శకుడు ఇంకాస్త దృష్టి సారిస్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే: నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ సినిమాలో ఆకతాయి కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో సూపర్ అనిపించింది. గాయత్రి సురేశ్ తన పాత్ర లో చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ కిల్లర్‌లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర ఫ్యాన్స్‌ను మెప్పించింది. మిగిలి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు జి. కార్తిక్ రెడ్డి పాత్రల ఎంపిక విషయంలో బాగానే ఉన్నా.. కథపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కథలో కొత్తదనం లేకపోవడం మైనస్. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రాఫి సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. చిత్రనిర్మాణ సంస్థ నిర్మాణ విలువలు ఫర్వాలేదు -
'రామ్ చరణ్ సినిమాను కూడా పైరసీ చేస్తా'
నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం 'మాయగాడు'. అడ్డా మూవీ ఫేమ్ జీ.ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా.. అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత సినిమాల్లో నటించారు. ఇటీవలే బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేశ్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు. -
అమెజాన్ ప్రైమ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’
‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, దివ్య పిళ్లై, అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ నిర్మించిన నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రంలో ఓటీటీలో విడుదైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కథేంటంటే.. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్, ఎప్పటినుంచంటే?
డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు నవీన్‌చంద్ర. పరంపర, అమ్ము సినిమాలతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించిన ఆయన తాజాగా రిపీట్ చిత్రంతో రాబోతున్నాడు. నవీన్ చంద్ర హీరోగా నటించిన రిపీట్ మూవీ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది తమిళ హిట్ మూవీ డెజావుకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో స్మృతి వెంకట్, మధుబాల, కాళీ వెంకట్ మిమే గోపి, అచ్యుత కుమార్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం అందించిన ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించాడు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు నిర్మించాడు. Prepare to watch this one on Repeat 🔁#RepeatOnHotstar, Premieres December 1.@Naveenc212 #AchuythKumar @madhoo69 @smruthi_venkat @mimegopi #SatyamRajesh #Pooja @NaveenaActress @kaaliactor @dirarvindh @MuthaiahG @GhibranOfficial pic.twitter.com/1rYHCSKb6d — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 24, 2022 చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటున్న డెజావు -
నవీన్ చంద్ర 'తగ్గేదే లే' సినిమా రివ్యూ
టైటిల్: తగ్గేదే లే నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ దర్శకత్వం : శ్రీనివాస్ రాజు కెమెరా : వెంకట్ ప్రసాద్ నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి బ్యానర్ : భద్ర ప్రొడక్షన్స్ ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్ విడుదల తేదీ: నవంబర్ 4, 2022 దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీతో రూపొందించిన చిత్రమే " తగ్గేదే లే". ఇందులో నవీన్ చంద్ర హీరోగా దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తాలు హీరోయిన్స్‌గా నటించారు. నవంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో చూద్దాం.. కథ మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేది తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర, హీరో భార్య గా దివ్యా పిళ్ళై బాగా నటించారు. నవీన్ చంద్ర ప్రియురాలిగా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్, డాక్టర్ సమరంగా '30 ఇయర్స్' పృథ్వీ వారి పాత్రలకు న్యాయం చేశారు. 'పోలీస్‌గా రాజా రవీంద్ర,. 'దండుపాళ్యం' గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో స్నేహితులుగా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్‌లు తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు ఈ కథ కొత్తదేమీ కాదు. కాకపోతే మర్డర్ మిస్టరీ, డ్రగ్స్, లవ్.. ఇలా మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ను సెలక్ట్ చేసుకొని ట్విస్టులు టర్నులతో సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనివాస్ రాజు. క్లెమాక్స్‌లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీలపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠకు గురి చేస్తాయి. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే వయలెన్స్‌కు కూడా మరీ ఎక్కువ మోతాదులో ఉంది. సినిమాకు అదే మైనస్‌గా మారింది. నేపథ్య సంగీతం బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా - భారతిరాజాల 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో తీసేయాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే వయొలెన్స్ ఇష్టపడేవారు తగ్గేదే లే చూసి ఎంజాయ్ చేయొచ్చు. చదవండి: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్ -
లవ్, యాక్షన్, ప్రతీకారంతో వస్తున్న ‘తగ్గేదే లే’
‘‘తగ్గేదే లే’ చిత్రంలో మూడు స్టోరీలను అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, ప్రతీకారం.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని హీరో నవీన్ చంద్ర అన్నారు. ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, దివ్య పిళ్లై, అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ..‘‘కరోనా రెండో వేవ్‌లో నా తండ్రిని కోల్పోయాను. ఆ దశలోనూ నాకు సపోర్ట్‌గా నిలిచిన యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘వాస్తవ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం’’ అన్నారు ప్రేమ్ కుమార్. ‘‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డిగారు మంచి చిత్రాలు తీద్దామని వచ్చారు. ‘తగ్గేదే లే’ ఆడితే ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నటుడు రాజా రవీంద్ర. -
నాకు ఆ తొందర లేదు.. అందుకే కథ విషయంలో రాజీ పడను
‘‘కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో కొత్త మార్పులు వచ్చాయి. లిప్‌లాక్ సీన్స్ ఉన్నంత మాత్రాన థియేటర్స్‌కు వస్తారనుకోవడం లేదు. సహజత్వంతో కూడిన వాస్తవిక కథలను చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. వెంటవెంటనే సినిమాలు చేయాలనే తొందర నాకు లేదు.. అందుకే కథ విషయంలో నేను రాజీ పడను’’ అని ‘దండుపాళ్యం’ ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ రాజు అన్నారు. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ–‘‘ప్రేమ, ప్రతీకారం మిళితమై ఉన్న కథ ఇది. స్వామిజీల ముసుగులో కొందరు చేసే అక్రమాలు, మనీ లాండరింగ్ అంశాన్ని చూపించాం. ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌కు సంబంధించిన ఏపిసోడ్ ఈ మూవీలో కీలకంగా ఉంటుంది. మా సినిమాలోని పాత్రలు వేటికవే పోటాపోటీగా ఉంటాయి. అందుకే ‘తగ్గేదే లే’ అని టైటిల్ పెట్టాం. మా టైటిల్‌కు మేము ఊహించిన దానికన్నా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
ఆ హీరోను నాతో మాట్లాడకు అని మొహం మీదే చెప్పాను: కలర్స్ స్వాతి
నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అమ్ము'. నేరుగా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యిందీ చిత్రం. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన హీరోయిన్ కలర్స్ స్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'నవీన్ చంద్ర మన ఇండస్ట్రీకి దొరికొన జెమ్ లాంటివాడు. ఈ సినిమాలో అతను పోషించిన శాడిస్ట్ రోల్ చూసి షాక్ అయ్యాను. అతన్ని చూడాలంటేనే భయం వేసింది. ఇంటర్వెల్లో వచ్చి నాతో మాట్లాడతోతే.. నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పేశాను. అంతలా నవీన్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు' అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది స్వాతి. -
ఓటీటీలో అమ్ము, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన చిత్రం అమ్ము. నవీన్ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. చారుకేశ్ శేఖర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కల్యాణ్ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 19 నుంచి ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అమ్ము టీజర్‌ను రిలీజ్ చేసింది. 'నా పేరు అమ్ము. మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు' అంటూ హీరోయిన్ పరిచయంతో వీడియో మొదలవుతుంది. మరి ఎంతో గారాబంగా పెరిగిన అమ్ము పెళ్లి తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అసలు అమ్ముకేం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! she’s fierce, she’s strong & she’s got a story to tell! ✨ watch #AmmuOnPrime, Oct 19 @karthiksubbaraj @StoneBenchers #KalyanSubramaniam @CharukeshSekar @aishwaryaleksh7 @Naveenc212 @ActorSimha pic.twitter.com/sr5AVZphmX — prime video IN (@PrimeVideoIN) October 6, 2022 చదవండి: ఓటీటీలో లాల్‌సింగ్ చడ్డా బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో నటుడు, ఆస్పత్రికి తీసుకెళ్లగా -
'డేజావు' కాన్సెప్ట్‌తో నవీన్ చంద్ర 'రిపీట్'.. నేరుగా ఓటీటీలో
Naveen Chandra Repeat Movie Sneak Peek Video Out: థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది. తాజాగా రిపీట్ స్నీక్ పీక్ పేరిట మూడున్నర నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ''ఈ వీడియోలో ఒక రైటర్ ఏదో సీరియస్‌గా రాస్తుంటాడు. ఎదురుగా చిరాకుగా ఉన్న ఒకామె అతన్ని చూసి ఏం రాశాడో చదవమని ఒకరికి సైగ చేస్తుంది. ఆ పేపర్ తీసుకున్న వ్యక్తి చదివాక వెంటనే ఆమె విక్రమ్‌కి కాల్ చేయండి అని అంటుంది. ఫోన్ కాల్ మాట్లాడిన విక్రమ్‌కు ఒక బ్రిడ్జి కింద నీటిలో అమ్మాయి మృతదేహం దొరుకుతుంది.'' అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ రైటర్ ఎవరు? అతను రాసినట్లుగా ఎందుకు జరిగింది? పోలీసులు అతని మాటలు ఎందుకు నమ్మారు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ ఇక సినిమా విషయానికొస్తే అరవింద శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపీట్'. నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ్ మూవీ 'డేజావు'కు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో డేజావు (ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇంతకుముందే జరిగినట్లుగా అనిపించే అనుభూతి) ప్రధానాంశంగా ఉండి, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
నేరుగా ఓటీటీలోకి నవీన్ చంద్ర కొత్త సినిమా!
థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ట్వీట్ చేసింది. అంతేకాదు సినిమా ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. గేమ్ మొదలుపెట్టిన ఫస్ట్ మూవ్లోనే ఒకడు మనకు చెక్ పెడితే ఎలా ఉంటుందో అలా ఎదురైందీ నాకీ కేస్.. ప్రతి స్టెప్‌లోనూ నాకు చెక్ పెడుతూనే వచ్చాడు అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. అలనాటి నటి మధు కీలకపాత్రలో నటించింది. ట్రైలర్ చూస్తుంటే మరో మంచి కథతో నవీన్ చంద్ర ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని ఇట్టే అర్థమవుతోంది. Get ready for a Mystical Crime Story! Here's the trailer of #RepeatOnHotstar ▶️ https://t.co/aKw0p1FH2x Watch all the action unfold, #Repeat on @DisneyPlusHSTel premieres Aug 25.#DisneyPlusHotstarMultiplex @Naveenc212 #AchuythKumar @madhoo69 @smruthi_venkat @mimegopi pic.twitter.com/DWvh04bllL — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 18, 2022 చదవండి: ‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ భారీ షాక్.. అసలు సీన్స్‌కే ఎసరు పెట్టారుగా! ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సిరీస్: నవీన్ చంద్ర
Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర. - పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు. - ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. - ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం. - రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. - నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. - నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి. - నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను. -
కోల్పోయిన జీవితం తిరిగి కావాలి.. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో 'పరంపర 2'
Parampara 2 Web Series Trailer: తెలుగు వెబ్ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో 'పరంపర' ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'పరంపర సీజన్ 2' వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్సరీస్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 'ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'పరంపర 2' జులై 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్‌లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్‌చరణ్–శంకర్‌గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ఆయన్ను చూసి బాక్సర్ అవ్వాలనుకున్నాను.. 'గని'తో ఆశ తీరింది
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. వరుణ్ తేజ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవీన్ చంద్ర చెప్పిన విశేషాలు. చదవండి: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఐకాన్ స్టార్.. మా మామయ్యగారు టి. శివకుమార్ బాక్సర్. ఆయన్ను చూసి, నేను బాక్సర్ అవ్వాలనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాను. ‘గని’లో ఆది అనే బాక్సర్ పాత్ర పోషించడంతో నేను బాక్సర్ కావాలన్న ఆశ తీరినట్లయింది. ఆది క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. లాక్డౌన్స్ వల్ల ‘గని’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కలిగాయి. దీంతో బాక్సర్‌గా చాలా రోజులు ఫిట్‌గానే ఉండటం చాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే నిజమైన బాక్సర్స్‌లా కనిపించాలని జాతీయ స్థాయి బాక్సర్స్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ప్రతి రోజూ పరీక్షలే! .. వరుణ్ అమేజింగ్ యాక్టర్. సెట్స్‌లో దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలానే కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ చేసినప్పుడు సిద్ధు, అల్లు బాబీగార్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజూ యూనిట్లో అందరికీ కరోనా పరీక్షలు చేయించేవారు. అరవింద..తో నటుడిగా మెరుగయ్యాను.. ‘అరవింద సమేత వీర రాఘవ’ యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. ‘గని’ చిత్రంలోని ఆది క్యారెక్టర్ మరో ఎక్స్పీరియన్స్. డేట్స్ కుదరకపోవడం వల్ల తమిళ హిట్ మూవీ ‘సారపట్ట పరంపర’లో అవకాశాన్ని కోల్పోయాను. రామ్‌చరణ్‌గారు హీరోగా శంకర్‌గారి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఏప్రిల్ 7న మొదలైయ్యే అమృత్సర్ షెడ్యూల్లో నేను పాల్గొంటాను. ఇక నేను హీరోగా చేసిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉన్నాయి. చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు -
ద్విభాషా చిత్రం.. క్లాప్ కొట్టిన అలీ
రెండు భాషల్లో షురూ ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం షురూ అయింది. వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వాణీ బోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ అండ్ కావ్య సమర్పణలో థింక్ బిగ్ బ్యానర్‌పై దర్శకుడు ఏ.ఎల్ విజయ్, శ్రీ షిరిడీ సాయి మూవీస్ అధినేత యం. రాజశేఖర్ రెడ్డి, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ క్రియేషన్స్‌పై బి. నర్సింగరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సి. కల్యాణ్, దర్శక–నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు అలీ క్లాప్ కొట్టారు. దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. యం. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న ప్రకాశ్ రాజ్, ఏ.ఎల్ విజయ్, నవీన్ చంద్రలకు థ్యాంక్స్’’ అన్నారు. నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గురుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
తొలిసారి భార్యను పరిచయం చేసి షాకిచ్చిన టాలీవుడ్ హీరో
Naveen Chandra Introduced His Wife On Valentines Day: 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే నవీన్ చంద్ర ఇంతవరకు తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా ఫిబ్రవరి 14,వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు. 'ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు నవీన్ చంద్రకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఏదైతేనెం శుభాకాంక్షలు అంటూ నవీన్‌కు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Actor Naveen Chandra (@naveenchandra212) -
పరంపర వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: పరంపర కథ: హరి యేలేటి దర్శకత్వం: కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ నేపథ్య సంగీతం: నరేష్ కుమారన్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల: 24 డిసెంబర్ 2021 బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్ సిరీస్ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్, జగపతి బాబు, శరత్ బాబు వంటి, ఆమని వంటి సీనియర్ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే హాట్‌స్టార్ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇది కావడం విశేషం. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: రాజకీయం, పవర్, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్‌మేకర్‌గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. సెంటిమెంట్‌తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్ (ఇషాన్)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. విశ్లేషణ: కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్‌తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్ సిరీస్. ఈ యాక్షన్ సీన్‌తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్ను చూపించారు దర్శకులు. పొలిటికల్ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్‌ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు. హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి కృష్ణ విజయ్. ఎల్ డైరెక్ట్ చేయగా మిగతా ఎపిసోడ్లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా తీశారు. అస్సలు బోర్ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్ చేశారు. చివరి రెండు ఎపిసోడ్లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు. అయితే క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్‌లా ఉండదు. ఇంకా వెబ్ సిరీస్ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. వెబ్ సిరీస్‌కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు క్రైమాక్స్ అలా ప్లాన్ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్‌తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్‌లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే: నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్, నెగెటివ్ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్ కుమార్ వెల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో శ్రీతేజ్, ప్రవీణ్ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్ చంద్రకు మంచి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్ చంద్ర. అప్పటివరకు సైలెంట్‌గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్ పాత్రలో ఇషాన్ (రోగ్ ఫేమ్) నటించి పర్వాలేదనిపించాడు. రచనగా హీరోయిన్ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్‌గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్‌ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. -
దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథే ‘1997’
‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథను చెప్పే ప్రయత్నమే ‘1997’ సినిమా. అంటరానితనం గురించి మా సినిమాలో ప్రశ్నిస్తున్నాం’’ అని నటుడు, దర్శక–నిర్మాత డా. మోహన్ అన్నారు. నవీన్ చంద్ర, డా. మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘1997లో జరిగిన సంఘటనలను మా తాతగారు నాకు చెప్పారు.. వాటి స్ఫూర్తితో కథ రాసుకున్నాను. అత్యాచారానికి గురైన మహిళ పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించాం. మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్కే.. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా సంతృప్తి ఉంది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. -
ఎంతో నీచమైన పాత్ర, నాకే ఛీ అనిపించింది
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 1997. డా.మోహన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ తాజా ఇంటర్వ్యూలో సినిమా కబుర్లు చెప్పుకొచ్చాడు. 'నా నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. ఒకసారి నేను షూటింగ్ చేస్తున్న సమయంలో మోహన్ గారు సెట్స్‌కు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను. అమ్మాయిపై అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం వంటి నేరాల నేపథ్యంలో 1997 సినిమా ఉంటుంది. నా పాత్రకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకే ఛీ అనిపించింది. అంత నీచమైన పాత్ర నాది. నా గాడ్ ఫాదర్ వర్మ గారే! . నటుడిగా నేను మూడు పాత్రలు మాత్రం చేయను.. ఆ పాత్రలు తప్ప మిగతా పాత్రలు చేస్తా. ఆ పాత్రలేవంటే .. చైల్డ్ ఆర్టిస్ట్ , హీరోయిన్ , హీరో ఈ మూడు పాత్రలు తప్ప అన్ని రకాల పాత్రలు చేస్తా!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘1997’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: నటుడు ప్రకాష్ రాజ్ -
‘1997’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: నటుడు ప్రకాష్ రాజ్
నటుడు నవీన్ చంద్ర, డా.మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ నీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు...ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...1997..నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో డాక్టర్ మోహన్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను. ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
నవీన్ చంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఆ విషయంలో కత్రినా, రష్మిక, పూజా హెగ్డేలే ఆదర్శం: అవికా గోర్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అంటే చాలు అందరికి గుర్తుకొచ్చే ఏకైక పేరు అవికా గోర్. ఆ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ నార్త్ బ్యూటీ. చైల్డ్ అర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ని ప్రారంభించిన అవికా.. ప్రస్తుతం వెండితెరపై దూసుకెళ్తోంది. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆకర్షించింది. తాజాగా ఈ బ్యూటీ నవీన్ చంద్రతో కలిసి ‘బ్రో’సినిమాలో నటిస్తోంది. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా అవికా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనపై వచ్చే రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోనని చెప్పింది. తనకు ముగ్గురు, నలుగు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఓ బేబీకి జన్మనిచ్చిందని కూడా పుకార్లు వచ్చాయని, వాటిని చూసి నవ్వుకుంటానే తప్ప.. పెద్దగా పట్టించుకోనని చెప్పింది. ఇక తన బ్యూటీ రహస్యం ఏంటని అడగ్గా.. వాటర్‌ని బాగా తాగాలని, 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని, వర్కౌట్ బాగా చేయాలని చెప్పింది. ఈ విషయంలో తనకు కత్రినాకైఫ్, పూజా హెగ్డే, రష్మికలే ఆదర్శమని చెప్పింది. ఇక తనకు టాలీవుడ్‌గా ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని, ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. బన్నీతో పాటు నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని తెలిపిందే. వీరిద్దరి సినిమాల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదుకోనని చెప్పింది. ఇంకా అవికా ఏమేమి చెప్పిందో ఈ వీడియోలో చూడండి -
మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించిన సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే!
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
‘మిషన్ 2020’ మూవీ రివ్యూ
టైటిల్: మిషన్ 2020 నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు దర్శకుడు: కరణం బాబ్జి సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్ నవీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. కరణం బాబ్జి దర్శకుడు. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్‌రాజు నిర్మాతలు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. విశాఖపట్నానికి చెందిన ప్రకాశ్ ఓ తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్. కాలేజీలో అతనే టాపర్. ముగ్గురు స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుంటారు. ఆ నలుగురికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. అయితే వారిలో ఒకరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనడంతో.. అశ్లీల వీడియోల మత్తులో పడిపోతారు. చదువును పక్కన పెట్టి పోర్న్ వీడియోలు చూస్తుంటారు. . ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారానికి పాల్పడతారు. క్షణికావేశంలో చేసిన ఆ తప్పుతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్ (నవీన్ చంద్ర)ఎలా ఛేదించాడు. చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ?అనేదే మిగతా కథ ఎలా చేశారంటే.. ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ జయంత్‌గా నవీన్ చంద్ర అదరగొట్టేశాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. ఎలా ఉందంటే.. మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత... అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమానే మిషన్ 2020. అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరణం బాబ్జీ. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. తన సినిమాతో యువతకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలన్న దర్శకుడి ఆలోచనను మనం ప్రశంసించాల్సిందే. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు. సెకండాఫ్‌లో కథ కాస్త ఫాస్ట్‌గా, సీరియస్‌గా నడుస్తుంది. క్లైమాక్స్‌లో అత్యాచార బాధితురాలు మీడియాతో మాట్లాడే సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ వర్క్ వర్కౌట్ కాలేదు. చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
డా.మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఇక హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు. ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.’’ అని అన్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో ఆయన నాకు కొడుకుగా నటించాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు. నేను పోలీస్ కావాలని మా నాన్న కోరిక. అది ఎలాగూ జరగలేదు. అయితే ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్‌గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని అన్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. -
‘అర్థ శతాబ్దం’మూవీ రివ్యూ
టైటిల్ : అర్థ శతాబ్దం నటీనటులు : కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ ఆమని తదితరులు నిర్మాణ సంస్థ : రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ దర్శకత్వం : రవీంద్ర పుల్లె సంగీతం : నోఫెల్ రాజా సినిమాటోగ్రఫీ : అస్కర్, వెంకట్, ఈజే వేణు ఎడిటింగ్ : జె.ప్రతాప్ కుమార్ విడుదల తేది : జూన్ 11, 2021(ఆహా) సీరియస్ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘అర్థ శతాబ్దం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ బాటపట్టింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 11)ప్రముఖ ఓటీటీ ఆహా విడుదలైన ‘అర్థ శతాబ్దం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ సిరిసిల్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ‘కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్ రామన్నగా సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ విప్లవం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ప్రేమ, కమర్షియల్ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలు చాలానే ఉనాయి. అయితే ఇలాంటి కథలను డీల్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని తట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ టర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్), డీఎస్పీ(అజయ్) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర అజయ్, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు. ఇక సహజత్వం కోసం అసభ్య పదజాలాన్ని యదేచ్ఛగా వాడేశారు. రక్తపాతం, హింస మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో..‘గతించిన క్షణాలన్నీ, గ్రంధాలుగా లిఖించబడినరోజున…కలవని అడుగులన్నీ కలయికగా కలబడే రోజు.. గెలువని ప్రేమలు అన్ని స్మృతులుగా పిలవబడే రోజున.. రాయని అక్షరాలని రాజ్యాంగంగా రాయబడిన రోజున.. మనిషిలో జనించిన ప్రేమ, మనిషిని జయించిన కులాన్ని చిల్చిన రోజున పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే’అనే భారీ ఎమోషనల్ డైలాగ్ సగం అర్థమై, అర్థం కానట్లుగానే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ నటన దర్శకుడు ఎంచుకున్న పాయింట్ నేపథ్య సంగీతం, పాటలు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ అగ్రనటీనటులను సరిగా ఉపయోగించుకోలేకపోవడం మోతాదు మించిన రక్తపాతం, హింస బలమైన సన్నీవేశాలు లేకపోవడం -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Ardha Shathabdam: పువ్వు కోసం కొట్టుకుచస్తున్నారంటే..
24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులుండేవి. ఒకానొక రాక్షస ఘడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది’ అని శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మధ్యలో ఓ ప్రేమ కథ, ఓ గ్రామంలోని ఇరు వర్గాల ఘర్షణలతో ఆసక్తి పెంచుతోంది. తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఒక్క పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం, ‘ఈ 50 ఏళ్ల స్వాతంత్ర్యం దేని కోసమో, ఎవరి కోసమో ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాలేదు’అని శుభలేక సుధాకర్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆహాలో రిలీజవుతోన్న 'అర్ధ శతాబ్దం'
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. రవీంద్ర పుల్లే మాట్లాడుతూ– జాతి, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన కథే ‘అర్ధ శతాబ్దం’. 1950 నుండి 2003 వరకు ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా ‘అర్ధ శతాబ్దం’’ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’’ అన్నారు చిట్టి కిరణ్. రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘22ఏళ్లుగా నటుడిగా ఉన్నాను. ‘అర్ధ శతాబ్దం’ కథ నచ్చడంతో రవీంద్ర, కిరణ్‌లతో భాగస్వామ్యం అయ్యాను. ‘ఆహా’ ద్వారా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళితో ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని భావించి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు, సంగీతం: నోఫెల్ రాజ. చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
ఆ పేరొస్తే చాలు
‘‘నేను నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను.. అంతేకానీ హీరోనా, విలనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానా? అని ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వాలనుకోలేదు. ఒక మంచి కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే చేయడానికి అభ్యంతరం లేదు. ‘నవీన్ చంద్ర అన్ని రకాల పాత్రలూ చేయగలడు.. చేస్తాడు’ అనే పేరొస్తే చాలు’’ అని నవీన్ చంద్ర అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. అందులో ప్రధాన పాత్రలో పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ‘మోసగాళ్ళు’ కథ విన్నప్పుడు ఇంతపెద్ద కుంభకోణం జరిగిందా? అనిపించింది. ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్‌లకు కజిన్ గా నటించా. వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను రక్షిస్తుంటా. ఎంత మేధావి అయినా తప్పు చేస్తే చివరికి శిక్ష తప్పదు? అనేది చూపిస్తున్నాం. ఇందులో నా పాత్ర డ్రగ్స్‌కి, మద్యానికి బానిసై ఉంటుంది. ‘ఎవరు’, ‘అరవింద సమేత వీరరాఘవ’ల్లో నా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పటివరకూ నాకంటూ ఎటువంటి ఇమేజ్ లేకుండా నటుడిగా కొనసాగుతుండటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు. -
‘సూపర్ ఓవర్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘సూపర్ ఓవర్’ తారాగణం: నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందుమౌళి, ప్రవీణ్ నిర్మాత: సుధీర్ వర్మ దర్శకత్వం: ప్రవీణ్ వర్మ ఓ.టి.టి. ప్లాట్‌ఫామ్: ఆహా విడుదల తేది : జనవరి 22, 2021 క్రికెట్ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో తెలుగులో పూర్తి స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. ఆ రెండు నేపథ్యాలనూ వాడుతూ, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడో విలక్షణమైన స్క్రీన్‌ప్లేతో చెబితే? క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం కన్నా హవాలా నేపథ్యం ఎక్కువుండే ‘సూపర్ ఓవర్’లో దర్శక, నిర్మాతలు చేసిన యత్నం అదే. కథ కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) – ముగ్గురూ చిన్నప్పటి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు దిగుతాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్లూ సమర్థిస్తారు. అనుకోకుండా కాశీ కోటీ 70 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని, కష్టాలు తీర్చుకోవాలని ముగ్గురూ రాత్రివేళ బయల్దేరతారు. ఆ రాత్రి తెల్లవారే లోపల అసలు ట్విస్టులు, కష్టాలు మొదలవుతాయి. బుకీ మురళి (కమెడియన్ ప్రవీణ్), పోలీసు ఎస్.ఐ. (అజయ్), హవాలా డబ్బు డీల్ చేసే మనుషులు – ఇలా రకరకాల పాత్రలతో సాగే ఛేజింగ్ థ్రిల్లర్ మిగతా కథ. ఎలా చేశారంటే హితుల కథలా మొదలై పూర్తిస్థాయి థ్రిల్లర్‌లా సాగే ఈ సినిమాలో నటీనటులందరూ పాత్రలకు సరిగ్గా అతికినట్టు సరిపోయారు. ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గంభీర కంఠస్వరం, ఒకింత రగ్డ్ లుక్‌తో నవీన్ చంద్ర ఈ కథను నడిపే కాశీ పాత్రలో బాగున్నారు. తెలుగమ్మాయి చాందిని పాత్రచిత్రణతో, ఆ ఎనర్జీతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ‘మస్తీస్’, ‘కలర్ ఫోటో’ లాంటి హిట్ వెబ్ సినిమాల్లో కనిపించిన చాందినికి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ప్రతిదానిలో ఏదో ఒక అనుమానం లేవనెత్తే కామికల్ రిలీఫ్ పాత్రలో రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి వినోదం అందిస్తారు. కమెడియన్ ప్రవీణ్, అజయ్ సహా ఈ సినిమాలో పాత్రలే తప్ప, ఎక్కడా నటీనటులు కనిపించరు. ఎవరెంతసేపున్నా సన్నివేశాలనూ, సందర్భాలనూ, పాత్రల ప్రవర్తననూ ఉత్కంఠ రేపేలా, శ్రద్ధగా రాసుకోవడం దర్శకుడి ప్రతిభ. ఎలా తీశారంటే..: ఈ సినిమాకు బలం – స్క్రీన్‌ప్లేలోని వైవిధ్యం. ఇలాంటి కథ, దానికి వెండితెర కథనం రాసుకోవడం కష్టం. రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం మరీ కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకొని, నలుగురూ ఇష్టపడేలా తీశారు – దర్శకుడు స్వర్గీయ ప్రవీణ్ వర్మ. షూటింగ్ ఆఖరులో వాహనప్రమాదంలో ప్రవీణ్ వర్మ దుర్మరణం పాలయ్యారు. దాంతో, ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని ఇచ్చిన ‘స్వామిరారా’ సుధీర్‌వర్మ పోస్ట్‌ప్రొడక్షన్ చేశారు. సాంకేతిక విభాగాల పనితనం సినిమాకు మరో బలం. 25 రోజులకు పైగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రివేళ షూటింగ్ జరుపుకొందీ సినిమా. నైట్ ఎఫెక్ట్‌లో, ఏరియల్ షాట్స్‌తో దివాకర్ మణి కెమేరావర్క్ కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్‌కి నేపథ్య సంగీతం గుండెకాయ. సన్నీ ఈ చిత్రానికి గ్యాప్ లేకుండా సంగీతం ఇస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కాస్తంత మితి మీరినా, ఆ నేపథ్య సంగీతమే లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఎడిటింగ్ సైతం కథ శరవేగంతో ముందుకు కదిలేలా చేసింది. సెన్సార్ లేని ఓటీటీలో సహజంగా వినిపించే, అసభ్యమైన డైలాగులు కూడా చాలానే ఉన్న చిత్రమిది. అనేక చోట్ల లాజిక్ మిస్సయి, కథనంలో మ్యాజిక్ ఎక్కువున్న ఈ సినిమాకు ఓటీటీ రిలీజు లాభించింది. థియేటర్లలో కన్నా ఎక్కువ మంది ముంగిటకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఛేజింగ్ థ్రిల్లర్ కావడంతో దర్శకుడు పలుచోట్ల తీసుకున్న సినిమాటిక్ లిబర్టీని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న విలక్షణ కథనం వల్ల ఒకే సీన్ సందర్భాన్ని బట్టి, పదే పదే వస్తున్నా సరే సహిస్తాడు. అక్కడక్కడా ఓవర్‌గా అనిపించే అలాంటివి పక్కన పెడితే, గంట 20 నిమిషాల కాలక్షేపం థ్రిల్లర్‌గా ఈ కథాకథనం సూపర్ అనిపిస్తుంది. బలాలు: విలక్షణమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం సహజంగా తోచే∙నటీనటులు, వారి అభినయం కెమేరా వర్క్, ఉత్కంఠ పెంచే నేపథ్య సంగీతం బలహీనతలు: ట్విస్టుల హడావిడిలో మిస్సయిన లాజిక్కులు స్క్రీన్ ప్లేలో భాగంగా రిపీటయ్యే సీన్లు వెండితెర కన్నా ఓటీటీకే పనికొచ్చే అంశాలు కొసమెరుపు: ఇది ఓటీటీలో ఓకే థ్రిల్లర్! – రెంటాల జయదేవ -
మాస్ సిద్
పుట్టినరోజు సందర్భంగా నవీన్‌చంద్ర కొత్త లుక్‌లో కనిపించారు. మంచు విష్ణు నిర్మాతగా, హీరోగా చేస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవీన్‌చంద్ర చేస్తున్న ‘సిద్’ పాత్ర లుక్‌ని బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిలిమ్స్ పతాకంపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రలో నవీన్‌చంద్ర కనిపిస్తారు. పోస్టర్ చూస్తుంటే తనది మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్‌కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్‌కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్‌గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్‌గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్‌వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్‌ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్‌లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
మిస్ ఇండియా మూవీ రివ్యూ
టైటిల్ : మిస్ ఇండియా నటీనటులు : కీర్తి సురేశ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా, నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు నిర్మాణ సంస్థ: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: మహేష్ కోనేరు దర్శకత్వం: నరేంద్రనాథ్ సంగీతం: ఎస్.ఎస్. థమన్ సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్ లోపేజ్, సుజిత్ వాసుదేవ్ ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : నవంబరు 4, 2020 ( నెట్‌ఫ్లిక్స్) థియేటర్లు మూతబడి 8 నెలలు కావస్తోంది. కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలేవీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేకపోయినప్పటికీ.. మహానటి కీర్తి సురేష్ అభిమానులకు మాత్రం ఓటీటీ.. ఆ వెలితి లేకుండా చేసింది. చాలా వరకు ఆమె చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ దశలో ఉండగానే లాక్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు రిలీజ్ చేయడమే తప్ప వేరొక మార్గం లేదని తెలిసినప్పటికీ బడా నిర్మాతలు ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ కీర్తి అభినయం, నటనా కౌశలంపై ఉన్న నమ్మకంతో ఆమె నటించిన ‘పెంగ్విన్’ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు మూవీ మేకర్స్. దాని ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కీర్తి సురేష్ ‘‘మిస్ ఇండియా’’ అనే మరో సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ ట్రైలర్‌తో మ్యాజిక్ చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ: మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది మానస సంయుక్త( కీర్తి సురేశ్). ఎప్పటికైనా తన సొంత బ్రాండ్‌ను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి తనేంటో ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ లంబసింగిలో తన తాతయ్య (రాజేంద్రప్రసాద్) బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీపై మక్కువ పెంచుకున్న మానస.. దానినే తన బిజినెస్‌గా మలచుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అకడమిక్స్‌లో మార్కులు సాధించడం కంటే కూడా ఓ లక్ష్యంతో ముందుకు సాగడంలోనే అసలైన మజా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు కూడా చిన్నతనంలోనే ఆమెపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో అనుకోని కారణాల వల్ల అమెరికాకు చేరుకున్న మానస.. అక్కడ తన ఆలోచనలను ఎలా అమలు చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఒక మహిళగా, యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాగిన మానస ప్రయాణంలో కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) సృష్టించిన అడ్డుంకులేమిటి? ఆశయం కోసం ప్రేమను కూడా పక్కనపెట్టిన మానస తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? ఇంతకీ మిస్ ఇండియా బ్రాండ్‌లో ఉన్న గొప్పదనం ఏమిటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ: నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్ వన్‌గా కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ ఛాయ్‌కు తిరుగులేదని ప్రతీ సీన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్ కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు. ఎవరెలా నటించారు? మహానటి సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలోనూ తన మార్కు నటనతో మంచి మార్కులే కొట్టేశారు. ఇక తానే టాప్‌లో ఉండాలనే స్వార్థం, ఓ మహిళ తనకు పోటీరావడాన్ని ఏమాత్రం సహించని విలన్ పాత్రలో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తూనే కైలాశ్ శివకుమార్‌గా జగపతిబాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా వంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తమ పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అల్టిమేట్‌గా ఛాయ్‌కు, కాఫీకు జరిగే యుద్ధంలో ఛాయ్ గెలుస్తుందని చూపించడంలో సీన్లు కొంచెం లాగ్ అయ్యాయని చెప్పవచ్చు. రొటీన్‌గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. థమన్ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్‌గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించినంత మేర వినోదం అందించలేదనే అనిపిస్తుంది. ‘‘మిస్ ఇండియా’’ బ్రాండ్ ఛాయ్ ఘుమఘుమలు అనుకున్న స్థాయిలో సువాసనలు వెదజల్లలేదనే చెప్పవచ్చు! కాకపోతే ఒక్కసారి మాత్రం ‘ఛాయ్’ను కళ్లతోనే టేస్ట్ చేసి ఆనందించవచ్చు!! -
బాలయ్య-బోయపాటి చిత్రంలో ‘బాల్‌రెడ్డి’?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ రోర్ (చిన్నపాటి టీజర్) సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ రోర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. (ట్రెండింగ్‌లో టీజర్.. సంతోషంలో బాలయ్య) ఇక బోయపాటి-బాలయ్య సినిమా ఆనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిత్రంలో ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. అటు హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే నటుడిగా తననితాను ఫ్రూవ్ చేసుకోవడానికి విలక్షణ పాత్రలను సైతం అంగీకరిస్తున్నాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో బాల్‌రెడ్డి పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర తన నటనతో మెప్పించాడు. అయితే బాలయ్య చిత్రంలో నవీన్‌చంద్ర నటించే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో మరో కీలకపాత్ర కోసం శ్రీకాంత్‌ను బోయపాటి ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?) -
సినిమాల పైరసీ నేపథ్యంలో..
నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్ ’.స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ చిత్రానికి ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తీక్ రెడ్డి దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. భార్గవ్ మన్నె మాట్లాడుతూ– ‘‘సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ ఇది. తను అనుకున్న పాయింట్‌ను చక్కగా తెరకెక్కించాడు కార్తీక్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం టీజర్ ఇటీవల విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.నవీన్ చంద్ర యాక్టింగ్ నెక్ట్స్ లెవ ల్లో ఉంటుంది. పైరేటెడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
‘హీరో హీరోయిన్’ ఫస్ట్ లుక్ ఇదే..
అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇటీవల సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్న నవీన్, సోలో హీరోగా నటించిన తాజా చిత్రం హీరో హీరోయిన్. ఈ సినిమాలో నవీన్ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. చిత్రయూనిట్ దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
అభిమానులకు అడివి శేష్ రిక్వెస్ట్
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో అడివి శేష్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కట్టిపడేసే కథా కథనాలతో ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన శేష్‌పై అభినందనల జల్లు కురుస్తోంది. అయితే కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో సినిమాలోని కీలక ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. (మూవీ రివ్యూ : ‘ఎవరు’) ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ లీకులపై ఎవరు టీం స్పందించింది. ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసిన అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనాలు ట్విస్ట్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేశారు. తనకు ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు. Team #Evaru is really enjoying the success of the film. We have a small request about SPOILERS!!! #EvaruRampage pic.twitter.com/KvRDf2kTx5 — Adivi Sesh (@AdiviSesh) August 15, 2019 -
షాలినిని మేమంత ఫల్నాక్కయ అని పిలుస్తాం
-
నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం
-
అసురుడు
పాత్రల్లోకి ఇట్టే మారిపోయే నటుల్లో తమిళ నటుడు ధనుష్ ఒకరు. లేటెస్ట్గా వయసు మళ్లిన వ్యక్తిగా మారిపోయారు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అసురన్’. వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల్లా డబుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. తమిళ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ధనుష్ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
ధనుష్‌కు విలన్‌గా తెలుగు హీరో
ఒక భాషలో హీరోగా నటిస్తున్న తారలు ఇతర భాషల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఆది పినిశెట్టి విలన్‌గా దూసుకుపోతున్నాడు. తాజాగా కోలీవుడ్ విశాల్ కూడా మలయాళ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.ఓ కోసం విలన్‌గా మారాడు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరేందుకు ఓ తెలుగు హీరో రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్, తరువాత హీరోగా సక్సెస్‌లు సాధించలేకపోయాడు. ఇటీవల అరవింద సమేతతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకోవటంతో ఈ యువ నటుడికి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నవీన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6న ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. Welcome on board #AndalaRakshasi & #AravindaSametha fame @Naveenc212. We are glad to have you play an important role in our film. pic.twitter.com/HVCo2ZWzXY — Sathya Jyothi Films (@SathyaJyothi_) 27 March 2019 -
డిఫరెంట్ టైటిల్‌తో నవీన్ చంద్ర!
‘అరవింద సమేత’ మూవీలో బెస్ట్ ఫర్ఫామెన్స్తో అందర్నీ ఆకట్టుకున్నాడు నవీన్ చంద్ర. ఇక ఈ మూవీ తరువాత హీరోగా నవీన్ చంద్ర మళ్లీ బిజీగా మారిపోయాడు. తాజాగా మరో మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 28°Cగా రాబోతోన్న ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలినీ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ చంద్ర మరో తాజా చిత్రం హీరోహీరోయిన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. -
‘ప్రతీ మగాడు ప్లేబాయే’
అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇటీవల సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్న నవీన్, సోలో హీరోగా నటించిన తాజా చిత్రం హీరో హీరోయిన్. ఈ సినిమాలో నవీన్ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్ మీట్
-
ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో
జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించనున్నాడట. గతంలో నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నవీన్, మరోసారి సపోర్టింగ్ రోల్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
అంచనాలు పెంచేస్తోన్న బోయపాటి
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలంలో సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో రామ్ చరణ్, ఆ సినిమా తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించనున్నాడు. ఇతర కీలక పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న తారలను ఎంపిక చేస్తున్నాడు బోయపాటి. కథ ప్రకారం ఈ సినిమాలో చెర్రీకి ఇద్దరు అన్నలు ఉంటారట. వీరిలో ఒక అన్నగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), మరో అన్నగా నవీన్ చంద్ర(అందాల రాక్షసి ఫేం)లు కనిపించనున్నారు. రామ్ చరణ్ వదినగా అందాల నటి స్నేహ అలరించనుంది. ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
నవీన్ చంద్రతో సరదాగా కాసేపు
-
‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ ఆడియో లాంచ్
-
జూలియట్.. ఇడియట్ల ప్రేమ
దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ వోధిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ‘‘ప్రతి లవర్ ఒక ఇడియట్టే. నేనొక ఇడియట్ లాంటి లవర్‌లా సినిమాలో కనిపిస్తా. విలువలున్న ప్రేమకథ ఇది’’ అన్నారు. ‘‘ఓ జూలియట్, ఓ ఇడియట్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే ఈ మూవీ. నవీన్‌ను ఇప్పటికీ ‘అందాలరాక్షసి’ నవీన్ అంటుంటారు. ఈ సినిమాతో ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ నవీన్ అంటారు’’ అన్నారు అజయ్ వోధిరాల. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి. -
జూన్ నెలాఖరున 'చందమామ రావే'
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా'చందమామ రావే'. ఈ సినిమాతో ప్రియల్ గోర్ అనే హీరోయిన్గా పరిచయం అవుతోంది. 'అది రాదు.. వీడు మారడు' అనేది క్యాప్షన్. లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తచరిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వర్మ సహా పలువురు స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కవల దర్శకులు ధర్మ-రక్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ... 'ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ధర్మ, రక్షలు చందమామ రావేకు దర్శకత్వం వహించారు.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పెక్యులర్ లవ్‌స్టోరీ. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పేఎక్స్‌ట్రీమ్ లవ్‌స్టోరీ 'చందమామ రావే'. ఆద్యంతం అలరించే చిత్రంగా రూపొందిన 'చందమామ రావే'ను జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. -
టైమ్ చాలా అవసరం!
పార్వతి దూరమయ్యాక దేవదాసు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా దేవదాసుని వదిలేస్తుంది పార్వతి. కానీ, ఈ కుర్రాడి ప్రియురాలు డిఫరెంట్. ఒకసారి వదిలేస్తుంది. తర్వాత దగ్గరవుతుంది. మళ్లీ వదిలేస్తుంది. దగ్గరవుతుంది. ఇలా మూడుసార్లు అన్నమాట. ఫైనల్‌గా వీళ్ల లవ్‌స్టోరీకి ఎలాంటి ఎండింగ్ పడుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘చందమామ రావే’. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్‌చంద్ర, ప్రియల్ గోర్ జంటగా నటించారు. ‘అది రాదు...వీడు మారడు’ అనేది ఉపశీర్షిక. లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రొడక్షన్స్‌పై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మించారు. రాంగోపాల్‌వర్మ వంటి స్టార్ దర్శకులు వద్ద పనిచేసిన కవల దర్శకులు ధర్మ–రక్ష ఈ సినిమాకు దర్శకులు. నిర్మాత కిరణ్ మాట్లాడుతూ–‘ఇందులో నవీన్ చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పే ఎక్స్ట్రీమ్ లవ్‌స్టోరీ ఈ సినిమా. మంచి ఎమోషన్స్‌తో సాగే చిత్రం. ధర్మ–రక్షలు చక్కగా తెరకెక్కించారు. వచ్చే నెల చివర్లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
ట్విన్స్... టైమింగ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ హీరో, హీరోయిన్లు. కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ‘‘ప్రేమకు, జీవితానికి టైమింగ్ అవసరమని చెప్పే చిత్రమిది. వైవిధ్య కథాంశం. వినోదం, ఎమోషన్స్ ఉంటాయి. ప్రపంచంలోనే ట్విన్స్ డెరైక్ట్ చేసిన చిత్రం మాదే. నవీన్ చంద్ర పాత్ర కొత్తగా ఉంటుంది. త్వరలో పాటలు, సినిమా రిలీజవుతాయి’’ అని నిర్మాతలు తెలిపారు. -
కోటీశ్వరుడు ఎవరు?
నవీన్‌చంద్ర హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాత. శ్రుతీ సోధి కథానాయిక. కేకే రాధామోహన్ మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్లో వస్తోన్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఓ పాటను ఈ నెలలో అరకులో చిత్రీకరించనున్నాం’’అని తెలిపారు. ‘‘గతంలో నా దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అని సత్తిబాబు తెలిపారు. పృధ్వీ, సలోని, జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: బాల్‌రెడ్డి పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఎస్. కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్. -
'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ స్టిల్స్
-
అందాల రాక్షసి హీరోతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'
యంగ్ హీరో నవీన్ చంద్రతో మీలో ఎవరు కోటీశ్వరుడు రూపొందిస్తున్నారు. అదేంటి.. ఈ మధ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు, చిరంజీవి హోస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి.. ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా..? అదేం లేందడి. నవీన్ చంద్రతో రూపొందించేది. టీవీ షో కాదు. ప్రస్తుతం ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న నవీన్ చంద్ర, ఆ సినిమా తరువాత సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సలోని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ పృథ్వి కీలక పాత్రలో నటించనున్నాడు. -
వలపులో మలుపు!
నవీన్ చంద్ర, ఆర్తీ చిక్కర జంటగా వేణుమూవీస్ పతాకంపై పసుపులేటి వేణుమాధవ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.గోపీ దర్శకుడు. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కరంటం రాంబాబు కెమేరా స్విచాన్ చేయగా, టీవీ నరసింహారెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఓ యువకుడి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? హ్యాపీగా, రొమాంటిక్‌గా సాగుతున్న జీవితంలో యాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది ఆసక్తికరం. ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: హరి, కెమేరా: వాసు, సంగీతం: కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్, సహ నిర్మాత: వి.కావేరి. -
భిన్నమైన కథతో...
సినిమా అనే షిప్కి డెరైక్టర్ కెప్టెన్‌లాంటి వాడు. సాధారణంగా ఓ చిత్రానికి ఒకే దర్శకుడుంటాడు. అరుదైన పరిస్థితుల్లో ఇద్దరు వేర్వేరు దర్శకులు పనిచేసిన సందర్భాలు న్నాయి. కానీ, తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ హీరో హీరోయిన్లు. ఐఈఎఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల నిర్మించారు. ఈ చిత్రం బ్యానర్ లోగోను దర్శకుడు మారుతి, టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలం. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి’’ అని దర్శకులు తెలిపారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. చిత్ర నిర్మాతలు, హీరో నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నాని గెస్ట్‌గా చందమామ రావే టీజర్ లాంచ్
అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చందమామ రావే. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా కవల సోదరులు ఇద్దరు కలిసి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ, రక్షలు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాల్ గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న చందమామ రావే టీజర్‌ను ఈ బుధవారం యంగ్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. -
నవ్వులే నవ్వులు!
‘అధినేత’,‘ ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్‌చంద్ర హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘ఓ చినదాన’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. సత్తిబాబు ఈ కథను బాగా హ్యాండిల్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. నితిన్ హీరోగా భారీ చిత్రం ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా రాధాకృష్ణ నిర్మించనున్న భారీ చిత్రం డిసెంబర్లో ప్రారంభమవుతుంది. -
నాని సినిమాలో విలన్‌గా యంగ్ హీరో
ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న నానీ, దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు ఓ యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోలేకపోయాడు. తరువాత కూడా వరుస సినిమాలు చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావటం లేదు. లుక్ పరంగా మ్యాన్లీగా కనిపించే నవీన్ చంద్రను నాని సినిమాలో ప్రతినాయక పాత్రకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నరట. మరీ నవీన్ కెరీర్‌కు నాని సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. -
యాక్షన్.. రొమాన్స్
రెండు దశాబ్దాల పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వేణు మూవీస్ సంస్థ అధినేత పసుపులేటి వేణుమాధవ్ తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘అందాల రాక్షసి’, ‘త్రిపుర’, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఫేం నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో జి. గోపిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతాం. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియచేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్. -
'బుర్రకథ'లో సన్నీలియోన్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్, మరో తెలుగు సినిమాలో తళుక్కుమననుంది. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్లో యమ బిజీగా ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సన్నీ నటించిన హిందీ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో సౌత్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ హాట్ బ్యూటీతో చిన్న క్యారెక్టర్ అయినా చేయించాలని ట్రై చేస్తున్నారు. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బుర్రకథ సినిమాలో సన్నీ లియోన్ కనిపించనుంది. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసిన సన్నీ, వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న సినిమా షూటింగ్లో పాల్గొననుంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు, ఓ పాటను కూడా సన్నీ మీద చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు సినిమా ప్రమోషన్లో కూడా సన్నీ పేరునే ప్రముఖంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు బుర్రకథ యూనిట్. -
అన్క్లెయిమ్డ్ మనీ... ఓ ఫిల్మ్ లెక్క!
చిత్రం: ‘లచ్చిందేవికో లెక్కుంది’ తారాగణం: నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ, జయప్రకాశ్‌రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ కెమేరా: ఈశ్వర్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం: ఎం.ఎం. కీరవాణి నిర్మాత: సాయిప్రసాద్ కామినేని రచన, దర్శకత్వం: జగదీశ్ తలశిల కొత్తదైన చిన్న కాన్సెప్ట్‌ను స్క్రిప్ట్‌గా రాసుకుం టున్నప్పుడు దాన్ని సూటిగా, సాఫీగా చెప్పడం ముఖ్యం. కొత్త దర్శకుడు, కొత్త కథనంతో అయిన ప్పుడు మరీ మరీ ముఖ్యం. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చూసినప్పుడు ఈ ఆలోచనలన్నీ కలు గుతాయి. మన బ్యాంకుల్లో ఎవరూ ఆపరేట్ చేయకుండా కొన్ని వేల ఖాతాలు ఉండిపోతు న్నాయి. వాటిల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్ల కొద్దీ మూలుగుతోంది. ఆ ‘అన్క్లెయిమ్డ్ మనీ’ చుట్టూ రాసుకున్న కథ ఇది. ‘జనతా బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో కూడా అలాంటి ఖాతాలు, అన్క్లెయిమ్డ్ మనీ ఎక్కువే. ఆ బ్యాంకులో పనిచేస్తుంటుంది దేవి (లావణ్యా త్రిపాఠీ). అమ్మానాన్న ఆ బ్యాంకులో పనిచేసి, చనిపోవడంతో, తానూ అదే బ్యాంకులో చేరి, దాన్ని గుడిగా భావించే సిన్సియర్ ఉద్యోగి ఆమె. అదే బ్యాంక్‌లో ‘హెల్ప్ డెస్క్’లో పనిచేస్తుంటాడు నవీన్ (నవీన్‌చంద్ర). సిగరెట్టు, మందుతో ఎంజాయ్ చేస్తూ, జీవితంలో బోలెడంత డబ్బు సునాయాసంగా సంపాదించేయాలనేది అతని ఆశ. ఇంతలో ఆ బ్యాంక్‌లోని అన్క్లెయిమ్డ్ ఖాతాల్లోని సొమ్ము కోసం ఇద్దరు (అజయ్, భానుశ్రీ) ప్లాన్ చేస్తారు. ఆ ఖాతాల డేటా కోసం నవీన్‌కు అందులో పర్సంటేజ్ ఇస్తామని ఎర వేస్తారు. ఆ డేటా బ్యాంక్ మేనేజర్ సోమయా జులు (జయప్రకాశ్ రెడ్డి), హీరోయిన్ దగ్గరే ఉంటుంది. అప్పటి దాకా తనను అసహ్యించు కుంటున్న హీరోయిన్ని సైతం డబ్బు కోసం ప్రేమ ముగ్గులోకి దింపుతాడు హీరో. ఆ డేటాను తీసుకెళ్ళి, అజయ్ బృందానికి ఇస్తాడు. వాటిలో అంకాళమ్మ, ఉమాదేవి - అనే రెండు ఖాతాల్లో ఉన్న భారీ మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి అజయ్ బృందం బ్యాంకుకు వస్తుంది. తీరా, వాళ్ళిద్దరూ ఆ ఖాతాల వారసులు కాదనే విషయం బయట పడుతుంది. అక్కడికి ఇంటర్వెల్. ఇక, అక్కడ నుంచి కథ ఎన్నెన్నో మలుపులు తిరుగుతుంది. ఈ అన్క్లెయిమ్డ్ మనీ కోసం మరో బ్యాచ్ (నర్రా శ్రీను బృందం) కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటుంది. మరోపక్క బ్యాంక్‌ను కాపాడుకోవాలని హీరోయిన్ భావిస్తుంటుంది. ఇన్ని కోణాల మధ్య అసలు కథ ఎటు నుంచి ఎటు, ఎలా మలుపు తిరిగిందన్నది పాతకాలం సినిమా ప్రకటనల్లో చెప్పినట్లు... ‘వెండితెరపై చూసి తీరవలసినదే కానీ, చెప్పతరము కానిది!’ ‘అందాల రాక్షసి’తో సక్సెస్ఫుల్ అనిపించు కున్న నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ కాంబినే షన్లో ఇది మరో సినిమా. నవీన్‌చంద్ర హీరో అయినా, నెగిటివ్, పాజిటివ్‌ల మధ్య ఊగిసలాడే చిత్రమైన ప్రొటాగనిస్ట్ పాత్ర అతనిది. పాత్ర, భిన్నమైన గెటప్‌లు, నటన పరంగా లావణ్యా త్రిపాఠీకే ప్రాధాన్యముంది. ఆమె ఆ బాధ్యతను నెరవేర్చడానికి వీలైనంత చేశారు. అందరి కన్నా బాగా పేరొచ్చేది - స్వయంగా ఓ పాట కూడా పాడిన జయప్రకాశ్ రెడ్డికి! మిగిలిన నటులదీ, సాంకేతిక నిపుణులదీ... యథోచిత భాగ స్వామ్యం. ‘‘పందికేం తెలుసు పెర్ఫ్యూమ్ వాసన’’ (హీరోయిన్), ‘‘మ్యాగీ తిని పెరిగామమ్మా! ఏదైనా టూ మినిట్స్!’’ (హీరో) లాంటి డైలాగ్స్ జనం ఎంజాయ్ చేస్తారు. కీరవాణి 221వ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమా అన్నారు. మ్యాజిక్ మాటెలా ఉన్నా, పరిధి దాటిన ప్రయోగశీలత, సృజనాత్మకత పాటల్లో వినిపిస్తుంది. సెకండాఫ్‌లో ఒక దశ దాటాక అది మరీ పరవళ్ళు తొక్కింది. కమర్షియాలిటీ కోసం ఫస్టాఫ్‌లో మొదట్లోనే ఐటమ్ సాంగ్ పెట్టారు. ‘జనాన్ని వదిలేసినవాడు సన్న్యాసి... జనం వదిలేసిన వాడు సన్నాసి’ అంటూ ఫిలసాఫికల్ టోన్‌లో మొదలై, తెరపై ప్యాచ్‌లతో డ్యాన్సర్ల ఒంటిని సెన్సార్‌వారు కొంత కప్పిపెట్టాల్సొచ్చిన ఈ క్లబ్సాంగ్ మాస్కు నచ్చుతుంది. దర్శకుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా గతంలో కొన్ని చిత్రాలకు పనిచేసిన జగదీశ్ తల శిలకు డెరైక్టర్‌గా ఇది తొలి సినిమా. కథ అల్లికలో, ఆచరణలో ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. వరుస ట్విస్టులతో స్క్రిప్టు అల్లుకుంటూ వచ్చిన దర్శకుడు వాటిని అర్థవంతంగా, అర్థమయ్యేలా చూసుకొంటే, ఇంకా బాగుండేదన్నది ఊహించని ట్విస్ట్. టైటిల్స్ వేస్తున్నప్పుడే క్లిష్టమైన ఈ అన్ క్లెయిమ్డ్ మనీ కాన్సెప్ట్ అంతా నిమిషంలో వివరిం చేశారు. కాబట్టి, తెర తీసే సమయానికే హాలులో ఉండడం సామాన్యులకు శ్రేయస్కరం. అలాగే, సినిమాలో అనేక మలుపులు కాబట్టి, వాటన్నిటికీ క్లైమాక్స్ తరువాత మళ్ళీ హీరో, హీరోయిన్ల సంభాషణల్లో తెలిసేలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కాబట్టి, ఆఖరు దాకా చూడా ల్సిందే. అందుకే, సినిమా నిడివి రెండు గంటల లోపే ఉండడం రిలీఫ్ అనిపించే విషయం. - రెంటాల జయదేవ -
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ కొత్త స్టిల్స్
-
లచ్చిందేవి లెక్కేంటి?
లక్ష్మీదేవిని పూజించని వారు ఎవరూ ఉండరు. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకూ అందరూ అనుగ్రహం కోసం ఆమెను పూజించేవారే. అయితే లచ్చిందేవికి కూడా ఎప్పుడు, ఎవరిని అనుగ్రహించాలో ఓ లెక్క ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మించిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారు. నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ జంటగా నటించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కీరవాణి సంగీతం హైలైట్. ఉత్కంఠ భరితమైన ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలూ ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఈ. మధుసూదన్‌రావు. -
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ మూవీ స్టిల్స్
-
'త్రిపుర' మూవీ రివ్యూ
దయ్యం ఫార్మ్‌లో ఉంది తారాగణం: స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేశ్, సప్తగిరి, శ్రీమాన్, ‘షకలక’ శంకర్; స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ - వెలిగొండ శ్రీనివాస్; మాటలు: రాజా; పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి; కెమేరా: రవికుమార్ సానా; ఎడిటింగ్: ఉపేంద్ర, సంగీతం: కామ్రాన్; సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్; కథ - దర్శకత్వం: రాజకిరణ్; నిడివి: 151 ని॥ దయ్యం సినిమాలు ఇప్పుడు స్టయిల్. అదే ‘ఫార్ము’లా ఇప్పుడు నడుస్తోంది. గత ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్టయిన కామెడీ హార్రర్ థ్రిల్లర్ ‘గీతాంజలి’. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు రాజ్‌కిరణ్. ఇప్పుడు ఆయన తన రెండో చిత్రంలోనూ ఆ మార్గమే అనుసరించారు. ‘ప్రేమకథా చిత్రమ్’, తమిళ డబ్బింగ్ ‘పిజ్జా’ లాంటి సూపర్‌హిట్స్‌తో రెండు మూడేళ్ళ క్రితం పుంజుకున్న ఈ తరహా హార్రర్ కామెడీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారంటీ ఫార్ములా. కాబట్టి, ‘సేఫ్ బెట్’గా రాజ్‌కిరణ్ రాసుకున్న కథ, తీసిన విధానం అర్థం చేసుకోదగినవే. కథగా చెప్పాలంటే... వరహాపట్నం అనే గ్రామం. అందులో శివన్నారాయణ దంపతుల (శివన్నారాయణ, రజిత) పెద్దమ్మాయి త్రిపుర అలియాస్ చిట్టి (స్వాతి). మరదలు త్రిపురకూ, ఇంట్లోవాళ్ళకీ ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలని తిరిగే మేనమామ సన్న్యాసిరాజు (సప్తగిరి). పెళ్ళీడుకొచ్చినా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్న త్రిపురకు ఒక చిత్రమైన లక్షణం. ఆ అమ్మాయికి ఎవరి గురించైనా, ఏదైనా కలలో వస్తే - అది నిజమవుతుంటుంది. ఊరు ఊరంతా ఆ అమ్మాయి నిద్ర లేవగానే - ఆమె కలల్లో తమ గురించి, తమ వాళ్ళ గురించి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి క్యూలు కడుతుంటారు. కలలపై ట్రీట్మెంట్ కోసం త్రిపురను హైదరాబాద్‌లో ప్రొఫెసర్ రమేశ్ (రావు రమేశ్) దగ్గరకు తీసుకువెళతారు. అక్కడ డాక్టర్ నవీన్ (‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర) ఆమెకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెడతాడు. అప్పటి దాకా ఎవరిని చూసినా పెళ్ళికి వద్దనే హీరోయిన్ తీరా ఒక్క అనుకోని ముద్దుకే సదరు డాక్టర్‌ను ఇష్టపడుతుంది. ఆ మరునాడే అతని బెకైక్కి ఊరంతా తిరుగుతుంది. అతనూ ఆనందంగా తిప్పుతాడు. పెళ్ళికి ఒప్పుకోని తల్లితండ్రుల్ని వదిలేసి, లేచిపోదామని హీరోయిన్ అంటుంది. చివరకు డాక్టర్‌తో హీరోయిన్ పెళ్ళవుతుంది. పెళ్ళయి హైదరాబాద్ వచ్చిన హీరోయిన్‌కు రకరకాల అనుభవాలు. ఊరికి దోవ అడిగిన వ్యక్తి మరణిస్తాడు. కలలో వచ్చినట్లే బ్రోకర్ తాతారావుకు యాక్సిడెంట్ అవుతుంది. ఇంతలో తన భర్తను తానే కత్తితో పొడిచినట్లు కల. అక్కడ ఇంటర్వెల్. మరోపక్క డాక్టర్ నవీన్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన కొలీగ్ డాక్టర్ ఈషా (పూజా రామచంద్రన్) నెలరోజులుగా కనిపించదు. డాక్టర్ నవీన్‌కు ఫ్రెండ్స గ్రూప్‌లో ఒకడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ (కన్నడ నటుడు తిలక్) దర్యాప్తు చేస్తుంటాడు. కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిని చంపిందెవరు? హీరో అమ్మేద్దామనుకుంటున్న ఫార్మ్‌హౌస్‌లో ఉన్న దయ్యం కథేమిటి? దయ్యం పగ ఏమిటి? ఇంతకీ హంతకుడెవరన్నది మిగతా ఫిల్మ్. ‘కలర్స్’ స్వాతికి ఈ సినిమా వెరైటీనే. తెలుగులో ఎక్కువగా ఉత్సాహం ఉరకెలెత్తే పాత్రలు, చిలిపితనం నిండిన పాత్ర చిత్రణలతో పాపులరైన ఆమెకిది కొత్త కోణం. పల్లెటూరి పిల్లగా మొదలై పెళ్ళయిన అమ్మాయిగా అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కునే పాత్రలో పెద్ద తరహాగా కనిపించారు. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి కథలోని హీరోయిన్ పేరే సినిమాకూ పెట్టారు. అందుకు తగ్గట్లే - సినిమాలో అసలు గుట్టు విప్పడంలో ఆ పాత్ర నుంచి మరింత యాక్టివ్ రోల్ ఆశిస్తాం. పాజిటివ్, నెగిటివ్ల మధ్య ఊగిసలాడే పాత్ర నవీన్చంద్రది. రావు రమేశ్, శివన్నారాయణ, ఇళ్ళ బ్రోకర్ తాతారావుగా శ్రీమాన్, పనిమనిషిగా ప్రీతీ నిగమ్ తదితరులది పరిధి మేరకు పాత్రపోషణ. భయపెట్టడం కన్నా మాస్ మసాలా కమర్షియల్ వినోదం మీదే ఆధారపడ్డ ‘త్రిపుర’లో లేటెస్ట్ కామెడీ సంచలనం సప్తగిరి మళ్ళీ తన మార్క్ కామెడీతో కనిపిస్తారు. హీరో కావాలనుకొనే కోమల్బాబుగా ‘షకలక’ శంకర్, అతని తండ్రి రొయ్యల రెడ్డిగా జయప్రకాశ్‌రెడ్డి కనిపించేది కాసేపే అయినా సామాన్య ప్రేక్షకుల్ని నవ్విస్తారు. చిత్ర నిర్మాణ బృందమంతా ఎక్కువగా కొత్తవాళ్ళూ. ఉత్సాహవంతులే. వాళ్ళ కష్టం తెర మీద కనపడుతుంటుంది. కొత్త మ్యూజిక్ డెరైక్టర్, కొత్త రైటర్, కన్నడంలో పేరు తెచ్చుకున్న కెమేరామన్ - ఇలా ఎక్కువ కొత్త రక్తమే. దాంతో వచ్చే ఎడ్వాంటేజ్లు, డిజెడ్వాంటేజ్లూ తెరపై మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కలలు నిజం కావడం, ఇన్‌ట్యూషన్‌తో జరగబోయేది ముందుగానే ఊహించడం - లాంటి అంశాలతో ఇప్పటికే సవాలక్ష ఇంగ్లీష్ సినిమాలొచ్చాయి. కానీ, ఇది మనదైన చిత్రం, చిత్రీకరణ. దర్శకుడు రాజ్కిరణే కథ రాసుకున్న ఈ చిత్రానికి కోన, వెలిగొండ లాంటి పేరున్న రచయితలు స్క్రీన్‌ప్లే ఇచ్చారు. ‘గీతాంజలి’ కథ దయ్యం ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ చుట్టూ తిరిగితే, ‘త్రిపుర’ కథ మొత్తం ఫార్మ్‌హౌస్‌లోని దయ్యం చుట్టూ నడుస్తుంది. అక్కడైనా, ఇక్కడైనా - మన సగటు సినిమాలన్నిటి లాగానే ఆడ దయ్యమే తిరుగుతుంటుంది. ఆ దయ్యం ఏం చేసింది? ఆ పనుల్లో ఎంత భయం, మరెంత వినోదం వచ్చాయన్నదే ఇంపార్టెంట్. ఈ కొలతలతోనే ‘త్రిపుర’ నడుస్తుంది. ఆ క్రమంలో కొన్ని కొరుకుడు పడవు. ఊరవతల మర్రిచెట్టు దగ్గర ఒక దయ్యముందని హీరోయిన్ చెబుతుంది. తీరా అక్కడ ఆగిపోయిన కారులోని మనిషిని చంపే దయ్యం మాత్రం మర్రిచెట్టు దయ్యం కాదు... ఫార్మహౌస్ దయ్యం. అలాగే, ఫస్టాఫ్ అంతా తెగ కలలు కనే హీరోయిన్‌కు సెకండాఫ్‌లో కలలు కనే తీరిక ఉండదు. కానీ, ఇలాంటివెన్నో వినోదంలో కొట్టుకుపోతాయని ఆశించాలి. ‘‘దీని గురించి ఎక్కువ పట్టించుకోకు. కొన్ని విషయాలంతే! లాజిక్కు అందవు’’ అని సినిమా చివరలో ఒక డైలాగ్ వస్తుంది. కలలు నిజం కావడం లాంటి మిస్టీరియస్ అంశాలున్న ‘త్రిపుర’కు అంతకు మించి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇంకేముంటుంది! తెర వెనుక ముచ్చట్లు హీరోయిన్ స్వాతి టైటిల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. పెళ్ళయిన స్త్రీ పాత్ర కోసం ఆరు కిలోల బరువు పెరిగారు.ఈ సినిమా చిత్రీకరణకు పట్టిన మొత్తం షూటింగ్ డేస్ 68. {పధాన భాగమంతా హైదరాబాద్ చుట్టుపక్కల తీశారు. సినిమా ప్రారంభ గీతంతో పాటు కలర్ఫుల్గా కనిపించే మరో పాటను కర్ణాటకలోని బాదామిలో చిత్రీకరించారు.మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ అయిన కామ్రాన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.డైలాగ్ రైటర్ రాజాకు ఇది తొలియత్నం. కన్నడ హిట్ ‘ఉగ్రమ్’ కెమేరామన్ రవికుమార్ ‘త్రిపుర’కు పనిచేశారు. షూటింగ్ పూర్తి కాక ముందే ‘గీతాంజలి’ క్రేజ్ వల్ల శాటిలైట్ రైట్స్ అమ్ముడైపోయాయి. ఇటీవలి కాలంలో ఒక చిన్న చిత్రం రైట్స్ రూ. 2.6 కోట్ల దాకా పలకడం విశేషం. తమిళ తెరకు కూడా సుపరిచితులైన స్వాతి, నవీన్ చంద్ర, శ్రీమాన్ లాంటి నటీనటులు ఉండడంతో, ఏకకాలంలో తెలుగుతో పాటు ‘తిరుపుర సుందరి’ పేరు మీద తమిళ వెర్షన్‌ను కూడా తెరకెక్కించారు. ‘షకలక’ శంకర్, జయప్రకాశ్‌రెడ్డి ఎపిసోడ్‌ను తమిళ వెర్ష న్లో అక్కడి నటులతో చేయించారు. తమిళంలో నేరుగా సెన్సార్ చేశారు. అక్కడ ఈ నెల 27న రిలీజ్ చేస్తారు. - రెంటాల జయదేవ -
త్రిపురకు అతనే హీరో - దాసరి
‘‘నాకు రాజమౌళి, శేఖర్ కమ్ముల, క్రిష్ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడనే పదానికి నిజమైన అర్థం తీసుకొచ్చారు. వారిలో రాజకిరణ్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి అతనే హీరో. రాజకిరణ్ రూపొందించిన ‘గీతాంజలి’ చూశాను. స్వాతి కళ్లు చాలా డేంజరస్. ఈ చిత్రానికి సరిగ్గా సూట్ అవుతాయి. విపరీతమైన పోటీ ఉన్న ఈ కాలంలో నవీన్ చంద్ర చాలా కష్టపడి నిలదొక్కుకుంటున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. స్వాతి, నవీన్‌చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించారు. క్రిష్ మాట్లాడుతూ-‘‘నాకు దెయ్యాల సినిమాలంటే చాలా భయం. ‘అరుంధతి’ సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే నేను సీట్లో కాళ్లు పెట్టుకుని మరీ చూశాను. ‘గీతాంజలి’ సినిమా చూస్తున్నప్పుడు పడీ పడీ నవ్వాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రాజకిరణ్ నాకు ‘గీతాంజలి’ కథ చెప్పినప్పుడు ‘త్రిపుర’ అనే టైటిల్ చెప్పారు. తర్వాత ఈ సినిమా కథను చెప్పి ‘త్రిపుర’ టైటిల్ చెప్పారు. ఇది అతనికి బ్రహ్మాస్త్రం లాంటి కథ. తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజకిరణ్ ఎంత చక్కగా కథ చెప్పారో, అంత కన్నా బాగా తెరపై ఆవిష్కరించారు. కమ్రాన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని స్వాతి చెప్పారు. రాజకిరణ్, రచ యిత వెలిగొండ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ మల్లాల తదితరులు పాల్గొన్నారు. -
జగదీశ్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు : రాజమౌళి
‘‘ఈ సినిమా డెరైక్టర్ జగదీశ్ నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ‘బాహుబలి’ సినిమా టైంకు మాత్రం అతను లేడనేసరికి కొంత టెన్షన్ పడ్డాను. తను చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. అంతే డిటైల్డ్‌గా సినిమా తీశాడనుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ -‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేదానికి లెక్కుంది. అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఆ లెక్కను విప్పి చూపించడానికి జగదీశ్ చేసే ప్రయత్నం సక్సెస్ కావాలి’’అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మన ఇంట్లో ఉండే లెక్క మనకు తెలుసు. కానీ కొన్ని లక్షల కోట్లు మనకు తెలియకుండా అనాథగా పడున్నాయి. వాటికీ ఓ లెక్క ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించా’’ అని చెప్పారు. ఈ వేడుకలో నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠి, సునీల్, శివశక్తి దత్తా, సంపూర్ణేశ్‌బాబు, అలీ, సెంథిల్ తదితరులు పాల్గొన్నారు. -
త్రిపుర
పెళ్లి కాని అమ్మాయికొచ్చే కలలన్నీ తియ్యగా ఉంటాయి. కానీ, ‘త్రిపుర’కు వచ్చే కలలు మాత్రం కల్లోలాన్ని సృష్టిస్తాయి. ఆ కలలేంటి? ఆ కలవరాలేంటి? ఆ కల్లోలమేంటి? ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ‘త్రిపుర’ చిత్రం రూపొందింది. ‘కలర్స్’ స్వాతి, నవీన్‌చంద్ర, రావురమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకుడు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లచ్చిందేవి లెక్కలు
‘అందాల రాక్షసి’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. రాజమౌళి దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన జగదీశ్ తలశిల ఈ చిత్రానికి ద ర్శకుడు. మయూఖ క్రియేషన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో, టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ చిత్రానికి ముఖ్యమైన సూతధ్రారి, పాత్రధారి డబ్బే అని, కథాంశం ఆసక్తికరంగా ఉంటుందని, ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి’’ అని చిత్రసంగీతదర్శకుడు కీరవాణి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక కామెడీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా రూపొందిస్తున్నాం. మంచి మ్యూజిక్ మూవీ అవుతుంది’’ అని తెలిపారు. కీరవాణిగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని హీరో నవీన్ చంద్ర అన్నారు. ‘‘ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌గా నిలిచే వాటిలో మా చిత్రం ఉంటుంది’’ అనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తపరిచారు. -
పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో
హైదరాబాద్ : టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచులర్ హీరోలు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. మంచు మనోజ్ ఈ నెల 20న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే హీరో అల్లరి నరేష్ కూడా మే 29న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా 'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నవీన్ చంద్రకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇక ఇతగాడు పెద్దలు నిర్ణయించిన యువతిని పెళ్లాడనున్నాడు. వధువు హైదరాబాద్‌కు చెందిన యువతిగా సమాచారం. త్వరలో నిశ్చితార్థం జరగనుందని, అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాదేనని నవీన్ చంద్ర సన్నిహితులు తెలిపారు. కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర ఓ వైపు తెలుగులో మరోవైపు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి సమయానికి ఆ సినిమాలన్ని పూర్తి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం స్వాతి ప్రధాన పాత్ర పోషిస్తున్న'త్రిపుర' చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది.ఇక తమిళ చిత్రం శివప్పుతో పాటు మరో కోలివుడ్ చిత్రానికి సైన్ చేశాడు. అంతేకాకుండా నవీన్ చంద్ర చేతిలో రెండు, మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
‘గీతాంజలి’ని మించి...
‘కలర్స్’ స్వాతి ఇక నుంచి ‘త్రిపుర’గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘త్రిపుర’. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు బోయపాటి శ్రీను, అలీ, కోనవెంకట్ కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాజ్‌కిరణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మళ్లీ కోనవెంకట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ‘గీతాంజలి’ ని మించిన చిత్రం అవుతుంది ’’ అని చెప్పారు. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యానని, రాజ్ కిరణ్ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉందని కోనవెంకట్ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని, ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే : కోనవెంకట్, కెమెరా: రవికుమార్, సంగీతం: కామ్రాన్. -
విభిన్న కథనంతో...
నవదీప్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. కార్తీక్‌వర్మ దండు దర్శకుడు. శిరువూరి రాజేశ్‌వర్మ నిర్మాత. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, ప్రచార చిత్రాలను నిఖిల్, సందీప్‌కిషన్, ప్రిన్స్, చందు మొండేటి, సుధీరవర్మ కలిసి విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన నాని, వరుణ్‌సందేశ్, శశాంక్, కమల్ కామరాజ్, కిరణ్, మధుశాలిని, పూజా జవేరి, ప్రాచీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. టికెట్‌కి పూర్తి న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. విభిన్నమైన కథనంతో కార్తీక్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని నవీన్‌చంద్ర అన్నారు. సంగీతానికి ఆస్కారమున్న సినిమా ఇదని సంగీత దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మట్లాడారు. -
రచ్చ చేస్తారు!
నవీన్‌చంద్ర, తులికా గుప్త జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రచ్చ రంబోలా’. ధర్మ-రక్ష కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బందరు బాబి, నాని క్రిష్ణ నిర్మాతలు. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నాగబాబు కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. హరీశ్‌శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ప్రేమకథల్లోనే నటించిన నాకు ఇదొక కొత్త అనుభవం. తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాను. యాక్షన్, కామెడీ, లవ్... ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉంటాయి. నటునిగా నాకు ఈ సినిమా మరో మంచి మలుపు అవుతుంది’’ అని చెప్పారు. ‘‘మా కథకు తగ్గ కథానాయకుడు నవీన్‌చంద్ర. అడగ్గానే ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించినందుకు థ్యాంక్స్. రాజీ అనే పదాన్ని ఇష్టపడని నిర్మాతలు మాకు దొరికారు. తప్పకుండా జనరంజకమైన సినిమాను తెరకెక్కిస్తాం’’ అని దర్శకులు అన్నారు. చిరంజీవికి ‘ఖైదీ’లా... నవీన్‌చంద్రకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనీ, ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామనీ, సమ్మర్లో విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు. నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రను ఇందులో చేస్తున్నానని కథానాయిక తులికా చెప్పారు. అతిథి, రావురమేశ్, అజయ్, పోసాని కృష్ణమురళి, జీవా, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్, కెమెరా: ఎస్వీ విశ్వేశ్వర్, కూర్పు: రవి మన్ల, నిర్మాణం: నానిగాడి సినిమా. -
భమ్ బోలేనాథ్ మూవీ స్టిల్స్
-
రచ్చ రంబోల
‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ‘రచ్చ రంబోల’ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘రచ్చ రంబోల’ పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందనుంది. కవల సోదరులైన ధర్మక్షేత్ర, ధర్మరక్షలను దర్శకులుగా పరిచయం చేస్తూ, నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబి, నాని కృష్ణ ఈ చిత్రం నిర్మించనున్నారు. సామాజిక సమస్య నేపథ్యం ఉన్న ఈ చిత్రం కథాంశం అన్ని వర్గాలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకులు పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘డిసెంబరు 6న చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటి షూటింగుతో సినిమాను పూర్తి చేస్తాం. ‘ప్రేమ-ఇష్క్-కాదల్’ చిత్రానికి స్వరాలందించిన శ్రవణ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
ప్రేమను కూడా అమ్మేస్తాడా?
దేన్నయినా అమ్మేయగల సమర్థుడు ఆ యువకుడు. ఒకానొక దశలో తన ప్రేమను కూడా అమ్మేయాల్సివస్తుంది. ఇలాంటి ఆసక్తికర కథాంశంతో నవీన్‌చంద్ర, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. అజయ్ వొద్దిరాల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కె.రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అనురాగ్ కెమెరా స్విచాన్ చేయగా, సుకుమార్ క్లాప్ ఇచ్చారు. టి.ప్రసన్నకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఆర్య’ నుంచి ‘ఆర్య-2’ వరకూ తన వద్ద అజయ్ సహాయకునిగా పనిచేశాడని, తనది అద్భుతమైన జడ్జిమెంట్ అని సుకుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. వాణిజ్య అంశాలను మేళవించిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కించనున్నానని దర్శకుడు చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మించనున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తన పాత్ర ఎనర్జి టిక్‌గా ఉంటుందని నవీన్ చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రతీష్ వేగా, పాటలు: సిరివెన్నెల. -
'నా రాకుమారుడు' సినిమా స్టిల్స్
-
నా రాకుమారుడు వస్తున్నాడు
అబ్బాయిలకు డ్రీమ్గాళ్స్ ఉన్నట్టుగానే, అమ్మాయిలకు డ్రీమ్బాయ్స్ ఉంటారు. అలాంటి ఓ డ్రీమ్‌బాయ్ కథే ‘నా రాకుమారుడు’. ఇందులో ‘అందాల రాక్షసి’ఫేం నవీన్‌చంద్ర హీరో. రీతువర్మ కథానాయిక. పూరి జగన్నాథ్ శిష్యుడు సత్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత వజ్రంగ్ మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన కథ. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు ఓ పెయింటింగ్‌లా సినిమాను మలిచాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి, కూర్పు: ప్రవీణ్‌పూడి, కళ: ఉపేంద్రరెడ్డి. -
రాకుమారుడి గీతాలాపన
అందాల రాక్షసి, దళం చిత్రాల ఫేం నవీన్‌చంద్ర హీరోగా హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న సందీప్, తనీష్, ప్రిన్స్, రాహుల్ సీడీని ఆవిష్కరించి జీవితారాజశేఖర్కి ఇచ్చారు. ట్రైలర్స్ చూసి సినిమా అంచనా వేయొచ్చని, ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని ‘దిల్’ రాజు అన్నారు. ‘అందాల రాక్షసి’లో నవీన్ అద్భుతంగా నటించాడని, అచ్చు మంచి పాటలు ఇచ్చాడనే నమ్మకం ఉందని, ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని బెల్లంకొండ సురేష్ చెప్పారు. నవీన్ మాట్లాడుతూ - ‘‘నా గత రెండు చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో చేశాను. పాత్రకు తగ్గట్టుగా శారీరక భాషను మార్చుకున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడు సత్య స్వేచ్ఛ ఇవ్వడం వల్ల చక్కని పాటలివ్వగలిగాను’’ అని అచ్చు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇంకా రాజశేఖర్, జీవిత, వీఎన్ ఆదిత్య, ఆదిత్య తదితరులు యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. -
యాదగిరీశుడికి ప్రముఖుల పూజలు
యాదగిరికొండ, న్యూస్‌లైన్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శనివారం కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిందంబరేషన్, రాష్ట్ర డీఐజీ నవీన్‌చంద్రలు స్వామి, అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు గర్భాలయ ముఖద్వారం వద ్దపూలమాలలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈఓ కృష్ణవేణి వారికి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్తయ్య, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, ఆంజనేయులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్ పాల్గొన్నారు. కుటుంబ కథా చిత్రాలే మంచి పేరు తెచ్చి పెట్టాయి కుటుంబ కథా చిత్రాలే తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయని సినీనటి శిరీష అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆమె స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడున్న హీరోలతో అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటించానని పేర్కొన్నారు. సుమారు 35 సినిమాలలో నటించినట్టు చెప్పారు. మనసంతా నువ్వే, స్టూడెంట్ నంబర్ వన్, పల్లకిలో పెళ్లి కూతురు లాంటి సినిమాలు చేశానని తెలిపారు. తాను నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలేనని పేర్కొన్నారు. జైనాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి ఆలేరు : కొలనుపాక జైన దేవాలయాన్ని కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చిద ంబరేశన్ సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు ఆయనకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. జైనదేవాలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. -
వాస్తవికతను అద్దంపట్టే కథలంటే ఇష్టం
‘‘అడవుల నుంచి మొదలైన చరిత్ర మళ్లీ ఆటవిక దిశగానే ప్రయాణిస్తోంది. తుపాకుల్ని పక్కన పెట్టి జనారణ్యంలోకి అడుగుపెట్టినా... ఆత్మనీ, అస్థిత్వాన్నీ కాపాడేది ఇక్కడా తుపాకులే. ఎటు చూసినా అరణ్యమే... స్థితీగతీ అగమ్యమే’’... ‘దళం’ కథ ఇదే. తొలి సినిమాతోనే ఇంత శక్తిమంతమైన కథను తీసుకొని దర్శకుడు జీవన్‌రెడ్డి పెద్ద సాహసమే చేశారు. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌పాయ్ ప్రధాన పాత్రధారులుగా మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జీవన్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘‘కొందరు మాజీ నక్సలైట్ల కథే ఈ చిత్రం. రాజకీయ కుతంత్రాల మధ్య నలిగి... ఉక్కిరిబిక్కిరైన ఆ ఉద్యమకారులు... చివరకు తీసుకున్న నిర్ణయమేంటి? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. అందుకని ఇది పూర్తిగా సీరియస్ వేలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇందులో కామెడీ ఉంటుంది. ఓ చిన్న ప్రేమకథ కూడా ఉంటుంది. ‘అందాలరాక్షసి’ ఫేం నవీన్‌చంద్ర ఇందులో మాజీ నక్సలైట్‌గా నటించాడు. ఆ పాత్రకు తను ప్రాణం పోశాడనాలి. అలాగే ధన్‌రాజ్ కూడా మాజీ నక్సల్‌గా కనిపిస్తాడు. అంతులేని ఉద్వేగం ఉన్న కథాంశమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’’ అని చెప్పారు జీవన్‌రెడ్డి. ఇంకా చెబుతూ- ‘‘చిన్నప్పట్నుంచీ పుస్తకాల పురుగుని. సాహిత్యం విపరీతంగా చదివాను. శ్రీశ్రీ సాహిత్యం నాకు ప్రాణం. ఓ విధంగా నా తొలి సినిమాకు ఇలాంటి నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణం అదే అయ్యుండచ్చు’’ అని చెప్పారు. ఇక నుంచి కూడా మీ నుంచి ఇలాంటి కథలే వస్తాయా? అనడిగితే- ‘‘అన్ని రకాల కథల్నీ హ్యాండిల్ చేయాలని ఉంది. అయితే నాకు వాస్తవికతను అద్దం పట్టే కథలంటే ఇష్టం. ఏం చేసినా అభిరుచిని మాత్రం చంపుకొని సినిమాలు చేయను. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులకు రెండు మంచి మాటలు చెప్పాలనేది నా అభిమతం’’ అన్నారు. -
ఆలోచింపజేసే ‘దళం’
నక్సలిజం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘దళం’. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌బాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవన్‌రెడ్డి దర్శకుడు. మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 15న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇష్టంతో తీసిన సినిమా ఇది. పేక్షకులను ఆనందింపజేయడమే కాక, ఆలోచింపజేసే విధంగా దర్శకుడు జీవన్ ఈ చిత్రాన్ని మిలిచాడు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు జీవన్. ఆ మార్కు సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘అందాల రాక్షసి’ తర్వాత నవీన్‌చంద్రకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. టైటిల్‌కి, పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ‘‘యువతరం మెచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఫ్రేమూ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాను ప్రేమించే వ్యక్తి నిర్మాత సుమంత్. ఖర్చుకు వెనకాకుండా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఉత్తమ సాంకేతిక విలువలు పాటించాం. ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ పాత్రలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’’ అని తెలిపారు. టైటిల్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన సినిమా ఇదని నవీన్‌చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.శ్రీకృష్ణ, లైన్ నిర్మాత: ప్రవీణ్‌రెడ్డి.