ఆలోచింపజేసే ‘దళం’ | 'Dalam' is an upcoming telugu film | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే ‘దళం’

Aug 10 2013 12:21 AM | Updated on Sep 1 2017 9:45 PM

ఆలోచింపజేసే ‘దళం’

ఆలోచింపజేసే ‘దళం’

నక్సలిజం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘దళం’. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌బాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవన్‌రెడ్డి దర్శకుడు.

నక్సలిజం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘దళం’. నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌బాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవన్‌రెడ్డి దర్శకుడు. మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 15న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇష్టంతో తీసిన సినిమా ఇది. 
 
 పేక్షకులను ఆనందింపజేయడమే కాక, ఆలోచింపజేసే విధంగా దర్శకుడు జీవన్ ఈ చిత్రాన్ని మిలిచాడు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు జీవన్. ఆ మార్కు సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘అందాల రాక్షసి’ తర్వాత నవీన్‌చంద్రకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. టైటిల్‌కి, పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ‘‘యువతరం మెచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రతి ఫ్రేమూ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాను ప్రేమించే వ్యక్తి నిర్మాత సుమంత్. 
 
 ఖర్చుకు వెనకాకుండా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఉత్తమ సాంకేతిక విలువలు పాటించాం. ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ పాత్రలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’’ అని తెలిపారు. టైటిల్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన సినిమా ఇదని నవీన్‌చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.శ్రీకృష్ణ, లైన్ నిర్మాత: ప్రవీణ్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement