యాదగిరీశుడికి ప్రముఖుల పూజలు | Yadagiri swamy celebrity worship | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడికి ప్రముఖుల పూజలు

Published Sun, Sep 15 2013 3:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Yadagiri swamy celebrity worship

యాదగిరికొండ, న్యూస్‌లైన్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శనివారం కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిందంబరేషన్, రాష్ట్ర డీఐజీ నవీన్‌చంద్రలు స్వామి, అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు గర్భాలయ ముఖద్వారం వద ్దపూలమాలలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
 
 దేవస్థానం ఈఓ కృష్ణవేణి వారికి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్తయ్య, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, ఆంజనేయులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్ పాల్గొన్నారు.  
 
 కుటుంబ  కథా చిత్రాలే  
 మంచి పేరు తెచ్చి పెట్టాయి
 కుటుంబ కథా చిత్రాలే తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయని సినీనటి శిరీష అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆమె స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడున్న హీరోలతో అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటించానని పేర్కొన్నారు. సుమారు 35 సినిమాలలో నటించినట్టు చెప్పారు. మనసంతా నువ్వే, స్టూడెంట్ నంబర్ వన్, పల్లకిలో పెళ్లి కూతురు లాంటి సినిమాలు  చేశానని తెలిపారు. తాను నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలేనని పేర్కొన్నారు.
 
 జైనాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి
 ఆలేరు :  కొలనుపాక జైన దేవాలయాన్ని కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చిద ంబరేశన్ సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు ఆయనకు ఆలయ కమిటీ  ఘన స్వాగతం పలికింది.  జైనదేవాలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని  అతిథి గృహంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement