యాదగిరికొండ, న్యూస్‌లైన్ : దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సిబ్బం దిపై ఉందని లేబర్ కమిషనర్ రమణాచారి అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వేముల వాడ, భద్రాచలం, శ్రీశైలం లాం టి దేవాలయాలను శానిటేషన్‌పై మోడల్‌గా తీసుకున్నట్టు పేర్కొన్నారు. గుట్ట దేవస్థానంలో శాని టేషన్ మంచిగా ఉన్నది లేనిది దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్టు తెలిపారు.
క్షేత్రాలకు వచ్చే ప్రతి భక్తునికి పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు దేవస్థానం ఈఓ కృష్ణవేణితో ఆయన సుమారు 3 గంటల పాటు చర్చించారు. సిబ్బందితో కలిసి ఆయన ఆలయ సరిసరాలు, సంగీత భవనం, గర్భాలయం, ఆండాళ్ నిలయం, విష్ణు పుష్కరిణి, తదితర ప్రాంతాల ఫొటోలను తీసుకున్నారు. దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించకూడదని సూచించారు. ఆయనతోపాటు దేవస్థానం సిబ్బంది దోర్భల భాస్కర శర్మ, ఆంజనేయులు, సివిల్ అధికారులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంద్ర మల్లేష్ ఉన్నారు.
భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
Published Sun, Sep 22 2013 3:48 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM
Advertisement
Advertisement