
టైమ్ చాలా అవసరం!
పార్వతి దూరమయ్యాక దేవదాసు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా దేవదాసుని వదిలేస్తుంది పార్వతి. కానీ, ఈ కుర్రాడి ప్రియురాలు డిఫరెంట్.
పార్వతి దూరమయ్యాక దేవదాసు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా దేవదాసుని వదిలేస్తుంది పార్వతి. కానీ, ఈ కుర్రాడి ప్రియురాలు డిఫరెంట్. ఒకసారి వదిలేస్తుంది. తర్వాత దగ్గరవుతుంది. మళ్లీ వదిలేస్తుంది. దగ్గరవుతుంది. ఇలా మూడుసార్లు అన్నమాట. ఫైనల్‌గా వీళ్ల లవ్‌స్టోరీకి ఎలాంటి ఎండింగ్ పడుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘చందమామ రావే’.
‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్‌చంద్ర, ప్రియల్ గోర్ జంటగా నటించారు. ‘అది రాదు...వీడు మారడు’ అనేది ఉపశీర్షిక. లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రొడక్షన్స్‌పై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మించారు. రాంగోపాల్‌వర్మ వంటి స్టార్ దర్శకులు వద్ద పనిచేసిన కవల దర్శకులు ధర్మ–రక్ష ఈ సినిమాకు దర్శకులు.
నిర్మాత కిరణ్ మాట్లాడుతూ–‘ఇందులో నవీన్ చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పే ఎక్స్‌ట్రీమ్ లవ్‌స్టోరీ ఈ సినిమా. మంచి ఎమోషన్స్‌తో సాగే చిత్రం. ధర్మ–రక్షలు చక్కగా తెరకెక్కించారు. వచ్చే నెల చివర్లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.