
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రయ్యారు. ఇవాళ ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాబును ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నవీన్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కాగా.. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవలో బాలరెడ్డిగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో బసిరెడ్డి పాత్ర వేసిన జగపతి బాబు కుమారుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
Me and orma ❤️ Blessed with baby boy 👶!!!!❤️ pic.twitter.com/db2N21fZOh
— Naveen Chandra (@Naveenc212) February 22, 2023