జగదీశ్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు : రాజమౌళి | Rajamouli launches Lachmideviki O Lekkundi | Sakshi
Sakshi News home page

జగదీశ్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు : రాజమౌళి

Published Tue, Oct 13 2015 12:22 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

జగదీశ్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు : రాజమౌళి - Sakshi

జగదీశ్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు : రాజమౌళి

 ‘‘ఈ సినిమా డెరైక్టర్ జగదీశ్ నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ‘బాహుబలి’ సినిమా టైంకు మాత్రం అతను లేడనేసరికి కొంత టెన్షన్ పడ్డాను. తను చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. అంతే డిటైల్డ్‌గా సినిమా తీశాడనుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ -‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేదానికి లెక్కుంది. అలానే లచ్చిందేవికి ఓ లెక్కుంది.
 
 ఆ లెక్కను విప్పి చూపించడానికి జగదీశ్ చేసే ప్రయత్నం సక్సెస్ కావాలి’’అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మన ఇంట్లో ఉండే లెక్క మనకు తెలుసు. కానీ కొన్ని లక్షల కోట్లు మనకు తెలియకుండా అనాథగా పడున్నాయి. వాటికీ ఓ లెక్క ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించా’’ అని చెప్పారు. ఈ వేడుకలో నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠి, సునీల్, శివశక్తి దత్తా, సంపూర్ణేశ్‌బాబు, అలీ, సెంథిల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement