
‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, దివ్య పిళ్లై, అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ నిర్మించిన నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రంలో ఓటీటీలో విడుదైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో ఈ సినిమా సాగుతుంది. దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి.
కథేంటంటే..
ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ... అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్ ఇంట్లో మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్‌తో ఈశ్వర్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్న పోలీసులకు అతడి ఇంట్లో శవం దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది.
ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్‌లో ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుంచి అతడు ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్‌ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment