
Naveen Chandra Introduced His Wife On Valentines Day: 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు నవీన్ చంద్ర. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం అరవింద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే నవీన్ చంద్ర ఇంతవరకు తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
తాజాగా ఫిబ్రవరి 14,వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యను పరిచయం చేసి అందరికి షాకిచ్చారు. 'ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్‌చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు నవీన్ చంద్రకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఏదైతేనెం శుభాకాంక్షలు అంటూ నవీన్‌కు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment