
జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించనున్నాడట. గతంలో నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నవీన్, మరోసారి సపోర్టింగ్ రోల్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment