
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ రోర్ (చిన్నపాటి టీజర్) సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ రోర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. (ట్రెండింగ్‌లో టీజర్.. సంతోషంలో బాలయ్య)
ఇక బోయపాటి-బాలయ్య సినిమా ఆనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిత్రంలో ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. అటు హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే నటుడిగా తననితాను ఫ్రూవ్ చేసుకోవడానికి విలక్షణ పాత్రలను సైతం అంగీకరిస్తున్నాడు. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో బాల్‌రెడ్డి పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర తన నటనతో మెప్పించాడు. అయితే బాలయ్య చిత్రంలో నవీన్‌చంద్ర నటించే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో మరో కీలకపాత్ర కోసం శ్రీకాంత్‌ను బోయపాటి ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?)
Comments
Please login to add a commentAdd a comment