యాక్షన్.. రొమాన్స్ | Naveen Chandra's New Movie as Romantic action entertainer | Sakshi
Sakshi News home page

యాక్షన్.. రొమాన్స్

Published Sun, May 22 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

యాక్షన్.. రొమాన్స్

యాక్షన్.. రొమాన్స్

రెండు దశాబ్దాల పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వేణు మూవీస్ సంస్థ అధినేత పసుపులేటి వేణుమాధవ్ తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

రెండు దశాబ్దాల పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వేణు మూవీస్ సంస్థ అధినేత పసుపులేటి వేణుమాధవ్ తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘అందాల రాక్షసి’, ‘త్రిపుర’, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఫేం నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో జి. గోపిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతాం. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియచేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement