
‘‘తగ్గేదే లే’ చిత్రంలో మూడు స్టోరీలను అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, ప్రతీకారం.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని హీరో నవీన్ చంద్ర అన్నారు. ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, దివ్య పిళ్లై, అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ..‘‘కరోనా రెండో వేవ్‌లో నా తండ్రిని కోల్పోయాను. ఆ దశలోనూ నాకు సపోర్ట్‌గా నిలిచిన యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘వాస్తవ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం’’ అన్నారు ప్రేమ్ కుమార్. ‘‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డిగారు మంచి చిత్రాలు తీద్దామని వచ్చారు. ‘తగ్గేదే లే’ ఆడితే ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నటుడు రాజా రవీంద్ర.
Comments
Please login to add a commentAdd a comment