Dandupalyam Sequel
-
లవ్, యాక్షన్, ప్రతీకారంతో వస్తున్న ‘తగ్గేదే లే’
‘‘తగ్గేదే లే’ చిత్రంలో మూడు స్టోరీలను అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, ప్రతీకారం.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని హీరో నవీన్ చంద్ర అన్నారు. ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, దివ్య పిళ్లై, అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ..‘‘కరోనా రెండో వేవ్‌లో నా తండ్రిని కోల్పోయాను. ఆ దశలోనూ నాకు సపోర్ట్‌గా నిలిచిన యూనిట్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘వాస్తవ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం’’ అన్నారు ప్రేమ్ కుమార్. ‘‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డిగారు మంచి చిత్రాలు తీద్దామని వచ్చారు. ‘తగ్గేదే లే’ ఆడితే ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నటుడు రాజా రవీంద్ర. -
అవసరమైతే కోర్టుకి వెళతాను
బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్ పూర్తయిన మా సినిమాను సెన్సార్‌కు అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్ చేయను. రివైజింగ్ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్ కమిటీనే కాదు... ట్రిబ్యునల్.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జైలు నుంచి తప్పించారా?
సుమారంగనాధన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం–4’. కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో దండును తయారు చేసే నాయకుడిగా ముఖ్య పాత్రలో నటుడు బెనర్జీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘నటుడిగా నాకిది వైవిధ్యమైన పాత్ర. నా పాత్రతో సహా మా దండు చేసే పోరాటాలు, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రంలోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. నా పాత్ర ప్రశంసలు అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఏడుమంది గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథక రచనతోనే ఈ సినిమా రూపొందింది’’ అన్నారు కె.టి.నాయక్. ‘‘ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అన్నారు వెంకట్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, -
ఆ సీక్వెల్స్ కుదరలేదు – శ్రీకాంత్
‘‘నేను నటించిన పెళ్లి సందడి, మహాత్మ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ కుదరలేదు. ‘దండుపాళ్యం’ సినిమాకి ఉన్న క్రేజ్, గత చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలోని విషయం ఆధారంగా ఎన్ని పార్టులైనా చేయవచ్చు. ‘దండుపాళ్యం 4’ హిట్ అవ్వాలి’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం 4’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ– ‘‘దండుపాళ్యం 1, 2 సినిమాలను తెలుగు ప్రజలు బాగా ఆదరించారు. వారిచ్చిన స్ఫూర్తితో ‘దండుపాళ్యం 4’ చిత్రం ప్రారంభించాం. కొందరి వ్యక్తిగత అహం వల్ల ‘దండుపాళ్యం 2’ నేను అనుకున్నట్లుగా రాలేదు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు అందులో లేవు. అందుకే.. ఓ కసితో ‘దండుపాళ్యం 4’ స్టార్ట్ చేశా. ఈ నెల 8న సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొదటి మూడు పార్ట్స్‌లో నటించిన నటీనటులతో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో ఉంటుంది’’ అన్నారు. దర్శకుడు కె.టి.నాయక్, వోల్గా బాబ్జీ పాల్గొన్నారు. -
నేనా సినిమా చేయట్లేదు..!
శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన దండుపాళ్యం 2 ఆ స్థాయిలో విజయం సాధించకపోయినా.. చిత్రయూనిట్ మరో సీక్వల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్ అవుతుండగా చిత్రయూనిట్ దండుపాళ్యం 4 పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో గత చిత్రాల్లో నటించిన వారే కనిపించారు. కానీ ఈ విషయంపై నటి పూజా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దండుపాళ్యం 4లో నటించటం లేదని తెలిపారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందగా ఎవరూ అడగలేదని. తన అనుమతి లేకుండానే తన ఫొటోనూ పోస్టర్లో వేశారని తెలిపారు. తనను గాని తనకు సంబంధించిన వ్యక్తులను కానీ సంప్రదించకుండా తన పేరు వాడుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
అంతకు మించి...
విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘దండుపాళ్యం’. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం 2’ వచ్చింది. ఆ రెంటినీ మించేలా ‘దండుపాళ్యం 3’ రాబోతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసు కున్న శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరాజు కథ, కథనం, సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయి. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘దండుపాళ్యం’ సిరిస్‌కి ఇదే చివరి పార్ట్ కావటంతో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. త్వరలోనే ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తాం. మార్చి 2న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర ్పణ: సాయికృష్ణ ఫిల్మ్స్, సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట్ ప్రసాద్, సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల. -
నాకు గొంతే ఇష్టం
‘పదకొండు మంది.. ఐదు సంవత్సరాలు.. ఎనభై కేసులు.. మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి క్రూర మృగాల్లా తిరుగుతున్నారు’’ అంటూ ప్రారంభమయ్యే ‘దండుపాళ్యం 3’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ‘నీకు గొంతుపై ఉండే మాల్ ఇష్టం.. వీడికి గొంతు కింద ఉండే మాల్ ఇష్టం. నాకు గొంతే ఇష్టం’ అనే మరో డైలాగ్ దండుపాళ్యం గ్యాంగ్ క్రూరత్వాన్ని చూపేలా ఉంది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 3’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజనీ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించి, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కి కూడా అదే రేంజ్లో స్పందన వస్తోంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట్ ప్రసాద్. -
ఆ నిజాల వెనుక కథే దండుపాళ్యం-2
- దర్శకుడు శ్రీనివాసరాజు క్రైమ్‌థ్రిల్లర్‌గా కన్నడంలో రూపొంది, సంచలన విజయం సాధించిన ‘దండుపాళ్యం’ గుర్తుందిగా! తెలుగులోకి కూడా అనువాదమైన ఈ సినిమా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ‘‘మొదటి సినిమా ఏదో హిట్ అయింది కదా అని ఇప్పుడీ సీక్వెల్ తీయడం లేదు. నిజంగానే ‘దండుపాళ్యం’ కథకు చాలా స్పాన్ ఉంది. నాలుగు గంటలు ఓ సినిమాకు కేటాయించలేం కాబట్టి, అప్పుడే సీక్వెల్‌కు ప్లాన్ చేసుకున్నా. ఆ కథకు ఒక ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సీక్వెల్ తీయనున్నా’’ అని ఈ తొలి, మలిభాగాల దర్శకుడు శ్రీనివాసరాజు అన్నారు. పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్యపాత్రల్లో మూడేళ్ల క్రితం తెలుగులో ‘దండుపాళ్యం’ చిత్రాన్ని విడుదల చేసిన వెంకట్ ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సీక్వెల్‌ను నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రారంభం కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల క్రితం ‘దండుపాళ్యం’ సినిమా తెలుగులో విడుదల చేసినప్పుడు కొంతమంది ఇది పూర్తి విలక్షణ సినిమా అన్నారు. మేము తీసుకున్న నేపథ్యం అలాంటిది. తీయనున్న సీక్వెల్ కూడా అలాంటిదే. ఇందులోని కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కాస్త ఇబ్బంది కలిగే మాట నిజమే. కానీ, అసలు సిసలు ఘటనల్ని యథాతథంగా చూపలేదు. ఒకవేళ ఆ ఘోరాలను ఉన్నవి ఉన్నట్లుగా, తెర మీదకు ఎక్కిస్తే ‘దండుపాళ్యం’ బయటకు వచ్చేదే కాదు. ఆ ‘దండుపాళ్యం’లో యథార్థ ఘటనలను తెరకెక్కించాం. ఈ సీక్వెల్లో ఆ నిజాల వెనుక దాగి ఉన్న కథను చూపించ నున్నాం’’ అని శ్రీనివాసరాజు పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, బెల్గామ్‌లలో షూటింగ్ జరిపి, సెప్టెంబర్, అక్టోబర్లలో విడుదల చేయాలన్నది దర్శక, నిర్మాతల ప్లాన్. ఆ తర్వాత హిందీలో ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మకరంద్ దేశ్‌పాండేలతో ‘దండుపాళ్యం’ చిత్రాన్ని రీమేక్ చే యాలని దర్శకుడు భావిస్తున్నారు. తర్వాత రోజుల్లో ‘కాశీ’, ‘అయోధ్య’ అనే రెండు చిత్రాలను చారిత్రక కథాంశాలతో నిర్మించనున్నానని దర్శకుడు తెలిపారు.. ఇక, నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, ‘‘ ‘దండుపాళ్యం’ సమ్‌థింగ్ స్పెషల్ మూవీ. అందుకే ఈ సినిమా సీక్వెల్‌ను నేనే తీయడానికి సిద్ధపడ్డాను’’ అని తెలిపారు.