ఆ సీక్వెల్స్‌ కుదరలేదు – శ్రీకాంత్‌ | Dandupalyam 4 First Look Launch by Hero Srikanth | Sakshi
Sakshi News home page

ఆ సీక్వెల్స్‌ కుదరలేదు – శ్రీకాంత్‌

Published Fri, Mar 2 2018 1:05 AM | Last Updated on Fri, Mar 2 2018 1:05 AM

Dandupalyam 4 First Look Launch by Hero Srikanth - Sakshi

కె.టి.నాయక్, శ్రీకాంత్, వెంకట్, బాబ్జీ

‘‘నేను నటించిన పెళ్లి సందడి, మహాత్మ సినిమాలకు సీక్వెల్స్‌ చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ కుదరలేదు. ‘దండుపాళ్యం’ సినిమాకి ఉన్న క్రేజ్, గత చిత్రాలు ఎంత హిట్‌ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలోని విషయం ఆధారంగా ఎన్ని పార్టులైనా చేయవచ్చు. ‘దండుపాళ్యం 4’ హిట్‌ అవ్వాలి’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. కె.టి.నాయక్‌ దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ నిర్మిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం 4’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని శ్రీకాంత్‌ విడుదల చేశారు.

నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘దండుపాళ్యం 1, 2 సినిమాలను తెలుగు ప్రజలు బాగా ఆదరించారు. వారిచ్చిన స్ఫూర్తితో ‘దండుపాళ్యం 4’ చిత్రం ప్రారంభించాం. కొందరి వ్యక్తిగత అహం వల్ల ‘దండుపాళ్యం 2’ నేను అనుకున్నట్లుగా రాలేదు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు అందులో లేవు. అందుకే..  ఓ కసితో ‘దండుపాళ్యం 4’ స్టార్ట్‌ చేశా. ఈ నెల 8న సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొదటి మూడు పార్ట్స్‌లో నటించిన నటీనటులతో పాటు వేరే గ్యాంగ్‌ కూడా ఇందులో ఉంటుంది’’ అన్నారు. దర్శకుడు కె.టి.నాయక్, వోల్గా బాబ్జీ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement