అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇటీవల సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్న నవీన్, సోలో హీరోగా నటించిన తాజా చిత్రం హీరో హీరోయిన్. ఈ సినిమాలో నవీన్ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment