
దుకే ఓటీటీలు థ్రిల్లర్, హారర్ జానర్‌లను సొంతంగా రూపొందిస్తుంటారు కూడా! తాజాగా ఓ హారర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతోంది. అదే
హారర్ సినిమాలకు థియేటర్‌లో ఎలాంటి రెస్పాన్స్ ఉన్నా ఓటీటీలో మాత్రం అదరగొట్టేస్తుంటాయి. అసలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ వీక్షకులు క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఓటీటీలు థ్రిల్లర్, హారర్ జానర్‌లను సొంతంగా రూపొందిస్తుంటారు కూడా! తాజాగా ఓ తమిళ హారర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతోంది. అదే ఇన్‌స్పెక్టర్ రిషి. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు నందిని జేఎస్ దర్‌శకత్వం వహించగా మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుక్‌దేవ్ లహిరి నిర్మించాడు.
ఈ సిరీస్‌లో సునయన, కన్న రవి, మాలిని జీవర్తనం, శ్రీకృష్ణ దయాల్, కుమారవేల్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఇన్‌స్పెక్టర్ రిషి కేసులు చేధించే క్రమంలో దాని వెనకాల అతీత శక్తుల గురించి కూడా తెలుసుకుంటాడు. ఆ కేసులకు, దెయ్యాలకు మధ్య సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే! ఈ నెలాఖరు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇన్‌స్పెక్టర్ రిషి తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ పోస్టర్‌తో సహా వెల్లడించింది.
the laws of state don’t bind the supernatural!#InspectorRishiOnPrime, Mar 29@MBP_ProdCo @Naveenc212 @TheSunainaa @shukdev_lahiri @nandhini_js @jithinthorai #SrikrishnaDayal #Kumaravel @iamkannaravi @MalniJevaratnam #BargavSridhar @editorsuriya @MusicAshwath @MishMash2611… pic.twitter.com/2M3oPzZFyB
— prime video IN (@PrimeVideoIN) March 14, 2024
చదవండి: హిట్ సినిమా 'ప్రేమలు' ఓటీటీ వివరాలు.. ఒకేసారి అన్ని భాషలలో రిలీజ్