
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇవాళ ప్రియదర్శి బర్త్‌డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.
ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉
Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024