
ప్రియదర్శి, రూపా కొడవయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గత ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో తాజాగా ‘సారంగపాణి జాతకం’ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతను చేతలతో చేసే పనులతో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని ఈ సినిమాను ఉద్దేశించి మేకర్స్ తెలిపారు. ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.