పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్‌ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్ | Naveen Chandra and Kamakshi Bhaskarla Show Time Movie poster Release | Sakshi
Sakshi News home page

Show Time Movie: నవీన్ చంద్ర - కామాక్షి భాస్కర్ల 'షో టైమ్‌'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్

Published Sun, Mar 30 2025 9:31 PM | Last Updated on Sun, Mar 30 2025 9:32 PM

Naveen Chandra and Kamakshi Bhaskarla Show Time Movie poster Release

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

తాజా పోస్టర్‌ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.  నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement