Varun Tej Response to Ghani Movie Failure - Sakshi
Sakshi News home page

Varun Tej: గని సినిమా ఫెయిల్యూర్‌పై వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌

Published Tue, Apr 12 2022 4:47 PM | Last Updated on Tue, Apr 12 2022 5:52 PM

Varun Tej Response to Ghani Movie Failure - Sakshi

మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో మీకు చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను సినిమా చేస్తాను.

యాక్షన్‌ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చిన హీరో వరుణ్‌ తేజ్‌. కానీ అతడి కెరీర్‌లో రొమాంటిక్‌ సినిమాలే హిట్స్‌గా నిలిచాయి. ఫిదా, తొలి ప్రేమ వంటి లవ్‌స్టోరీలతో హిట్స్‌ సాధించిన వరుణ్‌ ఈసారి యాక్షన్‌ ఫిలిం గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్‌ 8న విడుదలైన గని బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. వీకెండ్స్‌లోనూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది.

ఈ క్రమంలో గని సినిమాపై వరుణ్‌ తేజ్‌ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. 'ఎన్నో ఏళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను సర్వదా విధేయుడిని. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.

ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో తెరపై చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు గెలుస్తాను, మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను' అంటూ ట్వీట్‌ చేశాడు వరుణ్‌ తేజ్‌.

చదవండి: హీరో నాగచైతన్య కారుకు పోలీసుల జరిమానా

 మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన బిందు మాధవి లవ్‌ ఎఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement