
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండి
ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..
అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..
త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025