
అడుగడుగునా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాల క
కొనుగోలు కేంద్రాల వివరాలు
జిల్లా కేంద్రాలు ఇప్పటి వరకు
కొనుగోళ్లు
(టన్నులు)
కర్నూలు 25 4,289
నంద్యాల 12 2,800
● కందుల కొనుగోలు కేంద్రాల్లో
దళారీల హల్‌చల్
● రైతుల నుంచి రూ.7,200 ధరతో
కొనుగోలు
● కొనుగోలు కేంద్రాల్లో రూ.7,550
మద్దతు ధరతో అమ్మకం
● దళారీల నుంచి కొనుగోలుకు ఆసక్తి
చూపుతున్న మార్క్‌ఫెడ్ అధికారులు
కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ..
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకుందామని వెళ్లిన రైతులను నిలువునా ముంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కందులను 50 కిలోల ప్రకారం తూకం వేస్తారు. సంచి బరువుకు అదనంగా 650 గ్రాములు తీసుకోవాలి. అయితే కొన్ని మండలాల్లో క్వింటాకు 1500 గ్రాముల వరకు అదనంగా తీసుకుంటున్నారు. అంటే క్వింటాలుకు దాదాపు 3 కిలోల వరకు అదనంగా తీసుకుంటుండటం గమనార్హం. కర్నూలు జిల్లా పత్తికొండ, నంద్యాల జిల్లా ప్యాపిలి మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు దళారీల బెడద ఎక్కువగా ఉంది. అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు పోతుండటం గమనార్హం. ప్యాపిలి మండలం బోయిన్‌చెర్వుపల్లి గ్రామంలో బహిరంగంగానే దళారీల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): కందుల కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా దళారీలు, వ్యాపారులే మద్దతు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరందురూ టీడీపీ మద్దతుదారులు కావడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా దళారీల నుంచి కొనుగోలుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. క్వింటా ప్రకారం ఇచ్చే గుడ్‌విల్ కోసమేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కందుల ధర పడిపోయింది. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి...రేయింబవళ్లు కష్టించిన రైతుకు అంతంత మాత్రం ధర లభిస్తుండగా... దళారీలు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. 2023–24లో కందుల ధర రికార్డు స్థాయికి ఎక్కింది. 2024–25 సంవత్సరంలో కూడా ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని భావించిన రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. 2024 డిసెంబరు నెల వరకు కూడా కందుల క్వింటాలుకు రూ.9,000 వరకు లభించింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ధర పతనం అయింది. కాగా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయంటే చాలు ప్రతి గ్రామంలో దళారీలు, వ్యాపారులకు మంచి సీజన్ వంటిది. ధరలు తగ్గడం మొదలైన వెంటనే దళారీలు రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోతాయి.. ఇపుడు మంచి ధర ఉంది.. అమ్మకోవాలని నమ్మించారు. వారి మాటలు నమ్మిన రైతుల నుంచి క్వింటా రూ.6,800 నుంచి రూ.7,200 వరకు మేర కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. అలా కొనుగోలు చేసిన దళారీలు ఇపుడు మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర రూ.7,550 ప్రకారం అమ్ముకుంటున్నారు. కష్టించి పండించిన రైతుకు నష్టం రాగా.. దళారీలు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా క్వింటాపై సగటున రూ.200 నుంచి రూ.600 వరకు లాభం పొందుతున్నారు. దళారీలు నుంచి కొనుగోలు చేయడం వల్ల అధికారులకు కూడా ముడుపులు ముడుతుండటం గమనార్హం.
అంతా రైతుల పేరు మీదనే....
దళారీలు/ వ్యాపారులు అంతా రైతుల పేర్ల మీదనే అమ్మకాలు సాగిస్తున్నారు. ఏఏ రైతు నుంచి కందులు కొనుగోలు చేశారో వారి నుంచి ముందు జాగ్రత్తగా ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల నకళ్లను కూడా సేకరించుకుంటున్నారు. రెండు, మూడు లారీలు సిద్ధం అయిన తర్వాత రైతుల పేరు మీదనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నాయి. రైతులకు తెలిసిన వారే కాబట్టి దళారీలకు సహకరిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రానికి ఒరిజినల్ రైతులు రారు. దళారీలు వారి భూములకు సంబంధించిన వివరాలు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నందున అమ్మకం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కందులు అమ్మిన తర్వాత నగదు రైతు ఖాతాకే జమ అవుతుంది.
దళారీల నుంచే 40 శాతం కొనుగోలు
కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో కందుల కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. నంద్యాల జిల్లాలో 12 మండలాల్లో జరుగుతోంది. నంద్యాల జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో దళారీలే హవా నడిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, చిప్పగిరి, ఆదోని, క్రిష్ణగిరి, సి.బెళగల్ తదితర మండలాల్లో దళారీలదే పెత్తనం నడుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 2,65,214 ఎకరాల్లో కంది సాగు అయింది. కర్నూలు జిల్లాలో 1,58,749 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1,06,465 ఎకరాల్లో కంది సాగు అయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23, 2023–24 సంవత్సరాల్లో కందుల ధర మురిపించింది. 2023–24లో రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.13,500 వరకు వెళ్లింది. 2024–25లో పండించిన కందులు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో జరిగే కొనుగోళ్లలో 60 శాతం దళారీల నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,242 మంది రైతుల నుంచి 4,289 టన్నుల కందులు కొనుగోలు చేశారు.నంద్యాల జిల్లాలో దాదాపు 2,650 మంది రైతుల నుంచి 2,800 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 40 శాతం వరకు దళారీల నుంచి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
● పత్తికొండ మండలానికి చెందిన ఒక వ్యాపారి ఆరేడు మంది రైతుల పాసు పుస్తకాలు తీసుకెళ్లి ఒకే రోజు 200 క్వింటాళ్లకు పైగా కందులను అమ్ముకున్నారు. ఈ వ్యాపారి ఇలా చాల రోజులుగా కొనుగోలు కేంద్రంలో హల్‌చల్ చేశారు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ చేతులు తడిపినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ నేతల మద్దతు ఉన్నట్లు సమాచారం.

అడుగడుగునా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాల క

అడుగడుగునా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాల క