పగిడ్యాల: మండల కేంద్రంలోని దేవనగర్ కాలనీకి చెందిన పగడం మద్దిలేటి, సుజాతలు పెద్దగా చదువుకోలేదు. వీరికి నవ్యకళ, జగన్ ఇద్దరు సంతానం. మద్దిలేటి ఆల్విన్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నవ్యకళ చదువు పట్ల ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. లక్ష్మాపురం అంచె వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉత్తమ మార్కులు సాధించింది. బైపీసీ గ్రూప్‌లో 982 మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెను డాక్టర్ చేయాలనే లక్ష్యంతో కర్నూలులో ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.