
న్యూఢిల్లీ: అమెరికా తాజా విధించిన టారిఫ్‌లపై ఏ స్థాయిలో స్పందించాలనే విషయమై నిపుణులతో చర్చిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎగుమతులకు రక్షణ కల్పించడం, వాణిజ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందంలో భాగంగా పన్నుల తగ్గింపు వంటి వాటిని త్వరలోనే ఖరారు చేయనున్నామని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వంతో నేరుగా వ్యవహారాలను నడుపుతున్నందున ఇతర దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో ఇతర దేశాలతో కొత్తగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.