experts opinions
-
నిపుణులతో చర్చిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ: అమెరికా తాజా విధించిన టారిఫ్‌లపై ఏ స్థాయిలో స్పందించాలనే విషయమై నిపుణులతో చర్చిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎగుమతులకు రక్షణ కల్పించడం, వాణిజ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందంలో భాగంగా పన్నుల తగ్గింపు వంటి వాటిని త్వరలోనే ఖరారు చేయనున్నామని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వంతో నేరుగా వ్యవహారాలను నడుపుతున్నందున ఇతర దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో ఇతర దేశాలతో కొత్తగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. -
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్‌తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
బంగారం డిమాండ్ తగ్గుతుందా.. పెరుగుతుందా?
ముంబై: పసిడి ధరల తీవ్రత నేపథ్యంలో.. వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆ అభిప్రాయాలు క్లుప్తంగా...డిమాండ్ పడిపోవచ్చు కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు. – సువంకర్ సేన్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈఎఓగత ఏడాదికి సమానంగా బిజినెస్ధరలు పెరుగుతున్నప్పటికీ మేము మంచి వ్యాపారాన్ని ఆశిస్తున్నాము. ధన్తేరస్ తర్వాత 40 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నందున అమ్మకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. ధన్తేరస్ నాడు అమ్మకాల పరిమాణం 20 నుంచి 22 టన్నులు ఉండవచ్చు. ఇది గత ఏడాదికి దాదాపు సమానం. – సయం మెహ్రా, ఆల్ ఇండియా జీజేసీ చైర్మన్ఆశాజనంగానే ఉన్నాం... రెండో త్రైమాసికంలో బులియన్ మార్కెట్ పటిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పండుగల సమయంలో అమ్మకాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము. పండుగలకు ప్రీ–బుక్ ఆర్డర్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధర పెరిగితే వినియోగదారులు కొంత విరామం తీసుకునే మాట వాస్తవమే. అయితే ఈ రోజుల్లో వినియోగదారులు తమ బడ్జెట్ మేరకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దశలో ‘కొనుగోళ్ల పరిమాణం’ గురించి ఇప్పుడు మాట్లాడము. – టీఎస్ కళ్యాణరామన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండీపెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పదిలం బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకినప్పటికీ కొనుగోళ్ల విషయంలో పరిశ్రమ నుండి వచ్చిన సమాచారం సానుకూలంగానే ఉంది. కొనసాగుతున్న పండుగల కారణంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పటిష్టంగా ఉండే వీలుంది. పెట్టుబడి సెంటిమెంట్, వివాహ సంబంధిత కొనుగోళ్లు పరిశ్రమకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువ. వ్యవసాయ పరిస్థితుల మెరుగుదల, ఆదాయాలు పెరగడం, ఎకానమీ, వినియోగం పటిష్టత వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ ఉటుంది. – సచిన్ జైన్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్‌లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్ మోడ్‌లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్‌కప్ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్‌వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. -
డీ విటమిన్ డోస్ ఎక్కువైతే.. యమడేంజర్!
మన శరీరానికి విటమిన్-డి ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో అదే డీ విటమిన్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఒక్కోసారి ప్రాణంకూడా పోవచ్చు. యూకేకు చెందిన 89 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం రిటైర్డ్ వ్యాపారవేత్త డేవిడ్ మిచెనర్ హైపర్ కాల్సీమియాతో బాధపడుతున్నారు. దీంతో అతను గత ఏడాది మేలో ఆసుపత్రిలో చేరాడు. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువైనాయని వైద్యులు గుర్తించారు. పది రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తరువాత, స్థానిక వైద్య సంఘం సభ్యులు అప్రమత్తమై ఒక నివేదికను రూపొందించారు. అలాగే విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మిచెనర్ పోస్ట్‌మార్టం నివేదిక అతని విటమిన్ డీ స్థాయిలు 380 వద్ద ఉన్నట్టు తేలింది. దీంతో పెద్దల్లో విటమిన్ డీ-30 వద్ద ఉంటే చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పెద్దలకు 600 అంతర్జాతీయ యూనిట్లు (IUలు) డోసేజ్ చాలని చెప్పారు. మితిమీరిన వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విటమిన్ డీ సప్లిమెంట్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరి చేయాలని నియంత్రణ సంస్థలను కోరుతూ సర్రే అసిస్టెంట్ కరోనర్ నివేదికను విడుదల చేశారు. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట నష్టాలు లేదా దుష్ప్రభావాల గురించి వివరించే ప్యాకేజింగ్‌లో లేదా ప్యాకేజింగ్‌లో ఎటువంటి హెచ్చరిక లేదని కరోనర్ జోనాథన్ స్టీవెన్స్ తన అధికారిక నివేదికలో రాశారు. ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రాపర్టీ విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – అనిల్ మిశ్రా ప్రాపర్టీని రెండేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించడం) చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. రూ.50 లక్షలపై 20 శాతం పన్ను అంటే రూ.10 లక్షల మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే స్థిరాదాయ సాధనాలనే క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. క్యాపిటల్ గెయిన్ బాండ్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఏటా రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి నికరంగా లభించే రేటు 3.68 శాతం. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరుతుంది. ఈ గణాంకాలను పరిశీలించి చూసినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే మేలని అనిపిస్తుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సంక్లిష్టం కావచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇదేమీ గ్యారంటీడ్ కాదు. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. రిస్క్ లేని రాబడి కోరుకునేట్టు అయితే, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం కావాల్సిన వారు క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఎనిమిదేళ్ల తర్వాత కూడా పొడిగించుకోవచ్చా..? – గురునాథ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) నిబంధనల్లో సవరణ చోటు చేసుకుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత కోరుకుంటే మరో మూడేళ్ల కాలానికి దీన్ని పొడిగించుకోవచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఉండేది. ఆ తర్వాత కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలంటే, ఉపసంహరించుకుని మళ్లీ తాజాగా ఖాతా తెరవాల్సి వచ్చేది. ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఐదేళ్ల ప్రాథమిక కాల వ్యవధి ముగిసిన తర్వాత నుంచి.. మూడేళ్లకు ఒకసారి చొప్పున ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అంతేకానీ, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. గడువు పొడిగించే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఐదేళ్లు పూర్తయి ఉంటే, కొనసాగించుకోవడం వల్ల తదుపరి మూడేళ్ల కాలానికే 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనికి బదులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐదేళ్ల కాలానికి 8.2 శాతం గరిష్ట రేటును పొందొచ్చు. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా?
Gold Prices in 2024: హద్దుల్లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయని ఆశలు పెట్టుకున్న పసిడి ప్రియులను నిపుణుల అంచనాలు కలవరపెడుతున్నాయి. 2024లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆదివారం (2023 డిసెంబర్ 31) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,550,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,870 వద్ద ఉంది. 2023 డిసెంబర్ నెల ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. గత మే 4న, గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,845, ఔన్స్‌కి 2,083 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 16న ధర మళ్లీ రికార్డు స్థాయిలో రూ.61,914కి చేరుకుందని కా కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ (Commtrendz research) డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు. రూ.70 వేలకు చేరే అవకాశం కొత్త సంవత్సరంలో బంగారం ఔన్స్ ధరలు 2,400 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. రూపాయి స్థిరంగా ఉంటే దేశంలో తులం బంగారం ధర రూ.70,000 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తేలికపరుస్తారన్న అంచనాల నేపథ్యంలో రూపాయి బలహీనపడవచ్చు. ఇది బంగారం దేశీయ ధరలను పెంచే అవకాశం ఉంది. అమ్మకాలపై తీవ్ర ప్రభావం యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి బంగారం ధరలలో పెరుగుదలకు దారితీస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా పేర్కొన్నారు. 2024లో బంగారం ధర ఔన్స్‌కు 2,250 నుంచి 2,300 డాలర్లు, 10 గ్రాముల ధర 68,000 నుంచి 70,000కి చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు 2024లో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వచ్చే ఏడాదిలో నగల వ్యాపారం 2023లో ఉన్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భరణాల డిమాండ్ పెరిగింది. -
జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు - నిపుణుల చర్చలు
హైదరాబాద్: 2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ 'రామ్‌కుమార్ మీనన్' మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. డాక్టర్ ఎబి రీమాశ్రీ, డైరెక్టర్ - రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ.. మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం గురించి వివరిస్తూ.. ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలని వెల్లడించారు. NSC 2023 వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. 'ఫుడ్ సేఫ్ స్పైసస్ - ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్' సదస్సు కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది పిలుపు అని అన్నారు. సెషన్ రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై మరింత పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడతో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. -
స్టాక్స్.. రాకెట్స్!
ద్రవ్యోల్బణ, వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు. పసిడి 10 శాతం దాకా అప్ .. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు. మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్లు, కొత్త గ్రీన్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. ఆసక్తికరంగా గ్లోబల్ ఎకానమీ .. సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్ 2080లో గ్లోబల్ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్ డిజిట్ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు. – ప్రణవ్ హరిదాసన్, ఎండీ, యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టీవీఎస్ మోటర్ ప్రస్తుత ధర: 1,633 టార్గెట్ ధర: రూ. 2,100 దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935.. టార్గెట్ ధర: రూ. 1,155 దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ ఫోన్స్ వంటి మెరుగైన డిజిటల్ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్ సెగ్మెంట్లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుత ధర: 1,654 టార్గెట్ ధర: రూ. 1,950 స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ రంగంలో 60 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు. జ్యోతి ల్యాబ్స్ ప్రస్తుత ధర: 414.. టార్గెట్ ధర: రూ. 440 1983లో ఉజాలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనే సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్ ఉన్న హెంకెల్ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ కేర్, డిష్వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్ సోప్స్ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్ కన్జూమర్ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: 1,369 టార్గెట్ ధర: రూ. 1,500 ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 938 టార్గెట్ ధర రూ. 1,081 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స, స్టాక్ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 10,391 టార్గెట్ ధర రూ. 12,000 దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ధర: 8,720 టార్గెట్ ధర: రూ. 9,800 ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది. పాలీక్యాబ్ ఇండియా ప్రస్తుత ధర: 5,137 టార్గెట్ ధర:5,877 భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్ఎంఈజీ (ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రస్తుత ధర: 338 టార్గెట్ ధర:రూ. 364 భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది. స్టాక్స్‌బాక్స్ అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర: రూ. 139 టార్గెట్ ధర: రూ. 163 దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్ ఎస్వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి. కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 323 టార్గెట్ ధర: రూ. 370 భారత్ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం. కోల్గేట్–పామోలివ్ (ఇండియా) ప్రస్తుత ధర: 2,106.. టార్గెట్ ధర: రూ. 2,500 ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్మెంట్ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం. పురవంకర ప్రస్తుత ధర: రూ. 147 టార్గెట్ ధర: రూ. 176 ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935 టార్గెట్ ధర: రూ. 1,106 పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 2,314 టార్గెట్ ధర రూ. 2,725 కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది. కెనరా బ్యాంకు ప్రస్తుత ధర రూ. 387 టార్గెట్ ధర రూ. 425 కెనరా బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది. సిప్లా ప్రస్తుత ధర రూ. 1,240 టార్గెట్ ధర రూ. 1,320 సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం. సైయంట్ ప్రస్తుత ధర రూ. 1,659 టార్గెట్ ధర రూ. 2,000 ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్ ఉంటుందని సైయంట్ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్ క్వార్టర్లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్ కొనసాగించవచ్చు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రస్తుత ధర రూ. 210 టార్గెట్ ధర రూ. 276 సెపె్టంబర్ క్వార్టర్లో పీసీబీఎల్ (ఫిలిప్స్ కార్బన్ బ్లాక్) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్ కోసం డిమాండ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్ గ్రేడ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ఫెడ్ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్‌వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడుల ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్‌పట్ల గ్లోబల్ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్ ఫెడ్‌పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ నిపుణులు అజిత్ మిశ్రా, శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ సేథ్ అభిప్రాయపడ్డారు. గత వారం వెనకడుగు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 952 పాయింట్లు పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల దన్ను తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్‌లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్‌చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్‌పీఐలు 2021 అక్టోబర్– 2022 జూన్ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్‌పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్
ముంబై: హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్‌బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా
గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కేవలం స్థిరాస్తి మీద ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలే మన ప్రస్తుత అంశం. æ చట్టంలోని నిర్వచనాల జోలికి వెళితే తికమ కగా ఉంటుంది. సెక్షన్ల ప్రస్తావన అంతే. సారాంశమే తెలుసుకుందాం. æస్థిరాస్తి కొన్న తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అమ్మితే ఆ అమ్మకం, దీర్ఘకాలికమైనది అవుతుంది. రెండు సంవత్సరాల లోపల అమ్మితే అది స్వల్పకాలికం అని అర్థం. అలా వచ్చిన లాభాలను మీ మిగతా ఆదాయాలు.. అంటే జీతం, ఇంటి అద్దె, ఇతర ఆదాయాలు మొదలైన వాటితో కలిపి ఆ మొత్తాన్ని శ్లాబులవారీగా విభజించి, వర్తించే రేట్ల ప్రకారం ట్యాక్స్ లెక్కించాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 20 శాతం పన్ను విధిస్తారు. విద్యా సుంకం అదనంగా ఉంటుంది. ఈ వారం, మూలధన లాభాల నుండి పన్ను భారం లేకుండా బైటపడటం ఎలాగో తెలుసుకుందాం. ఇల్లు అమ్మి, మరో ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు. ఈ మినహాయింపనేది వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకే వర్తిస్తుంది. ఇల్లు అంటే ఇల్లు అలాగే అనుబంధమైన స్థలం అని అర్థం. ఫ్లాటు, దానితో పాటు జాగాలో ఉండే అన్‌డివైడెడ్ వాటా. ఈ ఇంటిని ఇదివరకే ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులలో అసెస్మెంట్ చేయించాలి. అంటే డిక్లేర్ చేయాలి. æ ఇల్లు అమ్మిన వెంటనే మన దేశంలో వేరే .. అంటే కొత్త ఇల్లు నిర్మాణం మూడు సంవత్సరాల లోపల చేయాలి. అంటే గెయిన్స్ మొత్తం వెచ్చించాలి. ఖర్చు పెట్టాలి. ఇల్లు నిర్మాణం పూర్తితో నిమిత్తం లేదు. తగిన కాగితాలు ఉండాలి. లేదా అమ్మిన తేదీ నుండి వెనక్కి వెళ్తారు. ఒక సంవత్సరం వరకూ .. ఒక సంవత్సరం ముందు ఇన్వెస్ట్ చేసినా చాలు. రెండు సంవత్సరాల లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంతో వెసులుబాటు ఉందని గమనించాలి. æఎంత లాభం వచ్చిందో అంతే అయినా లేక అంతకన్నా ఎక్కువగా అయినా ఇన్వెస్ట్ చేయాలి. తక్కువగా చేస్తే ఆ తక్కువ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసెస్సీకి జీవితకాలంలో ఒకే ఒకసారి ఓ అవకాశం ఉంది. లాభాలు రూ. 2 కోట్లు దాటితే, ఒక ఇల్లు బదులు రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు కుటుంబంలో భార్య, సంతానం పేరు మీద కొనవచ్చు. ఈ మేరకు ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు. మొత్తం ప్రతిఫలం చేయనవసరం లేదు. మిగిలిన మొత్తాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల ఇల్లు కొనకపోతే, ఇల్లు అమ్మిన సంవత్సరం నుంచి ఏడాది ముందు కానీ లేదా రిటర్నులు వేయడానికి గడువు తేదీ లోపల కానీ వెంటనే బ్యాంకులో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీకు మినహాయింపు లభిస్తుంది. అలా చేయకపోతే పన్ను పడుతుంది. మీరు కొన్న కొత్త ఇంటిని 3 సంవత్సరాలు అమ్మకూడదు. అలా అమ్మితే పన్ను వేస్తారు. జాగా కొని, స్వయంగా కట్టుకోవచ్చు. మినహాయింపులు పొంది స్వంత ఇంటి కల సాకారం చేసుకోండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను ఎలా వేస్తారంటే? -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్‌తో ఆధార్ లింక్ చేశారా!..చేయకపోతే..!
అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్ ఉంది. త్వరపడండి. ► వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. ► అడ్వాన్స్ ట్యాక్స్ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. ► ఇక ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్మెంట్లు.. సేవింగ్స్.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ..సేవింగ్స్..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్‌లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. ► ఇక నాలుగోది.. పాన్‌తో ఆధార్ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి. దీన్ని పాటించకపోతే సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం. -
TAX SAVINGS: బంగారం .. సొంత ఇల్లు.. జాగా..
చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు .. అయ్యా సేవింగ్స్ బోలెడంత ఉన్నాయి .. అబ్బాయి అమెరికా నుండి పంపారు. అక్కడ సంవత్సరానికి రూపాయి కూడా వడ్డీ రాదు. ఇండియాలో ఎక్కువ ఆదాయం వస్తుంది .. మమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు .. ఎంతవరకు చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో .. ఈ వారం ‘ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్‘లో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న .. లేదా చేసిన సేవింగ్స్‌ను ఎలా పొదుపు చేశారన్న దానిపై మీరు వివరణ ఇవ్వాలి. అది పన్ను చెల్లించగా మిగిలిన మొత్తమా .. పీఎఫ్ విత్డ్రాయలా, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తమా, జీవిత బీమా నుండి వచ్చిందా .. మీ పుత్రరత్నం విదేశాల నుండి మీకు పంపినదా .. ఏదైనా ఫర్వాలేదు. సోర్సు అంటూ ఒకటి ఉండాలి. అదీ పక్కాగా ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఉండి తీరాలి. ఇక బంగారమా.. భవంతా .. లేక జాగానా.. ఏదైనా మీ ఇష్టం. రాయితీలు లేవ్.. అయినా సరే బంగారం కొనడం వల్ల ఎటువంటి రాయితీలు, మినహాయింపులు రావు. ఇన్‌కం ట్యాక్స్ చట్టంలో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. మీరు కొన్న బంగారం ధరకి ‘సోర్స్‘ ఉండాలి. వివరణ ఇవ్వాలి. బంగారం ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. ఈ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. అమ్మతే లాభం వస్తే ఆ లాభాన్ని లేదా నష్టాన్ని మూలధనం లాభనష్టాల్లా భావిస్తారు. దీర్ఘకాలికం అయితే 20 శాతం రేటు చొప్పున పన్ను వేస్తారు. దీర్ఘకాలికం కాకపోతే శ్లాబుని బట్టి రేటు ఉంటుంది. సెస్సు అదనం. బంగారమైనా ఆభరణాలైనా ఇదే తీరు. కొంటున్నప్పుడు ఎటువంటి రాయితీలు రావు. అమ్మినప్పుడు పన్ను భారం ఉంటుంది. పన్ను భారం చెల్లించితే మిగతా చాలా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ .. ఆలికి సింగారం.. అదనుకి బంగారం అన్న పాత సామెత ఈ రోజుకీ వర్తిస్తుంది. జాగా విషయంలో జాగా/ఫ్లాటుకి కూడా బంగారంలాగానే. కొన్నందుకు ఎటువంటి మినహాయింపు ఉండదు. అమ్మితే పన్ను భారం ఉంటుంది. వేలల్లో కొని కోట్లలో అమ్మిన సందర్భాలు ఉన్నా ఎంతో లాభం ఉంటుంది. అందులో 20 శాతం ప్రభుత్వానికి పోతుంది. మిగతా అంతా మనదే. ఇంత పెద్ద మొత్తంతో చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సొంతిళ్లు సొంత ఇల్లు ఎంతో మందికి కల. ఆ కల సాకారం అవ్వటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు. ఇంటి గురించి అంటే ఫ్లాటు లేదా ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం వంటివి వస్తాయి. సేవింగ్స్ / స్వంత డబ్బులతో కొంటే ఎటువంటి రాయితీలు రావు. ఎటువంటి మినహాయింపులు రావు. అప్పు చేసి కడితే / కొంటే ఆ అప్పు మీద వడ్డీ కట్టాల్సి ఉంటే .. వడ్డీకి మినహాయింపు ఉంది. అప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తికి ‘సోర్స్‘ సామర్థ్యం ఉండాలి. కాగితాలు ఉండాలి. ఈ అప్పుని తిరిగి చెల్లించినందుకు గాను కూడా మినహాయింపు పొందవచ్చు. రుణం చెల్లించేటప్పుడు నిర్దేశించిన వారి నుంచే అప్పులు తీసుకుని ఉండాలి. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వడ్డీ నిమిత్తం రూ. 2,00,000 దాటితే ఇవ్వరు. మీరే ఆలోచించుకోండి. నిర్ణయం ఏదైనా చట్టబద్ధం అవ్వాలి. బ్లాక్ వ్యవహారాలు చేయకండి. మీ కుటుంబ అవసరాలు, ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు...! స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయా..?
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత వార్తలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశా నిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్, ఓపెక్ సమావేశ నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు ఓ కన్నేయొచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) చివరి వారంలో మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ.., రెండు శాతం ర్యాలీ చేసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 1,130 పాయింట్ల, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘గత రెండు వారాలుగా మార్కెట్ రికవరీ దశలో ఉంది. అయినంత మాత్రాన పరిస్థితులు చక్కబడ్డాయనే అంచనాకు రావడం తగదు. ఒమిక్రాన్ వేరియంట్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ట్రేడర్లు అప్రమతత్త వైఖరి కొనసాగిస్తూ.., రక్షణాత్మకంగా హెడ్డింగ్ పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. సాంకేతికంగా నిఫ్టీ నిర్ణయాత్మకమైన 17350 స్థాయిని చేధించి 17354 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులతో అమ్మకాలు జరిగితే దిగువస్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది.’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే.., ఒమిక్రాన్ ప్రభావం.. ఒమిక్రాన్ వేరియంట్ రోజుకు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. గతేడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత అత్యధిక ఈ ఏడాది తొలిరోజు(జనవరి 1న) 22,775 కేసుల నమోదయ్యాయి. కేసుల కట్టడికి దేశంలో ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంక్షలను మరి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, కెనడా దేశాల్లో రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిళ్లు పెరిగి, అనిశ్చితికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా ఇప్పటికే విడుదలైన డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు, జీఎస్టీ వసూళ్లపై స్పందించాల్సి ఉంది. భారత్‌తో పాటు యూరోజోన్, అమెరికాలు నేడు (సోమవారం) డిసెంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేటాను విడుదల చేయనున్నాయి. ఇవే దేశాలు బుధవారం(జనవరి 5న) సేవా రంగ పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. ఓపెక్ దేశాలు సమావేశం మంగళవారం జరగనుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పా లసీ కమిటీ మినిట్స్ బుధవారం వెలువడున్నాయి. యూరోజోన్ రిటైల్ డేటా.., అమెరికా ఉద్యోగ గ ణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ కీ లకమైన ఈ స్థూల గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. విదేశీ, దేశీయ విక్రయాల ప్రభావం గత రెండు నెలల ట్రెండ్‌ను కొనసాగిస్తూ డిసెంబర్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మొత్తం రూ.35,494 ల కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నా యి. 2021 ఏడాదిలో రూ.91,600 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐల వరుస విక్ర యాలు సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు)ను ప్రభావితం చేయలేకపోయాయి. డీఐఐలు డిసెంబర్లో రూ.31,231 కోట్ల షేర్లను, గత సంవత్సరంలో రూ.94,800 కోట్ల కొన్నారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమిక్రాన్ కేసులు, వడ్డీరేట్ల వంటి పరిణామాల నేపథ్యంలో., భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకం కానుంది. చదవండి: కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..! -
Pension Tax: పెన్షన్‌పైనా పన్ను వసూలు తప్పదా?
ప్రశ్న: నా పెన్షన్ రూ. 3,60,000. సేవింగ్స్ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్ మీద పన్ను పడుతుందా? : యం. మంగతాయారు, రాజమండ్రి సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్ లిమిట్ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్ లిమిట్ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్ లిమిట్ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు. ----------- ప్రశ్న: నేను గత వారం ఆదాయపు పన్ను రిటర్న్ వేసి రిఫండ్ క్లెయిమ్ చేశాను. ఈ రోజు రిఫండ్ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు / ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? : యం. శంకరరావు, సికింద్రాబాద్ సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. చెక్ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్మెంట్ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్మెంట్ చేస్తారు. ---------------- ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్ అప్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు? : జె.వి.యస్. యన్. మూర్తి, హైదరాబాద్ సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు. పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిఫుణులు -
Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ తెలిపారు. సూచీల కదలికకు ఇవే కీలకం.. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు. సానుకూలతలూ ఉన్నాయ్... జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. భారత్ వైపు ఎఫ్ఐఐల చూపు ... భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూ బాటలో వ్యాప్కోస్ జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్కోస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్కోస్లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇదే యోచనలో నేషనల్ సీడ్స్ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ఎస్సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. -
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30. డిజిటల్ సంతకం.. డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్లైన్లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్మెంటు ఆన్లైన్లో మెషీన్ ద్వారా జరుగుతుంది. ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
ఆదాయపు పన్ను చెల్లించే వారికి కొంత ఊరట..!
కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆదాయపు పన్ను చెల్లించే అసెస్సీలకు ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. ఇటు కోవిడ్ అటు వెబ్సైటు మొరాయించడం తదితర కారణాల వల్ల ఎన్నో అంశాల్లో గడువు పొడిగించింది. దీనితో తొందరపడకుండా నిదానంగా మన పని చేసుకోవచ్చు. ఉద్యోగికి ఊరటనిచ్చే విషయాలు ఓసారి చూస్తే.. కోవిడ్ నేపథ్యంలో చాలా మంది యజమానులు తమ కింద పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా సహాయం చేశారు. కొంతమంది.. ఉద్యోగులను ఆదుకున్నారు. కొంతమంది కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టారు. తాజా మార్పుల ప్రకారం 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లోనూ, ఆ తర్వాత యజమాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉద్యోగి విషయంలో మినహాయింపుగా భావిస్తారు. దీనిపరంగా ఉద్యోగికి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఎవరైనా ఉద్యోగి కోవిడ్ బాధితుడై మరణిస్తే, ఆ సమయంలో యజమాని ఆ కుటుంబానికి ఇచ్చిన నష్టపరిహారం.. ఎక్స్‌గ్రేషియా మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇది కూడా ఊరట కలిగించే అంశమే. పాన్ కార్డుతో, ఆధార్ అనుసంధానానికి గడువు తేది 2021 జూన్ 30. దీన్ని కూడా కేంద్రం 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించింది. ఇక్కడ సమస్య సమయానిది కాదు. ఆధార్ నిర్వాహకులు, ఇన్‌కం ట్యాక్స్ విభాగం మధ్య సమాచారం విషయంలో సయోధ్య, సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఎవరి మటుకు వారే తమ సమాచారమే కరెక్ట్ అని, సర్దుబాటుకు ఒప్పుకోవడం లేదు. అసెసీ మాట విన డం లేదు. అసెసీ నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుని ముగించాల్సిన అనుసంధాన ప్రక్రియను ‘అసెస్మెంట్‘ అంత కష్టం చేస్తున్నారు. దీని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ముందుగా చెప్పినట్లు చాలా అంశాల్లోలాగే ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద చెల్లింపులకు కూడా గడువు తేదిని పొడిగించారు. అయితే, మరింత సమయం లభిస్తున్నప్పటికీ.. మీరు తగిన సమాచారం, కాగితాలతో సిద్ధంగా ఉండటం శ్రేయస్కరం. ఆ తర్వాత పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. మూలధనం మీద పన్ను లెక్కించడం కోసం, మినహాయింపు పొందడం కోసం ఇల్లు కొనడం, బాండ్లు కొనడం వంటి వాటికి మీమీ లావాదేవీలను బట్టి గడువు ఉంటుంది. ఈ గడువును 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించారు. ఉదాహరణకు బాండ్లు కొనడానికి గడువు తేది 30–6–2021తో ముగిసినట్లయితే, దాన్ని ఇప్పుడు 30–9–2021 దాకా పొడిగించారు. మీరు బాండ్లను 30–9–2021లోగా కొని, మూలధన లాభాల విషయంలో మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి ఊరట కలిగించే అంశాలు. సందేహం లేదు. సమయానుకూలంగా గడువు తేదిని మళ్లీ పొడిగించవచ్చు. కానీ దాని కోసం ఎదురు చూడకుండా అన్నీ అమర్చుకుని సిద్ధంగా ఉండండి. వెబ్సైటు అందుబాటులోకి రాగానే ఫైల్ చేయండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: Stockmarket:లాభాల రింగింగ్,బ్యాంక్స్, ఐటీ గెయిన్ -
అన్‌లాక్, అంతర్జాతీయ అంశాలే కీలకం..!
ముంబై: కరోనా సంబంధిత వార్తలు, లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియ, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల రాక వార్తలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్‌ధరలు, రూపాయి ట్రేడింగ్, విదేశీ ఇన్వెస్టర్లు వైఖరి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ‘‘దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేస్తున్నాయి. కరోనా తగ్గేంత వరకు సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని గతవారంలో ఆర్బీఐ భరోసానిచ్చింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అంశాలన్నీ సూచీల రికార్డు ర్యాలీని కొనసాగించేలా ప్రోత్సహించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత వారంలో సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే.., సెంటిమెంట్‌ను బలపరుస్తున్న అన్‌లాక్ ప్రక్రియ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచే ‘అన్‌లాక్’ ప్రక్రియ ప్రారంభమైంది. మార్కెట్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. నేటి(సోమవారం)నుంచి మెట్రో రైళ్లు 50% రవాణా సామర్థ్యంతో ప్రయాణించనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కోవిడ్ నిబంధనలను ఐదు అంచెల్లో సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక రికవరీ తిరిగి గాడిన పడవచ్చనే ఆశలు మార్కెట్లో సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి... అమెరికా శుక్రవారం మే నెల ఉద్యోగ గణాంకాలను వెల్లడించింది. యూఎస్ ఆర్థికవేత్తలు మేలో 6.50 లక్షల ఉద్యోగాల సృష్టి జరగొచ్చని ఆశించగా, 5.59 లక్షల ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది. దీంతో ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని కఠినతరం చేయవచ్చనే ఆందోళనలు ఉపశమించాయి. జపాన్ ఈ మంగళవారం తొలి క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. చైనా బుధవారం మే నెల ద్రవ్యోల్బణ, పీపీఐ డేటాను వెల్లడించనుంది. ఈసీబీ (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్) గురువారం వడ్డీరేట్లను ప్రకటించనుంది. అదేరోజున(గురువారం) అమెరికా మే ద్రవ్యోల్బణ డేటాను, చైనా శుక్రవారం మే వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రుతుపవనాలు, క్యూ4 ఫలితాలు... దేశంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనా.., ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల విషయానికొస్తే.., ఇప్పటికే అధిక వెయిటేజీ షేర్లను కలిగిన కంపెనీలు ఫలితాలను వెల్లడించాయి. బాటా ఇండియా, గెయిల్, సెయిల్, భెల్, డీఎల్ఎఫ్ లాంటి కీలకమైన కంపెనీలు ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఐఐపీ గణాంకాలు శుక్రవారం విడుదల... ఇదే వారంలో శుక్రవారం ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. లో బేస్ కారణంగా వార్షిక ప్రాతిపదికన 186 శాతం వృద్ధి నమోదుకావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. నాలుగు రోజుల్లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు... భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జూన్ నెల తొలి నాలుగురోజుల్లోనే ఏకంగా రూ.8,000 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కరోనా కేసుల తగ్గుదల, కార్పొరేట్ల మెరుగైన ఆర్థిక ఫలితాలు కొనుగోళ్లను ప్రేరేపించాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక మేలో ఎఫ్ఐఐలు రూ.2,954 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. -
'సంస్కరణల ద్వారానే రైతులకు మేలు'
సాక్షి, విజయవాడ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(బుధవారం) విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె నియోజకవర్గంలోని జక్కుల, నెక్కలం, గూడవల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలిసి మాట్లాడారు. అనంతరం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్హాల్లో వ్యవసాయ బిల్లులపై వ్యవసాయరంగ నిపుణులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..' పార్లమెంట్ లో ఇటీవల సవరించిన మూడు యాక్ట్ కపై దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులంతా పర్యటిస్తున్నాం. వ్యవసాయ విధానాలపై బిల్లుల సవరణ చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. సంస్కరణల ద్వారానే రైతులకి మేలు జరుగుతుందని.. రైతు సంక్షేమమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల సవరించిన మూడు యాక్ట్ లను ఒకేసారి సవరణలు చేయడం ద్వారానే రైతులకి మేలు జరుగుతుంది. గతంలో రైతులు తమ ఉత్పత్తులని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో అమ్ముకోవడానికి కుదిరేది కాదు. కానీ కొత్తగా సవరించిన చట్టం వల్ల రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. గతంలో 8.5 % వరకి పన్నులు చెల్లించాల్సి వచ్చేది. మా ప్రభుత్వంలో దాదాపు 23 రకాల ఆహార ఉత్పత్తులకి కనీస మద్దతు ధర కల్పించాం. గతంలో కనీస మద్దతు ధర కేవలం వరి, గోధుమకి మాత్రమే ప్రకటించేవారు.. కానీ ఇప్పుడు ఆయా ఆహార ఉత్పత్తుల కొనుగోలు కూడా పెరిగాయి. టమాటో పండించే రైతుకి గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడేవారు.. నూతన చట్ట సవరణల వల్ల టమాటా లాంటి రైతులకి మేలు జరగనుంది. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. నూతన చట్ట సవరణల వల్ల సన్న, చిన్నరైతులకి నష్టం జరగదు. ఉత్తర భారతంలో గుంటూరు మిర్చికి మంచి డిమాండ్ ఉన్నా కూడా గతంలో సరఫరా చేయలేకపోయాం. వ్యవసాయపరమైన చట్ట సవరణలపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోంది. కొన్నిపార్టీలు కావాలనే పార్లమెంట్ లో ఈ చట్ట సవరణలపై గొడవలు చేశారు. చిన్న రైతులు సైతం ఈ-నామ్ డిజిటల్ వ్యవస్ధ ద్వారా ఎక్కడైనా తమ ఉత్పత్తులని సులువుగా అమ్ముకోవచ్చు. కోవిడ్ కి ముందు నాటి ఆర్ధిక పరిస్ధితులకి చేరుకుంటున్నాం. రాష్డ్రాలకి జీఎస్టీలోటు భర్తీపై ఈ నెల 12న మరోసారి రాష్డ్రాలతో సమావేశమం కానున్నాం. ఇప్పటికే ఈ అంశాలపై ఏడు గంటలపాటు సుధీర్ఘంగా చర్చించాం ' అంటూ తెలిపారు. -
ప్రేమే నేరమా..!
సాక్షి, సిటీబ్యూరో: మరోసారి పరువు పడగ విప్పింది.. ఉన్మాదమై బుసకొట్టింది.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచం గుప్పెట్లోకి వచ్చినా.. మానవ సంబంధాల్లోని బూజు మాత్రం తొలగిపోలేదు. మనిషితనం అదేపనిగా మాయమవుతూనే ఉంది. గచ్చిబౌలికి చెందిన హేమంత్ హత్య మరోసారి అత్యంత అమానవీయమైన కుల ఉన్మాదాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు అవంతి, హేమంత్లు. మైనారిటీ తీరి మేజర్లయ్యారు. కులాలు వేరైనా మనస్సులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. అవంతి కుటుంబానికి ఇది మింగుడుపడలేదు. హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. మిర్యాలగూడ తరహాలో నగరంలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య మరోసారి చర్చనీయాంశమైంది. కుల, మతాంతర వివాహాలకు రక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించకపోవడం వల్లనే నేరాలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, మనస్తత్వ నిపుణులు హేమంత్ హత్యను తీవ్రంగా ఖండించారు. ప్రేక్షకపాత్ర మంచిది కాదు వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. కానీ సమాజంలో పలుకుబడి గల వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందించడం లేదు. తప్పును తప్పు అని చెప్పకపోవడం కూడా నేరమే. పరువు హత్యలను కొంతమంది మనోభావాలకు ముడిపెట్టి ఇలా ప్రేక్షకపాత్ర వహించడం వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా అగ్రకులాలకు చెందిన వారి పిల్లలు, దళితుల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అగ్రకులాల మధ్య కూడా కుల ఉన్మాదం పెరిగింది. (మరో ‘పరువు’ హత్య) ఒక కులాన్ని మరో కులం సహించలేని దారుణమైన కుల ఆధిపత్యం ఇది. చాలా దారుణం. ఇలాంటి హత్యల వల్ల మానవత్వం నశిస్తుంది. నేరస్తులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్ల కూడా నేరాలు పెరుగుతున్నాయి. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడుతుంది. ప్రేమ పెళ్లిళ్లలో ఇష్టమైతే తల్లిదండ్రులు ఆ జంటను ఆశీర్వదించాలి. లేదా వారి ఇష్టానికి వారిని వదిలేయాలి, కానీ ఇలా హత్యలకు పాల్పడటం దారుణం. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు రావాలి కులాంతర, మతాంతర వివాహాలకు సంబంధించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బలంగా లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. 1954లో తెచ్చిన ఈ చట్టం మొక్కుబడిగా కొద్దిపాటి నగదు ప్రోత్సాహం ఇవ్వడానికే పరిమితమైంది. కానీ సరైన రక్షణ కల్పించలేకపోతోంది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు చట్టబద్ధమైన రక్షణ, సామాజిక భద్రత ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే ఇలాంటి హత్యలు జరగవు. ‘ఆడ పిల్లలు కుటుంబ గౌరవానికి ప్రతీక’ అనే పాతకాలం నాటి భావాల్లో కూడా మార్పు రావాలి. ఆడైనా, మగైనా సమానమే. కుల, మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు కూడా సాధ్యమైనంత వరకు ఇరువైపులా తల్లిదండ్రులను, కుటుంబాలను ఒప్పించడం మంచిది. పోలీసుల ద్వారా, ఇతరత్రా సంస్థల ద్వారానైనా సరే ఒప్పించడం ఒత్తిడి తెచ్చి ఒప్పించడం వల్ల ఇలాంటి హత్యలను ముందస్తుగానే అడ్డుకున్నట్లవుతుంది. – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త హత్యలతో పంతం నెగ్గించుకోవడం దారుణం అప్పటి వరకు మనిషిలో నిద్రాణంగా దాగి ఉన్న నేర స్వభావం తన అధిపత్యానికి విరుద్దమైన ఘటనలు జరిగినప్పుడు ఇలా బయటకొస్తుంది. ఈ రోజుల్లో కూడా కులపిచ్చి హత్యలకు పాల్పడే స్థాయిలో ఉండటం చాలా దారుణం. సాధారణంగా కుటుంబంలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. కేరింగ్ అండ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. కేవలం ఒకరిద్దరు వ్యక్తులు తమ పంతాన్ని నెగ్గించుకోవడం, తాము చెప్పిందే చెల్లుబాటుకావాలనుకోవడం హత్యల వరకు దారితీయడం శోచనీయమే. ఇలాంటి దారుణాలు మరోసారి పునరావృతం కాకుండా సమాజం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ రాధికా ఆచార్య, మనస్తత్వ నిపుణులు -
మార్కెట్ల దారెటు? నిపుణుల అంచనాలు
ఆర్థిక గణాంకాలు, ఈ ఏడాది క్యూ1లో కంపెనీల ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో గడిచిన వారం మార్కెట్లు ఊగిసలాట మధ్య కదిలాయి. వీటికితోడు పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కొద్ది రోజులుగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి. మరోవైపు చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఎలా సంచరించవచ్చన్న అంశంపై పలువురు నిపుణులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిలో కొన్నిటిని తీసుకుంటే.. 11,440 స్థాయి కీలకం కొద్ది వారాలుగా పలు ప్రతికూలతల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు నిలదొక్కుకుంటూ వచ్చాయి. దీంతో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 11,440-11,620 పాయింట్ల స్వల్ప పరిధిలోనే ఊగిసలాటకు లోనవుతూ వస్తోంది. వచ్చే వారం నిఫ్టీకి 11,440 స్థాయి కీలకమని చెప్పవచ్చు. ఈ మద్దతు స్థాయికంటే దిగువకు చేరితే 11,200 వరకూ నీరసించవచ్చు. - గౌరవ్ దువా, క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్, షేర్‌ఖాన్ 11,600 దాటితే.. పలు ప్రతికూల వార్తల నేపథ్యంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. దీంతో నిఫ్టీ 11,290-11,600 పాయింట్ల పరిధిలోనే ఆటుపోట్లను చవిచూస్తూ వస్తోంది. వచ్చే వారం నిఫ్టీకి 11,600 స్థాయి కీలకమని చెప్పవచ్చు. ఈ స్థాయి వద్ద ఎదురయ్యే రెసిస్టెన్స్‌ను అధిగమిస్తే.. 12,100 వరకూ పురోగమించవచ్చు. - గౌతమ్ షా, వ్యవస్థాపకుడు, ప్రధాన వ్యూహకర్త, గోల్డిలాక్ ప్రీమియం రీసెర్చ్ మరింత ముందుకు సమీప భవిష్యత్‌లో మార్కెట్లు మరింత బలపడేందుకు వీలుంది. ఇందుకు బ్యాంకింగ్ రంగం దోహదపడవచ్చు. ఇప్పటికే మారటోరియం, రుణాల డిఫాల్ట్స్ వంటి ప్రతికూలతలు బ్యాంకింగ్‌పై ప్రభావం చూపాయి. ఇకపై గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడం ద్వారా డిమాండ్‌కు వీలుంది. ఐటీ, ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. - పంకజ్ పాండే, రీసెర్చ్ హెడ్, ఐసీఐసీఐ డైరెక్ట్ రికార్డులవైపు.. కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సైనిక వివాదాలు, మార్చి కనిష్టాల నుంచి 50 శాతం ర్యాలీ చేయడం వంటి కారణాలతో ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. అయితే కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న వ్యాక్సిన్లు, ఆర్థిక రికవరీపై ఆశలు, కంపెనీల పనితీరుపై అంచనాలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలతో పెరిగిన లిక్విడిటీ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో మార్కెట్లు కొత్త గరిష్టాలవైపు దృష్టి సారించే అవకాశముంది. - గోల్డ్‌మన్ శాక్స్, గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ రీసెర్చ్ నివేదిక -
కరోనా చదువులు!
కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యార్థుల సంగతి ఏమిటన్న దానిపై విద్యాశాఖ ఎటూ తేల్చలేకపోతోంది. ఈలోగా కార్పొరేట్, సెమీ కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్ బోధన అంటూ తరగతులను ప్రారంభిం చేశాయి. జీహెచ్ఎంసీలో ఆన్లైన్ తరగతులు జోరందుకోవడంతో యాజ మాన్యాలు ఫీజు వసూళ్లపై దృష్టి పెట్టాయి. మరోవైపు కొన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర ప్రముఖ పాఠశాలలు, సాధారణ ప్రైవేటు స్కూళ్లు ఇంకా ఆన్లైన్ తరగతులను ప్రారంభించలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటన్న దానిపై ఇంతవరకు ఏ నిర్ణయమూ లేదు. ఈ పరిస్థితుల్లో వీడియో పాఠాలతో ప్రత్యామ్నాయ విద్యా బోధన సాధ్యం అవుతుందా? దాంతో ఎంతమేరకు ప్రయోజనం చేకూరుతుంది. ఆన్లైన్ బోధన, ప్రత్యక్ష బోధన లోటును పూడ్చగలుగుతుందా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఆన్లైన్ బోధనకు ఆటంకంగా మారుతుండటంతో విద్యా బోధన ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వానాకాలం చదువుల్లా తయారైన కరోనా చదువులు, విలవిల్లాడుతున్న పాఠశాల విద్యపై సాక్షి ప్రత్యేక కథనాలు. సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. రోజూ పని చేసుకుంటే తప్ప జీవనం సాగించలేని ఈ కుటుంబాలకు తమ ఇళ్లలో కరెంటు వినియోగించుకున్నం దుకు వచ్చే బిల్లు, సాధారణ ఫోన్ వినియోగానికి నెలకు అయ్యే ఖర్చు భరించడమూ గగనమే. కరోనా ఆడుతున్న వికృత క్రీడ నేపథ్యంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేనందున వారి పిల్లలు ఆన్లైన్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పుణ్యమాని అలాంటి కుటుంబాల్లో ఇప్పుడు ఎల్ఈడీ టీవీలు, కంప్యూ టర్లు, స్మార్ట్ఫోన్లు అవసరమవుతున్నాయి. వేలాది రూపాయలు ఖర్చయ్యే ఈ పరికరాలను కొనుగోలు చేయడం ఈ పేద, మధ్య తరగతి కుటుంబాలకు కరోనా తెచ్చిపెట్టిన మోయలేని భారం. మరోవైపు 10,756 ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థు ల్లోనూ 70% మంది సాధారణ, మధ్యతరగతి కుటుంబా లకు చెందిన పిల్లలే. సాధారణ, ప్రైవేటు ఉద్యోగుల పిల్లలూ ఉన్నారు. పిల్లలకు ఏదోలా మంచి చదువులు చెప్పించాలనే ఆలోచనతో పైసాపైసా కూడబెట్టుకుని, అవసరమైతే అప్పులు చేసి మరీ వేల రూపాయల స్కూల్ ఫీజులు చెల్లిస్తున్న వీరిపై ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ పాఠాలంటూ భారం మోపాయి. విద్యార్థులు విన్నా వినకపోయినా పాఠాలు చెబుతామంటూ ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకూ కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ పాఠాల కోసం కొత్త ఫోన్లు, కంప్యూటర్లు కొనుగోలు చేయలేక, ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించలేక వారు అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల బాధలు అలా ఉంటే... అసలు విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభించాలో కూడా ప్రభుత్వం ఇదమిత్థంగా నిర్ణయించుకోలేకపోతోంది. ఈ విద్యా సంవత్సరంలో అసలు పాఠశాలలు తెరుస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కీ ఎక్కని వీడియో పాఠాలు, వాటి కోసం తల్లిదండ్రుల తిప్పలు, ఏం చేయాలో పాలుపోని ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలకు పూర్తిగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పామో లేదో అర్థం కాక టీచర్లు... ఇలా అంతటా అయోమయం... గందరగోళం. కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యారంగాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పాఠశాల విద్యను మరింత గందరగోళంలో పడేసింది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య అనివార్య అంతరాలనూ సృష్టిస్తోంది. ఫీజుల కోసం పాఠాలు కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకంటూ తెరపైకి వచ్చిన ఆన్లైన్ తరగతుల గురించే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గతంలో వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన ఈ ఆన్లైన్ తరగతులు పూర్వ ప్రాథమిక విద్యలోని ఎల్కేజీ వరకు వచ్చేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, సెమీ కార్పొరేట్ స్కూళ్లు ఈ ఆన్లైన్ క్లాసుల విషయంలో దూసుకుపోతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేసుకునేందుకు జూన్ నుంచే తరగతులు ప్రారంభించాయి. ఈ క్లాసులు యాక్సెస్ అయ్యేందుకు పాస్వర్డ్ ఇవ్వాలన్నా వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు అసలు ఆ పాఠాలు అర్థం అవుతున్నాయా? లేదా? అన్నది ఓ పెద్ద ప్రశ్న. అయినప్పటికీ ఆన్లైన్ తరగతులను ప్రారంభించాం కాబట్టి ఫీజులు చెల్లించడంటూ తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన కార్పొరేట్, సెమీ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలైతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి ఫీజు అగ్రిమెంట్ చేసుకొని మొదటి టర్మ్ ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచాయి. అంతేకాదు యాజమాన్యాలు ఆ ఫీజల వసూలుకు ప్రిన్సిపాళ్లు, క్లాస్ టీచర్లకు టార్గెట్లను విధించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫీజులను చెల్లించేలా చూడాలని, అప్పుడే ఇప్పుడు ఇస్తున్న సగం జీతం ఇస్తామంటుండటంతో టీచర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. లేకపోతే జీతం ఇవ్వమని తెగేసి చెబుతుండటంతో టీచర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సార్.. కొంత ఫీజైనా చెల్లించండి.. అంటూ రోజూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బతిమిలాడుకోవాల్సిన దుస్థితిలో పడ్డారు. కాగా జీహెచ్ఎంసీయేతర పట్టణాల్లో కొన్ని ప్రముఖ పాఠశాలలు, సాధారణ పాఠశాలలు ఇంకా ఆన్లైన్ తరగతులను ప్రారంభించలేదు. సర్కారు బడుల్లో చదువులు ఎలా చెప్పాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని తాము ఎవరికీ చెప్పలేదని చెపుతోంది. కానీ, కొన్ని పాఠశాలల్లో ప్రారంభమయిన ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థుల మధ్య అంతరాలు ఏర్పడే ప్రమాదం నెలకొంది. మరోవైపు ఆన్లైన్ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని విద్యావేత్తలంటున్నారు. విద్యార్థులు ఇంట్లో శ్రద్ధగా ఆన్లైన్ పాఠాలు వినడం లేదని, ముఖ్యంగా ఎల్కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలకు అసలు ఆన్లైన్ అంటేనే తెలియడం లేదని, వారు ల్యాప్‌టాప్‌లు ముందు పెట్టుకుని, స్మార్ట్ ఫోన్లలో చూస్తూ పాఠాలు నేర్చుకోలేకపోతున్నారని ఇప్పటికే కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. రికార్డెడ్ వీడియో పాఠాలు పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడడం లేదని, లైవ్ తరగతులను విద్యార్థులు సరిగా వినడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆన్లైన్ పాఠాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆన్లైన్ తరగతుల వల్ల చిన్న పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్) సంస్థ ఇదివరకే పేర్కొంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేజీ నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ పాఠాలను నిషేధించింది కూడా. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్, వీడియో, టీవీ పాఠాల విషయంలో ఏం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతుపట్టడం లేదు. మరేం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఓవైపు విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండడం, మరోవైపు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాష్ట్రంలోని ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇప్పటికే నెల రోజులు నష్టపోగా, అసలు పరిస్థితి ఎప్పుడు గాడిలో పడుతుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ముందు కూడా ఆన్లైన్ లేదా టీవీ పాఠాలే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలు బోధించే వ్యవస్థ సక్రమంగా లేదు. మరోవైపు ఆ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కుటుంబాలకు కూడా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో టీశాట్, డీడీ యాదగిరి, నిఫుణ వంటి చానెళ్ల ద్వారా రాష్ట్రంలోని అందరు విద్యార్థులకు పాఠాలు బోధించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కానీ టీవీ పాఠాలు విద్యార్థుల మస్తిష్కాల్లోకి ఏ మేరకు వెళతాయన్నది సందేహాస్పదమే. ఇప్పుడు కొన్ని పాఠశాలలు ప్రారంభించిన ఆన్లైన్ పాఠాలతో పెద్దగా ప్రయోజనం లేదని సర్వేలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఎదురుగా కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పడమే మంచిదని, వేరే మార్గమే లేదని, ఏ మార్గంలో వెళ్లినా విద్యార్థులకు ఉపయోగం ఉండదని విద్యావేత్తలు పేర్కొంటుంటడంతో రాష్ట్రంలో విద్యారంగం ‘ఆన్లైన్’కూడలిలో నిలిచిపోయింది. నిఫుణులు ఏమంటున్నారంటే.. ప్రత్యక్ష బోధనతోనే ప్రయోజనం ఆన్లైన్ పాఠాలు, వీడియో పాఠాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. విద్యార్థులు శ్రద్ధ పెట్టి వినలేరు. చిన్న పిల్లలైతే ఆ పాఠాలను సొంతంగా అర్థం చేసుకునే స్థాయి ఉండదు. మనది పిల్లల ముఖం చూస్తూ బోధించే విద్యా విధానం. అతని ముఖం చూస్తూ అర్థం అవుతోందా? లేదా? అని పరిశీలించి బోధన స్వరూపాన్ని మార్చి చెప్పే పద్ధతి. వీడియో పాఠాలతో అది సాధ్యం కాదు. ఆన్లైన్ బోధనలో కూడా కష్టమే. పాఠశాల స్థాయిలో విద్యార్థులను విభజించి బ్యాచ్‌లుగా చేసి, భౌతిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చోబట్టి బోధిస్తే ప్రయోజనం ఉంటుంది. – విద్యావేత్త చుక్కా రామయ్య ఆన్లైన్ బోధనను ఎక్కువ సమయం వినలేరు ప్రాథమిక స్థాయిలో ఆన్లైన్ బోధన అమలు చేయాలంటే ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే ఉండాలి. చిన్న పిల్లల సైకాలజీ ప్రకారం తరగతి గదిలోనూ 45 నిమిషాల పీరియడ్‌లో కేవలం 10 నుంచి 14 నిమిషాలు మాత్రమే శ్రద్ధ పెడతారు. అంతకుమించి ఎక్కువ సమయం శ్రద్ధతో పాఠం వినలేరు. ప్రాథమిక స్థాయిలో పాఠాలను ఆటలు, పాటలు, సంభాషణ రూపంలోకి మార్చి చెబితేనే ఉపయోగం ఉంటుంది. 6 నుంచి 10వ తరగతి వారికి ఇంటరాక్షన్ విధానంలో బోధన లేకపోతే ఉపయోగం పెద్దగా ఉండదు. – ఆనందకిషోర్, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ డైరెక్టర్ ఒకటీ రెండు నెలల తరువాత షిఫ్ట్ పద్దతి మేలు ఒకటో తరగతి నుంచి 5 తరగతులకు ఇప్పుడే బోధన అవసరం లేదు. 6 నుంచి 10 తరగతుల ప్రభుత్వ విద్యార్థులకు టీవీల ద్వారా లేదా ట్యాబ్‌లు ఇచ్చి ఆన్లైన్ ద్వారా బోధించాలి. ఒకటీ రెండు నెలల తరువాత విద్యార్థులను బ్యాచ్‌లుగా ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ పద్ధతిలో అదీ 6 నుంచి 10 తరగతులకే బోధన చేపట్టాలి. వీలైతే మండల యూనిట్‌గా మండలంలోని టీచర్లను విభజించి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే 6 –10 తరగతుల విద్యార్థులకు బోధన చేపట్టేలా చేయాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి విద్యా సంవత్సరం అలస్యమైంది. విద్యా వి«ధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యక్ష బోధన వద్దనుకుంటే ముందుగా వర్క్షీట్లను రూపొందించి విద్యార్థులకు అందించాలి. వాటిపై టీవీల ద్వారా వీడియో పాఠాలను అందించడం ఉత్తమం. ఉన్నత తరగతులకు వీలైతే ఆన్లైన్ పాఠాలను బోధించాలి. టీచర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. – సదానంద్‌గౌడ్, ఎస్టీయూ అధ్యక్షుడు సిలబస్ తగ్గింపు ప్రధానమే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులపై భారం తగ్గించేలా సిలబస్‌ను కుదించాలి. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలి. 6 నుంచి 10 తరగతులకు ఆ¯Œన్‌లైన్ బోధనను చేపట్టాలి. ట్యాబ్‌లు ఇవ్వడం ఆర్థిక భారం అనుకుంటే వీడియో పాఠాలనైనా టీశాట్, డీడీ యాదగిరి వంటి ఛానెళ్ల ద్వారా ప్రసారం చేయాలి. విద్యార్థులు పూర్తిగా ఖాళీగా ఉండకుండా చూడాలి. –శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు టీవీల ద్వారా పాఠాలను బోధించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీలైతే స్కూళ్లు ప్రారంభింవచ్చు. లేదంటే టీవీల ద్వారా వీడియో పాఠాలు అందిస్తే ఉపయోగం ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో టీవీలను ఏర్పాటు చేసి పాఠాలను ప్రారంభించాలి. పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లలో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన బోధనను చేపట్టాలి. – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
మార్కెట్లు కుమ్మేస్తున్నాయ్.. ఎన్నాళ్లీ జోరు?!
ఓవైపు ప్రపంచ దేశాలన్నిటినీ కరోనా వైరస్ కుదిపేస్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకెళుతున్నాయి. యూఎఎస్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెన్సెక్స్ 37,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్ల దారెటు అన్న సందేహాలు ఇన్వెస్టర్లను మనసులను తొలుస్తున్నట్లు పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) తదితర కేంద్ర బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను నేలకు దించాయి. అంతేకాకుండా భారీ ప్యాకేజీల ద్వారా బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లతో నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు ఆర్థిక రికవరీతోపాటు.. స్టాక్ మార్కెట్లపట్ల విశ్వాసం పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జెఫరీస్ ఈక్విటీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్, ఫస్ట్ గ్లోబల్ విశ్లేషకులు శంకర్ శర్మ, ఎడిల్వీజ్ గ్రూప్ చైర్మన్ రాశేష్ షా వెల్లడించిన అభిప్రాయాలు, అంచనాల వివరాలు చూద్దాం.. క్రిస్ ఉడ్, జెఫరీస్ నిజానికి ఇండియాసహా వర్ధమాన దేశాలలోని ప్రజలకు కరోనా వైరస్ కంటే లాక్డవున్లే అత్యధికంగా చేటు చేస్తాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న విధానాలలో మార్పులే అతిపెద్ద రిస్క్‌గా చెప్పవచ్చు. సరళతర పాలసీల అమలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తోంది. దేశీయంగా చూస్తే ఐటీ, ఫార్మా రంగాలను కీలకంగా పేర్కొనవచ్చు. వీటికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు తక్కువే. అయితే ఆర్థిక మందగమనం, మొండి బకాయిలు దేశానికి సమస్యలు సృష్టించే వీలుంది. హౌసింగ్, నిర్మాణ రంగాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ లాక్‌డవున్ కారణంగా రియల్టీ మార్కెట్ దెబ్బతింటోంది. ఇతర పెట్టుబడి మార్గాలలో బంగారం మరింత మెరిసే వీలుంది. ఔన్స్ 1900 డాలర్లను అధిగమించవచ్చు. ఇటీవల వ్యాక్సిన్లపై పెరుగుతున్న అంచనాలు కృత్రిమతకు దారితీస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నదని భావించడంలేదు. శంకర్ శర్మ, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ల ర్యాలీకి ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా సహకరిస్తోంది. ఇటీవల మార్కెట్ల మొత్తం ర్యాలీలో ఈ కౌంటర్ కీలకపాత్ర పోషించింది. ఒకే కౌంటర్‌పై ఆధారపడి మార్కెట్లు పరుగందుకుంటే ఆందోళనలు తలెత్తుతాయి. గత మూడు నెలల్లో చూస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, రియల్టీ కేటగిరీలో తొలుత ర్యాలీరాగా.. తదుపరి రిలయన్స్ వల్ల మార్కెట్ పురోగమించింది. ఇటీవల రిలయన్స్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత బలపడటంతో ఈ షేరు చాలా వేగంగా దౌడు తీసింది. మూడు నెలల్లోనే రెట్టింపయ్యింది. దీంతో ఇకపై లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ ఏడాది దేశీ మార్కెట్లు 24 శాతం క్షీణించాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే వెనుకబడ్డాయి. అయితే కొన్ని రంగాలలో అత్యంత ఆకర్షణీయమైన స్టాక్స్ ఉన్నాయి. అలాగని బుల్ మార్కెట్‌కు అవకాశంలేదు. కొన్ని స్టాక్స్ ఆధారంగా కదిలే మార్కెట్‌గా కనిపిస్తోంది. రాశేష్ షా, ఎడిల్వీజ్ గ్రూప్ స్వల్పకాలిక ఆర్థిక గణాంకాలను మార్కెట్లు పట్టించుకోవడం లేదు. మార్చి, ఏప్రిల్‌లో చూస్తే.. కరోనా వైరస్ కారణంగా అనూహ్య భయాలు నెలకొన్నాయి. ఇది ఎలా అంతమవుతుందన్న అంశాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే లిక్విడిటీతో స్వల్పకాలిక ఒత్తిడి తొలగిపోయింది. స్వల్పకాలంలో లిక్విడిటీ ఆదుకోగా.. తదుపరి దశలో అంటే డిసెంబర్, జనవరికల్లా కోవిడ్-19కు తెరపడగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక గణాంకాలు అంటే జీడీపీ, కంపెనీల ఫలితాలు వంటివి నిరాశపరుస్తాయన్నది తెలిసిన సంగతే. దీంతో ఆపై అంటే 2021 తదుపరి పరిస్థితులపట్ల ఇన్వెస్టర్లు ఆశావహంగా స్పందిస్తున్నారు. -
మార్కెట్ల ఈ ర్యాలీ నిలుస్తుందా?
కొద్ది రోజులుగాదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ కారణంగా షేర్లు అధిక ధర పలుకుతున్నాయని బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ పేర్కొంటోంది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌లను అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల లాభార్జన నీరసించనున్నట్లు తెలియజేసింది. దీంతో షేరువారీ ఆర్జన(ఈపీఎస్)లు డౌన్‌గ్రేడ్ కానున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 19.7 రెట్లు ప్రీమియంలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. అంటే దాదాపు 2008 జనవరి గరిష్టాల స్థాయిలో మార్కెట్లు కదులుతున్నట్లు వివరించింది. 2008లో అంతర్జాతీయంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా తదుపరి దశలో మార్కెట్లు పతనమైన విషయం విదితమే. రీసెర్చ్ నోట్లో జెఫరీస్ ఇంకా ఏమన్నదంటే..! 44 శాతం ర్యాలీ మార్చి కనిష్టం నుంచి నిఫ్టీ 44 శాతం ర్యాలీ చేసింది. 7,511 పాయింట్ల కనిష్టం నుంచి 10,813 పాయింట్ల వరకూ ఎగసింది. అయితే కోవిడ్-19 ప్రభావంతో ఇటీవల పలు కంపెనీల ఈపీఎస్‌లు డౌన్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ పటిష్టతపై సందేహాలు నెలకొనడం సహజం. ఇప్పటికే నిఫ్టీ ఈపీఎస్‌పై అంచనాలలో కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 28 శాతం.. వచ్చే ఏడాదిలో 14 శాతం చొప్పున నిఫ్టీ ఈపీఎస్‌పై డౌన్‌గ్రేడ్స్ వెలువడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదలయ్యాక ఈపీఎస్ అంచనాలు మరింత తగ్గే వీలుంది. నిధులు వెనక్కి ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితుల కారణంగా మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. యాంఫీ(AMFI) వివరాల ప్రకారం జూన్‌లో ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ. 1800 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఫండ్స్‌లోకి పెట్టుబడులు రావడానికి బదులుగా నిధుల ఉపసంహరణ జరగడం ప్రతికూల అంశం. అయితే మెరుగైన ఆర్థిక గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా రిస్క్‌లను ఎదుర్కొనగల సామర్థ్యం పెరగడం వంటి అంశాలు మార్కెట్లలో దిద్దుబాటు(కరెక్షన్)ను స్వల్ప కాలానికే పరిమితం చేయవచ్చు. నిర్మాణ రంగం పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం వంటి అంశాలు ర్యాలీకి బలాన్నిచ్చే వీలుంది. ఈ బాటలో ఇకపై సిమెంటుకు డిమాండ్, ఇంధన విక్రయాలు వంటివి ఊపందుకుంటే సెంటిమెంటు మరింత మెగుగుపడవచ్చు. ఇది ర్యాలీకి మరింత దోహదం చేయవచ్చు. ఫేవరెట్ స్టాక్స్ ప్రస్తుత మార్కెట్లో వేల్యుయేషన్స్‌పరంగా ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నట్లు జెఫరీస్ అభిప్రాయపడింది. -
మార్కెట్ల ఈ దూకుడు ఎందుకంటే!
వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 36,400కు చేరగా.. నిఫ్టీ 10,700 ఎగువన కదులుతోంది. ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల ట్రెండ్నకు పలు కారణాలున్నట్లు కుంజ్ బన్సాల్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న అంశాలతోపాటు.. కార్పొరేట్ నిధుల సమీకరణ వెనుకున్న కారణాలు తదితరాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఆశావహం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఇటీవల హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణి నెలకొంది. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.గత మూడు నెలలుగా మార్కెట్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బలపడుతున్నాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం, లాక్‌డవున్‌లతో పారిశ్రామికం కుదేలవడం, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలున్నప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. ప్రధానంగా మార్కెట్లకు లిక్విడిటీ.. అంటే చౌక నిధులు బూస్టింగ్నిస్తున్నాయి. వీటికితోడు ఇటీవల వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఏప్రిల్‌లో రూ. 40,000 కోట్లు నమోదుకాగా.. మే నెలలో రూ. 70,000 కోట్లకు, జూన్‌లో రూ. 90,000 కోట్లకు జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆటో విక్రయాలు గత నెలలో ఆటో విక్రయాలు సైతం సానుకూల ధోరణిని సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి లభించిన దన్నుతో ట్రాక్టర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు సైతం ఇందుకు దన్నునిచ్చాయి. అయితే కార్లు, వాణిజ్య వాహన విక్రయాలు నిరాశపరచాయి. ఇక వ్యవసాయోత్పత్తిపై అంచనాలు బాగా పెరిగాయి. సాధారణ వర్షపాత అంచనాలు, పంటల విస్తీర్ణం వంటి అంశాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. ఇలాంటి పలు సానుకూల అంశాల కారణంగా కోవిడ్-19 వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లకు ఇన్వెస్టర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అవకాశాలు అందిపుచ్చుకోగల ఫార్మా, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలు వెలుగులో నిలుస్తున్నాయి. రంగాలవారీగా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇది కొంతకాలంపాటు కొనసాగవచ్చు. జియో జోరు ఇటీవల డిజిటల్, టెలికం సేవల సంస్థరిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నిధులు సమీకరించింది. ఫేస్బుక్ తదితర పలు విదేశీ సంస్థలు రిలయన్స్ జియోలో పెట్టుబడికి ఆసక్తి చూపాయి. మరోవైపు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్లు కొంతమేర వాటాను విక్రయించారు. తద్వారా కంపెనీ బలోపేతానికి నిధుల సమీకరణ చేపట్టారు. ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తగిన సమయంలో రుణభారాన్ని తగ్గించుకునేందుకు జియో ద్వారా నిధులను సమీకరించింది. తద్వారా పబ్లిక్ ఇష్యూ తదితరాలు చేపట్టేందుకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంది. ఇవన్నీ సెంటిమెంటుకు బలాన్నిస్తున్నాయి. ఇక మరోవైపు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్విప్, ప్రమోటర్ వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించింది. ఇదే విధంగా పలు బీమా రంగ కంపెనీలు సైతం వాటాలు విక్రయించాయి. నాణ్యమైన కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో కొన్ని వాటా విక్రయ ఆఫర్లు అధిక నిధులను ఆకట్టుకోగలిగాయి కూడా. తద్వారా దేశీ బిజినెస్లపట్ల విదేశీ ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి వ్యక్తమవుతోంది. వెరసి ఇలాంటి పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. -
మళ్లీ మార్కెట్ల పతనానికి చాన్స్!
ప్రస్తుత స్థాయిల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ద్వితీయార్థంలో పతనమయ్యే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు కొంతమంది భావిస్తున్నారు. అయితే మార్చిలో నమోదైన కనిష్ట స్థాయి 7,500కు నిఫ్టీ చేరకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఇటీవల కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు దిగితే మార్కెట్లు మరోసారి మార్చి కనిష్టాలను పరీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ద్వితీయార్ధంలో మార్కెట్ల గమనం ఎలా ఉంటుందన్న అంశంపై కొంతమంది మార్కెట్ నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. లాక్డవున్లు దేశీయంగా కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతుండటంతో ఇప్పటికే చెన్నై, గువాహటి తదితర ప్రాంతాలలో లాక్‌డవున్ ప్రకటించారు. ఈ బాటలో ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలలోనూ మరోసారి లాక్‌డవున్ ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొద్ది వారాల్లోనే దేశీయంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరగడంతో అమెరికా, బ్రెజిల్, రష్యా తదుపరి స్థానానికి దేశం చేరుకుంది. నిజానికి మార్చి నుంచి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న అంచనాలతో మార్కెట్లు 35 శాతం ఎగశాయి. ఎఫ్‌పీఐలు సైతం పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి లాక్‌డవున్ విధింపు వార్తలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చు. నిపుణులు ఇలా.. అమెరికా, చైనా వంటి దేశాలలో కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యే వీలున్నట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ సీఐవో నవీన్ కులకర్ణి అభిప్రాయపడుతున్నారు. అయితే నిఫ్టీ మార్చి కనిష్టాలకు చేరకపోవచ్చని చెబుతున్నారు. నిఫ్టీ 7500 పాయింట్ల వద్ద స్వల్పకాలిక బాటమ్‌ను చవిచూసిందని మోతీలాల్ ఓస్వాల్ నిపుణులు హేమంగ్ జానీ పేర్కొంటున్నారు. ఆటుపోట్లను తెలిపే ఇండియా విక్స్ 11 ఏళ్ల గరిష్టం 87ను మార్చిలో తాకిన పిదప 30కు తగ్గడం ద్వారా ఈ అంశం ప్రతిఫలిస్తున్నట్లు వివరించారు. గ్లోబల్ ఎకానమీతోపాటు, ఫైనాన్షియల్ మార్కెట్లకు కోవిడ్-19 తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలియజేశారు. ముందుముందు సవాళ్లు ఎదురుకావచ్చని కంపెనీల ఫలితాల సందర్భంగా యాజమాన్యాలు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు మార్కెట్లకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్టీ వీక్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిద్రవ్యోల్బణం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బలహీనపడిందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు చొక్కలింగం పేర్కొన్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోగా.. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్గాల ద్వారా అతితక్కువ రిటర్నులే వస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు ఆకర్షణీయంకాకపోవడంతో లిక్విడిటీ అంతా స్టాక్స్‌లోకే ప్రవహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు 15-20 శాతం పతనమైతే పెట్టుబడులు ఊపందుకునే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఎఫ్‌పీఐలు తమ హోల్డింగ్స్‌లో 5 శాతం వాటాను విక్రయించినప్పటికీ నిఫ్టీ మార్చి కనిష్టానికి సులభంగా చేరుతుందని అంచనా వేశారు. లేమన్ బ్రదర్స్ సంక్షోభంలో ఎఫ్ఐఐలు 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో సెన్సెక్స్ 60 శాతం పతనమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ బాటలో 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. ఇటీవల మార్కెట్లు 38 శాతం పతనమైనట్లు వివరించారు. ఇక సమీప భవిష్యత్‌లో మార్కెట్లు కరెక్షన్కు లోనయ్యే వీలున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు ఉమేష్ షా చెప్పారు. అయితే మార్చి కనిష్టాలను తాకే అంశంపై అంచనాల్లేవని తెలియజేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ లేదా చైనాతో వివాదాలు లేదా కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావడం వంటి అంశాలు మార్కెట్లలో అమ్మకాలకు దారిచూపవచ్చని విశ్లేషించారు. మార్చి కనిష్టాలకు నో సమీప భవిష్యత్‌లో మార్కెట్లు మార్చి కనిష్టాలకు పతనంకాకపోవచ్చని.. బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ షేర్స్ నిపుణులు సిద్ధార్ధ్ సెడానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయిర్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
2008 సంక్షోభం- 2020లో పాఠాలు
పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి పలు పాఠాలను నేర్చుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2008-09లో సబ్‌ప్రైమ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇటీవల ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు నెలల క్రితం ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అయితే ఫెడరల్ రిజర్వ్, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితర కేంద్ర బ్యాంకుల బారీ సహాయక ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ వెల్లువెత్తి మార్కెట్లు వేగవంతంగా బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. ఈక్విటీలలో పెట్టుబడులు అంటే అధిక రిటర్నులు, అత్యంత రిస్కుతో కూడుకున్న వ్యహహారమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశంలో చిన్న ఇన్వెస్టర్లు గతం నుంచి పలు విషయాలను అభ్యసించి అమలు చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎడిల్వీజ్ వెల్త్‌మేనేజ్‌మెంట్ నిపుణులు రాహుల్ జైన్ తదితర విశ్లేషకులు ఇంకా ఏమంటున్నారంటే.. దీర్ఘకాలానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు దీర్ఘకాలిక దృష్టితో తీసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఇండెక్స్ ఆధారిత రిటర్నులను ఆశించినప్పటికీ ఆటుపోట్లను తట్టుకుని అధిక కాలం కొనసాగితే భారీ లాభాలకు అవకాశముంటుంది. నిజానికి ఏవేని కారణాలతో మార్కెట్లు పతనమయ్యే సందర్భాలలో ఇన్వెస్టర్లను నిరాశావాదం ఆవహిస్తుంది. ఇది అనాలోచిత నిర్ణయాలకు కారణమవుతుంది. 2008లో తొలుత మార్కెట్లు పతనమయ్యాయి. తదుపరి 2009లో వెనువెంటనే భారీ ర్యాలీ చేశాయి. సంక్షోభ సమయాల్లో పెట్టుబడి అవసరంలేకపోతే.. దీర్ఘకాలం కొనసాగడం మేలు. మిగులు సొమ్ముంటే.. మరిన్ని పెట్టుబడులు చేపట్డం దీర్ఘకాలంలో ప్రయోజనాన్నికలిగిస్తుంది. నాణ్యత ప్రధానం స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రధానంగా నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం కీలకంగా నిలుస్తుంది. పటిష్ట ఫండమెంటల్స్, బలమైన యాజమాన్యం, బిజినెస్‌లకున్న అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలన్స్‌షీట్, క్యాష్‌ఫ్లో వంటి అంశాలు కంపెనీ ఫండమెంటల్స్‌ను వెల్లడిస్తాయి. సంక్షోభ సమయాల్లోనూ నిలదొక్కుకోగల వ్యూహాలు, ప్రోడక్టులకున్న డిమాండ్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. డైవర్సిఫికేషన్ నిజానికి 2008 జూన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ సెప్టెంబర్‌కల్లా ప్రభావం మరింత కనిపించడం ప్రారంభమైంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాళా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లకు షాకిచ్చింది. అప్పట్లో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకే అధిక శాతం కేటాయింపులు చేపట్టిన ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. సాధారణంగా భవిష్యత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోగల, ఆయా విభాగాల్లో మంచి మార్కెట్ వాటా కలిగిన రంగాలు, కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, వినియోగం, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఇన్వెస్టర్లకు కొంతమేర రక్షణాత్మక రంగాలుగా భావించవచ్చు. పరిస్థితులు వేరు దశాబ్ద కాలం క్రితం ఫైనాన్షియల్ అంశాలు సంక్షోభానికి కారణం కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థికపరంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు నీరసిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల మద్దతుతో వచ్చే ఏడాదికల్లా ప్రపంచ జీడీపీ పుంజుకునే వీలుంది. అదీకాకుండా కోవిడ్-19కు వ్యాక్సిన్ వెలువడితే.. మార్కెట్లు మరింత వేగమందుకోవచ్చు. -
స్టాక్స్‌లో పెట్టుబడులకు పంచ సూత్రాలు
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అనేవి ఎల్లప్పుడూ అధిక రిస్క్‌తో కూడుకున్నవే అంటున్నారు యాంబిట్ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ మనీష్ జైన్. ఒక ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్లకు సంబంధించి వ్యక్తిగత పెట్టుబడుల కోసం ఆరు విలువైన సూత్రాలను అమలు చేయమంటూ సూచిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో క్రమశిక్షణ చూపగలిగితే.. విజయవంతంకావడం అంత కష్టమేమీకాదని చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లు, పెట్టుబడి విధానాలు, కంపెనీల ఎంపిక వంటి అంశాలపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఎమోషన్స్‌కు నో ప్రపంచ దేశాలతో పోలిస్తే.. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లకు ఆదరణ తక్కువే. సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రిస్కులు తగ్గించుకంటూ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణను పాటించవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా సొంతంగా పటిష్ట పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు ప్రయత్నించవచ్చు. మార్కెట్ల కదలికలు, స్వల్పకాలిక లాభాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకు సాగవలసి ఉంటుంది. అత్యాశ, భయాలను పక్కనపెట్టడం ద్వారా ఇందుకు సక్రమ రీతిలో ఉపక్రమించాలి. బిజినెస్‌లో భాగస్వామి ఏదైనా ఒక కంపెనీ షేరుకి కాకుండా బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు యోచించాలి. అంటే ఒక కంపెనీలో వాటా కొనుగోలు చేస్తున్నట్లుకాకుండా.. బిజినెస్‌లో భాగస్వామి అవుతున్నట్లు భావించాలి. ఇందుకు అనుగుణమైన బిజినెస్ నిర్వహిస్తున్న కంపెనీని ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా మార్కెట్లో ఈ బిజినెస్‌కున్న అవకాశలు, ప్రొడక్టులకు గల డిమాండ్ వంటి అంశాలను ఆరా తీయడం మేలు. కంపెనీ బిజినెస్ చేస్తున్న పరిశ్రమ తీరుతెన్నులను అంచనా వేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. సవాళ్లు ఎదురైనప్పుడు కంపెనీ నిలదొక్కుకునే అవకాశాలపైనా అవగాహన అవసరం. యాజమాన్యం ఎంపిక చేసుకున్న కంపెనీని నిర్వహిస్తున్న యాజమాన్య నిబద్ధతను పరిశీలించండి. పారదర్శక కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్ కలిగిన కంపెనీలకు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ప్రత్యర్థి కంపెనీలతో పోటీ, యాజమాన్య వ్యూహాలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధిక మార్కెట్ వాటా కలిగి ఉండటంతోపాటు.. పోటీలో ముందుండే కంపెనీలు సమస్యల్లోనూ నిలదొక్కుకోగలుగుతాయి. దీర్ఘకాలానికి సాధారణంగా స్టాక్ మార్కెట్లలో సంపద సృష్టి దీర్ఘకాలంలోనే జరుగుతుంటుంది. ఎంపిక చేసుకున్న కంపెనీలు లేదా బిజినెస్‌లలో దీర్ఘకాలం కొనసాగేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఈక్విటీ మార్కెట్ల ద్వారా లభించే పూర్తి రిటర్నులను అందుకునేందుకు వీలుంటుంది. సాధారణంగా ఒక బిజినెస్‌లో భాగస్వామికావడం అంటే దీర్ఘకాలిక దృష్టితోనే ముందుకు వెళతాంకదా? అయితే స్వల్ప కాలిక లాభాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలాంటి సమయాల్లో క్రమశిక్షణగా మెలగవలసి ఉంటుంది. మార్కెట్లు లేదా షేరు కదలికలపై దృష్టి పెట్టకుండా సరైన ఫండమెంటల్స్ కలిగిన కంపెనీలకే కట్టుబడి ఇన్వెస్ట్ చేయడం మేలు. లక్ష్యం ముఖ్యం రిటర్నులపై ఆశలతో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఒక పర్పస్(లక్ష్యం) కోసం ఇన్వెస్ట్ చేయండి. పటిష్ట కంపెనీలలో పెట్టుబడి చేస్తే దీర్ఘకాలంలో రాబడులు అందుతాయి. అయితే రిటర్నులు అనేది ప్రధానంకాదు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కీలకం. ఇన్వెస్ట్మెంట్ ద్వారా గోల్‌ను సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు లిక్విడిటీ అవసరమున్న వ్యక్తి ఇల్లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మెరుగైన రిటర్నులకు వీలున్నప్పటికీ లక్ష్య సాధనలో ఉపయోగపడకపోవచ్చు. -
చైనాకు మరో ముప్పు తప్పదా..!
బీజింగ్: ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న మహ్మమారి కరోనా వైరస్‌ను నియంత్రించడంలో చైనా కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి చైనాలో మరోసారి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని చైనాలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జాంగ్ నాన్షాన్ వెల్లడించారు. 2003 లో చైనాలో సార్స్‌ను ఎదుర్కోవటంలో జాంగ్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను చైనాలో 'సార్స్ హీరో' అని పిలుస్తారు. ప్రస్తుతం కరోనా నివారణలో కూడా ఆయన కీలకంగా వ్యవహారిస్తున్నారు. చదవండి: ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది. అయితే కరోనా వైరస్ పుట్టిన చైనా మాత్రం తగ్గుముఖం పట్టిందని లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. కానీ గత కొన్ని రోజులుగా పరిస్థితి తారుమారై కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. దీంతో వైరస్‌ను కట్టడి చేశామని చెప్పుకుంటున్న చైనా ప్రభుత్వానికి అసలు ప్రమాదం రాబోయే రోజుల్లో ఎదురుకానుందని డాక్టర్ జాంగ్ హెచ్చరించారు. చదవండి: 'మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదు' చైనీయులకు రోగనిరోధకత శక్తి తక్కువని ఇది భవిష్యత్‌లో అతి పెద్ద సమస్యగా మారనుందని ఆయన పేర్కొన్నారు. విదేశాలతో పోలిస్తే చైనానే ఎక్కువగా కరోనా కారణంగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కరోనాను అదుపు చేశామన్న భావనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: లాక్డౌన్ 4.0 : వాటిపై నిషేధం కొనసాగింపు -
లాక్డౌన్ ఎత్తివేస్తే భారీ మూల్యం తప్పదు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో కరోనా పీడ విరగడవుతుందా? వైరస్ విరుగుడుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమా? దేశంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ గడువు ముగిశాక మళ్లీ పొడిగించాలా? ఇలా ఎంతకాలం పొడిగించాలి? దీనికి అంతు ఉంటుందా? అసలు దీనికి సరైన పరిష్కారం ఏమిటి? ఈ అంశాలపై దేశంలోని ప్రముఖ అంటురోగాల వైద్య నిపుణులు, ప్రభుత్వ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మే 3తో లాక్డౌన్ ముగియనుండగా రాష్ట్రంలో మే 7తో ముగియనుంది. శనివారంతో 35 రోజుల లాక్డౌన్ గడిచిపోయింది. అయినా దేశంలో, రాష్ట్రంలో రోజువారీగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. లాక్డౌన్ వల్లే పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. వైరస్ నియంత్రణకు ప్రస్తుత వ్యూహాన్నే మున్ముందూ యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే లాక్డౌన్ పొడిగింపు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభానికి రెండేళ్ల ముందు నుంచే దేశం లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. కరోనా దెబ్బకు సమీప భవిష్యత్తులో కోలుకోలేనంతగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంగి పోయింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చితే గతంలో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సైతం లాక్‌డౌన్‌తో కుదేలైంది. ముగింపు పలకాలి.. అంటురోగాల వైద్య నిపుణులు లాక్‌డౌన్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ జయప్రశాశ్ ములియాల్, టి. జాకబ్‌జాన్ వంటి సీనియర్ అంటురోగాల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్ విధింపు ఎలుకను పట్టేందుకు ఇంటిని తగలబెట్టుకోవడం లాంటిదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో కుష్టు వ్యాధి, పోలియో నిర్మూలనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ జయప్రకాశ్ ములియాల్, డాక్టర్ టి. జాకబ్‌జాన్ లాక్డౌన్ అంశంపై ఏమన్నారంటే... ► లాక్‌డౌన్‌తో కరోనా వైరస్ పీడ విరగదు. ► యువతను ప్రధానంగా 25 నుంచి 40 ఏళ్ల వయస్కులను పనికి పంపించాలి. వస్తు, సేవల ఉత్పత్తి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన రంగాల్లో దేశం మళ్లీ క్రియాశీలకంగా మారాలి. ► యువతలో చాలా మంది వైరస్ బారినపడి అస్వస్థతకు గురైనా చికిత్స తర్వాత కోలుకుంటారు. మరణాల రేటు కూడా తగ్గిపోతుంది. ఇలా జనాభాలో 60% మందికి వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినట్లే. ► వయోవృద్ధులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలి. మూడు నెలలు సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచాలి. ► వ్యక్తుల మధ్య కనీస భౌతిక దూరం పాటించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. చదవండి: కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్ ఒకేసారి ఎత్తేస్తే భారీ మూల్యం తప్పదు: ప్రభుత్వ వైద్యులు హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకొని ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి దేశ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, ఇందుకు మన వైద్య సదుపాయాలు సరిపోవని ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని సూచిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సైతం దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించింది. లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేం... లాక్డౌన్ అమలు వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యంకాదని దీని నియంత్రణకు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కీలక కమిటీలోని సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘చెక్‌పోస్టుల వద్ద స్మగ్లింగ్ గూడ్స్‌ను ఆపేసినట్లుగా దీన్ని నిలువరించడం సాధ్యం కాదు. వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏ వైరస్ అయినా వ్యాప్తి చెందుతుంది. ఐదారేళ్ల క్రితం స్వైన్‌ఫ్లూ రాష్ట్రాన్ని వణికించింది. అయితే దానికి కరోనాలాగా వేగంగా వ్యాప్తి చెందే గుణం లేదు. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ దాదాపు అందరిలోనూ ప్రవేశించింది. దీన్ని తట్టుకొనేందుకు ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే కరోనాకు కూడా మనం ఇప్పుడు అలవాటు పడాల్సి ఉంటుంది. వైరస్ విస్త్రృతంగా, వేగంగా జనంపై దాడి చేయకుండా లాక్డౌన్, కంటైన్మెంట్లను పెట్టారు. ఇలాగే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే అది మున్ముందు ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలి. ముందుగా 20–45 ఏళ్లలోపు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని యువకులను పనుల్లోకి పంపాలి. ఆఫీసులకు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు యువకులను వెళ్లనివ్వాలి. వారు తప్పకుండా వైరస్‌కు ఎక్స్పోజ్ కావాలి. వారికి పెద్దగా ముప్పు లేదని అంతర్జాతీయ నివేదికలే చెబుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా స్వైన్‌ఫ్లూ వైరస్‌కు అలవాటు పడినట్లే కరోనాకు అలవాటు పడగలం. లేకుంటే వచ్చే శీతాకాలంలో అది విజృంభించే అవకాశముంది. యువకులు కరోనాకు ముందుగా ఎక్స్పోజ్ అయితే మెల్లమెల్లగా ఇతరులూ దానికి ఎక్స్పోజ్ అవుతారు. తద్వారా సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వినోదం, సినిమాలు, క్రీడలు, మాల్స్ వంటి గుంపులుగా ఉండే ప్రాంతాలను ఇప్పుడే తెరవకూడదు. అలాగే ఆఫీసులకు అందరినీ ఒకేసారి కాకుండా వయసు, అవసరాల మేరకు షిఫ్టుల ప్రకారం వదిలిపెట్టాలి’అని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే శని, ఆదివారాలు పూర్తిగా లాక్డౌన్ అమలు చేయాలని వైద్య శాఖకు చెందిన మరో సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. దశలవారీగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని రాష్ట్రంలోని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: జేబులో డబ్బులున్నా తిండికి తిప్పలు -
కరోనా కొనసాగితే కష్టమే..
కరోనా మహమ్మారి మనిషికి పరిచయమై 4 నెలలు కూడా కాలేదుగానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలను బలితీసేసుకుంది. ఇంక కొన్ని రోజుల్లోనే అంతా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం నిలిచిపోయినా అది ఒక్కసారిగా జరగదని దశలవారీగా అప్పుడప్పుడూ మళ్లీ విరుచుకుపడటం తప్పదని ఎపిడమాలజిస్టుల అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే అమెరికా వంటి దేశాల్లో ఆగస్టుకల్లా సమస్య సమసిపోతుందని అంచనా. అయితే ఇలా కాకుండా వచ్చే ఏడాది వరకూ కొనసాగితే మాత్రం విపరీత పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఆహారం, వినోదం, ఆరోగ్య సేవల వంటి వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. వినోదం విషయానికి వస్తే ఇప్పటికే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. కాబట్టి కొత్త సినిమాలు ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలావరకూ ఆన్లైన్లో నేరుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. షూటింగ్‌లు జరగకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు. మరోవైపు కరోనా దీర్ఘకాలం కొనసాగితే దేశాల అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే రూ. లక్షల కోట్లు ఖర్చు చేసింది. టెస్టింగ్, చికిత్సల కోసం భారత్ కూడా భారీగా ఖర్చు పెడుతోంది. పాఠశాలలు ఏడాదిన్నరపాటు పనిచేయకపోతే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. హైస్కూల్ స్థాయి పరీక్షలు జరగకపోతే పై తరగతులకు అంటే కాలేజీలకు అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఆన్లైన్లో తరగతుల నిర్వహణ సాధారణమైపోతుంది. హోటళ్లు, బార్లు, నైట్‌క్లబ్‌లు, జిమ్‌లు, సినిమా, ఆర్ట్ గ్యాలరీలు, షాపింగ్ మాల్స్, మ్యూజియంలు, సంగీత కళాకారులు, క్రీడాకారులు, సదస్సు నిర్వాహకులు తీవ్రంగా దెబ్బతింటారని అంచనా. ఇదే సమయంలో విమాన ప్రయాణాలు తగ్గుతాయి. కరోనా కారణంగా మరణాలు కూడా ఊహించనంత పెరిగిపోతాయనడంలో సందేహం లేదు! -
‘డిజిటల్ డిటాక్స్’కు సమయమిదే
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో మనమంతా కొన్ని అలవాట్లకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రోజువారీ జీవన విధానంలో భాగమైన డిజిటల్ సాధనాలకు బానిసలుగా మారిన మనం.. దాన్ని దూరం చేసుకునేందుకు వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ (ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్ణీత సమయంపాటు వాడకుండా ఉండటం) వల్ల మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు ఇతర అంశాలపై మనం దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. డిజిటల్ విరామాలతో మేలు... లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా అధిక శాతం మంది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేదా టీవీలకు అతుక్కుపోయి కనిపిస్తున్నారు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా వాటిని వినోద సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ సాధనాలను ఎక్కువ గంటలు వాడరాదని సూచిస్తున్నారు. డిజిటల్ సాధనాలను అవసరం ఉన్నంత వరకే ఉపయోగించుకునేలా ప్రతిఒక్కరూ అలవాటు పడేందుకు ప్రస్తుత లాక్డౌన్, కరోనా వ్యాప్తి పరిణామాలు దోహదపడతాయని అంటున్నారు. ‘ఈ లాక్డౌన్ రోజుల సందర్భంగా డిజిటల్ ప్రపంచం నుంచి ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి. ముఖ్యంగా రోజంతా మొబైల్స్‌కు అతుక్కుపోవద్దు. పుస్తక పఠనం ద్వారా సమయాన్ని పరిజ్ఞానం పెంచుకునేందుకు ఉపయోగించాలి. కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవాలి’అని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, యాలైడ్ సైన్సెస్ డైరెక్టర్ డా. నిమేష్ జి. దేశాయ్ తన అధ్యయనంలో వెల్లడించారు. గతంతో పోలిస్తే లాక్డౌన్ సందర్భంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలు రెండింతలకు పైగా సమాయాన్ని గడుపుతున్నట్లు ‘హ్యామర్ కోఫ్ కన్జూమర్ సర్వే’అధ్యయనంలో వెల్లడైంది. ఈ డిజిటల్ సాధనాలన్నింటిలోనూ అత్యధికంగా వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్ల నుంచి ‘డీ అడిక్షన్’మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడటం, అది లేకుండా ఉండలేమన్నంతగా మారిపోవడాన్ని ‘రోగంగా’పరిగణించకపోయినా, దానితో వెళ్లబుచ్చే సమయాన్ని మాత్రం గణనీయంగా తగ్గించాలని సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్లతో మనకు విడదీయరాని బంధం ఏర్పడినందున దాని ఉపయోగాలు, అవసరాల దృష్ట్యా వాటికి పూర్తిగా దూరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడటంతో కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనలు ఇవీ... ► వారంలో ఒకరోజు స్మార్ట్ఫోన్లు లేకుండా గడపాలి. అది ఏ రోజన్నది ఎవరికి వారే ఎంచుకోవచ్చు. ► మొబైల్స్‌తో ‘ఫిజికల్ డిస్టెన్స్’పాటించాలి. ► బయటకు వెళ్లినప్పుడు ముఖ్యంగా వాకింగ్‌కు వెళ్తే ఫోన్ తీసుకెళ్లకూడదు. ► ప్రతిరోజూ కొంత సమయం మొబైల్స్ తాకకుండా ఉండాలి. ► భోజనాలు చేసేటప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు. ► సెల్‌ఫోన్‌ను బెడ్రూంలోకి తీసుకెళ్లకూడదు. ► ఫోన్‌ను చూసే, వాడే సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. ► పుస్తకాలు, పత్రికల పఠనం అలవాటు చేసుకోవాలి. ► ఫోన్లో నోటిఫికేషన్ బటన్‌ను ఆఫ్ చేసి ముఖ్యమైన వాటికే పరిమితం కావాలి. -
రాజ్యాంగం ప్రకారమే..
సాక్షి, అమరావతి: హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా, పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారమే పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం శాసనసభ రూపొందించిన చట్టం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయించాలని, ఆ మేరకే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యవహరించారని పేర్కొంటున్నారు. అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే.. రాష్ట్రంలో మద్యం, ధన ప్రభావమన్నది లేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం ముగియడంతో రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా గవర్నర్ నియమించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని అధికరణ 243(కే), ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200 ఉల్లంఘించారంటూ కొందరు చేస్తున్న వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. గవర్నర్ నిర్ణయమే ఫైనల్.. ► శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారని రాజ్యాంగంలోని అధికరణ 243(కే) చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి స్థ్దాయితో పరిగణించాలి. ఇతర కారణాల వల్ల తప్ప ఆయన్ను విధుల నుంచి తొలగించకూడదు. ఒకవేళ తొలగించాల్సి వస్తే హైకోర్టు జడ్జి తొలగింపునకు అనుసరించే పద్ధతిని అమలు చేయాలి. నిరూపితమైన దుర్వినియోగం, అసమర్థత కారణాలను చూపుతూ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాక రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించవచ్చు. ► స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారమే గవర్నర్ ఆమోదించారంటూ న్యాయనిపుణులు తేల్చి చెబుతున్నారు. నిమ్మగడ్డది పదవీ విరమణే.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రమేష్‌కుమార్ పదవీలో కొనసాగడానికి అర్హత కోల్పోయారు. ► 2016 ఏప్రిల్ 1న ఐదేళ్ల పదవీ కాలానికి నియమితులైన రమేష్ కుమార్ తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఈనెల 10 నుంచే పదవిలో కొనసాగే అవకాశం లేదు. అంటే ఆయన పదవీ విరమణ చేసినట్లు స్పష్టమవుతోంది. ► ఈ ప్రక్రియ అత్యంత స్పష్టంగా, పారదర్శకంగా జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 తాజా సవరణ ప్రకారం పదవీ కాలాన్ని మూడేళ్లకే కుదించడం వల్ల రమేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించారన్న ప్రశ్నే తలెత్తదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. యూపీ హైకోర్టు తీర్పే తార్కాణం.. – పదవీ కాలంపై గవర్నర్దే తుది నిర్ణయం ఉత్తరప్రదేశ్ శాసనసభ 2007లో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలానికి సంబంధించి మార్పులు చేసింది. అయితే ఆ మార్పులు చెల్లవంటూ నాడు యూపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అపర్మితా ప్రసాద్‌సింగ్ అలహాబాద్ హైకోర్టు(లక్నో బెంచ్)ను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై(డబ్ల్యూపీ 3457)పై విచారించిన న్యాయస్థానం 2007 ఆగస్టు 23న కీలక తీర్పు ఇచ్చింది. ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం సర్వీసు నిబంధనలకు సంబంధించినది కాదు. అధికరణ 243(కే) కేవలం సర్వీసు నిబంధనలకు మాత్రమే వర్తిస్తుంది. పదవీ కాలానికి సంబంధించిన మార్పు విషయంలో కాదు. సర్వీసు నిబంధనలు, పదవీ కాలం నిర్ణయంలో గవర్నర్దే అంతిమ అధికారం. పదవీ కాలంలో మార్పులు చేస్తూ చేసిన చట్టం వల్ల అనర్హత ఎదురైనప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వయంచాలక పదవీ విరమణ పొందుతారు’ అని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే – అవిభాజ్య ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య ‘‘ఎన్నికల కమిషనర్ కాల పరిమితి, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ఈ అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రకారమే ఎన్నికల కమిషనర్ కాల పరిమితిని, సర్వీసు నిబంధనలను సవరించింది. కరోనా వైరస్ వల్ల శాసనసభను హాజరుపరిచే పరిస్థితులు లేవు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో ఎంత మాత్రం తప్పులేదు. ఇక్కడ చూడాల్సింది ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేసిందా లేదా అన్నదే తప్ప నిమ్మగడ్డ రమేశ్ విషయంలోనా, మరొకరి విషయంలోనా అన్నది కాదు. ఇక రెండో విషయం ఏమిటంటే... ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన జస్టిస్ కనగరాజ్ న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని చదవకుండా, పంచాయతీరాజ్ చట్టాన్ని చూడకుండానే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారా? ప్రభుత్వం ప్రతిదీ చట్ట ప్రకారమే చేసింది కాబట్టి ఆయన సంతృప్తి చెందారు. అందుకే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. అధికరణ 243కే చదివితే కమిషనర్ కాల పరిమితి వేరు, సర్వీసు నిబంధనలు వేరన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై అసలు చర్చే అవసరం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు’’ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.. – చిత్తవరపు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించలేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ద్వారా చట్ట సవరణ చేసింది. కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటికే రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా మూడేళ్లు పూర్తి చేశారు. దీంతో చట్ట ప్రకారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. దీని ప్రకారం రమేశ్‌కుమార్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రిటైర్డ్ జడ్జిని కమిషనర్‌గా నియమించింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏముంది? టీడీపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందో అర్థం కావడం లేదు. చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు అంతే బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదు’’ ఆదర్శ వ్యవస్థ కోసమే ఆర్డినెన్స్ – నిమ్మగడ్డ నిష్క్రమణ అందులో భాగమే – ఎన్నికల ప్రకియలో న్యాయకోవిదుడి నియామకం వ్యవస్థకు మేలు చేస్తుంది – ఇది ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో ఒక ఆదర్శప్రాయమైన వ్యవస్థ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, అది అమలు చేయడంలో భాగంగానే నిమ్మగడ్డ నిష్క్రమణ జరిగిందని, అంతేతప్ప ఆయన్ను తొలగించలేదని న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓ దళితుడిని, న్యాయ కోవిదుడిని నియమించడం వ్యవస్థకు మేలు చేస్తుందని, సామాజికంగానూ ఎంతో ఉపకరిస్తుందని, దేశానికి ఇది అనుసరణీయమని పేర్కొంటున్నారు. న్యాయమూర్తిగా పనిచేసిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. ఇక ఇలాంటి ఆర్డినెన్స్‌లు గతంలోనూ వచ్చాయని, ఇవేమీ కొత్త కాదని స్పష్టం చేస్తున్నారు. 1993లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) హోదాలో టి.ఎన్ శేషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడం, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ శేషన్ నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని న్యాయస్థానం సమర్ధించడం గమనార్హం. -
ఎన్నికల ర్యాలీ షురూ..!
ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వమే మరొక్కసారి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 37,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,150 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో స్టాక్ సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 37,054 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 11,168 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది స్టాక్ సూచీలకు ఇవే గరిష్ట స్థాయిలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇది ముందస్తు ఎన్నికల ర్యాలీ అని విశ్లేషకులంటున్నారు. విద్యుత్తు, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ, లోహ, బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 435 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్ ర్యాలీ జరపడం రివాజు. ఒక్క 2009 మినహా అన్ని సందర్భాల్లోనూ స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అదే తీరు సోమవారం కూడా కొనసాగింది. 17వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ఆదివారం వెల్లడించింది. ఆసియా మార్కెట్ల సానుకూలతల నేపథ్యలో సోమవారం సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాల జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్435 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు మేర లాభపడ్డాయి. గత రెండు వారాలుగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు పెరుగుతున్నాయని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథమ్ తునుగుంట్ల వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నాటకీయంగా తిరిగివచ్చిందని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు... ►31 సెన్సెక్స్ షేర్లలో ఐదు మాత్రమే అదిన్నూ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్‌లు మినహా మిగిలిన 26 షేర్లు లాభపడ్డాయి. ►నిఫ్టీ 50 షేర్లలో ఎనిమిది మాత్రమే నష్టపోగా, మిగిలిన 42 షేర్లు పెరిగాయి. ► ఎయిర్టెల్ 8.08% లాభంతో రూ.338 వద్ద ము గిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత రెండు ట్రేడింగ్ సెషన్లలో పతనమైన డీహెచ్ఎఫ్ఎల్ షేర్ సోమవారం కూడా నష్టపోయింది. 5% నష్టంతో రూ.133 వద్దకు చేరింది. ఈ కంపెనీ వివిధ డెట్ సాధనాల రేటింగ్‌ను బ్రిక్వర్క్రేటింగ్స్ సంస్థ డౌన్ గ్రేడ్ చేయడమే దీనికి కారణం. ►ఎలాంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘన జరగలేదంటూ వివరణ ఇవ్వడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్ 10 శాతం ఎగసి రూ.1,033 వద్ద ముగిసింది. ► ఈ నెల 15న జరిగే బోర్డ్సమావేశంలో షేర్ల బైబ్యాక్‌పై చర్చించనుండటంతో ఆర్తి డ్రగ్స్ షేర్ తాజా ఏడాది గరిష్ట స్థాయి, 705 ని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. చివరకు 0.5 శాతం నష్టంతో రూ.666 వద్ద ముగిసింది. ►శుక్రవారమే స్టాక్ మార్కెట్లో లిస్టైన అరవింద్ ఫ్యాషన్స్ షేర్ రెండో రోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.652 వద్ద ముగిసింది. ►యాక్సిస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.744ను తాకింది. చివరకు 0.25% లాభంతో రూ. 734 వద్ద ముగిసింది. బజాజ్ హోల్డింగ్స్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. లాభాలు ఎందుకంటే... ►ఎన్నికల ర్యాలీ: ఇటీవల బాల్కోటలో జరిగిన మెరుపుదాడి కారణంగా ఎన్డీఏ విజయావకాశాలు మరింతగా మెరుగుపడ్డాయనే అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే పెద్ద, మధ్య, చిన్న అన్ని స్థాయి కంపెనీల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయని నిపుణులంటున్నారు. ► విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు: భారత్–పాక్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం, వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు లిక్విడిటీ అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి 5 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,741 కోట్లు పెట్టుబడులు పెట్టారు. సోమవారం ఒక్కరోజే రూ.3,810 కోట్లు ఇన్వెస్ట్‌చేశారు. ►పుంజుకున్న రూపాయి: డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 25 పైసలు పుంజుకొని 69.89ను తాకింది. గత వారం రూపాయి 78 పైసలు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా వస్తుండటంతో రూపాయి బలపడుతోంది. ► ప్రపంచ మార్కెట్ల జోరు: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి చైనా ప్రభుత్వం విధానాల తోడ్పాటునందించగలదన్న ఆశలతో చైనా మార్కెట్ లాభపడింది. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఈ ప్రభావంతో యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. ఇదంతా మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. షాంఘై సూచీ 2 శాతం, జపాన్ నికాయ్ 0.4 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 1 శాతం చొప్పున పెరిగాయి. ► లక్ష్యానికనుగుణంగానే ద్రవ్యలోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.4 శాతం ద్రవ్యలోటు సాధించాలన్న లక్ష్యం నెరవేరుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. పరోక్ష పన్ను వసూళ్లు తగ్గినా, ద్రవ్యలోటు లక్ష్యం సాధిస్తామని ప్రభుత్వ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ►బాండ్లలో ఎఫ్‌పీఐల పరిమితి పెంపు: కార్పొరేట్ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితిని ఆర్బీఐ పెంచడం సానుకూల ప్రభావం చూపించింది. రూ.2.27 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద బాగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ గత శుక్రవారం రూ.1,44,67,088 కోట్లుగా ఉంది. ఈ మార్కెట్ క్యాప్ సోమవారం రూ.2.27 లక్షల కోట్లు పెరిగి రూ.1,46,94,699 కోట్లకు ఎగసింది. -
లేడీస్ స్పెషల్ ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని బస్టాప్‌లలో ప్రయాణికులు తమ గమ్యం చేర్చే సిటీ బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూస్తుంటారు.. అది ఎప్పుడు వస్తుందో ఎవరన్నా చెప్పగలరా..? వచ్చిన బస్సు బస్‌బేలో ఆగాలి.. అలా ఎప్పుడన్నా, ఎక్కడన్నా జరిగిందా? వస్తే బస్సులన్నీ ఒకేసారి వరుసకడతాయి.. లేదంటే ఒక్కటీ కనిపించదు. ఆలాంటప్పుడు విసిగిపోయిన ప్రయాణికులు ఏ ఆటోనో.. మరో ప్రవేట్ వాహనాన్నో నమ్ముకుంటారు. ఇది ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియందికాదు. ప్రయాణికుల నమ్మకం సంపాదించలేని సంస్థకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా వారు పట్టించుకోరు. ఎందుకంటే సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా వారికి ప్రతినెలా జీతాలు వస్తాయి గనుక. ఇదే అంశాన్ని నిపుణల కమిటీ తేల్చి చెప్పింది. ప్రయాణికులకు నమ్మకమైన, సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పించినప్పుడే గ్రేటర్ ఆర్టీసీలో నష్టాలు తగుతాయని కమిటీ చెప్పింది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల రవాణా సదుపాయాలను విస్తృతం చేయాలని సూచించింది. అన్ని సమయాల్లోనూ తమ కోసం సిటీ బస్సు అందుబాటులో ఉందన్న భరోసాను కల్పించాలంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సులు సైతం మహిళా ప్రయాణికులకు అనుకూలమైన సేవలను అందజేయాలని చెప్పింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు, సరైన దిశానిర్దేశానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ప్రతినిధులు అన్ని రంగాల్లో ఆర్టీసీపై సమగ్రమైన అధ్యయనం చేశారు. కొద్ది రోజుల క్రితం బస్‌భవన్‌లో జరిగిన సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ నష్టాలపై కమిటీ దృష్టి సారించింది. ఆర్టీసీ స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను పెంపొందించడంతో పాటు, మెజారిటీ ప్రయాణికులైన మహిళల రవాణా సదుపాయాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను విస్తరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికి అరకొర సర్వీసులే.. గ్రేటర్ సిటీ బస్సుల్లో ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే. సొంత వాహనాల్లో ప్రయాణించేవారి సంఖ్య తక్కువే. మరోవైపు ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక వాటినికి వినియోగించుకొనే మహిళల సంఖ్య పెరిగింది. నమ్మకమైన, కచ్చితమైన సర్వీసులు క్యాబ్‌ల నుంచి లభించడమే ఇందుకు కారణమని కమిటీ అభిప్రాయపడింది. క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సుల్లో కూడా మహిళలకు ప్రత్యేక సేవలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 59 ‘లేడీస్ స్పెషల్’ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ బస్సులు సైతం కేవలం ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో తిప్పుతున్నారు. ఈసీఐఎల్, సికింద్రాబాద్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కుషాయిగూడ, మిధాని, అల్వాల్, కూకట్పల్లి, తదితర ప్రాంతాల నుంచి సెక్రటేరియట్, నాంపల్లి, గాంధీభవన్, లక్డీకాపూల్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం7 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీటిని నడుపుతున్నారు. అలా కాకుండా అన్ని వేళల్లో, అన్ని ప్రధాన రూట్లలో లేడీస్ స్పెషల్స్‌ను పెంచాలి. తమ కోసం ప్రత్యేక బస్సులు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించాలి. పైగా ఈ బస్సుల్లో భద్రతా సదుపాయాలు ఉండాలని నిపుణులు సూచించారు. టిక్కెట్టేతర ఆదాయం పెంచాలి ఆర్టీసీ సొంత స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను అభివృద్ధి చేయడం ద్వారా టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ప్రధానంగా చర్చించింది. ప్రస్తుతం కోఠి, చార్మినార్, హయత్‌నగర్, ఈసీఐఎల్, కూకట్పల్లి, కాచిగూడలో ప్రయాణికుల ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కూకట్పల్లి, ఈసీఐఎల్, హయత్‌నగర్ వంటి కొన్ని బస్స్టేషన్లలో ఆశించిన ఆదరణ లభించకపోవడం వల్ల కాంప్లెక్సులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు జూబ్లీ, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్‌లో ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను పెంచాలని, మినీ థియేటర్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ మొదటి నుంచి భావిస్తోంది. కానీ వ్యాపార వర్గాల నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోవడంతో ఇప్పటి దాకా కమర్షియల్ కార్యకలాపాలు మొదలు కాలేదు. నిపుణులు కమిటీ సైతం ఇటీవల ఇదే అంశంపై చర్చించింది. టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ స్థలాలపై అధ్యయనం చేపట్టింది. గ్రేటర్లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వాటిలో కనీసం 10 డిపోల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందవచ్చునని సూచించింది. ‘గ్రేటర్ ఆర్టీసీ ప్రస్తుతం రూ.430 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను అధిగమించేందుకు నిపుణుల కమిటీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. లోతుగా అధ్యయనం చేస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలతోనే..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఈ వారం భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల కూటమి...గత శనివారం తెల్లవారుజామున సిరియాపై దాడులు జరిపిన ప్రభావం సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై పడుతుందని, ఈ పరిణామంతో భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగాయని వారన్నారు. అమెరికా, చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధం చల్లబడిన ప్రభావంతో గత వారం మార్కెట్ సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడిందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ డైరెక్టర్ అనితా గాంధీ అన్నారు. అయితే క్రూడ్ ధర ఒక్కసారిగా పెరగడంతో భారత్ మార్కెట్లో ఏర్పడిన ఆందోళన కొనసాగుతూనే వున్నదని గాంధీ చెప్పారు. మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలతో క్రూడ్ ధర పెరగడం, దేశీయ బాండ్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావడం మార్కెట్‌కు ఆందోళనకారకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే సూక్ష్మ ఆర్థిక గణాంకాలు ప్రస్తుతం సానుకూలంగా వున్నాయని, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు, పారిశ్రామికోత్పత్తి నిలకడగా వున్నట్లు తాజా గణాంకాలు వెలువడటం అనుకూలాంశమని ఆయన వివరించారు. మార్చి నెలకు టోకు ద్రవ్యోల్బణం డేటా సోమవారం 16న వెలువడుతుంది. అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ ఒడుదుడుకులకు లోనైనా, సానుకూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల ఫలితాలు బావుంటే...మార్కెట్ స్థిరపడుతుందని విశ్లేషకులు చెప్పారు. ఫలితాలపై కన్ను...: గత శుక్రవారం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్...మార్చి క్వార్టర్‌కు ఫలితాల్ని ప్రకటించడం ద్వారా సీజన్‌ను ప్రారంభించింది. ఆ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడైనందున..మార్కెట్ స్పందనతో ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 7.75% పతనమైంది. ఇక ఈ వారం మరో ఐటీ దిగ్గజం టీసీఎస్, బ్యాంకింగ్ కంపెనీలైన ఇండస్‌ఇండ్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఫలితాల్ని ప్రకటించనున్నాయి. బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, సిమెంట్ కంపెనీ ఏసీసీ, ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఫలితాలు సైతం ఈ వారమే వెల్లడవుతాయి. కార్పొరేట్ లాభాలు అర్థవంతంగా కోలుకుంటున్న సంకేతాలు కనపడితే... భారత్ మార్కెట్ క్రమేపీ రికవరీ అవుతుందని వినోద్ నాయర్ చెప్పారు. గత రెండేళ్లుగా మార్కెట్ పదేపదే కొత్త గరిష్టస్థాయిల్ని తాకినప్పటికీ, కార్పొరేట్ లాభాలు పెద్దగా వృద్ధిచెందలేదని, అయితే జీడీపీ వృద్ధి అంచనాల్ని మించడం, జీఎస్టీ ఇబ్బందులు క్రమేపీ తొలగడంతో కార్పొరేట్ లాభాలు పుంజుకుంటాయన్న ఆశాభావం కలుగుతున్నదని ఆయన వివరించారు. డెట్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3935 కోట్లు ప్రస్తుత నెల ప్రథమార్ధంలో దేశీయ డెట్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 3,935 కోట్ల మేర నికర పెట్టుబడులు చేశారు. పశ్చిమదేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం, క్రూడ్ ధరలు, ద్రవ్యలోటు పెరుగుదల కారణంగా రూపాయి బాగా క్షీణిస్తుందన్న అంచనాలతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎఫ్‌పీఐలు.. డెట్ మార్కెట్ నుంచి రూ. 12,750 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. అయితే రూపాయి స్థిరంగా వుండటం, బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా వుండటంతో డెట్ మార్కెట్లో తిరిగి పెట్టుబడులకు ఉపక్రమించారని విశ్లేషకులు తెలిపారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి మాత్రం ఈ నెల ప్రథమార్ధంలో రూ. 1,085 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
తల్లిదండ్రులకు పరీక్షలు..
రావికమతం(చోడవరం) : పదో తరగతి పరీక్షలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసే ఈ పరీక్షలపైనే అంతా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నపుడే విద్యార్థి బాగా పరీక్ష రాయగలడని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి పది పరీక్షలు మొదలు కానున్నాయి. మండల వ్యాప్తంగా 6 కేంద్రాలలో 1,085 మంది విద్యార్ధులు సన్నద్దంగా ఉన్నారు. అయితే సమయం ముంచుకొస్తున్న కొద్దీ విద్యార్థులు పుస్తకాలపైనే దృష్టంతా పెడుతున్నారు. ఇలాంటపుడే తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో వారి మాటల్లోనే... ♦ పిల్లలపై వత్తిడి లేకుండా వారిని ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు ప్రయత్నించాలి, పిల్లలు పరీక్షలు బాగా రాయగలిగేలా..రాయగలవంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోత్సహించాలి. ఈ విదమైన శాస్త్రీయ పేరెంటింగ్ విదానం వల్ల ఫలితాలు ఉంటాయి. ♦ పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల తపన, శ్రద్ధ అనురాగం వారి లక్ష్య సాధనకు దోహదపడాలి ♦ పరీక్షల సమయంలో ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలి. పరీక్షల్లో ఎపుడూ అడ్డదారులు ఉండవని, కష్టపడి చదివే వారి వెనుకే విజయం ఉంటుందనే ధీమా కలిగించాలి. ♦ జ్ఞాపక శక్తికి 6 నుంచి 7 గంటల నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకుంటే పరీక్ష హాల్లో విద్యార్థులకు ఆవలింతలతో పాటు బద్ధకం ఆవహిస్తుంది. రాత్రి పగలూ చదవకుండా తగిన నిద్ర ముఖ్యమని సూచించాలి. ♦ ఆహార నియమాలను పాటిస్తూ పోషకాహారం అందించాలి. పరీక్షల సమయంలో ఇంట్లోవారు సైతం టీవీ బంద్ చేయాలి. నీరు ఎక్కువగా తాగించాలి. ♦ పిల్లలకు సబ్జెక్టుల్లో వచ్యేచ సందేహాలను తపపక సంబంధిత ఉపాధ్యాయుని సంప్రదించి నివృత్తి చేస్తే మంచిది. ♦ ఏదేనీ పరీక్ష సరిగ్గా రాయకపోతే నిందించవద్దు, కించపర్చవద్దు అలా చేస్తే ఆత్మస్థైర్యం దెబ్బతిని మిగతా పరీక్షలపై పడవచ్చు. -
గౌహతి హైకోర్టు తీర్పుపై నిపుణులు ఏమంటున్నారు?
గౌహతి హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులు ఆసక్తిర వ్యాఖ్యలు చేస్తున్నారు. తీర్పు ప్రభావం చాలా విసృ్తతంగా ఉంటుందని, సీబీఐ ఏర్పాటు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ఆ సంస్థ నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయని చెబుతున్నారు. దేశాన్ని కుదిపేసిన కేసులను ఎన్నింటినో సీబీఐ దర్యాప్తు చేసిందని, వీటిల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయని, తాజా తీర్పుతో వాటన్నింటిపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. జైల్లో ఉన్నవారంతా బయటకు రావడానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఈ కేసులన్నీ నిలబడాలంటే గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం లేదా మొత్తంగా కొట్టివేయడంగానీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తీర్పును కొందరు న్యాయ నిపుణులు స్వాగతిస్తుండడగా.. మరికొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. మాజీ డెరైక్టర్లు ఏమన్నారు..? తీర్పు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనిపై కేంద్రం, సీబీఐ తక్షణమే దృష్టి సారించి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సుప్రీంకోర్టు సూచనల మేరకు వాటన్నింటిని సరిచేయాలి. -విజయ్ శంకర్, సీబీఐ మాజీ డెరైక్టర్ ఈ తీర్పు ప్రభావం ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఏమాత్రం ఉండబోదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం కింద సీబీఐ కేసులను దర్యాప్తు చేస్తోంది. డీఎస్‌పీఈకి చట్టబద్ధత ఉన్నందున సీబీఐ కేసుల్లో దర్యాప్తులు యథాతథంగా కొనసాగుతాయి. - సీబీఐ మాజీ డెరైక్టర్ పీసీ శర్మ నేను ఆనాడే చెప్పా నా అభిప్రాయం ప్రకారం సీబీఐ చట్టబద్ధ సంస్థ కాదు. బ్రిటిష్ కాలంలో ఓ చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. సీబీఐకి చట్టబద్ధత కల్పించాల్సిందిగా 2010లో పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించా. ఆమోదం దాకా రాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. తాజా తీర్పు నేపథ్యంలో అందరినీ సంప్రదించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. - మనీష్ తివారి, కేంద్ర సమాచార శాఖ మంత్రి