పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
రావికమతం(చోడవరం) : పదో తరగతి పరీక్షలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యార్థి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసే ఈ పరీక్షలపైనే అంతా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నపుడే విద్యార్థి బాగా పరీక్ష రాయగలడని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి పది పరీక్షలు మొదలు కానున్నాయి. మండల వ్యాప్తంగా 6 కేంద్రాలలో 1,085 మంది విద్యార్ధులు సన్నద్దంగా ఉన్నారు. అయితే సమయం ముంచుకొస్తున్న కొద్దీ విద్యార్థులు పుస్తకాలపైనే దృష్టంతా పెడుతున్నారు. ఇలాంటపుడే తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో వారి మాటల్లోనే...
♦ పిల్లలపై వత్తిడి లేకుండా వారిని ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు ప్రయత్నించాలి, పిల్లలు పరీక్షలు బాగా రాయగలిగేలా..రాయగలవంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోత్సహించాలి. ఈ విదమైన శాస్త్రీయ పేరెంటింగ్ విదానం వల్ల ఫలితాలు ఉంటాయి.
♦ పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల తపన, శ్రద్ధ అనురాగం వారి లక్ష్య సాధనకు దోహదపడాలి
♦ పరీక్షల సమయంలో ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలి. పరీక్షల్లో ఎపుడూ అడ్డదారులు ఉండవని, కష్టపడి చదివే వారి వెనుకే విజయం ఉంటుందనే ధీమా కలిగించాలి.
♦ జ్ఞాపక శక్తికి 6 నుంచి 7 గంటల నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకుంటే పరీక్ష హాల్‌లో విద్యార్థులకు ఆవలింతలతో పాటు బద్ధకం ఆవహిస్తుంది. రాత్రి పగలూ చదవకుండా తగిన నిద్ర ముఖ్యమని సూచించాలి.
♦ ఆహార నియమాలను పాటిస్తూ పోషకాహారం అందించాలి. పరీక్షల సమయంలో ఇంట్లోవారు సైతం టీవీ బంద్ చేయాలి. నీరు ఎక్కువగా తాగించాలి.
♦ పిల్లలకు సబ్జెక్టుల్లో వచ్యేచ సందేహాలను తపపక సంబంధిత ఉపాధ్యాయుని సంప్రదించి నివృత్తి చేస్తే మంచిది.
♦ ఏదేనీ పరీక్ష సరిగ్గా రాయకపోతే నిందించవద్దు, కించపర్చవద్దు అలా చేస్తే ఆత్మస్థైర్యం దెబ్బతిని మిగతా పరీక్షలపై పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment