గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కేవలం స్థిరాస్తి మీద ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలే మన ప్రస్తుత అంశం. æ చట్టంలోని నిర్వచనాల జోలికి వెళితే తికమ కగా ఉంటుంది. సెక్షన్ల ప్రస్తావన అంతే. సారాంశమే తెలుసుకుందాం.
æస్థిరాస్తి కొన్న తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అమ్మితే ఆ అమ్మకం, దీర్ఘకాలికమైనది అవుతుంది. రెండు సంవత్సరాల లోపల అమ్మితే అది స్వల్పకాలికం అని అర్థం. అలా వచ్చిన లాభాలను మీ మిగతా ఆదాయాలు.. అంటే జీతం, ఇంటి అద్దె, ఇతర ఆదాయాలు మొదలైన వాటితో కలిపి ఆ మొత్తాన్ని శ్లాబులవారీగా విభజించి, వర్తించే రేట్ల ప్రకారం ట్యాక్స్ లెక్కించాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 20 శాతం పన్ను విధిస్తారు. విద్యా సుంకం అదనంగా ఉంటుంది. ఈ వారం, మూలధన లాభాల నుండి పన్ను భారం లేకుండా బైటపడటం ఎలాగో తెలుసుకుందాం.
ఇల్లు అమ్మి, మరో ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు. ఈ మినహాయింపనేది వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకే వర్తిస్తుంది. ఇల్లు అంటే ఇల్లు అలాగే అనుబంధమైన స్థలం అని అర్థం. ఫ్లాటు, దానితో పాటు జాగాలో ఉండే అన్‌డివైడెడ్ వాటా. ఈ ఇంటిని ఇదివరకే ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులలో అసెస్‌మెంట్ చేయించాలి. అంటే డిక్లేర్ చేయాలి.
æ
ఇల్లు అమ్మిన వెంటనే మన దేశంలో వేరే .. అంటే కొత్త ఇల్లు నిర్మాణం మూడు సంవత్సరాల లోపల చేయాలి. అంటే గెయిన్స్ మొత్తం వెచ్చించాలి. ఖర్చు పెట్టాలి. ఇల్లు నిర్మాణం పూర్తితో నిమిత్తం లేదు. తగిన కాగితాలు ఉండాలి. లేదా అమ్మిన తేదీ నుండి వెనక్కి వెళ్తారు. ఒక సంవత్సరం వరకూ .. ఒక సంవత్సరం ముందు ఇన్వెస్ట్ చేసినా చాలు. రెండు సంవత్సరాల లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎంతో వెసులుబాటు ఉందని గమనించాలి.
æఎంత లాభం వచ్చిందో అంతే అయినా లేక అంతకన్నా ఎక్కువగా అయినా ఇన్వెస్ట్ చేయాలి. తక్కువగా చేస్తే ఆ తక్కువ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసెస్సీకి జీవితకాలంలో ఒకే ఒకసారి ఓ అవకాశం ఉంది. లాభాలు రూ. 2 కోట్లు దాటితే, ఒక ఇల్లు బదులు రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. కట్టుకోవచ్చు.
ఇన్వెస్ట్ చేసినప్పుడు కుటుంబంలో భార్య, సంతానం పేరు మీద కొనవచ్చు. ఈ మేరకు ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు. మొత్తం ప్రతిఫలం చేయనవసరం లేదు. మిగిలిన మొత్తాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల ఇల్లు కొనకపోతే, ఇల్లు అమ్మిన సంవత్సరం నుంచి ఏడాది ముందు కానీ లేదా రిటర్నులు వేయడానికి గడువు తేదీ లోపల కానీ వెంటనే బ్యాంకులో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీకు మినహాయింపు లభిస్తుంది. అలా చేయకపోతే పన్ను పడుతుంది.
మీరు కొన్న కొత్త ఇంటిని 3 సంవత్సరాలు అమ్మకూడదు. అలా అమ్మితే పన్ను వేస్తారు. జాగా కొని, స్వయంగా కట్టుకోవచ్చు. మినహాయింపులు పొంది స్వంత ఇంటి కల సాకారం చేసుకోండి.
- కేసీహెచ్‌ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment