
తిరువొత్తియూరు: ప్లస్–2 విద్యార్థిని, ప్రేమించి వివాహం చేసుకుంటానని గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా, వెంబక్కం ప్రాంతానికి చెందిన మణికంఠన్(26) చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ పనికి వెళ్లి ఊరి నుంచి తిరిగి వస్తున్నాడు. సెయ్యూరు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్లస్–2 విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిగింది.
ఇద్దరూ ఉల్లాసంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా విద్యారి్థని 3 నెలల గర్భవతి అని తేలింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు విద్యారి్థనికి జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీనిపై సెయ్యూర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేశారు