
మణిపూర్:మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో జరిగిన హింసాకాండలో మరో 9 మంది మరణించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖామెన్‌లోక్ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఫైరింగ్‌లో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
హింసాకాండలో మరణించిన వారి శరీరాలపై అవయవాలు తెగిన గుర్తులు, అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజా ఘటనలతో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దాడులు జరిగిన ఖామెన్‌లోక్ ప్రాంతం.. కంగ్‌పోక్పీ, ఇంఫాల్‌కు తూర్పున ఉన్న జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా కోసం డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకుని హింసాత్మక వాతావరణం నెలకొంది. తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 100కి పైగా మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి:కల్లోల మణిపూర్‌లో ఆర్మీ మోహరింపు.. జరుగుతోంది ఇదే!