Manipur
-
Manipur: నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
బిష్ణుపూర్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్(Manipur)లో ఉగ్రవాదులు కలకలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. బిష్ణుపూర్‌లోని మోయిరాంగ్ ఓక్షోంగ్బంగ్లో నిషేధిత కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (పీడబ్ల్యూజీ)సభ్యుడిని శనివారం అరెస్టు చేయగా, తాజాగా ఇదే జిల్లాలోని నంబోల్ బజార్లో కేసీపీ క్రియాశీల సభ్యుడైన ఒక టీనేజర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్‌లోని నింగ్‌థౌఖోంగ్‌లో నిషేధిత కేసీపీ(పీడబ్ల్యుజీ)కి చెందిన చురుకైన క్యాడర్‌ను అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో జరిగిన తనిఖీల్లో భద్రతా దళాలు.. యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(United People's Party of Kanglipak) (యుపీపీకే) సభ్యుడిని అరెస్టు చేశాయని ఆయన పేర్కొన్నారు. అలాగే శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన తనిఖీల్లో పోలీసులు ఉగ్రవాదులకు చెందిన తుపాకీలను స్వాధీనం చేసుకున్నారన్నారు.శుక్రవారం నాడు బిష్ణుపూర్, తౌబాల్,ఇంఫాల్ తూర్పు జిల్లాలలో రెండు నిషేధిత సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు(Security forces) అరెస్టు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్-పాంబే)కి చెందిన ఇద్దరు సభ్యులను బిష్ణుపూర్ జిల్లాలోని నంబోల్లో అరెస్టు చేశారు. వీరు 47 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని పట్సోయ్ పార్ట్-4 నివాసి లైతోంజమ్ దిలీప్ సింగ్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి నుండి కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక ఎం20 పిస్టల్, ఒక మ్యాగజైన్, రెండు కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు -
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మణిపూర్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి రాజ్యసభలో మంగళవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు మణిపూర్‌లో హింసను నిర్మూలించలేకపోయిందన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.గతంలో హింస జరిగినప్పుడూ ప్రధానులు మణిపూర్‌ను సందర్శించలేదన్నారు. 1993లో మణిపూర్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నాగాలు, కుకీల మధ్య ఘర్షణల్లో 750 మంది మరణించారని, 350 గ్రామాలను తగులబెట్టారని, అయినా అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుగానీ, హోంమంత్రి శంకర్రావు చవాన్గానీ రాష్ట్రాన్ని సందర్శించలేదని చెప్పారు. మణిపూర్‌పై దృష్టి సాధించడం లేదని ప్రతిపక్షాల విమర్శలనూ ఆమె తిప్పికొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బందులు, దిగ్బంధాలతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడినా ఏ మంత్రి రాష్ట్రానికి వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ, అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారని వెల్లడించారు.ప్రతిపక్షాల కంటే సున్నితంగానే ఆలోచిస్తున్నామని, దేశంలోని ప్రతిరాష్ట్రం గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడించారు. మణిపూర్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. శాంతి నెలకొల్పి తే ఆర్థికంగా మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెదరుమదురు ఘటనలు మినహా.. మరణాలు, అగ్ని ప్రమాదాలు, కాల్పుల సంఘటనలు, నిరసనల కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.శాంతిభద్రతల పరిరక్షణకు 286 కంపెనీల సీఏపీఎఫ్, 137 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్.. రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తున్నాయన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకుంటున్నారని, జాతీయ రహదారిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మణిపూర్ బడ్జెట్ వివరాలను ఆమె సభకు వెల్లడించారు. ఒకరిపై ఒకరు వేలెత్తిచూపుతూ ఉంటే మణిపూర్‌కు ఎవరూ సాయం చేయరన్నారు. మేకిన్ ఇండియా మంచి ఫలితాలను ఇస్తోంది మేకిన్ ఇండియా పథకంపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. మేకిన్ ఇండియా భారత రక్షణ రంగాన్ని నికర ఎగుమతిదారుగా మార్చిందని ఆమె చెప్పారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీతారామన్ తెలిపారు. తన వాదనను బలపరిచే డేటాను సభకు తెలియజేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని, ఇప్పటివరకూ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని, 9.5 లక్షల మందికి ఉపాధినిచ్చాయని చెప్పారు. తృణమూల్ ఎంపీల వాకౌట్ మణిపూర్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంత్రి ఇచ్చిన సమాధానంపై తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మణిపూర్ బడ్జెట్‌పై మంత్రి ఇచ్చిన సమాధానం కంటితుడుపుగా ఉందని ఎంపీ సుస్మితాదేవ్ అన్నారు. 22 నెలలుగా మణిపూర్ కాలిపోతుంటే అల్లర్లను ఆపడానికి ప్రధాని, హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. -
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు. -
శాశ్వత శాంతిని పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మణిపూర్ భద్రతా పరిస్థితిపై శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక ఆదేశాలు చేశారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్, అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్, మణిపూర్ భద్రతా సలహాదారు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేగాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసులలో కఠినమైన చర్యలు తీసుకోవడం కొనసాగించాలని... మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, మాదకద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని ఆదేశించారు. -
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మణిపూర్ సీఎంగా మైతేయి వర్గం నేత..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే ముఖ్యమంత్రిగా మళ్లీ అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ వర్గానికి చెందిన ముగ్గురి నేతలు రేసులో ఉండగా వీరికి 22 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 10న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేసులో శాసనసభ ప్రస్తుత స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్ కూడా ఉన్నారు. బిరెన్ సింగ్ రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నప్పుడు తోక్చోమ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై బిరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తోక్చోమ్ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రెండో నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్. ఈయన 2017– 2022 సంవత్సరాల మధ్య మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో ఉన్నారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ సీఎం రేసులో ఉన్న మూడో నేత. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీఎం సలహాదారుగా ఉన్న రాధేశ్యామ్ సింగ్ 2017 –2022 మధ్య విద్య, కారి్మక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత, మైతేయి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోయారు. బిరేన్సింగ్ను మళ్లీ సీఎం చేయాలని ఒక వర్గం కోరుతుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే మార్చి 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతి్నంచే అవకాశాలున్నాయి. అందుకే ఆలోగా కొత్త సీఎంను ఎంపిక చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరింతకాలం కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బలమున్నా.. కరువైన ఏకాభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా మైతేయి వర్గానికి చెందినవారే. అయితే, కుకీలతో పాటు బీజేపీకి చెందిన పలువురు మైతేయి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కుకీ–మైతేయి వర్గాల మధ్య 2023 మే 3వ తేదీన మొదలైన హింసకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు. హింసాకాండ సమయంలో కుకీలకి వ్యతిరేకంగా మైతేయిలను బిరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీని రద్దు చేయని కారణంగా మార్చి 10 లోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయిలు, ఆరుగురు కుకీలు, ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన ఐదుగురు సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. -
మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్‌లో జరిగిన అల్లర్లను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది కాబట్టి.. పార్లమెంట్‌నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక (ఖటిక్) అసోసియేషన్ జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గంలో ఉన్నారని ఆరె కటిక అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది రహీమ్, రాజు సోంకర్‌లు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. ‘అసలు మీ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం?’అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులస్తులకు సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఏం జరిగింది? మణిపూర్‌లో ఎలా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అందుకు సైతం ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ..‘కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లినా మీకు పరిష్కారం దొరకదు. కాబట్టి పార్లమెంట్‌ను ఆశ్రయించండి’ అని చెప్పింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది రహీమ్ చెప్పగా కేసును ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
ఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్ శాంతిస్తుందా? -
మణిపూర్‌పై బిగ్ ట్విస్ట్.. మోదీ నిర్ణయం అదేనా?
ఇంపాల్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపించకపోడం గమనార్హం.ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని బీరేన్‌ను కోరారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ పంపిన నివేదికలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరినట్టు తెలిసింది.ఇక, సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.. కానీ మణిపూర్ అసెంబ్లీ సందర్భంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి నేటితో (బుధవారం) ముగుస్తుంది.అయితే, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల అంతరానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు 6 నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదని కూడా వర్గాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. BJP in talks to pick next chief minister of Manipur, deadline ends today President's rule looms large in #Manipur as #BJP remains undecided on next CM @priyanktripathi brings in latets updates | @NivedhanaPrabhu pic.twitter.com/6qY4NogVZc— Mirror Now (@MirrorNow) February 12, 2025 -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్‌కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్‌లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్‌లో బీరేన్‌సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్‌భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్‌ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్‌ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్‌లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
ఇలా రాజీనామా చేశారో లేదో.. మళ్లీ జత కట్టేశారు..!
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్(Biren Singh) ఇలా రాజీనామా చేశారో లేదో.. ఎన్పీపీ(National Peoples Party ) బీజేపీతో జత కట్టడానికి సై అంటోంది. మూడు నెలలుగా అక్కడ అధికార బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎన్పీపీ.. బీరెన్ సింగ్ రాజీనామాతో మళ్లీ తమ పొత్తును కొనసాగిస్తామంటోంది. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న హింసాకాండలో భాగంగా బీజేపీకి దూరంగా ఉంటోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన హింస అరికట్టడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.దాంతోనే బీరెన్ సింగ్‌కు తమ మద్దతును ఉపసంహరించుకుంది ఎన్పీపీ. బీరెన్ నాయకత్వంలో మణిపూర్ అల్లర్లు చెలరేగినట్లు ఎన్పీపీ భావించింది. ఈ నేపథ్యంలో బీరెన్‌కు మద్దతును బహిరంగంగానే ఉపసంహరించుకుంది ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమైనందున బీరెన్ రాజీనామా నిన్న( ఆదివారం) చేయక తప్పలేదు.#WATCH | Imphal | On N Biren Singh's resignation as Manipur CM, Working President of National Peoples' Party, Sheikh Noorul Hassan says, "NPP has withdrawn support from N Biren Singh govt. We do not believe in his leadership because of his failure to restore normalcy and peace in… pic.twitter.com/XKWWqwZGPR— ANI (@ANI) February 10, 2025 ఈరోజు(సోమవారం) బీజేపీ(BJP)తో జత కట్టేందుకు ఎన్పీపీ రెడీ అయ్యింది. తాము ఎన్డీఏలో భాగమేనని,కేవలం ీబీరెన్ సింగ్ నాయకత్వాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్పీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నూరల్ హసన్ ఓ ప్రకటన విడుదల చేశారు.మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొనడానికి ‘బీరెన్ సింగ్ రాజీనామా అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. మేము ఎప్పుడూ ఎన్డీఏలో భాగమే. బీజేపీతో కలిసి పనిచేస్తాం. మళ్లీమణిపూర్‌ను గాడిలో పెడతాం’ అని అన్నారు.మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే వై కేమచంద్ర సింగ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు అనే దానిపై హైకమాండ్ ినిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ సభ్యులంతా తప్పకుండా బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ప్రధానంగా మణిపూర్‌లో రెండు తెగల మధ్య చోటు చేసుకున్న వైరం కాస్తా పెద్దదై అల్లర్లు చెలరేగాయన్నారు. మొయితీ తెగ, కుకీ తెగల మధ్య వైరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు.కుకీలు ఉగ్రవాదులంటూ..2022లొ మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా బీరెన్ సింగ్నే బీజేపీ అధిష్టానం తిరిగి నియమించిన సంగతి తెలిసిందే. అయితే 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరెన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అయినా అల్లర్లు అనేవి ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు ఎన్పీపీ కూడా పట్టుబట్టుకుని కూర్చోని ఉండటంతో బీరెన్ రాజీనామా చేయకతప్పలేదు. -
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బీరెన్ సింగ్ సమర్పించారు. మణిపూర్ అల్లల్లు. రెండు జాతుల మధ్య రేగిన వైరం. ఎంతటి హింసకు దారి తీసిందో అంతా చూశాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఇటీవల బీరేన్ సింగ్.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం, కొద్ది సేపటి క్రితం బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనా చేశారు. -
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్‌బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్‌లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. -
నేటి సాక్షి కార్టూన్
-
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి..భయంతో జనం పరుగులు
ఇంఫాల్:మణిపూర్‌లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కాల్పులు, బాంబుల మోత మోగింది. కదంగ్‌బండ్ ప్రాంతంలో బుధవారం(జనవరి1) తెల్లవారకముందే ఉదయం మిలిటెంట్ల దాడి జరిగింది. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడమే కాకుండా బాంబులు విసిరారు మిలిటెంట్లు.మిలిటెంట్ల దాడితో వెస్ట్ ఇంఫాల్‌లోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల దాడిలోప్రాణ నష్టం జరగలేదన్నారు.మణిపూర్‌లో జాతుల మధ్య భారీ హింస చెలరేగిన 2023 మే నెలలో కదంగ్‌బండ్‌లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలని నూతన సంవత్సర వేళ సీఎం బీరేన్‌సింగ్ ఆకాంక్షించిన వెంటనే మిలిటెంట్ల దాడి జరగడం గమనార్హం. ఇదీ చదవండి: లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెల్ల హత్య -
జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్ సీఎం
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్(Biren Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, హింసాత్మక ఘటనలకుగానూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనైనా శాంతి స్థాపనకు ముందుకు రావాలంటూ తెగలన్నింటికి ఆయన పిలుపు ఇచ్చారు.‘‘గతేడాది మే 3వ తేదీ నుంచి ఇవాళ్టిదాకా జరిగిన పరిణామాలపై నేను క్షమాపణలు చెప్పదల్చుకుంటున్నా. గడిచిన ఏడాది అంతా చాలా దురదృష్టకరమైంది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయారు. మరెంతో మంది తమ ఇళ్లను వదిలి వలసలు వెళ్లారు. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు. అయితే..గత మూడు, నాలుగు నెలల నుంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోయే సమయంలో.. 2025 రాష్ట్రంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా.. అయ్యిందేదో అయ్యింది. గతంలో జరిగిన తప్పులను మరిచిపోయి.. కొత్త ఏడాదిలో అందరం కొత్త జీవితాల్ని ప్రారంభిద్దాం. మణిపూర్(Manipur)ను శాంతి వనంగా మార్చుకుందాం. ఇదే అన్ని ఉన్న 35 తెగలకు నేను చేసే ఏకైక విజ్ఞప్తి అని సందేశం అని అన్నారాయన. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపుర్ అట్టుడుకుతోంది. తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతుండడంతో.. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతల అదుపు విషయంలో అక్కడి పోలీస్ శాఖ చేతులు ఎత్తేయడంతో.. 19 నెలలుగా కేంద్ర బలగాలే అక్కడ పహారా కాస్తున్నాయి. తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో.. ఇంటర్నెట్పై సైతం చాలాకాలం ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.ఒకవైపు.. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపడం, భార్యభర్తలను తగలబెట్టడం, అన్నాచెల్లెళ్లను పైశాచికంగా హతమార్చడం.. తరహా ఘటనలు మణిపూర్ గడ్డ నుంచి వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. మరోవైపు.. రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. ఇంకోవైపు.. సుప్రీం కోర్టు(Supreme Court) జోక్యంతోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే.. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయితీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. వాస్తవానికి మెయితీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయితీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయితీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయితీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.అదే సమయంలో.. మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది అక్కడి ప్రజలు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయితీలు ఆరోపిస్తున్నారు. -
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్‌కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్‌లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్‌కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్‌కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్‌గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
మణిపూర్ హింసకు స్టార్‌లింక్ వినియోగం.. మస్క్ ఏమన్నారంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్టీపీ కేబుల్స్ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
అప్రమత్తంగా ఉండాలి!
న్యూఢిల్లీ/ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ప్రజల భద్రత, తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా వరుసగా రెండో రోజు సోమవారం సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని, ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని అమిత్ షా ఈ సందర్భంగా ఆదేశించారు.మణిపూర్‌లో కేంద్ర బలగాల మోహరింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటిదాకా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌కు 50 కంపెనీల బలగాలు మణిపూర్‌కు అదనంగా 50 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్(సీఏపీఎఫ్) బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బలగాల్లో 5,000 మందికిపైగా సిబ్బంది ఉంటారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాష్ట్రంలో భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అదనపు బలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 20 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలను మణిపూర్‌కు పంపించింది. ఇందులో 15 సీఆర్పీఎఫ్, ఐదు బీఎస్ఎఫ్ కంపెనీలు ఉన్నాయి. మరో వారం రోజుల్లోగా అదనంగా 50 కంపెనీలను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ(కోకోమీ) నేతృత్వంలో నిరసనకారులు కర్ఫ్యూ నిబంధనలను ధిక్కరిస్తూ సోమవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకు నిరసనగా వారు తాళాలు వేసే కార్యక్రమం చేపట్టారు. కోకోమీకి మైతేయిల్లో బలమైన పట్టుంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను మరో రెండు రోజులపాటు నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పారీ్ట(ఎన్పీపీ) మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచి్చన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. -
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు
న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
మణిపూర్ కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్..
-
అట్టుడుకుతున్న మణిపూర్.. సంగ్మా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్పీపీకి ఏడు సీట్లున్నాయి.హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
-
మళ్లీ మణిపూర్‌లో నిప్పు
ఇంపాల్/గువాహటి: మెజారిటీ మైతేయ్‌లకు రిజర్వేషన్లను కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికిపైగా బలైన ఉదంతం నుంచి తేరుకుంటున్న మణిపూర్‌లో మళ్లీ విద్వేషాగ్ని రాజుకుంటోంది. గత వారం అపహరణకు గురైన ఆరుగురి మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.మైతేయ్ అనుకూల అల్లరిమూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. నిరసనలు, ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమవడంతో పుకార్లు, తప్పుడు వార్తల ప్రచారానికి అడ్టుకట్టవేసేందుకు మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఘర్షణాత్మక, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కంగ్పోక్పీ, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో నెట్సేవలను ఆపేశారు. అసలేం జరిగింది? కుకీ–జో వర్గానికి చెందిన గ్రామవలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బొరోబెక్రా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పైకి దాడికి తెగించారు. అయితే భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ఈ 11 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయ్ వర్గానికి చెందిన వారిని కుకీ సాయుధమూకలు నవంబర్ 11వ తేదీన అపహరించాయి. అపహరణకు గురైన వారిలో ఆరు గురి మృతదేహాలు శుక్రవారం జిరిబామ్ జిల్లాలో లభించాయి. అస్సాం–మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న జిరిముఖ్ గ్రామ సమీప జిరి, బారక్ నదీసంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇంఫాల్ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు ఎమ్మెల్యేల నివాసాలపై మైతేయ్ వర్గీయులు శనివారం దాడులకు తెగబడ్డారు. ముగ్గురు రాష్ట్రమంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యే నిశికాంత్ ఇంటిపై దాడిచేశారు. -
Breaking : మణిపూర్‌లో మళ్లీ హింస.. 11మంది ఎన్కౌంటర్
-
మణిపూర్‌లో భారీ ఎన్కౌంటర్..11 మంది ఉగ్రవాదులు హతం
ఇంఫాల్:మణిపూర్ జిరిబమ్‌లో సోమవారం(నవంబర్ 11) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న రిలీఫ్ క్యాంపును టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్‌లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌కు ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేయడం గమనార్హం. -
మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది
లోహార్‌దాగా/సిండెగా(జార్ఖండ్): కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాషాయ పార్టీ మణిపూర్‌కు మంటపెట్టిందని, దేశ ప్రజలను మతం ప్రాతిపదికగా విభజించేందుకు ప్ర యత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 90 శాతం మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాహు ల్ శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగించారు. ‘బీజేపీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది. ఇటీవల హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్లు, జాట్‌యేతరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇదే బీజేపీ నైజం’అని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకు బదులు ప్రేమను పెంచేందుకే కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ‘దళితులు, గిరిజనుల కోసం గళం వినిపించినప్పుడల్లా దేశాన్ని విభజిస్తున్నానంటూ నాపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ, నేను దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దేశం జనాభాలో 90 శాతం ఉన్న గిరిజనులు, దళితులు, ఓబీసీలకు పాలనలో భాగస్వామ్యం కోసం మాట్లాడటమే తప్పయినట్లయితే, ఇకపైనా ఇదే పనిని కొనసాగిస్తా’అని రాహల్ అన్నారు. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చా రు. జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లను 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్సీల కోటాను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామన్నారు. కులగణనతో గిరిజనులు, దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యం తగు రీతిలో పెరుగుతుందని చెప్పారు. బీజేపీ రైతు రుణాలు మాఫీ చేసిందా? యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.72 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..దేశంలోని 25 మంది పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని రాహుల్ చెప్పారు. ‘జార్ఖండ్‌లోని రైతుల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందా? లేదు..ఎందుకంటే మీరంతా గిరిజనులు, దళితులు, ఓబీసీలు కాబట్టి. పెట్టుబడిదారుల రుణాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం మీరు తీసుకున్న అప్పులను మాత్రం మాఫీ చేయదు’అని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రజల నుంచి నీరు, భూమి, అడవి(జల్, జంగల్, జమీన్)ని లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’అని ఆయన ఆరోపించారు. ఇది సైద్ధాంతిక పోరాటం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ–ఆర్ఎస్ఎస్ల మధ్య జరుగుతున్న సైద్థాంతిక పోరుగా రాహుల్ అభివరి్ణంచారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల లక్ష్యం దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే, ఇండియా కూటమి లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే అన్నారు. జలం, అడవి, భూమి తమవేనని కాషాయ పార్టీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారులు భావిస్తున్నారు..అందుకే, ప్రధాని మోదీ గిరిజనులను వనవాసీలంటూ సంబోధిస్తున్నారని ఆరోపించారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత
చురాచంద్పూర్: మణిపూర్‌లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
అల్లర్లకు చెక్!.. మణిపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని ఆర్మీ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలను పట్టుకున్నారు.మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో 21 సెప్టెంబర్ 2024న భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా రెండు జాయింట్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఆయుధాలను, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్‌లో, చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్జింగ్ రిడ్జ్‌లోని దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు 9 ఎంఎం పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఒక సింగిల్ బ్యారెల్ రైఫిల్, రెండు స్థానికంగా తయారు చేసిన రాకెట్లు, ఒక లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 6.2 కిలోల గ్రేడ్-2 పేలుడు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.రెండో ఆపరేషన్‌లో భాగంగా తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చాంగ్బీ గ్రామంలో సోదాలు నిర్వహించగా.. రెండు కార్బైన్ మెషిన్ గన్లు, రెండు పిస్టల్స్, సింగిల్ బ్యారెల్ గన్, 9 గ్రెనేడ్లు, చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.ఇదిలా ఉండగా..గత ఏడాది మే నుంచి మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మందికి పౌరులు మృత్యువాత పడ్డారు. వేలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. ఇక, తాజాగా మిలిటెంట్లు ఇప్పుడు ప్రత్యర్థి వర్గానికి చెందిన గ్రామాలను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు, అధునాతన రాకెట్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజులు క్రితమే విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు -
‘100 శాతం నిజం.. ఆ దేశం నుంచి మణిపూర్‌లోకి కుకీ మిలిటెంట్లు’
ఇంఫాల్: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో మణిపూర్ భద్రతా సలహాదారు కూల్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి మణిపూర్‌కు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 కుకీ మిలిటెంట్లు ప్రవేశించారని తెలిపారు. ఆ మిలిటెంట్లు ఆయుధాలతో కూడిన డ్రోన్ల వినియోగించటంలో శిక్షణ పొందినవారనే సమాచారం ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అందినట్లు నిర్ధారించారు. ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించిన విషయాలు 100 శాతం నిజం. ఆ నివేదిక తప్పు అని నిరూపించేవరకు మేము నమ్ముతాం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ 100 శాతం నిజంగానే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఆ నివేదిక నిజం కాకపోయినా. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఆపకుండా ఉంటాం. ఇంటెలిజెన్స్ నివేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోము’’ అని అన్నారు.దక్షిణ మణిపూర్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పంపిన ఈ నివేదికలో.. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెలిల్లా యుద్ధంలో కొత్తగా శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్‌లోకి ప్రవేశించారు’’ అని స్పష్టం చేసినట్లు మణిపూర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. కుకి మిలిటెంట్లు 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లతో గ్రూప్‌లుగా ఉంటారని, మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ కుకీ మిలిటెంట్లు సెప్టెంబర్ చివరి వారంలో మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికలు ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.చదవండి: సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ -
మళ్లీ రాజుకుంటున్న మణిపూర్
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న ఘర్షణలను నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. డీజీపీ, భద్రతా సలహాదారును తొలగించాలంటూ గవర్నర్ నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టించేందుకు వారంతా మంగళవారం విఫలయత్నం చేశారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైకి రాళ్లు తదితరాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.దాంతో లోయలోని ఐదు సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని తొలుత పేర్కొన్నా, అనంతరం దాన్ని ఐదు జిల్లాలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాజధాని ఇంఫాల్‌తో పాటు పరిసర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభు త్వం పేర్కొంది. మరో 2,000 మందికి పైగా సీఆరీ్పఎఫ్ సిబ్బందిని కేంద్రం మణిపూర్‌కు తరలించింది. మణిపూర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల డ్రోన్, రాకెట్ దాడులు జరిగినట్టు వార్తలొచ్చా యి. అవి వాస్తవమేనని ఐజీ కె.జయంతసింగ్ తెలిపారు. డ్రోన్లతో పాటు అధునాతన రాకెట్ల తాలూకు విడి భాగాలను పౌర ఆవాస ప్రాంతాల్లో తాజాగా స్వా«దీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అంతకుమించి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తౌబల్ ప్రాంతంలో నిరసనకారుల నుంచి దూసుకొచి్చన తూటా ఓ పోలీసును గాయపరిచినట్టు చెప్పారు. -
మళ్లీ మండుతున్న మణిపూర్
-
మణిపూర్‌లో హింస.. కేంద్రానికి సీఎం బిరేన్ సింగ్ డిమాండ్!
ఇంఫాల్: మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న దాడులతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఆరుగురు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ నియంత్రణ కోసం సీఎం ఎన్ బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ కమాండ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర భద్రతా సలహాదారు, సైన్యం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూనిఫైడ్ కమాండ్ నియంత్రణను సీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.సీఎం బీరెన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తమ డిమాండ్లను లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు అందజేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డిమాండ్ల జాబితాలో ప్రముఖంగా.. యూనిఫైడ్ కమాండ్ అప్పగించడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మణిపూర్‌లో అమలులో ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 355 ప్రతి రాష్ట్రాన్ని దురాక్రమణ, అంతర్గత దాడుల నుంచి రక్షించే బాధ్యతను కేంద్రానికి ఇచ్చింది. ఇక.. ఈ ఆర్టికల్‌ను విధించడం అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడానికి కేంద్రం సిద్ధమైనట్లే అని సమాచారం.గత ఏడాది మేలో జాతుల మధ్య చెలరేగిన హింసను నిర్మూలించిచి శాంతిని నెలకొల్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సీఎం బిరేన్ సింగ్‌లో సహా బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ సమగ్రతను కాపాడాలని, సరిహద్దు ఫెన్సింగ్‌ను పూర్తి చేయాలి, అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన సింసలో ఇప్పటి వరకు 220 మంది మృతిచెందగా.. సుమారు 50 వేల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు. -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్‌బండ్‌లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్‌బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. -
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..
ఇంఫాల్: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్బాండ్ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
మణిపూర్‌లో బాంబు పేలుడు.. మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్‌లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య మృతిచెందారు. మరోవైపు.. తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకరాం.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్‌థాంగ్ హౌకిప్ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పేలుడు ఘటన సమయంలో హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. తాజాగా మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. -
మహారాష్ట్ర మరో మణిపూర్ కావొచ్చు: శరద్ పవార్ వ్యాఖ్యలు
ముంబై: మణిపూర్ తరహాలో హింసాత్మక ఘటనలు మహారాష్ట్రలో కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం అరికట్టలేకపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.కాగా, శరద్ పవార్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు సముహాల జాతి హింసను పరిష్కరించడంతో కేంద్రం విఫలమైంది. అలాగే, మహారాష్ట్రలో కూడా మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మణిపూర్ తరహాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, ఎంతో మంది మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పెంపొందించారు. కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చు అనే అనుకుంటున్నాను. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలి. నిరసనకారులతో చర్చలు ఎందుకు జరపలేదు. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో ఏడాది కాలంగా హింసా జరుగుతున్నా ఒక్కసారి కూడా మోదీ అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించలేదని మండిపడ్డారు. తరతరాలుగా జీవనం కొనసాగిస్తూ, సామరస్యాన్ని కొనసాగిస్తున్న మణిపురీలు నేడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితికి కేంద్రం కూడా ఒక్క కారణమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మోదీ ఉక్రెయిన్ పర్యటన!.. జైరాం రమేష్ ఏమన్నారంటే?
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉక్రెయిన్ పర్యటనకు ముందు, తర్వాత అయినా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని అన్నారు.‘మణిపూర్ సీఎం శనివారం ఢిల్లీ మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన బీజేపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో జరిగిన భేటీకి సైతం మణిపూర్ సీఎం హాజరయ్యారు. సీఎం బీరేన్ సింగ్.. ప్రధాని మోదీతో విడిగా సమావేశమై మణిపూర్‌లో మే 3,2023 నుంచి చెలరేగిన ఘర్షణల పరిస్థితిని చర్చించారా?. మోదీని ఉక్రెయిన్ పర్యటనకు ముందు లేదా తర్వాత మణిపూర్ సందర్శించాల్సిందిగా సీఎం బీరేన్ సింగ్ ఆహ్వానించారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’అని జైరాం రమేష్ అన్నారు.The Chief Minister of Manipur attends the NITI Aayog meeting in New Delhi presided over by the self-anointed non-biological PM.Then the Manipur CM attends a meeting of BJP CMs and Deputy CMs presided over by the same deity.The simple question that the people of Manipur are…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 28, 2024 బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది నుంచి కుకీ, మైతేయ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న విసయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆయన మణిపూర్ వెళ్లకూడా విదేశీ పర్యటనలు చేయటంపై కాంగ్రెస్ ఇప్పటికే పలుసార్లు తీవ్రంగా విమర్శలు గుప్పించింది.ఉక్రెయిన్‌పై రష్యా 2022లో యుద్దాయానికి దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ జాతీయ దీనోత్సవం ఆగస్టు 24న జరుగనున్న నేపథ్యంలో ఆ సమయానికి కాస్త అటూఇటూగా మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. -
మణిపూర్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టుకు.. ఎవరీ ఎన్ కోటీశ్వర్?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం వెల్లడించారు.కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు.జస్టిస్ కోటీశ్వర్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్‌గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. -
మణిపూర్‌లో కాల్పులు.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
ఇంపాల్: మణిపూర్‌లో సాయుధ దుండగుల హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సెంట్రల్ రిజర్వుడు పోలీసు ఫోర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో సాయుధ తిరుగుబాటు దారులు కాలుపు జరిపారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జనాన్తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ఉదయం 9. 40 గంటలకు గుర్తుతెలియని దుండగుడు 20వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. సీఆర్పీఎస్ బలగాలు, పోలీసులు మాన్బంగ్ గ్రామంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు.ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ (43), జిరిబామ్ ఎస్ఐతో సహా ముగ్గురి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక.. ఇటీవల కాలంలో జిరిబామ్ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలు చేటుచేసుకుంటున్నాయి. జూన్‌లో కుకీ, మైతేయి వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో సుమారు 70 ఇళ్లు, పోలీసు పోస్టులకు తిరుగుబాటు దారులు నిప్పంటించారు. -
Rahul Gandhi: పార్లమెంట్లో నిలదీస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతిస్థాపన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నెలకొన్న విషాదాన్ని పారద్రోలి శాంతినెలకొనేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి వారి బాధలను అర్ధంచేసుకుని ఘర్షణలకు చరమగీతం పాడాలని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన మణిపూర్‌లో పర్యటన, బాధితులతో మాట్లాడటం తదితర ఘటనల వీడియోను గురువారం ‘ఎక్స్’లో షేర్చేస్తూ హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక మూడుసార్లు రాష్ట్రంలో పర్యటించా. ఇన్నిరోజులైన అక్కడి పరిస్థితిలో మార్పురాలేదు. ఇప్పటికీ అక్కడి జనం రెండు వర్గాలుగా విడిపోయి బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. వేలాది కుటుంబాలు దిక్కులేక శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగానైనా ఒక్కసారి మణిపూర్‌లో పర్యటించి అక్కడి వారి బాధలను వినాలి. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి’ అని అన్నారు. ‘పార్లమెంట్లో మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తాం. శాంతిస్థాపన కోసం చర్యలు తీసుకునేదాకా కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి మోదీ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాయి’ అని అన్నారు. ‘ మీ వాణిని పార్లమెంట్లో వినిపిస్తాగానీ మీరు శరణార్థి శిబిరాలను వీడి స్వస్థలాలకు ఎప్పటికల్లా వెళ్లగలరు? అనే ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం వద్దే ఉంది’’ అని అన్నారు. -
‘మణిపూర్ రెండు ముక్కలైంది.. ఇప్పటికైనా ప్రధాని మోదీ..’
ఢిల్లీ: జాతుల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల మూడోసారి మణిపూర్ సందర్శించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘ మణిపూర్ ఇంకా ఆందోళనలోనే ఉంది. జాతుల మధ్య చెలరేగిన హింసలో ఇళ్లు కాలిపోయాయి. అమాయక ప్రజలు ప్రమాదంలో పడ్డారు. వేల కుటుంబాలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఉన్నారు. నేను 2023 మే నుంచి ఇప్పటివరకు మూడుసార్లు మణిపూర్‌కు వెళ్లాను. ఇప్పటికే కూడా మణిపూర్ రెండు ప్రాంతాలుగా విడిపోయి ఉంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలి. అక్కడి ప్రజలు సమస్యలు విని, శాంతిని నెలకొల్పాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.मणिपुर में हिंसा शुरू होने के बाद, मैं तीसरी बार यहां आ चुका हूं, मगर अफसोस स्थिति में कोई सुधार नहीं है - आज भी प्रदेश दो टुकड़ों में बंटा हुआ है।घर जल रहे हैं, मासूम ज़िंदगियां खतरे में हैं और हज़ारों परिवार relief camp में जीवन काटने पर मजबूर हैं।प्रधानमंत्री को मणिपुर खुद… pic.twitter.com/8EaJ2Tn6v8— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2024ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ చురచంద్‌పూర్ సహాయక శిబిరంలో బాధితులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం ఇక్కడ ఘర్షణలకు ముగింపు పలకాలని భావిస్తేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. మణిపూర్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా.కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.గతేడాది మణిపూర్‌లోని కుకీ, మైతేయి జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్త.. సింసకు దారితీసిన విషయం తెలిసింది. ఈ హింసాత్మక ఘటనల్ల 224 మంది మృతి చెందగా.. సుమారు 60 వేల మంది ప్రజలు వలస వెళ్లారు. -
Rahul Gandhi: మోదీజీ.. మణిపూర్‌కు రండి
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో కొన్ని నెలల క్రితం రావణకాష్టంగా రగిలిపోయిన మణిపూర్‌కు ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి ఇక్కడి వారి కష్టాలను అర్థంచేసుకోవాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఘర్షణల్లో సర్వస్వ కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. బీజేపీపాలిత రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఓదార్చారు. వారి బాగోగులను అడిగి తెల్సుకున్నారు. ‘‘ సోదరుడిగా ఇక్కడికొచ్చా. మీ బాధలు, కష్టాలు వింటా. ఇక్కడ శాంతి నెలకొనాల్సిన సమయం వచి్చంది. హింస ప్రతిఒక్కరినీ బాధిస్తోంది. వేల కుటుంబాలు కష్టాలబారిన పడ్డాయి. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. అమాయక జనం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. దేశంలో మరెక్కడా ఇంతటి దారుణాలు చోటుచేసుకోలేదు. మణిపూర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు, మీకు బాసటగా నిలిచేందుకు, మీ సోదరుడిగా వచ్చా’’ అని బాధిత కుటుంబాలతో రాహుల్ అన్నారు. బాధితులను కలిశాక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ మణిపూర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మోదీకి తెలియాలి. అందుకోసం ఇక్కడికి రండి. ఇక్కడ ఏం జరుగుతోందో తెల్సుకోండి. ప్రజల కష్టాలు వినండి’’ అని పరోక్షంగా మోదీకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేను సైతం రాహుల్ కలిశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా సద్దుమణకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. -
మీ సోదరుడిగా మణిపూర్‌కు వచ్చా: రాహుల్ గాంధీ
ఇంఫాల్: కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం మణిపూర్‌లో పర్యటించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను రాహల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘నేను మణిపూర్ ప్రజలకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నేను మీ సోదరుడిగా ఇక్కడి వచ్చాను. మాణిపూర్ మళ్లీ శాంతిని పునరుద్ధరించటం కోసం మీతో కలిసి పనిచేస్తాను. మాణిపూర్ చాలా విషాదకరమైన సమస్య చోటచేసుకున్నప్పటి నుంచి ఇక్కడికి మూడుసార్లు వచ్చాను. ఇక్కడి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ.. ఆశించినంత మార్పు రాలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.ఇవాళ మధ్యాహ్నం ఇంఫాల్ విమానాశ్రయంలో చేరుకున్న రాహుల్ గాంధీ.. జిరిబామ్, చురచంద్‌పూర్ జిల్లాల్లోని సహాయక శిబిరాలను సందర్శించారు. మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించి మద్దతుగా నిలిచారు. -
‘ మోదీ అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. మణిపూర్ వెళ్లాలి’
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్‌నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అంతరిక్షంలో వెళ్లే ముందు ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లిరావాలని అన్నారు. 2025లో భారత్ ప్రయోగించనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’లో ప్రధాని మోదీని పంపిస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపినట్లు ఓ మీడియా సంస్థ నివేదికను వెల్లడించింది.'Before he goes into space, the non-biological PM should go to Manipur': Jairam RameshRead @ANI Story | https://t.co/TSJfrNXiVO#JairamRamesh #PMModi #ManipurViolence pic.twitter.com/H8cumSd55V— ANI Digital (@ani_digital) July 4, 2024 దీనిపై జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లేముందు. ఆయన మణిపూర్ రాష్ట్రానికి వెళ్లిరావాలి’ అని అన్నారు.‘ప్రధాని మోదీకి అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్ అభివృద్ధిలో ఆయన్ను భాగస్వామిని చేయటంలో ఆసక్తిగా ఉన్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) వ్యోమగామి శిక్షణ అందించటంలో సహకరిస్తాం. అంతరిక్షంలోకి ప్రధానిని పంపించే సత్తా సాధిస్తే.. మనందరికీ చాలా గర్వంగా ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపినట్లు మీడియా నివేదికలో పేర్కొంది. -
మణిపూర్‌లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఈ నేపధ్యంలో మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.మణిపూర్‌లోని ప్రధాన నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
లోక్‌సభలో ‘నీట్’ రగడ.. మోదీ ప్రసంగంపై విపక్షాల ఆందోళన
సాక్షి,న్యూఢిల్లీ : రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందర గోళం నెలకొంది. మణిపూర్ అల్లరు,నీట్ లీకేజీపై స్పందించాలని డిమాండ్ చేస్తూ మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 👉రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ లక్ష్యాలను వివరించారు.👉దేశానికి మార్గదర్శకం చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు.👉ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి.👉ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అధికారం కట్టబెట్టారు.👉మా పదేళ్ల ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.👉మాకు నేషన్ ఫస్ట్. మేం ఏ పనిచేసినా ఇదే అంశంపై కట్టుబడి ఉంటాం.👉కొంత మంది బాధని నేను అర్ధం చేసుకోగలను అసత్య ప్రచారం చేసినా ఓడిపోయారు.👉పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు.👉పదేళ్లలో భారత్ ఖ్యాతిని మరింత పెంచాం.👉ఈ దేశంలో ఏదీ మారదని 2014ముందు ప్రజలు అనుకునే వారు.👉కాంగ్రెస్ హయాంలో ఎక్కడా చూసినా అంతా అవినీతి మయమే.. పత్రికల్లో ఎక్కడ చూసినా ఆ వార్తలే.👉స్కామ్‌లకు చెల్లింది.👉కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే 15పైసలు మాత్రమే సామాన్యులకు అందేవి.👉2014కు ముందు ఉగ్రవాదులు భారత్‌లో ఎక్కడ పడితే అక్కడే దాడులు జరిగేవి. ప్రభుత్వాలు నోరుమెదిపేవి కావు.👉కానీ 2014 తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాం.👉దేశ భద్రతకోసం మేం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.👉కాంగ్రెస్ హయాంలో బొగ్గు స్కాం జరిగితే.. మా హయాంలో రికార్డ్ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.👉కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల్లో స్కాంలు జరిగితే 2014 తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తెచ్చాం.👉ఆర్టికల్ 370తో అక్కడి ప్రజలు హక్కుల్ని లాక్కున్నారు. జమ్ము కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయనిచ్చేవారు కాదు.👉ఆర్టికల్ 370 రద్దుతో రాళ్ల దాడులు ఆగిపోయాయి.👉స్మార్ట్ ఫోన్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.👉మా పాలనలో మహిళలలను లక్షాదికారులుగా మార్చాం.👉భారత్ ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి ఎదిగేందుకే మా కృషి.👉మూడో టర్మ్‌లో ట్రిపుల్ స్పీడుతో అత్యత్తమ ఫలితాలు సాధిస్తాం.👉చిల్లర రాజకీయాలతో దేశం నడవదు. అదే సమయంలో విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపించడంతో సరైన పద్దతి కాదని మండిపడ్డారు. అయినప్పటికీ నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై స్పందించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నినాదాల మధ్య కొనసాగుతున్న మోదీ ప్రసంగం -
ఢిల్లీలో ఎమ్మెల్యేలు.. మణిపూర్ రాజకీయాల్లో కలకలం
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీజేపీ, దాని మిత్రపక్ష ఎమ్మెల్యేలంతా హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం, నాయకత్వ మార్పు డిమాండ్‌పై వాళ్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నట్లు వరుస కథనాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా తప్పదనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. మణిపూర్‌లో నాయకత్వ మార్పు ప్రచారాన్ని బీరెన్ సింగ్ ఖండించారు. ఎమ్మెల్యేల పర్యటనకు, తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారాయన. కేవలం మణిపూర్ శాంతి భద్రతల అంశంపై చర్చించేందుకే వాళ్లు అక్కడికి వెళ్లారని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ సమావేశం జరగలేదని.. ఆ హడావిడి ముగిశాక తాను ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలతో పాటే హైకమాండ్‌ను కలుస్తానని చెప్పారాయన. 2017లో మణిపూర్ సీఎం పదవి చేపట్టారు బీరెన్ సింగ్. అయితే ఆయన నాయకత్వంపై చాలా ఏళ్ల నుంచే అధికార కూటమి ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాక ఆయన్ని కచ్చితంగా తప్పించాలని సొంత పార్టీ నుంచే కాదు, మిత్రపక్షాలు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, జేడీయూలు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు కూడా. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం బీరెన్‌ను కొనసాగిస్తూ వస్తోంది. అయితే.. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలంతా మరోసారి ఆ డిమాండ్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించాయట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారనే చర్చ నడుస్తోంది అక్కడ. మణిపూర్‌లో రెండు లోక్‌సభ సీట్లను బీజేపీ కోల్పోగా.. కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యేల పర్యటనపై బీరెన్ మరోలా స్పందించారు. ‘బీజేపీ, మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఈ పర్యటనకు.. నా మార్పునకు ఎలాంటి సంబంధం లేదు. మణిపూర్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించే విషయంలో ఎన్డీయే ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయ్యింది. ఈ మధ్యే కేంద్రంలో మోదీ సర్కార్ మళ్లీ కొలువుదీరింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో మణిపూర్ అంశం కూడా ఉంది. అందుకే గురువారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కేంద్రం తరఫున మణిపూర్ శాంతిభద్రతల్ని పరిరక్షించాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్రహోం శాఖకు ఒక మెమొరాండం ఇవ్వాలని ఆ భేటీలో నిర్ణయించాం. దానిపై 35 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఆ మెమొరాండాన్ని సమర్పించేందుకే వాళ్లు హస్తిన వచ్చారు. వాళ్లకు అపాయింట్మెంట్ కూడా దొరికింది. నేను కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. పార్లమెంట్ సమావేశాల హడావిడిలో ఢిల్లీ పెద్దల విలువైన సమయాన్ని వృధా చేయొద్దని మేమంతా ఆగాం. సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేల సమేతంగా నేనూ ఆ సమావేశానికి హాజరవుతా’’ అని బీరెన్ సింగ్ చెప్పారు.మణిపూర్‌లో కిందటి ఏడాది మే నెలలో రిజర్వేషన్ల అంశంపై వర్గాల పోరుతో మొదలైన ఘర్షణలు.. నెలల తరబడి కొనసాగింది. ఈ హింసలో 200 మంది మరణించగా.. వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సీట్లు తగ్గడాన్ని మణిపూర్ అంశం కూడా ఒక కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడింది. దీంతో.. ఎన్డీయే బలం 293కి చేరింది. -
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు. వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు. ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
మణిపూర్‌లో కాల్పులు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ పోలీసులు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ అవుట్‌పోస్ట్ లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్‌పోస్ట్‌కు సమీపంలో పేలుడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎతైన కొండ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్‌పై కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ లక్ష్యంగా తెల్లవారుజామున 12.30 నుంచి 2.15 వరకు కాల్పులు జరిపారు. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. ఒక బాంబు సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌కు సమీపంలో పేలింది’అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతి చెందినవారు.. సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. శంకర్, హెడ్ కానిస్టేబుల్ అనుప్ సైనీగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
యూఎస్ మానవహక్కుల నివేదిక.. తీవ్రంగా ఖండించిన భారత్
దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా ఇచ్చిన నివేదికను బారత్ తీవ్రంగా ఖండించింది. యూఎస్ డాక్యుమెంట్ తీవ్ర పక్షపాతంతో కూడుకొని ఉందని, భారత్‌పై సరైన అవగాహన లేకపోవాడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గతేడాది మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల ఓ నివేదిక పేర్కొంది.దీనిపై విదేశాంత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంలో కూడుకున్నట్లు తెలిపారు. భారత్‌పై అమెరికాకు సరైన అవగాహన లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనికి తాము(భారత్) ఎలాంటి విలువ ఇవ్వడం లేదని, మీరు కూడా(మీడియా) పట్టించుకోవద్దని తెలిపారు.కాగా ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టిసెస్: ఇండియా’ పేరుతో విడుదల చేసిన ఈ డాక్యుమెంట్లో మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన జాతి వివాదం మానవ హక్కులు ఉల్లంఘనకు దారి తీసినట్లు ఆరోపించింది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోదీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయలపై దర్యాప్తు సంస్థల దాడి, మోదీపై డాక్యుమెంటరీ, మోదీ ఇంటి పేరును కించపరిచిన కేసులో రాహుల్ గాంధీకి శిక్ష పడటం, ఆయన లోక్‌సభ అనర్హతకు గురికావడం, మళ్లీ సుప్రీం కోర్టు స్టేతో ఎంపీ పదివి తిరిగి పొందడం, కెనడాలో ఖలీస్తానీ ఉగ్రవాది హత్య వంటి అంశాలను కూడా ప్రస్తావించింది.చదవండి: మస్క్ పేరుతో మోసం.. రూ.41 లక్షలు పాయే.. -
Manipur: శిబిరాల నుంచే ఓటు
ఇంఫాల్: గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్‌లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికిపైగా స్థానికులు సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడుకట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలపైనా వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్నా ఎన్నికల హడావుడే కనిపించలేదు. ‘‘మణిపూర్‌లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు. ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతాల్లో ఉండే మెజారిటీ జనాభా మైతేయ్‌లకు రాష్ట్రంలో ఎస్టీ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. మైతేయ్, కుకీల విద్వేషకాండలో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణభయంతో సొంతూరిని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు, మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు. ఘర్షణలు పూర్తిగా సద్దుమణకముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా? అంటూ వేలాది మంది బాధితులు, కొన్ని పౌర సంఘాలు ప్రశి్నస్తూ ఎన్నికల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాయి. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దంపడుతోంది. ఈసారి గణనీయమైన పోలింగ్‌కు కృషిచేస్తాం’’ అని ప్రదీప్ ఝా అన్నారు. -
Manipur: వినూత్న నిరసనకు దిగిన పోలీసులు
ఇంఫాల్: మణిపుర్లో ఓ పోలీసాధికారి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఏఎస్పీ స్థాయి అధికారి నివాసంపై దాడి జరిపి.. ఆయన్ని, ఆయన సిబ్బందిని గుర్తు తెలియని ఆగంతకులు అపహరించుకుని పోయారు. ఈ ఘటనను ఖండిస్తూ.. ఆ అధికారికి సంఘీభావంగా పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. అయితే.. ఏఎస్పీ అపహరణకు గురయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆయన్ను విడిపించినట్లు మణిపుర్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేశారు. ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. JUST IN | #Manipur Police commandos lay down arms in protest against attack and abduction of a police officer on Tuesday. Around 200 armed miscreants had stormed the house of a police officer in Imphal East. ASP Moirangthem Amit and his escort were abducted, @vijaita reports. pic.twitter.com/3B1kTTh5mt — The Hindu (@the_hindu) February 28, 2024 అంతకుముందు వాహనం దొంగిలించారనే ఆరోపణలతో అరంబై టెంగోల్ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వాళ్లే.. విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఆ రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని కిందటి ఏడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దంటూ నాగా, కుకీజొమీ తెగలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాయి. అయితే.. రాష్ట్రంలో కుకీలు, మెయితీల మధ్య వైరానికి కారణమైన పేరాను మణిపుర్ హైకోర్టు తాజాగా తొలగించింది. -
మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని చెప్పారు. మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్, ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు కారణమన్నారు. ‘ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ఉంది. భారత్ మయన్మార్ మధ్య ఫ్రీ మూమెంట్ రిజైమ్(ఎఫ్ఎమ్ఆర్)ఇక ఉండదు. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తాం. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు’ అని బీరెన్‌సింగ్ అన్నారు. ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్ -
మణిపుర్‌కు మతం రంగు!
మణిపుర్లో విధ్వంసం కన్నా మణిపుర్‌పై విధ్వంసక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది! దేశంలో ఎక్కడేం జరిగినా దానికి మతాన్ని అంటుకట్టేలా తయారైన రాజకీయ వ్యవస్థ ఆఖరికి మణిపుర్‌లోని తెగల మధ్య ఘర్షణలను కూడా ‘మత కలహాలు’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మణిపుర్‌తో సంబంధం లేని రాష్ట్రాలకు సైతం ఆ ‘రాజకీయ మతోన్మాదం’ వ్యాపించింది! దురుద్దేశాలతో కొన్ని విదేశీ శక్తులు, పొద్దెరగని కొందరు దేశవాళీ కొత్త రాజకీయవాదులు స్వార్థ ప్రయోజనాల కోసం మణిపుర్ నిప్పుల కుంపటిని తమ ప్రసంగ వేదికలపైకి మోసుకెళుతున్నారు. అవి మత కలహాలు కావు... భూమి హక్కుల తగాదాలని తెలిసీ మణిపుర్‌కు మతం రంగును పులుముతున్నారు! నిరుడు ఈ సమయానికి మణిపుర్ ప్రశాంతంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రశాంతం. మార్చి నెలలో కూడా ప్రశాంతం. ఏప్రిల్ వచ్చేసరికికొంచెం వేడెక్కింది. అయితే అది... ఏప్రిల్‌లో 16 సెల్సియస్ డిగ్రీలతో మొదలై, జూన్ నాటికి 35 డిగ్రీల వరకు చేరుకునే ఎండాకాలపు వేడిమి కాదు. నిరసన ప్రదర్శనల వేడి. దాడులు, దహనాల వేడి. నిజానికి అంతకు పదేళ్లు, ఆ ముందు పదేళ్ల నుంచి కూడా మణి పుర్ దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేసేంతగా అక్కడేం జరగలేదు. గత మే నెల నుంచే హింసాకాండ మొదలైంది. మూకుమ్మడి దాడులు, గృహదహనాలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మణిపుర్‌ను అగ్నిగుండంలా మార్చేశాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 180 మంది మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. డిసెంబరులో మణిపుర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపించినప్పటికీ కొత్త సంవత్సరంలో మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. జాతుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు విద్వేష జ్వాలలే అయ్యాయి. ఇంతకన్నా ఘోరం... అక్కడ జరుగుతున్న ఘటనలపై పాశ్చాత్య మీడియా చేస్తున్న దుష్ప్రచారం! వారితో పాటు అంతర్గతంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా మణిపుర్‌కు మతంరంగు పులిమేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ‘‘1947లోపంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలన కాండను మణిపుర్ ఘటనలు గుర్తు చేస్తున్నాయి’’ అనేంతగా ప్రచారం జరుగు తోంది. వారి వ్యతిరేకత ఎవరి మీదనైనా కావచ్చు. కానీ వాస్తవాలను హతమార్చడం ఎందుకు? పర్ణశాల వంటి మణిపుర్‌పై మతోన్మాద మరకల్ని అంటించడం దేనికి?భౌగోళికంగా మణిపుర్ ప్రత్యేకమైనది. రాష్ట్రంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన భూభాగంలో రాష్ట్రంలోని దాదాపుతొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మైతేయిలు. రాష్ట్రంలో వారి జనాభా దాదాపు 53 శాతం. దీంతో సహజంగానే రాజకీయాల్లో వారిదే ప్రాబల్యం. 60 సీట్ల అసెంబ్లీలో 40 స్థానాలు వాళ్లవే.కొండ ప్రాంతాల్లోని గిరిజనులైన కుకీలు, నాగాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండటం, మైదాన ప్రాంత గిరిజనులైన మైతేయిలకు ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం... కాలక్రమంలో రెండు వర్గాల మధ్య సఖ్యత లోపించడానికీ, సంఘర్షణకూ కారణం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడానికి మణిపుర్ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పు కారణం అయింది. మణిపుర్‌ను రణపుర్గా మార్చేసింది. 2023 మార్చి 27న షెడ్యూల్డు తెగల జాబితాలోకి మైతేయి తెగలను చేర్చేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు సిఫారసు చేయాలని మణిపుర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కుకీలు, నాగాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గంగా మైతేయిలదే రాజకీయంగా పైచేయిగా ఉందనీ, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను వారు ఇప్పటికే అనుభవిస్తున్నారనీ, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదనీ అభ్యంతరం చెబుతున్నారు. మైతేయిలకు రిజ ర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారనీ, తమ ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనీ ఆందోళన చెందుతున్నారు. అయితే, మైతేయిల వాదన మైతేయిలకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ ఆదివాసీల్లోని ముప్పైకి పైగా తెగలకు ఎస్టీలుగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. తమకు ఆ గుర్తింపు లేని కారణంగా దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని... తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయిల వాదన. అంతేకాదు 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయిలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోర్టుకు విన్నవించుకున్నాం అని మైతేయి సంఘం అంటోంది. కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా... సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్ర దాయాలను కాపాడుకోవటం కోసం ఎస్టీలుగా గుర్తింపును కోరు తున్నామని కోర్టులో వాదించింది. మణిపుర్ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందో ళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభ వించాయి. చర్చిలు, దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇవేమీ మత కలహాలు కావు. భూమి హక్కుల విషయమై మొదలై, నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు. అయితే మణì పూర్లో జరుగుతున్నవి మత ఘర్షణలు అని, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులు విధ్వంసానికి పాల్పడు తున్నారనే దుష్ప్రచారం సాగుతోంది. గమనించాల్సి వాస్తవం ఏమి టంటే మైతేయి తెగల్లో అధిక సంఖ్యాక హిందువులతో పాటు, ముస్లింలు, క్రిస్టియన్లు; కుకీ నాగాల్లోనూ అధిక సంఖ్యాక క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింలు ఉన్నారన్నది! మణిపుర్ తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా కొన్ని పాశ్చాత్య దేశాలకూ, మన దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీల వారికీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే, ఎవరి స్వార్థ ప్రయో జనాలు వారివి. నిజానికి మత ఘర్షణలనేవి మణిపుర్ చరిత్రలోనే లేవు. ‘‘కుకీ, నాగా తెగలకు పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మైతేయిలది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మరిక మతోన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అంటారు మణిపుర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రియోరంజన్ సింగ్. అయితే రెండు వేలకు పైగా చర్చిలను ధ్వంసం చేశారని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వారికి ఏ క్రైస్తవ దేశాలు అందించాయో వారే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా 100 దేవాలయాలతో పాటు రెండు వేల మైతేయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. మరి వీటిని ఏమంటారు? మత ఘర్షణలు అనేనా! మైతేయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు’’ అని స్పష్టం చేశారు. ఆ మాటను కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్పేవారెవరు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పేవారెవరు? ‘‘మణిపుర్లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్ చేసి మతపరమైనహింసగా చూపించడం ఇదే మొదటిసారి’’ అని స్వయంగా మణిపుర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబబ్రత సింగ్ అన్నారు కదా! బాధ్యత గల రాజకీయ నాయకులు ఎవరూ మణిపుర్లో జరుగు తున్న మతపరమైన దాడులు అని అనలేదు. అలాంటి ప్రచారానికి తావు కూడా ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మణిపుర్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మీరు క్రిస్టియన్ అయుండీ ఎందుకు మణిపుర్ క్రిస్టియ న్లను సమర్థించడం లేదు?’’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఇలా ఒక మతం వారిని రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పే పని లేదు. – మాధవ్ శింగరాజు, సీనియర్ జర్నలిస్ట్ -
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మృతులను ఓనామ్ బమోంజావో సింగ్ (61), ఆయన కుమారుడు ఓనామ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55), నింగ్థౌజం నబద్విప్ సింగ్ (40)గా గుర్తించారు. కాంగ్పోక్పిలో మరణించిన పౌరుడిని తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు. అయితే.. గత రెండురోజులుగా అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లోనే మనోరంజన్ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక బంకర్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి తౌబల్ జిల్లాలో కాల్పులు జరగడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు నిద్రిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు మంగళవారం అర్ధరాత్రి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. గత ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ.. అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్! -
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మూకదాడి
ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోరే జిల్లాలో పోలీసు పోస్టుపై దుండగులు కాల్పులు జరిపిన కొన్ని గంటల్లోనే తౌబాల్ జిల్లాలో పోలీసు హెడ్‌క్వార్టర్‌పై దాడి చేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. తౌబల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను దుండగులు మొదట లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారు జామున పోలీసు కేంద్రంపై ఒక్కసారిగా మూకదాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్ణణ వాతావరణం కాస్త సద్దుమణిగినప్పటికీ కాల్పుల ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మోరేలో జరిగిన దాడి నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. Today (17.01.2024), an irate mob targeted the 3rd Indian Reserve Battalion (3IRB) in Khangabok, Thoubal District. Security forces repelled them using the minimum necessary force. Further, the mob attempted to breach Thoubal Police Headquarters, prompting the security forces to — Manipur Police (@manipur_police) January 17, 2024 -
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
Bharat Jodo Nyay Yatra: అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...
థౌబాల్/ఇంఫాల్: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం. ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్ ద్వజమెత్తారు. సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు. రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ యాత్రపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు. -
ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మణిపూర్ ప్రజలు తమ ఆవశ్యకత, విలువను పోగొట్టుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏం కోల్పోయారో తాము చూశామని తెలిపారు. #WATCH | Congress MP Rahul Gandhi kickstarts Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur. pic.twitter.com/6F8hLDgAqa — ANI (@ANI) January 14, 2024 మణిపూర్ ప్రజలు ఏం కోల్పోయారో వాటిని మళ్లీ అందిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రజల బాధలు చూశామని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దు:ఖాన్ని తాము తొలగిస్తామని అన్నారు. ఇక్కడ ప్రజల్లో మునుపటిలా శాంతి, ప్రేమ, శ్రేయస్సును పునరుద్ధరిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. #WATCH | Thoubal, Manipur: Congress MP Rahul Gandhi says, " You (people) have lost what you have valued but we will find what you have valued once again and bring it back to you. We understand the pain the people of Manipur have been through. We understand the hurt, the loss and… pic.twitter.com/RQ0d1OZ5Pe — ANI (@ANI) January 14, 2024 న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు. చదవండి: ‘రాహుల్’ రాజకీయం.. కాంగ్రెస్‌ను వీడిన 11 మంది సీనియర్లు -
మణిపూర్ టు ముంబయి: మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం
ఇంఫాల్: ►మణిపూర్‌లోని తౌభాల్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi: Congress MP Rahul Gandhi arrives at Delhi airport. He will kick-start 'Bharat Jodo Nyaya Yatra' from Manipur's Thoubal today. The yatra will cover over 6,700 kilometres over 67 days, going through 110 districts. pic.twitter.com/GFPwwzfDAb — ANI (@ANI) January 14, 2024 ►అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వాన్ని ఎలుగెత్తడమే ఈ యాత్ర ధ్యేయమని పేర్కొన్నారు. #WATCH | Delhi: On Rahul Gandhi's 'Bharat Jodo Nyaya Yatra', Congress General Secretary KC Venugopal says, "The purpose of this yatra is seeking justice for everybody. Social, economic and political justice in this country...Rahul Gandhi is starting the yatra from Manipur to… pic.twitter.com/5dzcQPFo2R — ANI (@ANI) January 14, 2024 ►కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు హాజరవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు కీలక నాయకులు బయలుదేరారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మణిపూర్‌కు వెళుతున్నారు. #WATCH | Telangana CM and Congress leader Revanth Reddy leaves for Manipur from Delhi airport to participate in the party's 'Bharat Jodo Nyaya Yatra' pic.twitter.com/55gVCzJ7JU — ANI (@ANI) January 14, 2024 ► కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబయిలో యాత్రను ముగించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
నేటి నుంచి భారత్‌జోడో న్యాయ్‌యాత్ర ప్రారంభం...ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జనవరి 14వ తేదీ ఆదివారం) మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. చదవండి: ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే.. -
కాలారామ్ గుడికి ప్రధాని మోదీ.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని మోదీ నాసిక్ పర్యటనపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నాసిక్‌లోని కాలారామ్ గుడిని సందర్శించడానికి కారణం తామేనని రౌత్ చెప్పారు. తాము ఈ నెల 22న అయోధ్య వెళ్లకుండా కాలారామ్ గుడిని సందర్శిస్తామని ప్రకటించినందు వల్లే టూర్ షెడ్యూల్లో లేకున్నాప్రధాని శుక్రవారం ఆ గుడికి వెళ్లారని రౌత్ అన్నారు. గత ఏడాది మే నెల నుంచి రెండు తెగల పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్న మణిపూర్‌ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదని రౌత్ మండిపడ్డారు. శివసేన ముఖ్య నేతలు అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మరొక రోజున రామ్ మందిరాన్ని సందర్శిస్తారని, అనంతరం మణిపూర్ వెళ్లి అక్కడి రామ మందిరంలోనూ పూజలు నిర్వహిస్తారన్నారు. కనీసం తమ పర్యటన తర్వాతైనా మోదీ మణిపూర్‌కు వెళ్తారని ఆశిస్తున్నట్లు రౌత్ చెప్పారు. శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో కీలకమైన ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ కూడా ఉండటం విశేషం. అయితే వీటిని కూడా మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రారంభిస్తున్నారని శివసేన విమర్శించింది. ఇదీచదవండి.. నాసిక్‌లో మోదీ పర్యటన -
Manipur: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు
ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది. గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాల్పులు జరగడానికి ముందు ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి. అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
రాహుల్ గాంధీ యాత్రపై సస్పెన్స్.. మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంపై సస్పెన్స్ నెలకొంది. ఈనెల 14వ తేదీ మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి లేనట్టు సమాచారం. అయితే, తాజాగా మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ యాత్రపై సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరేలో తాజాగా మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో మోరేలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన సాయుధ సిబ్బందిని పట్టుకునేందుకు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసుల ఉమ్మడి ప్రయత్నం ద్వారా ప్రస్తుతం కూబింగ్ కార్యక్రమం జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ యాత్రపై బీరెన్ సింగ్ స్పందించారు. రాహుల్ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర కొనసాగనుంది. 66 రోజుల ప్రయాణంలో 6,713 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. చివరకు భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. ఇక, రాహుల్ యాత్ర సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారు. Bharat Jodo Nyay Yatra Preparation in full swing. Visuals from Assam. Nyay Ka Haq Milne Tak! pic.twitter.com/hd6AudvmU8 — Amit Kumar (@yadav_Amit025) January 10, 2024 -
‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫొటోలు దిగడానికి ఉన్న సమయం.. హింస చెలరేగిన మణిపూర్‌లో పర్యటించడానికి లేదుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. శనివారం ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధానిమోదీ లక్ష్యదీప్ పర్యటనపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఒకవైపు మణిపూర్‌లో దురదృష్టవశాత్తు రెండు వర్గాల మధ్య హింస చెలరేగితే, మరోవైపు ప్రధాని మోదీ మాత్రం బీచ్‌లో సాహస క్రీడ ఆడుతూ.. ఫొటో సెషన్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ముందు ఫొటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ముందు దేవుడి దర్శనంలా ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ ఫొటోలే కనిపిస్తాయని మండిపడ్డారు. ఇటువంటి పెద్దమనిషి.. ఎందుకు మణిపూర్‌కు వెళ్లడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీవాళ్లు మణిపూర్‌కు కేవలం రాజకీయ విహారయాత్రకు మాత్రమే వెళ్లారని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్ ఆవిష్కరణ -
రాహుల్ రెండో యాత్ర పేరులో స్వల్ప మార్పు..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీమరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీగతేడాది చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది. భారత్ జోడో యాత్ర తరహాలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయల్దేరనున్నారు. ముందుగా దీనికి భారత్ ‘న్యాయ్ యాత్ర’ అని నామకరణం చేశారు. అయితే, ఇప్పుడు యాత్ర పేరులో స్పల్ప మార్పులు చేశారు. . రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'గా పేరు మార్చారు. ఈ మేరకు యాత్ర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. Here is the route map of the Bharat Jodo Nyay Yatra being launched by the Indian National Congress from Manipur to Mumbai on January 14, 2024. @RahulGandhi will cover over 6700 kms in 66 days going through 110 districts. It will prove as impactful and transformative as the… pic.twitter.com/ZPxA5daZEb — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేశ్ వెల్లడించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం? కాగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. . ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం అవుతుండగా, మార్చి 30న ముగియనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 15 రాష్ట్రాలు, 66 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. 6700 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటిస్తారు. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేశ్ వెల్లడించారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో సాగనుంది. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. -
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్‌లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్‌కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
ఇంఫాల్: మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు మంగళవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆకస్మికంగా కాల్పులు జరిపారు. నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్ గాం«దీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర రాహుల్ గాంధీ తన తొలి విడత భారత్ జోడో యాత్రను 2022 సెపె్టంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ అగ్రనేత కె.సి.వేణుగోపాల్ వివరించారు. యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్–కార్నర్ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ సభకు హమ్ తయ్యార్ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. -
భారత్ న్యాయయాత్ర.. రాహుల్ మళ్లీ పాదయాత్ర
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. రెండో విడతలో.. ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభం అయ్యి 14 రాష్ట్రాలు.. 85 జిల్లాల గుండా ఉంటుంది. మణిపూర్‌లో మొదలై.. ముంబై దాకా దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా.. భారత్ న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు తెలిపారాయన. రాహుల్ యాత్ర ఈసారి హైబ్రీడ్ మోడల్లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా రాహుల్ యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్ భారత్ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వెల్లడించారు. #WATCH | Congress General Secretary KC Venugopal says, "Now Rahul Gandhi is doing a yatra with great experience from the first Bharat Jodo Yatra. This Yatra is going to interact with youth, women and marginalised people. This Yatra will cover a distance of 6,200 kms. It travels… pic.twitter.com/ICfR4jDExA — ANI (@ANI) December 27, 2023 జోడో యాత్ర సాగిందిలా.. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకేనని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ‘మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా.. 12 రాష్ట్రాల్లో సాగింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు దాదాపు 3970 కి.మీ మేర రాహుల్ యాత్ర కొనసాగించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. -
Licypriya Kangujam: నిండు సభలో... నిగ్గదీసి అడిగిన అగ్గిస్వరం
వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే మురిసే చిన్నారి హృదయాలకు ప్రకృతి ఆత్మీయ నేస్తం. అలాంటి అందమైన, ఆత్మీయమైన ప్రకృతి ఎదుట విలయ విధ్వంసం కరాళనృత్యం చేస్తుంటే... లిసిప్రియలాంటి చిన్నారులు ‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం’ అని ఊరుకోరు. ప్రకృతికి సంబంధించి మనం చేస్తున్న పాపం ఏదో, పుణ్యం ఏదో కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తారు. దుబాయ్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్–2023’లో తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది మన దేశానికి చెందిన పన్నెండు సంవత్సరాల లిసిప్రియ కంగుజామ్. ‘శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి’ అంటూ నినదించింది. కొద్దిసేపు ప్రసంగించింది. ఆమె నిరసనను ప్రపంచ ప్రతినిధులు కొందరు చప్పట్లతో ఆమోదం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మణిపుర్‌కు చెందిన క్లైమెట్ యాక్టివిస్ట్ లిసిప్రియ గురించి.... లిసిప్రియ కంగ్జామ్ మణిపుర్‌లోని బషిక్హోంగ్లో జన్మించింది. తల్లిదండ్రుల ద్వారా, స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా విన్న పర్యావరణపాఠాలు ఈ చిన్నారి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపాయి. పర్యావరణ సంరక్షణ కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఏడు సంవత్సరాల వయసులోనే అందరూ ఆశ్చర్యపడేలా పర్యావరణ సంబంధిత విషయాలు మాట్లాడేది. 2018లో ప్రకృతి విధ్వంసంపై మంగోలియాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తండ్రితో కలిసి పాల్గొంది. ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాల నుంచి ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకుంది. ఈ సదస్సు ప్రియ జీవితాన్ని మార్చేసిన సదస్సు అని చెప్పవచ్చు. ఈ సదస్సు స్ఫూర్తితో ‘చైల్డ్ మూమెంట్’ అనే సంస్థను మొదలుపెట్టింది. మొక్కల పెంపకం వల్ల ప్రకృతికి జరిగే మేలు, ప్రకృతి విధ్వంసం వల్ల జరిగే నష్టాలు... మొదలైన వాటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో స్కూల్స్‌లో ప్రచారకార్యక్రమాలు విరివిగా నిర్వహించింది. 2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఇదే సంవత్సరం అంగోలా దేశంలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాల్గొంది. ఈ సదస్సులో ఎంతోమంది దేశాధ్యక్షులతో పాటు ప్రియ ప్రసంగించడం విశేషం. చిన్నవయసులోనే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చుకుంది లిసిప్రియ. ప్రియకు డబ్బులను పొదుపు చేయడం అలవాటు. అవి తన భవిష్యత్ అవసరాలకు ఉద్దేశించి కాదు. సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం కోసం పొదుపు చేస్తుంటుంది. 2018లో కేరళ వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది. దిల్లీలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని‘సర్వైవల్ కిట్ ఫర్ ది ఫ్యూచర్’అనే డివైజ్‌కు రూపకల్పన చేసింది. ఈ జీరో బడ్జెట్ కిట్ వాయుకాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా, ఎక్కడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని పంజాబ్ అసెంబ్లీలో లాంచ్ చేసింది ప్రియ. వాతావరణ మార్పులపై కార్యచరణ కోసం, మన దేశంలో క్లైమెట్ లా కోసం వందలాదిమందితో కలిసి దిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన నిర్వహించింది. ‘సందేశం ఇవ్వాలనుకోవడం లేదు. సమస్యను అర్థం చేసుకోమని చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను’ అంటుంది లిసిప్రియ. యాక్ట్ నౌ దుబాయ్‌లో జరిగిన క్లైమేట్ కాన్ఫరెన్స్–2023లో 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి ప్రియ ధైర్యంగా వేదిక మీదికి వచ్చి ‘అవర్ లీడర్స్ లై, పీపుల్ డై’ అని గట్టిగా అరిచింది. సదస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తరువాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘ఎవరు ఈ అమ్మాయి?’ అంటూ చాలామంది ఆరా తీశారు. చిన్న వయసు నుంచే పర్యావరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న ప్రియ గురించి తెలుసుకొని ఆశ్చర్యానందాలకు గురయ్యారు. శిలాజ ఇంధనాలను అంతం చేయండి... భవిష్యత్తును, భూగోళాన్ని కాపాడండి. – లిసిప్రియ నా నేరం ఏమిటి? నిరసన తరువాత అధికారులు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నేను చేసిన నేరం ఏమిటంటే పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణం అయిన శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించమని అడగడం. నన్ను ‘కాప్ 28’లో లేకుండా చేశారు. – లిసిప్రియ, యాక్టివిస్ట్ -
మెరుపు అర్ధశతకాలు.. విధ్వంసకర శతకం.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు నమోదవుతున్నాయి. నిన్న (డిసెంబర్ 5) మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు రికార్డు స్థాయిలో 427 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే విధ్వంసకర శతకంతో (105 బంతుల్లో 167; 17 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. ఓమ్ బోస్లే (60), కౌశల్ తాంబే (51), రుషబ్ రాథోడ్ (65) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లతో పాటు అజిమ్ ఖాజీ (36), కెప్టెన్ నిఖిల్ నాయక్ (33 నాటౌట్) కూడా మెరుపు వేగంతో పరుగులు చేయడంతో మహారాష్ట్ర జట్టు విజయ్ హజారే టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022 సీజన్లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అదే సీజన్లో పాండిచ్చేరిపై ముంబై చేసిన 457 పరుగుల స్కోర్ రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాయ్ విషయానికొస్తే.. మహా బ్యాటర్ల విధ్వంసం ధాటికి మణిపూర్ బౌలర్ రెక్స్ సింగ్ 10 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్ ప్రియ్‌జ్యోత్ సింగ్ 9 ఓవర్లలో ఏకంగా 94 పరుగులు సమర్పించుకున్నాడు. భిష్వోర్జిత్ 2, కిషన్ సింఘా, రెక్స్ సింగ్, ప్రియ్‌జ్యోత్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యం పెద్దది కావడంతో.. 428 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపూర్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. లక్ష్యం పెద్దది కావడంతో మణిపూర్ బ్యాటర్లు ఆదిలో ఓటమిని ఒప్పేసుకున్నారు. ప్రియ్‌జ్యోత్ (62), జాన్సన్ సింగ్ (62), కెప్టెన్ లాంగ్లోన్యాంబా (76 నాటౌట్) ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. మహా బౌలర్లలో రామకృష్ణ ఘోష్ 2, సత్యజిత్, అజిమ్ ఖాజీ, కౌశల్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. -
ఇంకా చల్లారని మణిపూర్
ఘర్షణల సమయంలో తప్ప సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడూ వార్తలకెక్కని ఈశాన్య భారతం ఇంకా కుదుటపడలేదని మణిపూర్‌లో సోమవారం రెండు సాయుధ బృందాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం తెలియజెబుతోంది. ఈ కాల్పుల్లో 13 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఏడునెలల క్రితం అక్కడ మొదలైన తెగల ఘర్షణల్లో ఇంతవరకూ 175 మంది మరణించారని, 50,000 మంది నిరాశ్రయులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ రాష్ట్రంలో పర్యటించి ఎక్కడెక్కడ మారణకాండ జరిగిందో, తాజా పరిస్థితులు ఎలా వున్నాయో వివరిస్తూ నివేదిక సమర్పించింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంతలోనే తాజా ఉదంతం చోటుచేసుకుంది. మే 3 నుంచి వరస బెట్టి జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలో మెజారిటీగా వున్న మెయితీలకూ, కుకీ–చిన్‌లకూ మధ్య తలెత్తిన ఘర్షణలు ఏ స్థాయికి చేరాయంటే మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా వూరేగించి అత్యాచారాలకు తెగబడటం యథేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. ఘర్షణల సందర్భంగా పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై గుంపులు దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. ఆయుధాలు అప్పగించినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా వీటిల్లో వెనక్కొచ్చినవి స్వల్పం. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడం పర్యవసానంగా హింసాత్మక ఘటనలు మొదలుకాగా, అటు తర్వాత జరిగిందంతా ప్రధాన స్రవంతి మీడియా నిర్వాకమని ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. అది ‘మెయితీ మీడియా’గా మారి పక్షపాతం ప్రదర్శించిందన్నది ఆ కమిటీ అభియోగం. ఆ తర్వాత కమిటీ సభ్యులపై మణిపూర్ సర్కారు కేసులు పెట్టడం, ఆ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించటం వేరే కథ. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా వున్నాయని బీరేంద్ర సింగ్ ప్రకటించి నెల్లాళ్లయింది. అయినా అడపా దడపా ఘర్షణల వార్తలు వస్తూనే వున్నాయి. సోమవారం నాటి ఉదంతం ఈమధ్యకాలంలో పెద్దది. మరణించినవారంతా ఎవరో, ఎక్కడివారో అధికారులు ఇంకా తేల్చలేదు. ఘటన జరిగిన ప్రాంతానికి భద్రతా బలగాల శిబిరం 10 కిలోమీటర్ల దూరంలో వున్నదంటే ఇన్ని నెలల మారణకాండ నుంచి ప్రభుత్వం నేర్చుకున్నదేమీ లేదన్నమాట. హింసాత్మక ఘట నల సంఖ్య తగ్గిందని అధికారులు సంబరపడుతూవుండొచ్చు. కానీ కనబడని హింస పీడిస్తూనే వుంది. సమాజం మొత్తం రెండుగా చీలిపోయింది. మెయితీలు, కుకీలు గతంలో మాదిరి స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నారు. నెలల తరబడి సాగిన హింస పర్యవసానంగా ఆప్తుల్ని కోల్పోయి, ఎంతో విధ్వంసం చోటుచేసుకుని భవిష్యత్తు అగమ్యగోచరంగా వున్నచోట అంతా బాగున్నదని చెప్పటం పరిహాసాస్పదం అవుతుంది. కుటుంబాల్ని పోషించుకోవటానికీ, చదువుకోవటానికీ, ఇతరేతర వ్యాపకాల కోసం వెళ్లటానికీ స్వేచ్ఛ లేని ప్రశాంతత వల్ల సాధారణ పౌరులకు ఒరిగేదేముంటుంది? ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన, అత్యవసరమైన చర్యలు తీసుకొనేవరకూ ఇదంతా సాధ్య పడదు. ముఖ్యంగా ఎక్కడికక్కడ రెండు తెగల నుంచి బాధ్యతాయుత వ్యక్తుల్ని గుర్తించి కమిటీలు ఏర్పాటుచేసి సామరస్యత సాధించే దిశగా ప్రయత్నిస్తే వేరుగా వుండేది. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధ రించిన 24 గంటల్లోగానే తాజా ఉదంతం చోటుచేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఏడు నెలల హింసలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించిన 88 గుర్తు తెలియని మృతదేహాలు ఏడు నెలలుగా ఇంఫాల్‌లోని రెండు ఆస్పత్రుల శవాల గదుల్లో పడివున్నాయి. రెండు తెగలవారూ భయం భయంగా బతుకుతున్న వర్తమానంలో తమ తమ గ్రామాలొదిలి ఇంఫాల్ వరకూ పోవటం, ఆ మృతదేహాలను గుర్తించటం సాధ్యమేనా? హింస కొనసాగుతున్న కాలంలోనూ, ఆ తర్వాతా తమ వారి జాడ తెలియటం లేదని చెప్పినవారు అనేకులున్నారు. వీరిలో అనేకులు కుకీలు కాగా, మెయితీ తెగకు చెందినవారు కూడా వున్నారు. ఆ మృతదేహాలు కల్లోలం సృష్టించటానికి మయన్మార్ నుంచి వచ్చినవారికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నా అందుకు వారి దగ్గర కచ్చితమైన సాక్ష్యా ధారాలు లేవు. ఆదివాసీ నేతల ఫోరం 22 మంది కుకీల జాడ తెలియటం లేదని ఆ మధ్య ప్రకటించింది. గుర్తుతెలియని మృతదేహాల్లో ఇలా అదృశ్యమైనవారివే అధికంగా వుండొచ్చు. ఇక ఎవరి కోసమూ వేచిచూడకుండా ఈ మృతదేహాలను ఖననం చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించటం మణిపూర్‌లో విషాదస్థితికి అద్దం పడుతోంది. ఈపాటికే శాంతి సాధనకు తగిన చర్యలు తీసుకునివుంటే, బాధిత వర్గాల్లో భరోసా కల్పించి నట్టయితే ‘గుర్తు తెలియని మృతదేహాల’ సమస్య వుండేదే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హింసాత్మక ఘటనలకు కారకులైనవారినీ, ఇప్పటికీ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతియుత పరిస్థితులను ఏర్పర్చటం తేలికవుతుంది. ఈనాటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని, అది మెయితీల పట్ల మెతగ్గా వుంటున్నదని ఆది వాసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేసినప్పుడే తమ వారి మృత దేహాలను గుర్తించి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించటం బాధిత కుటుంబాలకు సాధ్యమవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవటం మణిపూర్ సర్కారు బాధ్యత. -
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 13 మంది మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెంగ్నౌపాల్ జిల్లాలో అల్లరిమూకలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనా ప్రాంతంలో దాదాపు 13 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. “ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు లీతు గ్రామంలో 13 మృతదేహాలను కనుగొన్నాయి. మృతదేహాల పక్కన ఎలాంటి ఆయుధాలను గుర్తించలేదు. లీతు ప్రాంతంలో మరణించిన వ్యక్తులు స్థానికులు కాదు. వారు వేరే ప్రాంతం నుండి వచ్చి మరొక సమూహంతో కాల్పులు జరిపి ఉండవచ్చు. చనిపోయిన వారి వివరాలు ఇప్పటికి తెలియదు” అని ఓ అధికారి తెలిపారు. భారత ప్రభుత్వానికి మెయిటీ మిలిటెంట్ వర్గమైన UNLF మధ్య డిసెంబర్ 3న జరిగిన 'శాంతి ఒప్పందాన్ని' తెంగ్నౌపాల్ జిల్లాలోని కుకీ-జో గిరిజన సమూహాలు స్వాగతించాయి. ఈ పరిణామాల తర్వాత డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను మణిపూర్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ధరించింది. ఇదే జిల్లాలో కాల్పుల ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మణిపూర్‌లో మే నెల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. మెయితీ తెగలకు గిరిజన హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చొరవతో కొన్ని రోజులుగా పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ తాజాగా మళ్లీ కాల్పుల ఘటన జరగడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇదీ చదవండి: Mizoram Election Results 2023: సీఎం జోరంతంగాపై విజయ ఢంకా -
బ్యాంకులో పట్టపగలే రూ.18.80 కోట్ల దోపిడీ
ఇంఫాల్: మణిపూర్‌లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు. గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్‌రూంలో బంధించారు. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్‌ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు. -
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్ గుర్తు చేసుకున్నారు రణ్‌దీప్ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. రణదీప్, లిన్ ప్రేమకథ లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. -
లేటు వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, హైవే , సర్బ్జిత్ లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్లో ఉన్న బాలీవుడ్ నటుడు లేటు వయసులె పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను రణ్‌దీప్ పెళ్లి చేసుకోనున్నారు. నవంబర్ 29న మణిపూర్‌లో వీరి వివాహం జరగనుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకకు హాజరు కానున్నారు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహాబంధంతో ఒక్కటి కాబోతున్నారు. డిఫరెంట్ స్టైల్లో వెడ్డింగ్! అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లి అంటే గ్రాండ్ డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ వివాహాం ఇటలీలో అలాగే జరిగింది. అయితే ఈ జంట మాత్రం అందరికంటే భిన్నంగా మహాభారతం పౌరాణిక నేపథ్యంతో వివాహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లిన్ మణిపూర్‌కు చెందిన నటి కాగా.. తనకు కాబోయే భార్య సొంత ఊర్లోనే ఈ వేడుక జరగనుంది. మణిపూర్ సంప్రదాయంలో వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్ ప్లాన్ చేశారు. అయితే దీనిపై పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సీక్రెట్‌గా డేటింగ్! వీరిద్దరు డేటింగ్‌పై సోషల్ మీడియాలో చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ రణదీప్, లిన్ తమ రిలేషన్‌ను ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. 2022లో దీపావళి వేడుకల తర్వాత ఈ జంట తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రణ్‌దీప్ అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. ఆ తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు లిన్ చివరిసారిగా కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. అంతే కాకుండా ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్ వంటి చిత్రాలలో కూడా నటించారు. -
ఇంఫాల్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. -
గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత
ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. -
మణిపూర్ హింస: తొమ్మిది మైతీ సంస్థలపై నిషేధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తొమ్మిది మైతీ తీవ్రవాద గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థలపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాద, విధ్వంసక, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మణిపూర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు సహా, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికరమైన కార్యకలాపాలను చేపడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపలు, భద్రతా బలగాలపై ప్రాణాంతకమైన దాడులకు పాల్పడుతున్నారంటూ పీఎల్ఏ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ )తోపాటు దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సహా తొమ్మిది సంస్థలు, అనుబంధ విభాగాలపై ఐదేళ్లపాటు నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాని రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్)తో పాటు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) దాని సాయుధ విభాగం, మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపీఏ), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఎకే), రెడ్ ఆర్మీ అని పిలవబడే దాని సాయుధ విభాగం కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ(కేసీపీ), రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్ కాన్బలుప్ (కేవైకేఎల్), కోఆర్డినేషన్ కమిటీ (కేఓఆర్కామ్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ (ఎఎస్యూకే)లను చట్టవిరుద్దమైన సంఘాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సంస్థలపై విధించిన నిషేధం సోమవారం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్ ను భారతదేశం నుండి వేరు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజలను ప్రేరేపించడమే ఈ సమూహాల లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ఈ ఏడాది మే 3నుంచి మణిపూర్ మైతీ గిరిజన కుకీ కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు!
దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. తాజా ఘటనలో ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురిని మైతీ ఉగ్రవాదులు అపహరించారు. ఈ సంఘటన ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ వార్త అంతటా వ్యాపించడంతో ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలతో పాటు కాంగ్‌చుప్ ప్రాంతంలో ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురిలో 65 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎం ప్రభాకర్ తెలిపారు. కిడ్నాప్‌కు గురైన మిగతా నలుగురిని నెంగ్‌కిమ్ (60), నీలం (55), జాన్ తంగ్జామ్ హౌకిప్ (25), జామ్‌ఖోటాంగ్ (40)గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’ విధానం ఏ దేశంలో మొదలయ్యింది? -
అడ్డంకులను దూరంగా తన్ని,30 ఏళ్లుగా ఆడపిల్లల కోసం కష్టపడుతూ..
మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్‌బాల్ క్లబ్‌ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్‌బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్‌బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్‌సీ) నడుపుతోంది. ఈ క్లబ్‌కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్‌ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్‌గా ప్రారంభించుకుంది. ‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్‌కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’. ఇద్దరి కథ ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్‌ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్లో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్జామ్. మణిపూర్ వెలుతురు నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్‌ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్‌లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్‌గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం. -
కలవర పెడుతున్న ప్రశ్నలు
ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్–వాష్ స్టేషన్లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్ థీక్ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్‌కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా? రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్ 27 సాయంత్రం ఇంఫాల్ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్.ఎఫ్. (ఇండీజనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది. కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్‌పుర్‌లో అరెస్ట్ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా? కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్.ఎఫ్. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్ లోని పరిణామాలు చురాచాంద్‌పుర్ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు. ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా? యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్ ఆనంద్ సింగ్ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుండి మణిపుర్లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. నా ముగింపు: మణిపుర్ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్ట్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో జరిగిన దారుణ సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో మరోసారి ఆ రాష్ట్రం భగ్గుమంది. కనిపించకుండా పోయిన ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐ చేతికి అప్పగించింది. మణిపూర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా కేసులో దర్యాప్తు చేయగా నిందితులు ఇంఫాల్‌కు 51 కి.మీ. దూరంలో అత్యధిక సంఖ్యలో కుకీలు నివాసముండే చురాచంద్పూర్లో ఉన్నట్లు కనుగొన్నారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిని పావోమిన్లామ్ హవోకిప్, మల్సాన్ హవోకిప్, లింగ్నేచొంగ బైటే, తిన్నీఖోల్‌లుగా గుర్తించారు. మే 3న అల్లర్లకు బీజం పడింది ఈ చురాచంద్‌పూర్‌లోనే. దీంతో భద్రతా దళాలు అప్పట్లోనే ఇక్కడి తిరుగుబాటు వర్గాలతో ఎటువంటి అల్లర్లకు పాల్పడమని హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో నిందితులను పట్టుకున్న భద్రతా దళాలు అక్కడి నుండి వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారని తెలుసుకుని భారీ సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టును చుట్టుముట్టారు. అప్పటికే అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించడంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టు నుండి 5.45 కి ఆఖరి ఫ్లైట్‌లో అసోంలోని గువహతికి తరలించింది సీబీఐ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ఇద్దరు విద్యార్థులు హిజామ్ లువాంబి, హేమంజిత్ హత్య కేసులో ప్రధాన నిందితులను చురాచంద్పూర్లో అరెస్టు చేయడం జరిగింది. నేరం చేసిన వ్యక్తి అందరి కళ్లుగప్పి తప్పించుకోవచ్చేమో కానీ చట్టం చేతుల్లో నుంచి మాత్రం తప్పించుకోలేరు. వారు చేసిన తప్పుకు తగిన శిక్ష పడి తీరుతుందని రాశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కుకీ తిరుగుబాటు గ్రూపులు మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపి మణిపూర్ అల్లర్లకు కారణమయ్యారని.. దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఉగ్రవాదులతో పోరాడుతోందని అన్నారు. హత్య కేసులో నిందితులు దొరికారు కానీ చనిపోయినవారి మృతదేహాల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. I’m pleased to share that some of the main culprits responsible for the abduction and murder of Phijam Hemanjit and Hijam Linthoingambi have been arrested from Churachandpur today. As the saying goes, one may abscond after committing the crime, but they cannot escape the long… — N.Biren Singh (@NBirenSingh) October 1, 2023 ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ హత్య -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్‌లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్‌ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్‌ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్‌లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్‌లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్‌యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్‌లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్‌తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్‌కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన సైనిక కల్నల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్‌లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్‌లోని మోరేతో థాయ్‌లాండ్‌లోని మయీ సాట్‌తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్‌యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్‌యూజీ/పీడీఎఫ్‌తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్‌ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్‌సింగ్‌కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్‌పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్‌ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్‌ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం
ఇంఫాల్: మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. #Breaking: Manipur CM N Biren Singh's residence under Mob attack. Rounds of firing heard as the forces retaliate the attack. Manipur is now a Lawless State#Manipur#IndiaWithCongress pic.twitter.com/Z7U0dvoTE2 — Aman Shukla (@AmanINC_) September 29, 2023 సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. అస్థికలైనా ఇప్పించండి.. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపుర్లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫొటోలు బయటికొచ్చాయి. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. మృతులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ప్రకటించింది. -
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి రాకేష్ బల్వాల్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన హింసాత్మక ఘర్షణలు నాలుగు నెలలుగా కొనసాగుతూనేన్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. తాజాగా జూలైలో కనిపించకుండా పోయిన మైతేయి వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైనట్లు ఫోటోలు బయటకు రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా ఇంఫాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ బల్వాల్ను మణిపూర్‌కు రప్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న రాకేష్ బల్వాల్ను.. తన సొంత కేడర్ అయిన మణిపూర్‌కు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా మరింత మంది అధికారుల అవసరాన్ని పేర్కొంటూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన చేసిన దాదాపు ఒక నెల తర్వాత క్యాబినెట్ నియామకాల కమిటీ దీనిని ఆమోదించింది. ఎవరీ రాకేష్ బల్వాల్? రాకేశ్ బల్వాల్‌మణిపుర్ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మణిపుర్ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018లో ఎన్ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది నాలుగేళ్లపాటు పనిచేశారు. 2019లో పుల్వామా లో జరిగిన భీకర ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ బృందంలో రాకేశ్ సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయ్యారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్నిరోజులుగా మణిపుర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కేడర్ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు రాష్ట్రమంతటా AFSPA చట్టం పరిధిని విస్తరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ మెబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్ఎల్పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్‌లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? -
మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మళ్ళీ మొదలు.. మే 3న మొదలైన అల్లర్లకు మణిపూర్ రాష్ట్రం నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుండటంతో అక్కడ వాతావరణం చల్లారినట్టే చల్లారి అంతలోనే మళ్ళీ అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో ఎలాంటి పరిణామాలను సృష్టించిందో తాజాగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వెలుగులోకి రావడంతో మళ్ళీ అలాంటి ఉద్రిక్తతే నెలకొంది. The students of #Manipur have joined forces to express their solidarity, demanding #Justice4LinthoiNHemanjit. Our commitment to ensuring accountability for the tragic loss of the 2 Students is unwavering. The fact that not a single #Kuki spoke out against the slaughter is awful! pic.twitter.com/s1KAG6hxVt — YumnamEvelyn (@YumnamEvelyn) September 27, 2023 విద్యార్ధులపై లాఠీ.. ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విద్యార్థులంతా ఇంఫాల్ వీధుల్లో నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోని కంగ్లా కోట సమీపంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల దాడిలో సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కల్లోలిత ప్రాంతం.. మణిపూర్ అల్లర్లు జరిగి ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ 23న మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన ప్రభుత్వం తిరిగి మంగళవారం నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. పదేపదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇంఫాల్ లోయ వద్ద 19 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి మిగతా రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అదేవిధంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల అఫ్స్పా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సీఎం బైరెన్ సింగ్ ఇద్దరు విద్యార్థుల కేసులో దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు. The situation in #Manipur is very bad and PM Modi is busy campaigning for his party.#Manipur pic.twitter.com/MQvbraAWXB — Aafrin (@Aafrin7866) September 26, 2023 The students of Manipur continue to protest for justice for the "Murder of Linthoinganbi and Hemanjit" The police can act only on the protests in Imphal. Had they acted like on 3rd May, would the violence be there?#JusticeForLinthoiganbiAndHemanjit #Manipur #Imphal… pic.twitter.com/cmkyFYJYAy — babynongsha (@nongsha_meetei) September 27, 2023 ఇది కూడా చదవండి: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య -
మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
ఇంఫాల్: జూలై నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారని తెలియడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతులను హిజం లింథోయింగంబి(17), ఫిజమ్ హేమ్‌జిత్(20)గా గుర్తించారు. వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం విద్యార్థులు ఇంఫాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. సీఎం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని, దర్యాప్తునకు సహకరించాలని ప్రజలను కోరింది. కిడ్నాప్, హత్యపై దర్యాప్తును సీబీఐకి అప్పగించామని తెలిపింది. విద్యార్థుల హంతకులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై అయిదు రోజులపాటు నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది. అన్ని స్కూళ్లకు శుక్రవారం వరకు సెలవులు ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల అనంతరం రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఈ నెల 23న పునరుద్ధరించిన విషయం తెలిసిందే. మైతేయి వర్గానికి చెందిన హిజం లింథో ఇంగంబి(17) ఆమె స్నేహితుడు ఫిజమ్ హేమ్‌జిత్(20) కలిసి జూలై 6వ తేదీన చురాచంద్‌పూర్‌లోని పర్యాటక ప్రాంతం లండాన్‌కు వెళ్లారు. ఆ తర్వాత వారి జాడ తెలియలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. కుటుంబసభ్యులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వారి మృతదేహాల ఫొటోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక ఫొటోలో ఇద్దరు విద్యార్థుల పక్కన సాయుధులు నిలబడి ఉండగా, మరో ఫొటోలో ఇద్దరి మృతదేహాలున్నాయి. హంతకులను పట్టుకునేందుకు ఇప్పటికే పో లీసు బలగాలు వేట ప్రారంభించాయని సీఎం ఎన్.బిరేన్ సింగ్ తెలిపారు. హత్య ఘటనపై విచారణ చేపట్టేందుకు స్పెషల్ డైరెక్టర్ అజయ్ భటా్నగర్ నేతృత్వంలోని సీబీఐ బృందం ఇంఫాల్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. లాఠీచార్జిలో 45 మందికి గాయాలు విద్యార్థుల కిడ్నాప్, హత్యను నిరసిస్తూ మంగళవారం విద్యార్థులు ఇంఫాల్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు, భద్రతాబలగాలతో బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో 45 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది బాలికలే ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఇటువంటి అమానవీయ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మైతేయి, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
మణిపూర్‌లో వెలుగులోకి మరో ఘోరం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంఇ... ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం రానురానూ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పుడిప్పుడే హింసాకాండ నుంచి రాష్ట్రం కోలుకుంటుండగా మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజాగా మణిపూర్‌లో మరో అఘాయిత్యం వెలుగుచూసింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూలైలో కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక తప్పిపోయిన విద్యార్థులు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్టింట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నెటిజన్లు.. ఈ కేసును చేధించడానికి పోలీసులకు ఇంత సమయం ఎందుకు పట్టిందంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 17 ఏళ్ల హిజామ్ లిన్‌తోఇంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ జూలై నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తాజాగా వారు అడవిలోని గడ్డి మైదానంలో కూర్చుని, వారి వెనకాల కొంచెం దూరంలో సాయుధ గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. చదవండి: నేడు కవిత ఈడీ సమన్ల పిటిషన్ విచారణ ఇందులో లింతోంగంబి తెల్లటి టీ-షర్ట్‌లో ఉండగా, మిస్టర్ హేమ్‌జిత్, బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని, చెక్డ్ షర్ట్‌లో ఉన్నారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు తుపాకీలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్లు కనిపిస్తుంది. జూలైలో ఓ షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు విద్యార్థులు కనిపించినా వారి జాడ తెలియలేదు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రావడం తమ దృష్టికి వచ్చినట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఎలా అదృశ్య మయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? వారిని హత్య చేసిన నేరస్థులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది. హేమ్‌జిత్, లింతోయింగంబి కిడ్నాప్, హత్యకు కారకులైన వారిపై వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, విచారణాధికారులు తమ పని తాము చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులు అధునాతన సైబర్ ఫోరెన్సిక్స్ సాధనాలను ఉపయోగించనున్నారని వీటి ద్వారా ఫోటోలు మరింత స్పష్టంగా చేసి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు తోడ్పడనున్నట్లు తెలిపింది. చదవండి: గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం Indian Media has been mediocre at straightforward stories. Bharka got an A+ on her coverage on Covid. Karan did many insightful coverages in the past. How did all of them fail so spectacularly on multi-layered stories in Manipur where they bit hook, line and sinker on what they… pic.twitter.com/7UF1ljvO3o — Skeeper (@Skeeper10) September 25, 2023 -
ఎట్టకేలకు కాసింత స్వేచ్ఛ!
ఒకటి కాదు... రెండు కాదు... 143 రోజుల తర్వాత మోక్షం లభించింది. కల్లోలిత మణిపుర్‌లోని బీరేన్‌సింగ్ సర్కార్ ఎట్టకేలకు శనివారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. అపరిమిత ఆలస్యం తరువాౖత అయితేనేం, పాలకులు ఇన్నాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసినట్ట యింది. రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు తీసుకున్న చర్యగా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం హర్షించదగ్గ విషయం. మే 3న రెండు ప్రధాన వర్గాల మధ్య ఘర్షణలు మొదలైనప్పుడే నెట్ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ఆ తరువాత జూన్ 25న బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనేక షరతులతో పాక్షికంగా పునరుద్ధరించినా, మొబైల్లో నెట్‌పై ఇప్పటి దాకా నిషేధం కొనసాగింది. నూటికి 95 మంది మొబైల్‌తోనే నెట్ సేవలందుకొనే మన దేశంలో ఇప్పుడీ ఎత్తివేత నిర్ణయం మణిపుర్లో అందరికీ సాంత్వన. కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థకూ, జీవనోపాధికీ పెద్ద ఊపిరి. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైనందు వల్ల’’ ఇప్పుడు మొబైల్ నెట్ సేవల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నామన్నది సర్కారు వారి మాట. మణిపుర్లో పరిస్థితిపై ప్రభుత్వ కథనంలో నిజానిజాలు ఎంత అన్నది చర్చనీయాంశమే. అయితే, నిర్ణయం ఎందుకు తీసుకున్న ప్పటికీ... జనజీవితాన్ని ప్రభావితం చేస్తూ, అసత్యాల వ్యాప్తికి కారణమవుతున్న నిషేధాన్ని ఎత్తి వేయడం కచ్చితంగా సమంజసం. అందులో మరో మాట లేదు. మణిపుర్లో పర్యటించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బృందం సైతం ఇంటర్నెట్ సేవల నిషేధం చెడు చేసిందని పేర్కొన్న సంగతి మర్చిపోలేం. ఇంటర్నెట్ లేక, నిజనిర్ధారణకు వీలు లేక మీడియా చివరకు ప్రభుత్వపు గూటి చిలకగా మారి, ఆ గూటి పలుకులే పలికే దుఃస్థితి తలెత్తిందని విమర్శలు వచ్చాయి. సత్యనిష్ఠ గల మీడియా లేకపోవడంతో, అదే సందుగా పుకార్లు షికార్లు చేశాయి. విద్వేషవ్యాప్తితో అగ్నికి ఆజ్యం పోశాయి. అలాంటి ఓ పుకారే చివరకు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనకు దారి తీసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మణిపుర్ ఘర్షణల్లో 175 మందికి పైగా బలి కాగా, 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. జీవితాలు చెల్లాచెదరయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు కాల యాపన చేశాయి. ఫేక్ న్యూస్ ఆపుతామంటూ పెట్టిన నెట్ నిషేధం అసలు న్యూస్ ఏమిటో ప్రపంచానికి అందకుండా చేసింది. అసలు సమస్య ఎక్కడుందో ముందే కనిపెట్టి, బలగాలు త్వరితగతిన చర్యలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇవాళ ప్రజలు పూర్తిగా రెండు శిబిరాలుగా చీలిపోయే పరిస్థితిని కొనితెచ్చింది. గతంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు ఇంట ర్నెట్పై నిషేధం నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా దాదాపు 5 నెలల దీర్ఘకాలం నెట్ సేవలపై కట్టడి కొనసాగింది మణిపుర్‌లోనే! గత అయిదేళ్ళలో ప్రపంచంలో మరే దేశమూ చేయనన్నిసార్లు భారత్ నెట్‌పై కట్టడి పెట్టింది. ఒక్క 2022లోనే 84 సార్లు నెట్ షట్డౌన్లు సాగాయి. ఏ కొద్ది నిరసన తలెత్తినా అణచివేసేందుకు నెట్ నిలిపివేత కొత్త రాజకీయ నియంత్రణ సాధనంగా మారడం విషాదం. రష్యా, సూడాన్, ఇరాన్, మయన్మార్, ఇథియోపియా సహా నిరంకుశ పాలన సాగే అనేక దేశాల్లో కన్నా మన ప్రజాస్వామ్య భారతంలోనే ఇంటర్నెట్ సేవల్ని తరచూ ఆపేయడం విడ్డూరం. నిజానికి, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ‘అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (2020) కేసులో సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం,ఇంటర్నెట్ను ఉపయోగించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులనీ, నెట్‌పై నిషేధం వాటికి భంగం కలిగించడమేననీ కోర్ట్ అప్పుడే తేల్చింది. అత్యవసరమై నిషేధం పెట్టినా దాన్ని పొడిగిస్తూ పోరాదనీ చెప్పింది. ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవట్లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం మానేసి, దానికి ప్రత్యామ్నాయం నెట్‌పై నిషేధమే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇది పరిష్కారం కాదని సుప్రీమ్ తప్పుబట్టింది. కానీ, ఇప్పటి దాకా మణిపుర్ సర్కార్ చేసింది అదే. తాజాగా ఈ మార్చిలో పంజాబ్‌లో వేర్పాటువాద నేత పరారీ, జూలైలో హర్యానాలో మతఘర్షణల సమయంలో ఇతర ప్రభుత్వాలూ ఆ పనే చేశాయి. మణిపుర్లో మైతేయ్‌లకూ, కుకీలకూ మధ్య పేరుకున్న విద్వేషాన్ని పోగొట్టాలంటే పాలకులు చేయాల్సిన పని వేరు. ముందు సమన్యాయం పాటించాలి. అందరితోనూ సుహృద్భావ పూర్వక చర్చలు జరపాలి. తీవ్రవాద వర్గాన్ని ఏకాకిని చేయాలి. సమాజంలో సహనం, శాంతి, పరస్పర విశ్వాసం నెలకొనేలా ఒక్కొక్క అడుగూ వేయాలి. కానీ, ఒక వర్గానికే కొమ్ము కాస్తూ, సొంత సహచరుల నమ్మకమే కోల్పోయిన పాలకుడికి అది కష్టమే! ఇప్పటికీ మణిపుర్ సాధారణ స్థితికి రాలేదని వార్త. కానీ, అందుకు నెట్‌పై విరుచుకుపడడం సరికాదు. ఆ వివేకం ఇన్నాళ్ళకు మన పాలకులలో మేలుకొన్నట్టుంది. ‘డిజిటల్ ఇండియా’ స్వప్నంతో, నెలకు వెయ్యి కోట్ల సంఖ్యలో డిజిటల్ చెల్లింపులతో రొమ్ము విరుచుకుంటున్న దేశం తరచూ నెట్ ఆపేస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అది చెల్లదు. నెట్ నిషేధంతో మణిపుర్ 60 లక్షల డాలర్లు, దేశవ్యాప్తంగా 400 కోట్ల డాలర్లు నష్టం వచ్చిందని అంచనా. బ్రిటీషు కాలపు టెలిగ్రాఫ్ చట్టం–1885ను అడ్డం పెట్టుకొని కోర్టులకు చిక్కకుండా యథేచ్ఛగా నెట్‌పై నిషేధం పెట్టడం పాలకులకు శోభనివ్వదు. మణిపూర్ ఉదంతంతోనైనా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకొని, తీరు మార్చుకుంటే మనుషులకూ, మానవ హక్కులకూ మేలు. -
ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్‌ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశి్చమ జిల్లా తరుంగ్ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్‌థంగ్ కొమ్.. కంగ్పొక్పి జిల్లా లీమఖోంగ్లోని ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ప్లటూన్‌లో విధులు నిర్వర్తిస్తన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం ఖునింగ్‌థెక్ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. -
Manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్‌ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్‌గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు. కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్‌లోని 12 మంది జూన్‌లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని చెబుతూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. #WATCH | The State government has filed an FIR against the members of the Editors Guild who are trying to create more clashes in the state of Manipur, says CM N Biren Singh. pic.twitter.com/gm2RssgoHL — ANI (@ANI) September 4, 2023 ఇది కాకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ఇంఫాల్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఎం.శరత్ సింగ్ ఆగస్టు 7 నుంచి 10 లోపు మణిపూర్ వచ్చిన సీమా గుహ, సంజయ్ కపూర్, భారత్ భూషణ్‌లతో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆ ఇండియా ప్రెసిడెంట్ పైన కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నివేదికలో ఉన్నఅనేక తప్పిదాలను సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్లో ఏకరువు పెట్టారు. ఎఫ్ఐఆర్లో మే 3న నిప్పుల్లో కాలుతోన్న మణిపూర్ అటవీ శాఖాధికారి గృహం ఫోటోకు కింద 'తగలబడుతున్న కుకీ గృహం' అని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అదే రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను జతచేశారు. ఆ స్టేషన్ ఎస్ఐ జంగ్ఖొలాల్ కిప్జెన్ మాట్లాడుతూ ఇది కుకీలు నివాసం కాదని అల్లర్ల సమయంలో నిరసనకారులు తగలబెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇల్లని స్పష్టం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న ఎడిటర్స్ గిల్డ్ తమ తప్పును అంగీకరిస్తూ సెప్టెంబర్ 2న ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంటూ.. అసలు వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. There was an error in a photo caption in the report released on Sep 2. The same is being rectified and updated report will be uploaded on the link shortly. We regret the error that crept in at the photo editing stage — Editors Guild of India (@IndEditorsGuild) September 3, 2023 అంతకు ముందు ఎడిటర్స్ గిల్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మయన్మార్ మిలటరీ తిరుగుబాటు కారణంగా అక్కడి నుండి వలస వచ్చిన వారితో కలిపి మణిపూర్ ప్రభుత్వం కుకీలను కూడా వలసదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించి మణిపూర్ ప్రభుత్వం అత్యధికులు ఆగ్రహానికి కారణమైందని రాసింది. ఈ విషయాన్ని కూడా శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో ప్రస్తావిస్తూ అక్రమ వలసదారులకు సంబంధించి ఈజీఐ కీలక సమాచారాన్ని ప్రచురించలేదని 2001తో పోలిస్తే సెన్సస్ 169 శాతం పెరిగిందని.. దీనిపై వారు కథనాన్ని ప్రచురించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇటీవల ఎలక్షన్ కమీషన్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని సుమారు 1,33,553 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా వారు గుర్తించారని తెలిపారు. కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేవలం 10 శాతం అభివృద్ధి ఐదులను మాత్రమే వినియోగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనం కూడా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులలో దాదాపు 40 శాతం గిరిజనులు నివసించే కొండప్రాంతాలకే వెచ్చింస్తోందని తెలిపారు.. ఇలా అడుగడుగునా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనేక తప్పుడు కథనాలను ప్రచురించి పజాలను ఏమార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. State Government had stated on the floor of the Assembly in 2021 regarding the budget allocation for the Valley and Hills across all departmental works. A committee was formed to check the fund inflow over the last 10 years, the methodology was also explained. There has been a… pic.twitter.com/w8MuIumve9 — Rajkumar Imo Singh (@imosingh) August 24, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
మణిపూర్‌లో ఆరని కాష్టం.. మళ్ళీ అల్లర్లు
ఇంఫాల్: నాలుగు నెలల క్రితం మణిపూర్‌లో రగిలిన హింస తాలూకు కాష్టం ఇంకా మండుతూనే ఉంది. తాజాగా వారం రోజుల క్రితం ఆగస్టు 29న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ రగులుకుంది. ఈ హింసలో మరో 8 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్‌లో మిగిలిన కుకీ కుటుంబాలను బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి సాయుధ దళాలు. మెయిటీలు అత్యధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుండి అక్కడ మిగిలి ఉన్న స్వల్ప సంఖ్యాకులైన కుకీలను బలవంతంగా కొండప్రాంతానికి తరలించాయి అక్కడి భద్రతా దళాలు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధ దళాలు తమ ఇంటిని తలుపులను బలంగా కొట్టి నిద్రలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా తరలించారని అన్నారు అక్కడ నివసించే ఓ పెద్దాయన. లంబులానే ప్రాంతం నుండి తరలించబడింది రెవరెండ్ ప్రిమ్ వైఫే, హెజాంగ్ కిప్జెన్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కేంద్ర భద్రతా దళాలు కనీసం తమ వస్తువులను వెంట తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతోనే తమను బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారని అక్కడే ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా నివసించే కంగ్పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి తరలించారని అన్నారు. కేంద్ర భద్రతా దళాలు మాకు భద్రతా కల్పించాల్సింది పోయి ఇలా బలవంతంగా మమ్మల్ని తరలించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. భారతదేశం లాంటి మహోన్నత దేశం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో విఫలమై సంఘ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లొంగిపోయి పౌరులకు భద్రత కల్పించడంలో మన వ్యవస్థ దారుణంగా విఫలమైందని అన్నారు. ఈ బలవంతపు తరలింపులో భద్రతా దళాలు మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని తరలించామని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లరి మూకలు మూడు పాతబడ్డ ఇళ్లను దహనం చేశారని మిగిలిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని సమాచారం రావడంతో వారిని హుటాహుటిన అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు. మెయిటీలకు గిరిజన తెగగా గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. నెలరోజులకు పైగా కొనసాగిన ఈ హింసాకాండలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 50000 మంది తమ ఇళ్లను విడిచిపోయారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే అనిపించినా ఈ మధ్యనే పశ్చిమ ఇంఫాల్‌లో మళ్ళీ అల్లర్లు జరగడంతో ఇంఫాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
మణిపుర్ గాయాల్ని మాన్పాలంటే...
మణిపుర్ పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మణిపుర్ ఏళ్లుగా తుపాకుల నీడలో, మత్తుమందుల ప్రభావంలో, బలవంతపు వసూళ్ల మధ్య బతికింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి న్యాయమైన అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇదే. రాజకీయంగా చర్చలు ప్రారంభించాలి. ఆర్థిక పరిపుష్టికి ఊతమివ్వాలి. మణిపుర్‌లోని అన్ని తెగలు కూడా దృఢమైన, న్యాయమైన పాలన కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రపతి పాలనలో సమర్థమైన అధికార యంత్రాంగం మణిపుర్‌ను మళ్లీ సరైన మార్గంలో పెట్టగలదు. మణిపుర్ నివురుగప్పిన నిప్పులా అసందిగ్ధ భవిష్యత్తుకేసి చూస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, దుకాణాలు, రహదారులు కూడా ధ్వంస మైపోయి రాష్ట్రం నిర్జీవమైన మట్టిదిబ్బ రూపం సంతరించుకుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపుర్ ప్రస్తావన పార్లమెంటులో వచ్చింది. కానీ ఇరుపక్షాల పరస్పర నిందారోపణలతో ఒరిగింది శూన్యం. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో అసాం రైఫిల్స్, మణిపుర్ పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం కూడా పరిస్థితి మరింత దిగజారేందుకు కారణమైంది. ఈ ఏడాది మే 4న కాంగ్పోకీ జిల్లాలో ఇద్దరు అమాయక మహిళలపై జరిగిన అకృత్యాలు సుప్రీంకోర్టును సైతం నిర్ఘాంతపోయేలా చేశాయి. రాష్ట్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించగా కొందరి ప్రయోజనాలు, పక్షపాతాలతో రాజకీయాలు నడిచాయి. జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగితే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా అస్సలు సహించరాదు. అధ్వాన్నమైన స్థితి ఏమిటంటే... సంఘటన జరిగిన తొలిరోజే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం. వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు ఇంతకంటే బలమైన కారణం కని పించదు. కొన్ని రోజుల తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. పోలీసులు, నాయకులు తమ బాధ్యతలను విస్మరించి, వారి వారి తెగల్లో హీరోలు కావాలని అనుకుంటే ఇంతకంటే ఎక్కువేమీ ఆశించలేము. ఈ ఘటన తరువాతి రోజే ఇంఫాల్‌లో కార్లు కడిగే పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై దారుణమైన నేరం జరిగింది. రాష్ట్రం స్పందన భిన్నంగా ఏమీ లేదు. దౌర్భాగ్యకరమైన స్థితి ఏమిటంటే, ఈ మూక దాడుల్లో మహిళలూ భాగస్వాములు కావడం! రాష్ట్ర పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసు కోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. నిఘా వర్గాలు కూడా దీనిపై కచ్చితంగా నివేదిక అందించే ఉంటాయి. రాష్ట్రం తనదైన కారణాలతో నోరు మెదపదు కానీ అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. నిబద్ధత కలిగిన హోంశాఖ కార్యదర్శి ఎవరైనా సరే... మణిపుర్ ఘటనపై సీరియస్‌గా స్పందించి ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలుతున్న వైనాన్ని గమనించి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా సిఫారసు చేసేవారు. అయితే జరిగిందేమిటి? ఎత్తుకెళ్లిన ఆయుధాలు తిరిగి ఇచ్చేయండి సామీ అని రాష్ట్ర డీజీపీ స్వయంగా బతి మాలడం, ఆయుధాల సేకరణ కోసం రాజకీయ నేతల ఇళ్ల ముంగిట్లో డ్రాప్‌బాక్స్‌ల ఏర్పాటుచేయడం! మణిపుర్ విషయంలో కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదే. రాష్ట్రం సాధారణ స్థితికి చేరుకుని తన కాళ్లపై తాను నిలబడగలగాలంటే కనీసం రెండేళ్లపాటు రాజకీయాలను దూరంగా పెట్టాలి. నిష్పక్షపాతమైన, ప్రొఫెషనల్‌గా వ్యవహరించే యంత్రాంగం పాలనా విధులు చేపట్టాలి. మణిçపుర్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ కార్యాచరణ అనుసరించడం మేలు: 1. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా వ్యవహరించలేకపోయిన, ప్రజల నైతిక మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి. కుకీలతోపాటు కొందరు మైతేయిల్లోనూ ముఖ్యమంత్రిపై విశ్వాసం పోయింది. శాంతిభద్రతలు భయంకరంగా ఉన్నాయని బీజేపీ నేతలే కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడం ద్వారా ప్రధానమంత్రి రాష్ట్రానికి మాత్రమే కాకుండా, తనకు తాను మేలు చేసుకున్న వారవుతారు. 2. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రంలోని విశ్రాంత అధికారుల్లో సమర్థులను ఎన్నుకుని గవర్నర్‌గా నియమించాలి. 3. ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖల నుంచి ఒక్కొక్కరిని గవర్నర్‌కు సలహాదారులుగా నియమించాలి. జి.ఎస్.పంధేర్, హర్జీత్ సంధూ, ఎ.ఎన్.ఝా, నిఖిలేష్ ఝా, జాన్ షిల్సీ, జర్నేల్ సింగ్, బీ.ఎల్.వోహ్రా లాంటి అత్యుత్తమ అధికారులను పరి గణనలోకి తీసుకోవచ్చు. ఆర్థిక, పారిశ్రామిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఆర్థికరంగ నిపుణులు ఒకరిని కూడా సలహాదారుగా నియ మించుకోవచ్చు. 4. ప్రత్యేక హక్కుల చట్టంతో సైన్యాన్ని తీసుకు రావద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రాన్ని పాలించలేమన్న సంకే తాన్ని పంపడం అనవసరం. పైగా ఏఎఫ్ఎస్పీఏతో సైన్యాన్ని దింపితే అది పాత గాయాలను మళ్లీ రేపవచ్చు. 5. క్షేత్రస్థాయి పోలీసింగ్ మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అవసరమైతే జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను డిప్యుటేషన్‌పై బయటి రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చు. 6. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారిని ‘సిట్’లు అరెస్ట్ చేసేలా చూడాలి. దుండగుల చేతుల్లో 4,500 ఆయుధాలున్నాయంటే మణి పుర్ ఇప్పుడు సాయుధ రాష్ట్రమనే లెక్క. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారి పేర్లు వెల్లడించకపోతే తగిన చర్యలుంటాయని పోలీసులను హెచ్చరించాలి. దోపిడి సమయంలో అక్కడే ఉన్నవారిపై చట్టపరమైన విచారణ జరగాలి. 7. మిలిటెంట్లకు వ్యతిరేకంగా భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగిస్తున్న మహిళా వర్గాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. తగినంత మంది మహిళ అధికారిణులు, సిబ్బందిని ఈ కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. 8. నిందితుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, నేర విచారణ బృందాలను ఏర్పాటు చేయాలి. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితుల్లో కలిగించేందుకు ఇది అత్యవసరం. 9. కుకీ మిలిటెంటు గ్రూపులు ఇరవై ఐదింటిపై చర్యలను నిలిపి వేయడంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. పద్నాలగు క్యాంపుల్లోని 2,200 మంది కేడర్ వద్ద ఉన్న ఆయుధాలను సమీక్షించాలి. కుకీ, మైతేయి మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న బలవంతపు వసూళ్ల చెక్ పోస్టులను పెకిలించాలి. నల్ల మందు మాఫియాపై స్థానిక పోలీసులు కఠిన చర్యలకు దిగాలి. ఈ మాఫియాలో కొందరు రాజకీయ నేతలూ మిలాఖత్ అయి ఉన్నారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న అదనపు ఎస్పీ థౌనావోజామ్ బృందం తనకు తగిన మద్దతు లేదని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటువంటి వారిని మళ్లీ నియమించుకుని డ్రగ్ మాఫియా ఆటలు కట్టేలా చూడాలి. 10. నిరాశ్రయులైనవారు మళ్లీ తమ ఇళ్లకు చేరుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయాలి. పాలన యంత్రాంగ చక్రాలు కదలడం మొదలై, అది ప్రజలకు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టిన తరువాత రెండో దశ కార్య కలాపాలకు శ్రీకారం చుట్టాలి. పోలీసు కౌన్సిల్స్ ఏర్పాటు చేసి అందులో తటస్థులైన విద్యావేత్తలు, జర్నలిస్టులు, పౌర సమాజపు సభ్యులను చేర్చాలి. గతంలో భయంతో లేదా తమ తెగలకు నిబద్ధంగా ఉండాలన్న కారణంతో కొందరు సభ్యులు రాజీనామా చేశారు. తటస్థులను సభ్యులుగా చేయడం ద్వారా శాంతి స్థాపన సాధ్యం. చివరగా... ఘర్షణల సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తెగువ చూపిన వారిని బహిరంగంగా గౌరవించాలి. కుకీలున్న చోట మైతేయిలను, మైతేయిల ప్రాబల్యం ఉన్న చోట కుకీలను కాపాడిన ఘటనలు కోకొల్లలు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరి ష్కారం దీర్ఘకాలికమైందిగా ఉండాలి. ప్రతి తెగకూ తమ బాధలు చెప్పుకునేందుకు అనువైన వేదిక, ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదులు ఆయుధాలు వదిలేయడం సాధ్యమవుతుంది. కంచెలు, కందకాలు తొలగిపోతాయి. యశోవర్ధన్ ఆజాద్ కేంద్ర మాజీ సమాచార కమిషనర్,విశ్రాంత ఐపీఎస్ అధికారి, డీప్స్ట్రాట్ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మణిపుర్ గవర్నర్ మౌనమేల?
ఇంటి దీపమని ముద్దాడితే మీసాలు తెగకాల్చిందని సామెత. మణిపుర్లో కల్లోలం జాడలు కనబడి నప్పుడు అక్కడున్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే కదా అని ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వానికి తదుపరి కర్తవ్యం బోధపడటం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. సోమవారం ప్రారంభం కావాల్సిన మణిపుర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురించి 24 గంటలు గడిచినా అతీగతీ లేకపోవటం దాన్నే సూచిస్తోంది. ఆగస్టు మూడోవారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గత నెల 27న కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన సిఫార్సును ఈనెల 4న లాంఛనంగా గవర్నర్ అనసూయ ఊకే ఆమోదానికి పంపారు. అసెంబ్లీ ప్రోరోగ్ అయింది గనుక నిబంధనల ప్రకారం పక్షం రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలపై రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. హింసాకాండ మొదలై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడలేదన్నద వాస్తవం. హత్యాకాండలో 160 మందికి పైగా మరణించగా వందలాది మంది పౌరులు గాయ పడ్డారు. బాధితులు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకునే పరిస్థితులే ఉన్నాయి. భద్రతా బల గాలు సోదాలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించిన మారణాయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకుంటున్నాయి. వివిధ నేరాలతో సంబంధమున్నదని భావిస్తున్న దాదాపు 1,500 మందిని అరెస్టు చేశారు. అయినా చెదురుమదురుగా ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగు తూనే ఉన్నాయి. మరోపక్క కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా ప్రత్యర్థి మైతేయి తెగ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఇంఫాల్–అస్సాంలోని సిల్చార్‌ల మధ్య ఉన్న 37వనంబర్ జాతీయ రహదారిని కుకీలు దిగ్బంధించారు. ఇంఫాల్–నాగాలాండ్‌లోని దిమాపూర్ మధ్య గల రెండో నంబర్ జాతీయ రహదారిపై సైతం ఉద్యమకారుల దిగ్బంధంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి. సమస్యల వలయం నుంచి మణిపుర్ ఇంకా బయటపడలేదన్నది నిజం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా తాము హాజరుకావటం అసాధ్యమని వివిధ పార్టీల్లోని కుకీ తెగ శాసనసభ్యులు పదిమంది గవర్నర్‌కు విడివిడిగా వినతిపత్రాలు పంపిన మాట కూడా వాస్తవం. ఇందులో ఇద్దరు సభ్యులున్న అధికార కూటమి భాగస్వామ్య పార్టీ కుకీ పీపుల్స్ అలయెన్స్ కూడా ఉంది. నాగా తెగకు చెందిన మరో పదిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావొద్దని మణిపుర్‌లోని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) కోరడాన్ని విస్మరించలేం. అంతేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర సమగ్రత పరిరక్షణకు తీర్మానం చేయాలని మైతేయిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ (కొకోమీ) గత జూలైలో జరిపిన ర్యాలీలో మాండ్ చేయటం కూడా వాస్తవమే. అలాగని కేబినెట్ సిఫార్సుపై గవర్నర్ మౌనం వహించటం సరికాదు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉనికిలో ఉంది. 60 మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఇప్పటికైతే మెజారిటీ ఉంది. ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించలేదు. అసెంబ్లీ కూడా రద్దు కాలేదు. మణిపుర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వర్షా కాల సమావేశాలు నిర్వహించాల్సివుంది. అంటే వచ్చే నెల 2లోగా అసెంబ్లీ సమావేశం కావాలి. అటువంటప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? గవర్నర్ విధి నిర్వహణ మంత్రివర్గం సలహాలకు లోబడివుంటుందని రాజ్యాంగంలోని 163వ అధి కరణ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లేదా దాని ప్రోరోగ్, అసెంబ్లీ రద్దు అధికా రాలు గవర్నర్‌కు ఉంటాయని 174వ అధికరణ వివరిస్తోంది. అయితే మంత్రివర్గాన్ని సంప్రదించి మాత్రమే ఈ అధికారాలను వినియోగించాల్సి వుంటుందని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో తీర్పునిచ్చింది. మణిపుర్లో రాజ్యాంగసంక్షోభం ఏర్పడిందని గవర్నర్ భావించివుండొచ్చు. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని అనుకొని వుండొచ్చు. అదేమిటో ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు లేదా? అంతా సవ్యంగా ఉందనుకుంటే సమావేశాల నోటిఫికేషన్ విడుదలకు అభ్యంతరం దేనికి? సమస్యలున్నప్పుడే ప్రజలెన్నుకున్న సభల ప్రాధాన్యత పెరుగుతుంది. చుట్టుముట్టిన ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింపజేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తే, సభ్యుల అభిప్రా యాలు పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రజానీకానికి భరోసా ఇవ్వగలిగితే దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే చర్య కూడా. చిత్రమేమంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్దార్థ్ మృదుల్‌ను నియమించాలన్న జూలై 5 నాటి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఫైలును మణిపుర్ సర్కార్ ఆమోదానికి కేంద్రం పంపింది. అదేమైందో తెలియదు. మణిపుర్లో సర్కారు ఉంటే అది సక్రమంగా పని చేస్తున్నదో లేదో తేల్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. నిరవధిక అనిశ్చితి మణిపుర్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతుందని అందరూ గుర్తించాలి. -
'మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ హింస చెలరేగింది. తుంగ్ఖుల్ నాగా జనాభా అధికంగా ఉండే ఉఖ్రూల్ రీజియన్‌లోని తోవాయి కుకీ అనే గ్రామంలోముగ్గురిని కాల్చి చంపింది అల్లరి మూక. ఉఖ్రూల్ ఎస్సీ నింగ్షెమ్ వషుమ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం వేకువ ఝామున 4.30.గం. ప్రాంతంలో తోవాయి కుకీ గ్రామానికి కాపలాగా ఉన్న ముగ్గురిని ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈలోపు కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్‌పోస్ట్‌కు వచ్చి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో కొనసాగుతున్న గిరిజన-గిరిజనేతర వర్గపోరులో భాగంగానే ఈ కాల్పులు జరిగాయని ఎస్సీ ధృవీకరించారు. కాల్పులు జరిగింది మారుమూల గ్రామంలో కావడం, భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేకపోయామని ఎస్సీ వెల్లడించారు. ఇక మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో గత రెండు నెలలుగా గ్రామస్తులే తమ యువతను కాపలాగా ఉంచుతూ వస్తున్నారు. ఈ ఘటన ప్రభావం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా భద్రతా బలగాలు మోహరించాయి. -
దాదాపు 23 ఏళ్ల తర్వాత సినిమా ప్రదర్శన.. ఎక్కడంటే!
ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు గిరిజన తెగల మధ్య మొదలైన వివాదం హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే మణిపూర్ ఘర్షణల నుంచి మెల్లగా కోలుకుంటోంది. అయితే మణిపూర్‌లో 2000 సెప్టెంబర్‌లో హిందీ సినిమాలపై నిషేధం విధించారు. మైటీ తెగకు చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ అప్పట్లో బాలీవుడ్ సినిమాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. (ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) అయితే దాదాపు 23 ఏళ్ల తర్వాత హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు హిందీ సినిమాను ప్రదర్శించారు. విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రాన్ని చురచంద్‌పూర్‌లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించారు. మైటీ గ్రూపులు అవలంభిస్తున్న దేశ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని గిరిజన నాయకుల ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ ప్రకటనలో తెలిపారు. భారత్‌పై తమ ప్రేమను చాటేందుకు సినిమాను ప్రదర్శించామని అన్నారు. కాగా.. చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని అలపించారు. కాగా.. మణిపూర్‌లో చివరి హిందీ చిత్రం 1998లో కుచ్ కుచ్ హోతా హై ప్రదర్శించినట్లు హెచ్ఎస్ఏ వెల్లడించింది. (ఇది చదవండి: లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!) Uri: The Surgical Strike (2019) was screened in Churachandpur after more than 2 decades of Hindi movies ban in Manipur by VBIGs. pic.twitter.com/QpLvYTNiTT — Thongkholal Haokip (@th_robert) August 15, 2023 -
మణిపూర్ అల్లర్లు.. 3 వేల మందికి రెడీమేడ్ ఇళ్లు
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో నిరాశ్రయులైన 3 వేల కుటుంబాలకు మొదటి విడతలో ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూన్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించించింది. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వేలాదిమంది ప్రభుత్వం నిర్వహిస్తున్న తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.బ్రోజెంద్రో వివరాలు వెల్లడించారు. ‘రహదారుల దిగ్బంధం కారణంగా ఇంటి సామగ్రి రవాణా కష్టంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని విమానాల ద్వారా అక్కడికి తరలిస్తున్నాం. పశ్చిమ ఇంఫాల్‌లోని సెక్మాయ్, తూర్పు ఇంఫాల్‌లోని సవోంబుగ్ల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. వైరి వర్గాల మధ్య కాల్పుల ఘటనల కారణంగా క్వాక్తా ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది’ అని చెప్పారు. చదవండి: బీజేపీ భారత్ వీడిపో అబద్ధాలు, అతిశయోక్తులు: కాంగ్రెస్ స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులు, శుష్కవాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్వాతంత్య్రదినోత్సవ వేళ దేశ ప్రజలందరినీ ఏకతాటికి పైకి తేవాల్సిన ప్రధాని ప్రసంగంలో తన గొప్పలు, ప్రతిష్ట గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని పేర్కొంది. స్వాతంత్య్రదినోత్సవం నాడు ప్రధాని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే భారత్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దగలరని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందో చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలా మార్చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. -
హింసా సంస్కృతి ఏ సందేశానికి?
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్ శక్తిమంతంగా పనిచేస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్ ఇంజన్‌తో, అంటే రెండో ఇంజన్ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు. వాస్తవానికి మణిపుర్లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్ ఇంజన్’ పవర్‌తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్ – ఆరెస్సెస్. మూడవ ఇంజన్ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్. 1999లో బీజేపీ, ఆరెస్సెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోంది. రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్‌పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్ అయిన ఆరెస్సెస్ ప్రమేయం లేకుండా... మణిపుర్లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్ ఇంజన్. స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’. ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్సంఘ్ చాలక్ మాట్లాడుతున్నారు. మణిపుర్లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు! నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్ నింపిన ఆ ఇంజన్‌కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్‌కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్ ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మణిపుర్లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
ఇంఫాల్: మణిపూర్‌లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో కలిసి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది. 'మణిపూర్‌కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్‌నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు. 'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్ అన్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్‌లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
మణిపుర్‌కు దక్కిందేమిటి..?
గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. మోదీ వాక్పటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన రెండు గంటల పది నిమిషాల సుదీర్ఘ ప్రసంగం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగి, ఆయన సభకు రావటం అటు విపక్షాలతోపాటు ఇటు అధికార పక్షానికి కూడా కలిసొచ్చింది. విపక్ష స్వరం దీటుగా వినబడ టానికి రాహుల్ దోహదపడితే... ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగేందుకు అధికారపక్షానికి అవకాశం చిక్కింది. అయితే క్షతగాత్రగా మారిన మణిపుర్‌కు ఏమాత్రం సాంత్వన చేకూర్చామన్నది ఇరుపక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సేవుంది. ఇది గతంలో అనేకమార్లు సభలో చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానాలవంటిది కాదు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి దాగుందంటూ 2018లో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంతో కూడా దీన్ని పోల్చలేం. ఇది యావత్తు సమాజమూ సిగ్గుతో తలదించు కోవాల్సిన దురదృష్టకర ఉదంతాల పర్యవసానంగా చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం. మణిపుర్లో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులేర్పడటం, పరస్పరం భౌతిక దాడులు చేసుకోవటం, నివాసాలు తగలబెట్టుకోవటంతో మొదలై... చివరకు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టే హీన స్థితికి చేరు కోవటం చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రజలు చెట్టుకొకరూ, పుట్టకొకరూ కావటం, అలా వెళ్లలేనివారిని సాయుధ మూకలు చిత్రవధ చేయటం, పోలీసులే తమ కస్టడీలో ఉన్న మహిళలను సాయుధ గుంపులకు అప్పగించాన్న ఆరోపణలు రావటం మామూలు విషయం కాదు. ఈ హింసాపర్వం మొదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెల కొనకపోవటం, పోలీసులూ, కేంద్ర బలగమైన అస్సాం రైఫిల్స్ పరస్పరం నిందారోపణలు చేసు కోవటం దిగ్భ్రాంతికరం. ఆఖరికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబిస్తున్న సమయంలో కూడా మే 3 నాటి మరో దారుణ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె ఇంటిని తగులబెట్టారన్నది ఆ ఉదంతం సారాంశం. ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లే సాహసం చేయలేనివారు వేలాదిమందివుంటే, వెళ్లినవారు భయాందోళనల్లో మునిగి తేలు తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేయటంలో అవి శ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రం వంటిది. అందునా రాక్షసమూకల కొమ్ముకాసిందన్న ఆరోపణలెదుర్కొంటున్న మణిపూర్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదు. మూడురోజులపాటు ఇరుపక్షాల నేతలూ ప్రసంగించారు. అయితే ఆ వాగ్ధాటి హోరులో మణిపుర్ విషాదం మరుగున పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన అంశాన్ని మరిచి సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, అర్థరహితమైన ఆరోపణలూ విసురు కుంటూ రెండు పక్షాలూ కాలక్షేపం చేశాయి. వర్తమాన దుఃస్థితికి గతంలో పాలించిన కాంగ్రెసే కారణమని అధికారపక్షం అంటే... కేంద్ర బలగాలను ఉద్దేశపూర్వకంగానే వినియోగించుకోలేదనీ, అందువల్లే ఇంతటి హింస చెలరేగిందనీ విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్ గురించి సవివరమైన ప్రకటనే చేశారు. అమిత్ షాయే మాట్లాడతారని మొదటినుంచీ అధి కారపక్షం చెబుతోంది. కాదు, ప్రధానే మాట్లాడాలన్నది విపక్షం డిమాండ్. ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో మణిపుర్ ప్రస్తావన వచ్చింది. దుండగులపై చర్య తీసుకుంటామని, శాంతి నెలకొల్పుతా మన్న హామీ కూడా ఇచ్చారు. ఈశాన్యానికి తమ హృదయంలో కీలక స్థానమున్నదని చెప్పారు. మణి పుర్ మహిళలతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మణిపుర్ ప్రజానీకానికి ఈ సభావేదిక నుంచి సహానుభూతి ప్రకటిస్తూ, ఈ ఉదంతాలు పునరావృతం కానీయబోమనీ, దోషులను కఠినంగా దండిస్తామనీ వాగ్దానం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించివుంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. వారి పునరా వాసానికి అవసరమైన పథకాలు ప్రకటిస్తే బాగుండేది. అధికార పక్షం వీటిని విస్మరించిందనుకున్నా ప్రతిపక్షం మాత్రం చేసిందేమిటి? ప్రధాని ప్రసంగం పూర్తిగా వినకుండానే వాకౌట్ చేసింది. అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఉన్న సభలో అవిశ్వాసం చివరికేమవుతుందో అందరికీ తెలుసు. అయినా ఆ సందర్భంగా జరిగే చర్చలను ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తుంది. విపక్షం ఏయే అంశాలపై అధికారపక్షాన్ని నిలదీస్తున్నదో, వాటికి అధికారపక్షం ఏం చెబుతున్నదో తెలుసుకోవ టమే ఆ ఆసక్తిలోని ఆంతర్యం. ఆ సందర్భంగా ఎవరి మంచిచెడ్డలేమిటో బేరీజు వేసుకుంటారు. ముఖ్యంగా మణిపుర్ ప్రజలూ, ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం తమకు జరగబోయే న్యాయం గురించి ఆలోచిస్తారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, అందులో గెలుపోటములే చర్చల్లో ప్రధానంగా వినబడ్డాయి. ఇది సరైందేనా? మణిపుర్ విషాదంపై సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుని లైంగిక హింసపై సాగే సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. పునరావాసం, పరిహారం, ఆవాసాల, ప్రార్థనామందిరాల పునర్నిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పరిచింది. తనవంతుగా చేయబోయేదేమిటో కేంద్రం ప్రకటిస్తే ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు అర్థవంతమైన ముగింపు ఉండేది. -
‘మణిపూర్ మంట చల్లారడం మోదీకి ఇష్టం లేదు’
సాక్షి, ఢిల్లీ: నిన్న లోక్‌సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాల తీరు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్ పరిస్థితిని సరిదిద్దేది. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయాయి. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ప్రధానిగా మోదీ కనీసం మణిపూర్‌కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వాల్సింది. నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని ఆయన అనాల్సింది. కానీ, ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు. మణిపూర్ మంటలు ఆరడం ఆయనకు ఇష్టం లేనట్లుంది అని రాహుల్ అన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "Yesterday the PM spoke in Parliament for about 2 hours 13 minutes. In the end, he spoke on Manipur for 2 minutes. Manipur has been burning for months, people are being killed, rapes are happening but the PM was laughing, cracking jokes. It… pic.twitter.com/WEPYNoGe2X — ANI (@ANI) August 11, 2023 భారత్‌ను హత్య చేశారు అని నేను అనలేదు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు అని ఊరికే అనలేదు. ‘బీజేపీ మణిపూర్‌ను, భారత్‌ను హత్య చేసి.. రెండుగా చీల్చింది’ ఇదీ నేను అన్నమాట. మణిపూర్ మండుతుంటే.. ప్రజలు చనిపోతుంటే.. మోదీ మాత్రం నవ్వుతూ పార్లమెంట్లో కనిపించారు. మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎందుకు ఆపలేకపోయారు?. దేశంలో ఇంత హింస జరుగుతుంటే.. ప్రధాని రెండు గంటలపాటు నవ్వుతూ ఎగతాళి చేశారు. అలాంటి వ్యవహార శైలి మోదీకి సరికాదు. ఇక్కడ ప్రశ్న 2024లో మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? కాదా? అనికాదు.. మణిపూర్‌లో జనాల్ని, పిల్లల్ని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రధాని అయ్యాక రాజకీయ నాయకుడిగా ఉండడం మానేయాలి. ఆయన దేశ వాణికి ప్రతినిధి అవుతాడు. అలాంటప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయ నాయకుడిలా కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న భారతీయ ప్రజల గుండెబరువుతో మాట్లాడాలి. కానీ, మోదీ అలాకాకుండా వ్యవహరించడం బాధాకరం. అలాంటి ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "When the PM becomes a PM, he ceases to be a politician. He becomes the representative of the voice of the country. Politics should be put aside and the PM should speak not as a petty politician but the PM should speak with the weight of… pic.twitter.com/jJqu4KZTrP — ANI (@ANI) August 11, 2023 -
విద్వేష రాజకీయాలు దేశానికి చేటు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ దేశంలో విద్వేషం సృష్టిస్తోందని..ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. చైనా ఓ పక్క దేశాన్ని ఆక్రమిస్తుంటే, కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్, హరియాణాలో జరుగుతున్న హింసాకాండకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని ఓ దుకాణదారుడు, ఓ చౌకీదార్ ఏలుతున్నారని, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదని..ఇది ఇలానే కొనసాగితే దుకాణదారుడి దుకాణం మూతపడుతుందని, చౌకీదార్ మారుతాడని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఒవైసీ మాట్లాడారు. నుహ్ హింస, యూసీసీ, హిజాబ్, మణిపూర్ సహా పలుఅంశాలను ఆయన ప్రస్తావించారు. అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ను తొలగించడం ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. హరియాణాలోని నూహ్‌లో 750 భవనాలను ముస్లింలవి అనే కారణంగానే నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని, హైకోర్టు పేర్కొందని గుర్తు చేసిన ఒవైసీ, భవనాలు కూలుస్తున్నప్పుడు దేశ మనస్సాక్షి ఎక్కడికి పోయిందన్నారు. క్విట్ ఇండియా నినాదం ముస్లిందే ఇటీవల మీనాసాహబ్ అనే వ్యక్తిని అతను ధరించిన దుస్తులు, గడ్డం చూసి, పేరు అడిగి ఒకరు చంపారు...అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో బతకాలంటే మోదీకి ఓటేయాలన్నారు. ఇది ఛాందస వాదానికి ఉదాహరణ కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఇక దేశంలో హిజాబ్‌ను సమస్యగా మార్చి, ముస్లిం బాలికలను చదువుకు దూరంగా ఉంచారని దుయ్యబట్టారు. ‘బిల్కిస్‌బానో ఈ దేశపు పుత్రిక కాదా అని నేను అడుగుతున్నా. బిల్కిస్‌బానోపై 11 మంది అత్యాచారం చేశారు, ఆమె తల్లిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మీరు నేరస్తులను విడుదల చేశారు. మీరు మెజారిటీ కోసం పనిచేస్తున్నారు’అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మాట్లాడితే ‘క్విట్ ఇండియా’అంటున్నారని, అయితే ఈ నినాదం ఒక ముస్లిం ఇచ్చారని తెలిస్తే మాత్రం ఈ మాట చెప్పడం మానేస్తారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ ఆమోదించిన క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ రూపొందించారని చెప్పారు. పాకిస్తాన్లో ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎందుకు తీసుకురావడం లేదన్నారు. ‘విశ్వగురు–విశ్వగురు అంటారు కానీ మీరు కులభూషణ్ జాదవ్‌ను మర్చిపోయారు. నేవీ అధికారులు ఖతార్‌లో ఒక సంవత్సరం జైలులో ఉన్నారు, కానీ మీరు వారిని తీసుకురాలేకపోయారు’అని అన్నారు. చైనా ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు చైనా గురించి ఏమీ మాట్లాడరు. 2013లో మోదీ సమస్య ఢిల్లీలో ఉందని, సరిహద్దులో లేదన్నారు. ఈ రోజు చైనా మన భూమిపై కూర్చోలేదా?, ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌ను పిలిచి, హత్తుకున్నారు.అతన్ని చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఏం జరిగింది, ఫలితం ఏమిటి?’అని అడిగారు. ఒకదేశం, ఒకేచట్టం అనే యూసీసీ ఫార్ములా ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనేది నియంతల ఫార్ములా అని పేర్కొన్నారు. దేశంలో లెక్కలేనన్ని భాషలు, అనేక మతాలు ఉన్నాయని గుర్తు చేశారు. -
కాషాయీకరణ ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: కాషాయీకరణను, మత శక్తుల ఏకీకరణను, మతతత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదర అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అవినీతి క్విట్ ఇండియా అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని తిప్పికొట్టారు. క్విట్ ఇండియా ఉద్యమం జరగాల్సిందేనని చెప్పారు. కాషాయీకరణ, మతతత్వం క్విట్ ఇండియా అని సభలో అధిర్ రంజన్ నినదించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు ‘‘నరేంద్ర మోదీ 100సార్లు ప్రధానమంత్రి అయినా మాకు ఎలాంటి ఆందోళన, అభ్యంతరం లేదు. మా ఆందోళన అంతా దేశ ప్రజల గురించే. మణిపూర్ ప్రజలకు ప్రధానమంత్రి స్వయంగా శాంతి సందేశం ఇవ్వాలని మా పార్టీ కోరుతోంది. మణిపూర్ హింసాకాండ గురించి ‘మన్ కీ బాత్’లో కనీసం ఒక్కసారైనా మోదీ మాట్లాడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మణిపూర్‌లో హింస అనేది సాధారణ అంశం కాదు. ఆ రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణ జరుగుతోంది. పౌర యుద్ధం కొనసాగుతోంది. మణిపూర్ హింస మొత్తం ప్రపంచం దృష్టిలో పడింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌తోపాటు అమెరికాలోనూ దీనిపై చర్చ జరిగింది. మణిపూర్ వ్యవహారాన్ని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు. అందుకే ప్రదానమంత్రి స్వయంగా కలుగజేసుకోవాలని, మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని, శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రిని లోక్‌సభకు రప్పించడానికి అవిశ్వాస తీర్మానం మినహా మాకు (విపక్ష ‘ఇండియా’ కూటమి) మరో మార్గం లేకుండా పోయింది. బఫర్ జోన్.. ప్రజల మధ్య వద్దు అది హస్తినాపురం అయినా, మణిపూర్ అయినా మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే దేశాన్ని పరిపాలించే రాజు అంధుడిగా వ్యవహరించకూడదు. కఠిన చర్యలు ఉపక్రమించాలి. దోషులను శిక్షించాలి. దేశాన్ని ఏలే పాలకుడు అంధుడైన ధృతరాష్ట్రుడిలా మిన్నకుండిపోతే ఇక మహిళలకు రక్షణ కల్పించేదెవరు? మణిపూర్‌లో రెండు వర్గాల ప్రజల మధ్య ‘బఫర్ జోన్’ను ప్రభుత్వం సృష్టించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం సభలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బఫర్ జోన్ అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. అంతేతప్ప ప్రజల మధ్య ఉండడం తగదు. అవిశ్వాస తీర్మానంపై సభలో మాట్లాడేందుకు మణిపూర్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ప్రయత్నిస్తే స్పీకర్ అనుమతించకపోవడం దారుణం’’ అని అధిర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలు తొలగింపు లోక్‌సభలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని నిలదీశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఖండించారు. సభకు, దేశానికి అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో భారత ప్రభుత్వం తన భవిష్యత్ వృద్ధిపై ఆశాజనకంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గురువారం నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమెరికా, యూకే, యూరోజోన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఆర్థిక సవాళ్ల మధ్య ఉన్నాయని, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా వినియోగదారుల డిమాండ్లు, వేతనాల స్తబ్దత వంటి సమస్యలనెదుర్కొంటోందని తెలిపారు. ‘‘ప్రపంచబ్యాంకు గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి 3%గా ఉంది. 2023 నాటికి అది 2.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో మోర్గన్ స్టేన్లీ సంస్థ 2013లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొంది. అదే సంస్థ తాజాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ను గుర్తించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే దీనికి కారణం’’ అని చెప్పారు. మిలేగా స్థానంలో మిల్గయా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం గరీబీ హఠావో నినాదాన్ని సీతారామన్ ఎగతాళి చేస్తూ వాస్తవంగా పేదరికం తొలగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఒకప్పుడు మిలేగా (లభిస్తుంది) అన్న పదం స్థానంలో ఇప్పుడు మిల్ గయా (అన్నీ అందాయి) అని ప్రజలు చెప్పుకునే స్థాయికి పాలన వెళ్లిందన్నారు. అవినీతి, బంధుప్రీతితో దశాబ్దాల పాటు కాంగ్రెస్ సమయాన్ని వృథా చేసిందని, అన్ని సంక్షోభాల్ని అవకాశాలుగా అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామన్నారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో తమిళనాడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమిళంలో మాట్లాడారు. సెంగాల్ (రాజదండం) గురించి ఆమె ప్రస్తావిస్తూ దానిని ఎక్కడో మ్యూజియంలో పడేశారని అది తమిళనాడు ఆత్మగౌరవాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సెంగాల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించి సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. అదే సమయంలో ఆమె సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, లెప్ట్ పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు. నిండుసభలో జయలలిత చీర లాగారు మణిపూర్‌లో మహిళల అకృత్యాల గురించి సీతారామన్ ప్రస్తావిస్తూ కేవలం మణిపూర్ మాత్రమే కాదు మహిళల్ని అవమానపరిచే, కించపరిచే ఘటనలు రాజస్థాన్, ఢిల్లీ ఇలా ఏ రాష్ట్రంలో జరిగినా ఆందోళన కలిగిస్తాయన్నారు. ఈ ఘటనలు ఎక్కడ జరిగినా తీవ్రంగా పరిగణించాలన్నారు. మణిపూర్ అంశంపై ప్రసంగించిన డీఎంకే ఎంపీ కనిమొళికి ఈ సందర్భంగా ఒక ఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవం గురించి ప్రస్తావించారు. ‘‘జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు 1989 మార్చి 25న పరమ పవిత్రమైన నిండు సభలో ఆమె చీరను లాగారు. డీఎంకే సభ్యులు అదంతా చూస్తూ జయలలితను గేలి చేశారు. ఆమెను చూసి నవ్వుకున్నారు. రెండేళ్ల తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితను పరాభవించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వారు ఇప్పుడు విపక్ష నేతలుగా ద్రౌపదికి చీర లాగడం గురించి మాట్లాడుతున్నారు’’ అని డీఎంకేకి చురకలు అంటించారు. -
నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు: మోదీ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవిశ్వాసం అంటే శుభపద్రం, శుభసూచకమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 2028లో కూడా తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పేదల బిడ్డను ప్రజలు కచ్చి తంగా ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి అహంకారులతో నిండిపోయిందని మండిపడ్డారు. అందులో అందరూ పెళ్లికొడుకులేనని ఎద్దేవా చేశారు. మోదీ లోక్‌సభలో 2.10 గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసలు విషయం మోదీ మాట్లాడడం లేదని వారు ఆరోపించారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని ప్రధాని చెప్పారు. ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డ దుండగులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా మీకు అండగా ఉన్నారంటూ మణిపూర్ మహిళలకు భరోసా కల్పించారు. అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఎవరూ మాట్లాడలేదు. మోదీ ప్రసంగం అనంతరం సభలో అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే... 2028లోనూ అవిశ్వాసం పెట్టండి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మేము మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యం. రికార్డులను తిరగరాయడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మాకు శుభప్రదమే. 2018లో మాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఆ అవిశ్వాస తీర్మానం మాకు శుభ సూచకమని నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా మాకు శుభాలు చేకూర్చబోతోంది. వచ్చే ఎన్నికల్లో నెగ్గబోతున్నాం. ప్రజలకు కుంభకోణాల రహిత, అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం. 2028లో కూడా మాపై మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం తథ్యం. మా ప్రభుత్వంపై దేశ ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఈ పేదల బిడ్డను ప్రజలు ఆశీర్వదిస్తారు. నార్త్ఈస్ట్... జిగర్ కా తుక్డా ఈశాన్య ప్రాంతం మన దేశం హృదయంలో ఒక భాగం(జిగర్ కా తుక్డా). మణిపూర్‌లో హింస జరగడం నిజంగా బాధాకరం. మణిపూర్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుంది. మహిళలపై అరాచకాలను ఎంతమాత్రం సహించబోం. మహిళలను అవమానించిన వారిని, అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. మణిపూర్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హామీ ఇస్తున్నా. దేశం మొత్తం మీకు అండగా ఉంది. పార్లమెంట్ మీకు అండగా ఉంది. మణిపూర్‌లో సమస్యలకు పరిష్కారాన్ని కచ్చి తంగా కనుగొంటాం. మణిపూర్ త్వరలోనే మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మహిళలపై నేరాలు క్షమార్హం కావు మణిపూర్ హైకోర్టు నిర్ణయం తర్వాతే అక్కడ సమస్య మొదలైంది. చిన్నచిన్న సంఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హింస చోటుచేసుకుంది. ఎన్నో కుటుంబాలను సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాలు క్షమార్హం కావు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే నిత్యం ఉభయ సభల్లో ఉద్దేశపూర్వకంగా రగడ సృష్టిస్తున్నాయి. దేశ అభివృద్ధికి సంబంధించిన బిల్లులపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు చర్చ జరగనివ్వడం లేదు. వారికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ప్రజలు వంచిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వంపై విమర్శలపై ఉన్న శ్రద్ధ పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులపై లేదు. విపక్షాలు నోబాల్స్ వేస్తుంటే అధికార పక్షం సెంచరీలు కొడుతోంది. మణిపూర్ విషయంలో రాజకీయాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రజల భాధలను తగ్గించే ఔషధంగా పనిచేయండి. మా అంకితభావానికి నిదర్శనం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 50 పర్యాయాల కంటే ఎక్కువే పర్యటించా. మా మంత్రులు 400 కంటే ఎక్కువసార్లు అక్కడ పర్యటించారు. ఇవి కేవలం గణాంకాలు కాదు. ఈశాన్యంపై మా ప్రభుత్వానికున్న అంకితభావానికి ఇవొక నిదర్శనం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1966 మార్చి 5న మిజోరాం ప్రజలపై వైమానిక దాడులకు పాల్పడింది. సొంత ప్రజలపై వైమానిక దాడుల చేసిన ఘటన దేశ చరిత్రలో ఇదొక్కటే. 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం గాలికొదిలేసింది. 1980వ దశకంలో పంజాబ్‌లో అకల్ తఖ్త్‌పై కాంగ్రెస్ సర్కారు సైనిక చర్యకు దిగింది. మణిపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రవాదులు చెలరేగిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గాందీజీ చిత్రపటాలు పెట్టనివ్వలేదు. స్కూళ్లలో జాతీయ గీతం పాడనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంపై ముష్కరులు బాంబుదాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి. దాడులు చేస్తున్న దేశంతో చర్చలు జరపాలా? కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకు పాకిస్తాన్ అంటే ఎనలేని ప్రేమ. మనదేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్‌పై అనురాగం ప్రదర్శిస్తుంటాయి. భారతీయులను మనోభావాలను పక్కనపెట్టి పాకిస్తాన్‌ను సమర్థిస్తుంటాయి. విపక్షాలు ఎప్పుడూ పాకిస్తాన్నే నమ్ముతుంటాయి. భారతదేశపు అంతర్గత శక్తియుక్తులపై, భారత సైనికుల సామర్థ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేదు. కశ్మీర్‌లోని వేర్పాటువాదులంటే విపక్ష నాయకులకు ఎంతో మక్కువ. వారు ఎక్కువగా వేర్పాటువాదులనే కలుస్తుంటారు. పాకిస్తాన్ మన సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపిస్తోంది. భారత్‌లో ఉగ్రదాడులు జరిగితే పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. అయినా మన ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్నే సమర్థి,స్తుంటారు. పాకిస్తాన్ ఏది చెబితే అది నిజమని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. మన గడ్డపై పాకిస్తాన్ ముష్కరులు దాడులు చేస్తున్నా ఆ దేశంతో చర్చలు జరపాలని మూర్ఖంగా వాదిస్తుంటారు. పాకిస్తాన్ జెండాలు మోసినవారే కాంగ్రెస్‌కు ఇష్టం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద మంటల్లో కశ్మిర్ చిక్కుకుంది. అమాయక జనం బలైపోయారు. అయినా కశ్మిర్లోని సామాన్య ప్రజలను ఏనాడూ కాంగ్రెస్ విశ్వసించలేదు. హురియత్ కాన్ఫరెన్స్‌ను, వేర్పాటువాదులను, పాకిస్తాన్ జెండాలు మోసినవారిని మాత్రమే కాంగ్రెస్ నమ్మింది. పాకిస్తాన్ భూభాగంలో నక్కిన ముష్కరులపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నానా యాగీ చేశాయి. మన సైనిక దళాల బలాన్ని విశ్వసించలేదు. మన శత్రువులు చెప్పినదాన్నే విశ్వసించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మరింత పెద్దది చేసి చూపి, సంబరపడే శక్తి ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ప్రతిపక్షాలు అహంకారానికి, అవిశ్వాసానికి మారుపేరు. వాటిది నిప్పుకోడి తరహా మనస్తత్వం. భారతదేశ కీర్తిప్రతిష్టలు అంతర్జాతీయ నూతన శిఖరాలకు చేరుతున్నాయి, ప్రజల్లో కొత్త ఉత్సహం, కొత్త శక్తి నిండుతోంది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ఏదో ఉన్నట్టుంది. ఇతరులకు చెడు జరగాలని వారు (విపక్ష నేతలు) కోరుకుంటే మంచి జరుగుతోంది. అందుకు నేనే ఉదాహరణ. గత 20 ఏళ్లుగా నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, నాకు ఏమీ కాలేదు. బ్యాంకింగ్ రంగంపై, ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌పై, భారతీయ జీవిత బీమా సంస్థపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయి. హెచ్ఏఎల్ రికార్డు స్థాయిలో రెవెన్యూ సాధించింది. ఇక ఎల్ఐసీ అద్భుత పనితీరుతో లాభాల బాటలో దూసుకెళ్తోంది. విపక్షాలు ఇప్పుడేం చేయాలో తెలియక చివరకు దేశాన్ని శపిస్తున్నాయి. కానీ, మన దేశం మరింత శక్తివంతంగా మారుతోంది. ప్రభుత్వం సైతం బలోపేతం అవుతోంది. మూడో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. భారత్ ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది. దీని ప్రభావం మరో వెయ్యేళ్లు ఉంటుంది. దేశ ప్రజల బలం, శ్రమ, కష్టపడే తత్వం వచ్చే వెయ్యి సంవత్సరాలకు బలమైన పునాది వేస్తాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. దేశంలో గత ఐదేళ్లలో ఏకంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు పరాయి గడ్డ నుంచి మన దేశంలోకి వస్తున్న ముష్కర మూకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అందుకే కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలు పూర్తి అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఒక విజన్ గానీ, ఒక విధానం గానీ లేవు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాత్ర గురించి కాంగ్రెస్‌కు తెలియదు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ది వెనుక తమ నాయకుల పాత్ర ఉందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని సమస్యలకు కాంగ్రెస్, ఆ పార్టీ నీచ రాజకీయాలే మూలకారణం. అక్కడి ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. ఈశాన్యంతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రధానమంత్రిని కాకముందే ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించా. విపక్ష దుకాణం త్వరలో బంద్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అహంకారులైన వారసత్వ రాజకీయ నాయకులతో నిండిపోయింది. విద్వేషం, విభజన, అత్యవసర పరిస్థితి, సిక్కులపై దాడులు, అబద్ధాలు, అవినీతి, కుంభకోణాలు, రెండంకెల ద్రవ్యోల్బణం, అస్థిరత, బుజ్జగింపు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, నిరుద్యోగం, ఉగ్రవాదం.. ఇవన్నీ ప్రతిపక్షాల ఘనతలే. ప్రతిపక్ష నాయకులు గనుక అధికారంలోకి వస్తే దేశాన్ని రెండు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బీటలువారిన ఇంటికి పూతలు పూసే ప్రయత్నంలా ఉంది. మా కూటమి ఎన్డీయే కేవలం అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. దేశం పేరు పెట్టుకున్న విపక్ష కూటమితో ఒరిగేదేమీ లేదు. విపక్షాల కొత్త దుకాణం త్వరలో బంద్ అవుతుంది. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసు. అది కేవలం లూటీ దుకాణం, విద్వేష బజార్. మా కూటమి ఎన్డీయే. దానికి రెండు ‘ఐ’ అక్షరాలు కలిపి ‘ఇండియా’ అని పెట్టుకున్నారు. అందులో ఒక ‘ఐ’ 26 పార్టీల అహంకారం. మరో ‘ఐ’ ఒక కుటుంబ అహకారం. పేరు మార్చుకున్నంత మాత్రాన పాత పాపాలను దాచలేరు. వారసత్వ రాజకీయాలు అంతం కావాలని మహాత్మాగాందీ, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ తదితర గొప్ప నాయకులు ఆకాంక్షించారు. కానీ, వారసత్వ రాజకీయాలు, డబ్బుతోనే ఒక కుటుంబం చుట్టూ ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది. నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు నేను పేద కుటుంబం నుంచి వచ్చా. పేదల బిడ్డ అధికారంలోఉండడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిరుపేద బిడ్డ ఉన్నత పదవిలో ఉండడం ఏమిటని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వారు(కాంగ్రెస్ నాయకులు) గతంలో విమానాల్లో పుట్టిన రోజు కేకులు కట్ చేసుకున్నారు. మనం అదే విమానాల్లో వ్యాక్సిన్లు రవాణా చేశాం. వారు తమ దుస్తులను విమానాల్లో పంపించుకున్నారు. నేడు పేదలు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు నావికాదళం నౌకలను విందులు వినోదాల కోసం వాడుకున్నారు. అది ‘ఇండియా’ కాదు, ముమ్మాటికీ అహంకార కూటమి. అందులోని ప్రతి నాయకుడు పెళ్లి కొడుకు(ప్రధానమంత్రి) కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఒక విదేశీయుడు స్థాపించారు. ఆ పార్టీ జెండా, పార్టీ గుర్తు, సిద్ధాంతాలు ఇతరుల నుంచి దొంగిలించినవే. అహంభావం వల్లే కాంగ్రెస్ 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయింది. బెంగళూరులో ‘యూపీఏ’కు సమాధి కట్టిన విపక్ష స్నేహితులకు ఇదే నా సానుభూతి. రాహుల్.. విఫల ఉత్పత్తి మన భరతమాత మృతి చెందాలని కొందరు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాత హత్య అంటూ అనుచితంగా మాట్లాడడం భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చింది. ప్రజాస్వామ్యం హత్య, రాజ్యాంగం హత్య అంటూ మాట్లాడే ఈ వ్యక్తులే(కాంగ్రెస్ నాయకులు) భరతమాతను మూడు ముక్కలు చేశారు. బానిసత్వం నుంచి భరతమాతకు విముక్తి కలిగించే సమయం వచ్చి నప్పుడు ఆమె అవయవాలను నరికేశారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు చేయడం తప్ప మరేమీ తెలియదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పలుమార్లు రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ఆయన విఫలమయ్యారు. ఆయనొక ‘విఫల ఉత్పత్తి’. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
మణిపూర్ నుంచి మరో ఘోరం వెలుగులోకి!
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతిభద్రతలు ఒకమోస్తరుగా అదుపులోకి వస్తున్న క్రమంలో.. గత మూడు నెలల కాలంలో చోటు చేసుకున్న నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక శిబిరానికి చేరుకున్న ఓ వివాహిత తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం.. చురాచందాపూర్ జిల్లాలో కొందరు దుండగుల చేతుల్లో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యంత పాశవికంగా వేధిస్తూ మరీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు వాళ్లు. ఈ క్రమంలో బయటికి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే ఆ లైంగిక దాడి తర్వాత ఆమె ఆరోగ్యంగా బాగా దెబ్బతింది. ఆమె మంగళవారం ఓ ప్రభుత్వాసుపత్రిని సందర్శించగా.. అక్కడి వైద్యులు జరిగిందంతా తెలుసుకుని ఆమెకు వైద్యంతో పాటు మనోధైర్యం అందించారు. ఆపై బుధవారం ఆమె బిష్ణుపూర్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (జీరో ఎఫ్ఐఆర్ అంటే.. బాధితులు ఏ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు కావొచ్చు. నేరం జరిగిన స్టేషన్ పరిధిలోనే ఫిర్యాదు చేయాలనే రూల్ లేదు. ఆ తర్వాత నేరం జరిగిన పరిధిలోకి ఆ ఎఫ్ఐఆర్ను పంపిస్తారు.) బాధితురాలి ఆవేదన.. మే 3వ తేదీ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో.. కొందరు దుండగులు మా ప్రాంతంలోని ఇళ్లను తగలబెట్టారు. ఈ క్రమంలో నేను ఉంటున్న ఇల్లు కాలిపోతుండగా.. ప్రాణభయంతో నేను(37) నా ఇద్దరు కొడుకుల్ని, నా భర్త సోదరి ఆమె ఇద్దరు బిడ్డలతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాం. నా అల్లుడిని వీపున వేసుకుని.. ఇద్దరు కొడుకులతో సహా పారిపోయే యత్నం చేశాం. ఆ సమయంలో కింద పడిపోయా. ముందు చంటిబిడ్డతో పరిగెడుతున్న నా భర్త సోదరి వెనక్కి వచ్చి తన బిడ్డనూ, నా ఇద్దరు బిడ్డలను తీసుకుని పరుగులు తీసింది. కిందపడ్డ నేను పైకి లేవలేకపోయా. ఆ సమయంలో ఐదారుగురు దుండగులు చుట్టుముట్టారు. నా బిడ్డలు అరుస్తూ నావైపు చూస్తూనే పారిపోసాగారు. ఆ కీచకులు లైంగికంగా వేధిస్తూ.. నాపై దాడికి పాల్పడ్డారు. మృగచేష్టలతో తీవ్రంగా గాయపడిన నేను.. ఆ తర్వాత శరణార్థ శిబిరంలో ఉన్న నా వాళ్లను చేరుకున్నా. ఆ గాయం నన్ను మానసికంగా ఎంతో కుంగదీసింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆరోగ్యం దిగజారడంతో వైద్యుల్ని సంప్రదించగా.. వాళ్లకు విషయం చెప్పాల్సి వచ్చింది. వాళ్ల సలహా మేరకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నాకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా అని బాధితురాలు తన ఆవేదనను పంచుకుంది. ఇదిలా ఉంటే.. మణిపూర్ అల్లర్లు-హింస కారణంగా మే 3వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు 6,500దాకా కేసులు నమోదు చేసినట్లు మణిపూర్‌పోలీస్ శాఖ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వీటిలో ఇళ్ల ధ్వంసం కేసులే ఎక్కువగా ఉన్నట్లు సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అయితే పోలీస్ శాఖ వివరణతో సంతృప్తి చెందని సుప్రీం.. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో కేసుల విచారణ జరిపించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిచింది. మరోవైపు గత నెలలో మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి మరీ లైంగిక దాడి జరిపిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. -
'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..
ఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధంగానే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ అంశంలో దాచడానికి ఏమీ లేదని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం మౌన వ్రతం పాటించడంలేదని చెప్పారు. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో కేంద్ర సహాయ మంత్రి 23 రోజులు అక్కడే గడిపారని పేర్కొన్నారు. తాను కూడా స్వయంగా మూడు రోజులు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దినట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటలపాటు మాట్లాడారు. సరికాదు.. ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అమిత్ షా చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల వీడియోపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఘటన సిగ్గుచేటని కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఆ వీడియోను పోలీసులకు ఇవ్వాల్సిందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రిలిజ్ చేయడం సరికాదని అన్నారు. అగ్నికి ఆజ్యం ప్రతిపక్షాలు చేసే చర్యలు అగ్నికి ఆజ్యం పోసే దిశగా ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనలను కేంద్రం కూడా సమర్థించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. #WATCH | This is a very unfortunate incident and it is a shame for society. But why did this video (Manipur viral video) come before the start of this Parliament session? If someone was having this video they should have given it to the DGP, and action would have been taken on… pic.twitter.com/CEd8vTWnPN — ANI (@ANI) August 9, 2023 శాంతి నెలకొంటోంది.. మణిపూర్ ఘటనపై అక్కడి సీఎంను మార్చాల్సిన పనిలేదని అమిత్ షా అన్నారు. బీరేన్ సింగ్ చక్కగా స్పందిస్తున్నారని.. మాట వినకపోతే తొలగిస్తారని చెప్పారు. ఈ ఘటనలో సరిగా వ్యవహరించని అధికారులను మార్చినట్లు చెప్పారు. మణిపూర్‌లో శాంతి పరిస్థితులు నెలకొనడానికి అన్ని ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని అన్నారు. మే3 నాడు అల్లర్లు ప్రారంభమయ్యాయని అమిత్ షా చెప్పారు. నేటికి అవి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 152 మరణించగా.. ఒక్క మే నెలలోనే 107 మంది మృతి చెందినట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. రెండు తెగలు మైతీ, కుకీల మధ్య గొడవ ప్రారంభమైనట్లు చెప్పారు. రెండు వర్గాలతో చర్చలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించిన కారణంగానే ఘర్షణలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
అగ్ని గుండంగా రాష్ట్రం.. ఇదీ మణిపూర్ కథ..!
మణిపూర్ చరిత్ర అంటే రాజులు, సంస్థానాలు, ఆక్రమణలు, చొరబాట్లు మాత్రమే కాదు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జాతుల కలబోత. విభిన్న తెగల వారు ఒకే చోట సహజీవనం చేసే మణిహారం. మెయిటీలు, కుకీల మధ్య మూడు నెలలుగా జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ చరిత్ర అందరిలోనూ ఆసక్తిని పెంచింది. మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీలు, నాగా, జొమి ఇలా 124 తెగలు నివసిస్తూ ఉంటే మణిపూర్ కొండల్లో 38 గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కుకీల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గాల మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో మెయిటీలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. చరిత్రలోకి తొంగి చూస్తే మణిపూర్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాలు క్రీ.శ. 33వ సంవత్సరం నుంచి ఉన్నాయి. అయితే, అంతకు ముందు సైతం ఇంఫాల్ లోయలో మానవ నాగరికత వెల్లివిరిసినప్పటికీ అక్కడ ఉన్న వారంతా మెయిటీ వర్గీయులు అని చెప్పడానికి వీల్లేదు. టిబెట్, బర్మా నుంచి మెయిటీలు వలస వచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన నింగ్‌డౌ వంశీకులు మణిపూర్ లోయను పాలించారు. మణిపూర్ రాజులు, ప్రజలు 18 వ శతాబ్దం వరకు సనామహిజం అనే దేశీయ మత విశ్వాసాల్ని ఆచరించారు. 15వ శతాబ్దంలో లోయను పాలించిన క్యంబ అనే రాజు విష్ణమూర్తి దేవాలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి లోయలోకి బ్రాహ్మణుల రాక ప్రారంభమైంది. అప్పట్లోనే మణిపూర్ లోయను పాలించిన రాజులు హిందువులుగా మారారా అన్న చర్చ ఉంది. అయితే 1704వ సంవత్సరంలో రాజు చరియారోంగ్బా తన కుటుంబంతో సహా హిందూమతంలోకి మారారు. అప్పట్నుంచి ఇంఫాల్ లోయలో హిందువుల ప్రాబల్యం పెరిగింది. నింగ్‌డౌ వంశీకులే 1724లో ఈ ప్రాంతానికి మణిపూర్ (మణిమాణిక్యాలకు నిలయం) అని పేరు పెట్టారు. కుకీల ప్రస్తావన తొలిసారి ఎప్పుడంటే కొన్ని వందల శతాబ్దాల కిందటే మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీల ఉనికి ఉంది. కానీ కుకీల ప్రస్తావన 17వ శతాబ్దంలో తొలిసారిగా తెలిసింది. 1777లో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు చిట్టగాంగ్‌లో బ్రిటీషర్లపై ఒక తెగ దాడి సందర్భంగా తొలిసారిగా కుకీల ప్రస్తావన వినిపించింది. బ్రిటీష్ రచనల్లో కుకీలను పాత కుకీలు, కొత్త కుకీలుగా విభజించారు. ఆంగ్లో, బర్మా యుద్ధం (1824–1826) జరిగినప్పుడు బర్మా నుంచి వచ్చినవారే కొత్త కుకీలు అని బ్రిటీష్ రచనల ద్వారా తెలుస్తోందని రచయిత, చరిత్రకారుడు మలేమ్ నింగ్‌తౌజ వెల్లడించారు. అప్పట్నుంచే మెయిటీల డిమాండ్ 1819లో మణిపూర్‌పై బర్మా దురాక్రమణకు దిగింది. దీంతో మణిపూర్ రాజులు బ్రిటీష్ సాయం కోరారు. అప్పట్నుంచి 1891 వరకు మణిపూర్ తెల్లదొరల సంరక్షణలో ఉంది. తర్వాత సంస్థానా«దీశుల చేతికొచ్చింది. సంస్థాలన్నీ భారత్‌లో విలీనమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత 1949 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి మణిపూర్ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైంది. ఆ సమయంలో మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న చర్చ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కుకీలకు తెల్లదొరల అండ బ్రిటిష్ పాలకుల అండదండలతో కుకీలు మణిపూర్ కొండప్రాంతాల్లో స్థిరపడ్డారు. నాగా తెగల దాడుల నుంచి లోయ ప్రాంతాలను రక్షించే పనిలో ఉండేవారు. ఓ రకంగా బ్రిటీష్ పాలకుల కిరాయి సైన్యంగా పని చేసేవారు. తెల్లదొరలు తమ వ్యూహంలో భాగంగా ఒక తెగకి వ్యతిరేకంగా మరో తెగని, వారికి వ్యతిరేకంగా ఇంకో తెగవారిని ప్రోత్సహించారు. కొండ ప్రాంతాల్లో కుకీల ప్రాబల్యం పెరిగిపోవడానికి బ్రిటీష్ వారి వ్యూహాలే కారణమని మలేమ్ నింగ్‌తౌజ అభిప్రాయపడ్డారు. నేటి ఘర్షణలకు మూలం మణిపూర్ ఘర్షణలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. లోయ ప్రాంతాల్లో నివసించే మెయిటీలు ఎస్టీ హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంటే కొండప్రాంతంలో ఎస్టీ హోదా ఉన్న కుకీలు తమకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. 1949 తర్వాత మయన్మార్ నుంచి అక్రమ వలసదారులు భారీగా వచ్చి కుకీ సమాజంలో కలిసిపోయారని అదే నేటి ఘర్షణలకు మూలమని రచయిత, చరిత్రకారుడు నింగ్‌తౌజ తెలిపారు. మణిపూర్ చరిత్రతో నేటి ఘర్షణలకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్న అక్రమ వలసదారుల్ని ఏరివేయడానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకీలలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రదర్శన నిర్వహిస్తూ 1951 తర్వాత అక్రమంగా వచ్చిన వలసదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యలు, సవాళ్లతోనే మణిపూర్ జాతుల సంఘర్షణ సంక్లిష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆగని మణిపూర్ అల్లర్లు
ఆగని మణిపూర్ అల్లర్లు -
బీరేన్ సింగ్ ప్రభుత్వానికి షాక్.. మద్దతు ఉపసంహరించుకున్న కీలక పార్టీ..
ఇంఫాల్: మణిపూర్‌లో గత మూడు నెలలుగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తన మిత్రున్ని కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుకీ పీపుల్ అలయెన్స్ (కేపీఏ) ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాసింది. కేపీఏ నిర్ణయంతో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు. 'ఇన్ని రోజుల అల్లర్ల పరిణామల తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ఉపయోగం లేదు. సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ నిర్ణయం తీసుకుంటున్నాం.' అని కేపీఏ చీఫ్ టోంగ్‌మాంగ్ హాకిప్ లేఖలో పేర్కొన్నారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో సైకుల్ నుంచి కిమ్నియో హౌకిప్ హాంగ్షింగ్, సింఘత్ నుంచి చిన్లుంతంగ్ ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఐదుగురు నాగ కూటమి సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌లో అల్లర్లు గత మూడు నెలలుగా ఆందోళనలు చెలరేగాయి. కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లు కొద్ది రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్లీ రాజుకున్నాయి. అల్లర్లను తగ్గించడానికి కేంద్రం తాజాగా మరో 900 మంది బలగాలను కొత్తగా మోహరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 4000 మంది ఆర్మీ సిబ్బంది పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. కాగా.. మణిపూర్ అల్లర్లలో ఇప్పటికే దాదాపు 170 మంది మరణించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
మణిపూర్ ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. శనివారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో గిరిజన సంక్షేమం– పోడుపట్టాల పంపిణీ’పై లఘుచర్చలో కవిత మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపించారు. అన్ని జాతులు బాగుపడాలని తెలంగాణ కోరుకుంటుంటే.... విభజించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో అమలు చేసిన వాటిని కేంద్రం అనుకరిస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గిరిజనులకు కేటాయించిన నిధులను వంద శాతం వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. -
Manipur Violence: నిద్రిస్తున్న తండ్రీకొడుకులను కర్కశంగా..
ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తాజాగా హింసాకాండ చెలరేగింది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించి ఉంటారని స్థానిక పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరణించిన వారిలో తండ్రికొడుకులు కూడా ఉన్నారని వారిని నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా పట్టణంలోని ఫౌగక్చావో ఇఖాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటలకు మిలిటెంట్లు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఒక ఇంటి వద్ద నిద్రిస్తున్న తండ్రీకొడుకులను ఆగంతకులు మొదట కాల్చి చంపారు. తరవాత కత్తులతో నిర్దాక్షిణ్యంగా నరికారు. మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను మళ్ళీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ తండ్రీకొడుకులు ఇన్నాళ్లు సహాయక శిబిరంలో ఆశ్రయం పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. పాపం చాలాకాలం తర్వాత ఇంటి వద్ద సేదదీరుతున్నందునో ఏమో ఆదమరచి నిద్రించారు. వస్తోన్న విపత్తును గ్రహించలేక శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. తెల్లవారాక ఈ ఘోరాన్ని చూసిన వారంతా మూడు నెలల నుండి సాగుతున్న ఈ మారణకాండ చల్లారేదెన్నడంటూ.. తాము ప్రశాంతంగా కునుకు తీసేదెన్నడంటూ వాపోతున్నారు. ఇది కూడా చదవండి: పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా? -
ఈ చట్టంతో సాధించేదేమిటి?
ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్‌సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్‌పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే. ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్‌లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి. కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్ఎస్క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్ఎస్క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ. కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి? -
మణిపూర్ అల్లర్లలో దొరికిన ఆణిముత్యం
-
పార్లమెంటులో కొనసాగిన మణిపూర్‌పై విపక్షాల ఆందోళన
పార్లమెంటులో కొనసాగిన మణిపూర్‌పై విపక్షాల ఆందోళన -
మళ్లీ మతం మంటలు!
విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్ పట్టణాలు అట్టుడికిపోయాయి. ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు. ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్ అంటుకుంది. అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది. నూహ్ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు. ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి. -
మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకొక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. మహిళలపై అఘాయిత్యాల తర్వాత ఆ రాష్ట్ర పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మరో అంశం మిస్సింగ్ కేసులు. ఇప్పటికైతే 30 మంది కనిపించడం లేదని కంప్లైట్లు రాగా 6000కు పైగా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా మరో విద్యార్థిని మిస్సయిన కేసు సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసులు.. మణిపూర్ రాష్ట్రంలో మరణాలు, విధ్వంసం తర్వాత మిస్సింగ్ కేసుల సంఖ్య బాగా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 3 నెలల్లో మొత్తం 30 మంది మిస్సవ్వగా సుమారు 6000 జీరో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. మే 6న సమరేంద్ర సింగ్(47) అనే జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు కిరణ్ కుమార్ సింగ్ కూడా అల్లర్ల తర్వాత ఇంటికి రాలేదని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే వారి డీఎన్ఏ శాంపిల్స్ అయినా ఇప్పిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వేడుకుంటున్నారు. ఆరోజు ఏం జరిగిందంటే.. అంతలోనే మరో విద్యార్థిని హిజామ్ లువాంబి (17) స్థానికంగా పరిస్థితి కాస్త మెరుగయ్యిందని భావించి స్నేహితుడితో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లిందని అప్పటినుంచి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తలిదండ్రులు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ చేసినట్లు.. ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయ్యినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారన్నారు. క్వాట్కాకు లమదాన్ కు మధ్య 18 కిలోమీటర్ల దూరముంది. పైగా వేర్వేరు జిల్లాలు. ఫోన్ చేస్తే హిజామ్ ఒకసారి లిఫ్ట్ చేసి భయం భయంగా మాట్లాడిందని.. నంబోల్ లోని ఖూపంలో ఉన్నట్లుగా చెప్పిందని ఆయన అన్నారు. పోలీసులు కూడా వారిద్దరూ నంభోల్ వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో ఉందని చెప్పారు. హిజామ్ స్నేహితుడు హేమంజిత్ తండ్రి మాట్లాడుతూ ఆ ప్రాంతం గురించి పోలీసులకు తెలిసినా కూడా వారు అక్కడికి వెళ్లడానికి భయపడ్డారని చెప్పుకొచ్చారు. హేమంజిత్ ఫోన్ స్విచాఫ్ చేసిన తర్వాత ఇపుడు వేరే నెంబరుతో వాడకంలో ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇంఫాల్ ఆసుపత్రులలో సుమారు 44 అనాధ శవాలకు ఆగస్టు 3న సామూహిక అంత్యక్రియలకు నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: ఉడుపి వీడియోలు తమాషా కావచ్చు -
ఇండియా కూటమికి రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్
ఢిల్లీ: మణిపూర్ అంశంపై తనతో చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చారు. బుధవారం ఉదయం విపక్ష ఎంపీలతో భేటీ కానున్నారు. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే అక్కడ పర్యటించాలని వాళ్లు ఆమెను కోరే అవకాశాలూ లేకపోలేదు. మణిపూర్ వ్యవహారంపై తమ ఆందోళనను పట్టించుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఉదయం 11.30 సమయంలో తనను కలవాలని ఆమె వాళ్లకు సూచించారు. ఇండియా కూటమిలో 21 పార్టీల ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు-హింసకు నెలవైన కొండాలోయ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి బాధితులను కలిశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణ టైంలో మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు కూడా. ఈ క్రమంలో ఇండియా కూటమి ఎంపీల మణిపూర్ పర్యటనపైనా బీజేపీ మండిపడింది. ఇటు పార్లమెంట్ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ.. డ్రామాలు ఆడుతోందంటూ ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్లో మణిపూర్ హింసపై సుదీర్ఘ చర్చ జరగాలని.. ప్రధాని ప్రసంగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభను సజావుగా జరగనివ్వకుండా నినాదాలతో హెరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ అంశంపైనా అవిశ్వాసం ప్రకటించగా.. 8,9 తేదీల్లో చర్చ జరగాల్సి ఉంది. -
ఆంగ్లో కుకీ యుద్ధం(1917-1919).. ఆ రోజు ఏం జరిగిందంటే..
ఇంఫాల్: మణిపూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మెయిటీ వర్గానికి గిరిజనులుగా గుర్తింపు కల్పించడాన్ని కుకీలు ప్రశ్నించడంతో వివాదానికి బీజం పడింది. అదికాస్తా ఆధిపత్య పోరుగా మారి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసింది. కొండ ప్రాంతాల్లో నివసించేవారు కుకీలు. పల్లపు ప్రాంతంలో నివసించేవారు మెయిటీలు. వీరిలో కుకీ తెగవారు ఒకసారి దేన్నైనా వ్యతిరేకించడం మొదలుపెడితే వెనకడుగు వేయరని చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు వారు బ్రిటిషర్లకు సైతం ఎదురు తిరిగి చేసిన యుద్ధమే అందుకు ఉదాహారణ. ఆంగ్లో కుకీ యుద్ధం.. మొదటి ప్రపంచ యుద్ధంలో భారత దేశం పాల్గొనకపోయినా అలనాటి బ్రిటీష్ పాలన కారణంగా వారి ప్రోద్బలంతో కొంత మంది భారత సైనికులు వారికి సహాకారమందించారు. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం మణిపూర్ మహారాజును పోరాటయోధులు కానీ కొంతమందిని ఇండియన్ లేబర్ కార్ప్స్(ILC)గా ఎంపిక చేసి తమ సైన్యానికి సహకారమందించాలని కోరారు. తదనంతరం ILCలను భారత సైన్యానికి సమానమైన కేడర్ గా పరిగణించారు. అయితే మహారాజు పిలుపు మేరకు లోయ ప్రాంతంలోని వారు ILCలో చేరారు. వీరు యుద్ధం చేయలేదు కానీ యుద్ధం చేసే సైనికులకు సేవలు చేసేవారు. ఈ బానిస బ్రతుకుకు వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే కుకీలు 1917లో బ్రిటీషర్లలకు ఎదురు తిరిగారు. ఈ తిరుగుబాటు కాస్తా యుద్ధంగా మారి సుమారు రెండేళ్లపాటు 1919 వరకు కొనసాగింది. ఈ రెండేళ్లలో కుకీలు బ్రిటీషర్లకు ఎదురుపడి పోరాడిన సందర్భాలూ ఉన్నాయి, గెరిల్లా తరహా చేసిన దాడులు కూడా ఉన్నాయి. కొండ ప్రాంతాలపైనా, అటవీ ప్రదేశాలపైనా విపరీతమైన అవగాహన ఉండటంతో అరకొర ఆయుధ సామాగ్రి మాత్రమే ఉన్నా కూడా కుకీలు పటిష్టమైన బ్రిటీషర్లను సమర్ధవంతంగానే ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో తిరుగుబాటుదారుల ధాటికి బ్రిటీషు ప్రభుత్వం కుకీలు ఉండే మణిపూర్ గిరిజన ప్రాంతాన్ని "కల్లోల ప్రాంతం"గా కూడా ప్రకటించింది. దీర్ఘకాలికంగా సాగిన యుద్ధంలో మెల్లిగా కుకీ తిరుగుబాటుదారుల జనాభా తరుగుతూ వచ్చింది. ఈ యుద్ధంలో అత్యధికులు మరణించగా కుకీలకు నాయకులుగా వ్యవహరించిన వారిని మాత్రం అరెస్టు చేసిన వలసపాలకులు వారిని అండమాన్ జైలుకు తరలించారు. కేవలం ILCలో చేరమన్నందుకే కుకీలు బ్రిటీషర్లకు ఎదురు తిరగలేదు. బ్రిటీషర్లు గిరిజనులను క్రైస్తవ్యం వైపుగా నడిపిస్తారేమోనన్న భయం ఒక కారణమైతే, గిరిజనులపై వారి వివక్ష రెండోది. ఈ కారణాలతోనే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్న తపనతో కుకీలు బ్రిటీషర్లపై యద్ధానికి సిద్ధమయ్యారు. ఇది కూడా చదవండి: చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం -
మణిపూర్ వైరల్ వీడియో.. కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్
-
మణిపూర్ దురాగతం భయానకమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పార్లమెంట్ లో మణిపూర్ ప్రకంపనలు
-
వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా?
-
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్నలు వేసింది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. బాధిత మహిళల తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపూర్‌లో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు. ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బదిలీ చేయవద్దంటున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున కేసును వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు. బాధితుల్లో ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ కుటుంబానికి ఆ మృతదేహాలను అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్. మే 18న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. చదవండి: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట.. -
మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మణిపూర్ వీడియో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మణిపూర్ పోలీసులు. ఇదిలా ఉండగా నగ్నంగా ఊరేగించబడిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య.. -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి..
ఇంఫాల్: మణిపూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు రెండ్రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజున వీరంతా బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి హృదయవిదారకమైన తన విన్నపాన్ని వారికి వివరించింది. నా భర్తను, కొడుకుని కూడా అదేరోజున చంపేశారు. దయచేసి వారి శవాలనైనా మాకు ఇప్పించండని వేడుకున్నారు. వర్గవివక్ష కారణంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు 21 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా వారు బాధితులను పరామర్శించారు. వారిలో నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి మాట్లాడుతూ.. ఆరోజున నాకు జరిగిన నష్టం చాలా పెద్దది. నా కుమార్తెను వివస్త్రురాలికి చేసి దారుణంగా అవమానించారు. అడ్డుకున్న నా భర్త, కుమారుడిని చంపేశారు. కుకీలు, మెయిటీలు ఇకపై కలిసి ఉండటం జరగదని అన్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత సుష్మితా దేవ్ స్పందిస్తూ.. పోలీసుల సమక్షంలోనే ఆమె కొడుకును, భర్తను చంపేశారు. అయినా కూడా ఏ ఒక్క పోలీసును సస్పెండ్ చేయలేదు. సుమారు వెయ్యిమంది ఆరోజున దాడిలో పాల్గొన్నారని బాధితురాలు చెబుతోంది. ఆమె కుమార్తెను దారుణంగా నగ్నంగా ఊరేగించారు. ప్రస్తుతం ఆ యువతి పోలీసులను చూస్తేనే భయపడిపోతోంది. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడమంటే అది రాజ్యాంగానికే మాయని మచ్చ. ఆమె తన భర్త, కొడుకుల శవాలనైనా ఇప్పించమని కోరుతున్నారు. నేను ఈ విషయాన్ని కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. పాపం ఆ బాధితురాలి భర్త దేశ సైన్యంలో పనిచేశారు. దేశానికి రక్షణ కల్పించారు కానీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు. తనకు అంత నష్టం జరిగితే ఇంతవరకు ఆమెకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. ఆ రోజున.. మే 4న ఒక్కసారిగా అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుండటంతో సేనాపతి జిల్లాలోని బి.ఫయనోమ్ గ్రామంలో ఓ పెద్దాయన(51) అతడి కుమారుడు(19), కుమార్తె(21), మరో ఇద్దరు మహిళలు కలిసి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. అంతలో 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు ఈ ఐదుగురిని సమీపించి మొదట యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె తండ్రిని, తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ పొలాల్లోకి తీసుకెళ్ళి వారిలో ఒకరిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ వీడియో చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది కూడా చదవండి: మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు -
మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది. Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF — ANI (@ANI) July 29, 2023 మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
మణిపూర్ బయలుదేరిన బృందంలో డీఎంకే ఎంపీ కనిమొళి
-
నేడు మణిపూర్‌కు ‘ఇండియా’
న్యూఢిల్లీ: మణిపూర్‌లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్ రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్ చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు. మహిళల గౌరవంతో ఆటలా? బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు.