Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Pays Tribute to Dr BR Ambedkar1
అంబేద్కర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు.

KSR Comments Over YS Jagan Vision And CBN2
జగన్‌ విజన్‌ బాబు తలకెక్కిందా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్‌లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూ​ల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్‌ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్‌ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్‌ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Telangana SC Categorization GO released3
తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ.. రిజర్వేషన్లు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేదర్క్‌ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం.. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..గ్రూప్‌-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్‌గ్రూప్‌-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్‌గ్రూప్‌-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనుంది. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్‌ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.

IPL 2025: Karun Nair, Jasprit Bumrah Involved In Heated Spat During DC VS MI Match, Video Viral4
DC VS MI: కరుణ్‌ నాయర్‌తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం

ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య నిన్న (ఏప్రిల్‌ 13) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్‌ సారీ చెప్పినా​ పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ చివరి బంతికి) కరుణ్‌ పరుగు తీసే క్రమంలో బౌలింగ్‌ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్‌ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్‌ కల్పించుకుని కరుణ్‌కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్‌ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్‌ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్‌ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్‌లో, అంతకుముందు ఓవర్‌లో కరుణ్‌ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్‌ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్‌లో ఏ బ్యాటర్‌ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్‌ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో కరుణ్‌ ట్రెంట్‌ బౌల్ట్‌పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్‌లో కరుణ్‌ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్‌ దెబ్బకు హార్దిక్‌ బౌల్ట్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ కర్ణ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్‌ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌.. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్‌ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్‌ తీసుకుని స్ట్రయిక్‌ రొటేట్‌ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్‌ ఔటయ్యాక (13వ ఓవర్‌లో) కొత్త బంతి తీసుకోవడం​ కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్‌ శర్మ, సాంట్నర్‌, బౌల్ట్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్‌, కేఎల్‌ రాహుల్‌, విప్రాజ్‌ నిగమ్‌ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (59), ర్యాన్‌ రికెల్టన్‌ (41), సూర్యకుమార్‌ యాదవ్‌ (40), నమన్‌ ధీర్‌ (38) రాణించగా.. రోహిత్‌ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

Gold Rates and Silver Price Today On April 14th 20255
బంగారం తగ్గిందోచ్‌... గోల్డ్‌ స్పీడ్‌కు బ్రేక్‌!

వరుసగా ఐదు రోజులుగా దూసుకెళ్తున్న పసిడి ధరలకు బ్రేక్‌ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (April 14) కాస్త దిగొచ్చాయి. స్వల్పంగా రూ.150-రూ.160 మేర తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 95,510 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.95,660 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,700 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇది చదివారా? అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,510 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరల్లోనూ మార్పుదేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.100 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,09,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 99,900 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Hit 3 Nani Movie Trailer Out Now6
మోస్ట్ వైలెంట్‍గా 'హిట్‌-3' ట్రైలర్‌.. మార్కోను మించిపోయిన 'నాని'

హిట్‌3 సినిమాలో అర్జున్‌ సర్కార్‌గా పోలీస్‌ పాత్రలో దుమ్మురేపేందుకు నాని సిద్ధం అయ్యాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన 'మార్కో' సినిమాకు మించిన వయలెన్స్‌ హిట్‌-3లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చెప్పిన వ్యాఖ్యలను హిట్‌3 నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్‌ ఇచ్చారు. ఇదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు. హిట్ 3 సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది. ఈ కామెంట్‌తో వెండితెరపై రక్తపాతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇప్పటికే హిట్ 3(Hit 3 Movie) గురించి నాని ఇలా హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఏ రేంజ్‌లో వయలెన్స్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా భారీ బడ్జెట్‌తో వాల్‍పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై నానినే ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sheikh Hasina Says Bangladeshs History Being Erased7
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్‌ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్‌(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్‌ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్‌(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ మదిలో ‘హైదరాబాద్‌’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

DRDO laser-based weapon demonstration success at Kurnool8
కర్నూలులో డీఆర్‌డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్‌.. భారత్‌ సరికొత్త రికార్డు

కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్‌ వ్యవస్థను డీఆర్‌డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్‌ చేరింది. ఇజ్రాయెల్‌ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్‌డీవో ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco— DRDO (@DRDO_India) April 13, 2025అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్‌డ్‌ వింగ్‌ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

Summer Fire Safety Tips: How To Prevent, Safe Keep Guidelines9
మండే ఎండల్లో..మంటలతో జాగ్రత్త..! అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్‌ఆర్‌ జిల్లాలో రోజురోజుకు ఎండతీవ్రత పెరిగిపోతోంది. అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న సమయమిది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమను, తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి.. నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అసలు అగ్ని ప్రమాద శాఖ సిబ్బంది తదితర వివరాలతో ప్రత్యేక కథనం. వేసవికాలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అప్రమత్తంగా ఉన్నా కొన్ని సమయాలలో ప్రాణనష్టంతో పాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పైగా ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుండడం కలవరపరిచే అంశం. అరకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. లీడింగ్‌ ఫైర్‌మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్లు, సిబ్బంది కొరతతో అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో ఇబ్బంది పడుతున్నారు. ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు గాను ఇద్దరే ఉన్నారు. ఇక స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసరు రెండు స్టేషన్లలో లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్‌ పైర్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌ 31 మందికిగాను ప్రస్తుతం 26 మంది విధులు నిర్వహిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్‌మెన్‌ 102 మంది ఉండాల్సి ఉండగా కేవ లం 42 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నా రు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 211 మందికి గాను 142 మందే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో ఒకేసారి రెండుమూడు చోట్ల ప్రమాదాలు జరిగితే నష్టనివారణ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా 30 మంది హోంగార్డులతోనే విధులు నిర్వహిస్తున్నారు. ముద్దనూరుకు ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ జిల్లాలో 8 ఫైర్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాత భవనాలు కలిగి ఉన్న కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో నూతన భవనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ముద్దనూరులో ఫైర్‌ స్టేషను’ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు..జిల్లాలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల పరిధిల్లో 14 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. కడప ఫైర్‌ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ఈ వారోత్సవాలను ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది అగ్నిమాపక శాఖ వారు ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు ‘అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. అలాగే అవకాశం ఉన్నపుడల్లా... స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, కడప నగర శివార్లలోని ఐఓసి గ్యాస్‌ ప్లాంట్, కర్మాగారాలలో అగి్నమాపక అధికారులు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం ఎటువంటి అగ్ని ప్రమాదాలు, విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వాహనాలకు చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ మరమ్మతులు చేయించా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డుల కు కూడా రెస్క్యూ ఆపరేషన్‌పై శిక్షణ ఇచ్చాం –ధర్మారావు, జిల్లా అగి్నమాపక శాఖ అధికారి అగ్ని ప్రమాదాల నివారణపై పాటించాల్సిన నియమాలు 👉: ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు. 👉: కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు. 👉: ఐ.ఎస్‌.ఐ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలనే ఉపయోగించాలి. 👉: పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌లోడ్‌ వేయకూడదు. ఎలక్ట్రికల్‌ సాకెట్‌ నందు దాని కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి. 👉: ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులకు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయడం ఉత్తమం. 👉: ప్రమాదవశాత్తు అగి్నప్రమాదం జరిగితే ఆర్పటానికి ఎళ్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ చేయాలి. 👉: గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్‌ వాల్‌్వను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్‌ స్విచ్‌లు ఆన్‌/ఆఫ్‌ చేయరాదు. 👉: స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్‌ మాల్స్‌లలో ఆర్‌సిసి లేదా కాంక్రీట్‌ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి. 👉: ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్‌లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్‌లలో ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్‌లు ఉపయోగించాలి. 👉: గోడౌన్‌లలో వస్తువులను నిల్వ ఉంచేటపుడు స్టాక్‌లకు మధ్య ఖాళీస్థలం ఉంచాలి. 👉: గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేసి, వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. 👉: కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్‌ ఫైర్‌ ఫైటింగ్‌పై శిక్షణ ఇవ్వాలి. 👉: విద్యుత్‌ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి. 👉: పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ గోడౌన్‌లలో వాహనదారులు, బంక్‌ల యందు డీజల్‌గాని, పెట్రోల్‌గాని నింపుకొన్నపుడు వాహనం ఇంజను పూర్తిగా ఆఫ్‌ చేయాలి. వాహనదారులు ఇంధన నింపుకున్న తరువాత కొద్ది దూరం వెళ్లిన తరువాత బండి స్టార్ట్‌ చేయాలి. వాహనదారులు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిగానీ పెట్రోల్‌ బంక్‌ ఉన్న ప్రదేశంలో బీడీగాని, సిగరెట్‌గాని కాల్పరాదు. సెల్‌ఫోన్‌ ద్వారా సంభాషించరాదు. నీటివసతి అందుబాటులో ఉండాలి. (చదవండి: పర్యావరణ ‍స్పృహతో రైతు సృష్టిస్తున్న అద్భుతం..! దాంతో ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..!)

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion10
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement