
మెల్‌బోర్న్: ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు వర్చువల్‌గా హాజరయ్యారాయన.

‘‘వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదు’’ అని కాకాణి అన్నారు.

ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం. వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. అండగా నిలుస్తాం. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జూమ్ కాల్ ద్వారా పార్టీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇక.. వైఎస్సార్ జయంతి సందర్భంగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, మరియు నాగార్జున పాల్గొన్నారు.

