Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistani High Commission in Delhi celebrating With Cake1
పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్‌ సంబరాలు?

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్‌ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్‌ కట్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్‌ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్‌ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్‌ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ ప్రతినిధులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్‌ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025

KSR Comments On Chandrababu Govt Land Allotments To TCS2
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్‌ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్‌ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్‌ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్‌ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్‌ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్‌ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్‌ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్‌ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్‌ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Operation Kagar in Mulugu Karregutta Latest Updates3
ములుగులో ముమ్మరంగా ఆపరేషన్‌ కగార్‌

ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌(Operation Kagar) మూడో రోజుకి చేరింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో కూంబింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఎప్పుడు.. ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్‌, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టారు. మూడు హెలికాప్టర్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్‌ కొనసాగుతోంది. కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్‌గడ్‌ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవ‌ల మావోయిస్టుల నుండి క‌ర్రెగుట్ట‌ల్లో బాంబులు అమ‌ర్చామని.. గుట్ట‌ల్లోకి ఎవ‌రు రావొద్దంటూ లేఖ విడుద‌ల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్ర‌మ‌త్త‌మైన ఇరు రాష్ట్రాల పోలిస్ బ‌ల‌గాలు క‌ర్రెగుట్ట‌ల్లో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మ‌డ‌వి హిడ్మా, హీడ్మా ద‌ళం క‌ర్రెగుట్ట‌ల్లో సంచ‌రిస్తున్న‌ట్లుగా కేంద్ర సాయుద బ‌ల‌గాల‌కు ఉప్ప‌ందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్‌ డైలాగ్‌ కమిటీ(పీడీసీ) చైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.

Beerappa A youth from shepherding community clears UPSC Success Details4
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!

‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్‌ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్‌ పూర్తి చేసి.. చివరకు పోస్టల్‌ జాబ్‌ కొట్టాడు.ఐపీఎస్‌ కావాలనే కలతో.. సివిల్స్‌ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్‌ జాబ్‌ను వదిలి ప్రిపేర్‌ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్‌ చేశాడు. మొన్న ఏప్రిల్‌ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్‌ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu

IPL 2025, SRH VS MI: Rohit Sharma Storms Into Record Books As Fifth Fastest To 12000 T20 runs5
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్‌ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్‌ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్‌ గేల్‌ (345 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. గేల్‌ తర్వాత విరాట్‌ (360), వార్నర్‌ (368), అలెక్స్‌ హేల్స్‌ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్‌గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్‌ తన టీ20 కెరీర్‌లో 8 సెంచరీలు, 80 హాఫ్‌ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ముంబై బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-26-4), దీపక్‌ చాహర్‌ (4-0-12-2), హార్దిక్‌ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్‌ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్‌ (71), అభినవ్‌ మనోహర్‌ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్‌ (11) వికెట్‌ కోల్పోయింది. అయినా రోహిత్‌ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స‍ర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

somashetti Madhusudan Funeral At Kavali Over Pahalgam6
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన

మధుసూదన్‌ అంత్యక్రియలు అప్‌డేట్స్‌.. మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిసోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అంత్య క్రియలకు హాజరుకానున్న మంత్రి ఆనంకావలి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొననున్న మంత్రి ఆనం.👉జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం కావలి చేరుకుంది. మధుసూదన్‌ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మధుసూదన్‌ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో​ బంధువులు, స్థానికులు చేరుకున్నారు.👉వివరాల ప్రకారం.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. మరోవైపు.. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.👉ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. దేశం మొత్తం మృతుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మృతుని కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తున్నారు’ అని తెలిపారు.👉కశ్మీర్‌లో పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది. సోమిశెట్టి మధుసూదన్‌ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్‌ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి పట్టణంలోని పెదపవని బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల తరువాత మధుసూదన్‌రావు పుట్టారు. స్థోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేరారు.👉వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్‌ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు (ఇంటర్‌) కుమారుడు దత్తు (8వతరగతి)తో కలసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్‌రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ల బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. మృతుడు మధుసూదన్‌కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Pahalgam Navy Officer Vinay NarwalLast Video With His Wife video goes viral 7
స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్‌

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రమూకల పైశాచికత్వం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 26 మంది అమాయకులు అసువులు బాసారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నావికాదళ అధికారి, సెలవులో ఉన్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. హర్యానాకు చెందిన వినయ్‌ వివాహం ఏప్రిల్ 16న హిమాన్షితో జరిగింది. హనీమూన్‌ కోసమని 'మినీ స్విట్జర్లాండ్' వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. వినయ్ ఉగ్రవాదుల చేతిలో మరణించాడు.లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ , అతని భార్య హనీమూన్ కోసం ముందు స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారట. కానీ వీసా రిజెక్ట్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌ ,సుందరమైన బైసరన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిసెప్షన్ పార్టీ తర్వాత రెండు రోజుల తర్వాత పెళ్లైన ఆరు రోజులకు పహల్గాం వెళ్లారని అదే తన మనవడి జీవితానికి శాపంలా తగిలిందని వినయ్ తాత , హర్యానా రిటైర్డ్ పోలీసు అధికారి హవా సింగ్ తెలిపారు. , తన మనవడికి స్విస్ వీసా మంజూరు అయి ఉండే తన మనవడు ప్రాణాలతో ఉండావాడని కన్నీటి పర్యంతమయ్యారు.చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం दुःखद नेवी ऑफिसर लेफ्टिनेंट विनय नरवाल की मौत से पहले का आखिरी वीडियो#PahalgamTerroristAttack pic.twitter.com/kIlP6mJc5E— Manish Yadav लालू (Journalist) (@ManishMedia9) April 23, 2025 ; మరోవైపు వినయ్ నర్వాల్ భార్యతో కలిసి ఆనందంగా గడుపుడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భర్తతో హిమాన్షి రీల్ వీడియోను షూట్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత, ఆయన శవపేటికను కౌగిలించుకుని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు కలచివేశాయి. "జై హింద్" అంటే తన భర్తకు కన్నీటి నివాళులర్పించింది. చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు VIDEO | Karnal: Navy officer Lt. Vinay Narwal, who lost his life in the Pahalgam terror attack, was cremated with state honours.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/xUirNpooUC— Press Trust of India (@PTI_News) April 23, 2025 సోదరి చేతుల మీదుగా అంత్యక్రియలువినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కర్నాల్‌లోని అతని స్వగ్రామంలో అన్ని గౌరవ లాంఛనాలతో జరిగాయి. నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సోదరి కర్నాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ సహా, పలువురు ఆర్మీ , నేవీ అధికారులు కూడా అంతిమ నివాళులు అర్పించారు.

YSRCP Vidadala Rajini Relative Gopi Arrest In Hyderabad Updates8
రెడ్‌బుక్‌ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్‌

సాక్షి, గుంటూరు/హైదరాబాద్‌: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు.

Godrej Unlocks a New Range of Smart Security in Hyderabad9
పసిడి పరుగుతో లాకర్లకు డిమాండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పసిడి ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో హోమ్‌ లాకర్లకు కూడా గణనీయంగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌నకు చెందిన సెక్యూరిటీ సొల్యూషన్స్‌ విభాగం సరికొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. గృహ, వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడే 7 ఉత్పత్తులు ఉన్నాయి.వీటిలో డిజిటల్‌.. బయోమెట్రిక్‌ యాక్సెస్, ఇంటెలిజెంట్‌ ఐబజ్‌ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉన్నట్లు సెక్యూరిటీ సొల్యూషన్స్‌ బిజినెస్‌ హెడ్‌ పుష్కర్‌ గోఖలే వివరించారు. ఇళ్లలో వినియోగించే ఉత్పత్తుల ధర శ్రేణి రూ. 9,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 500 పైచిలుకు అవుట్‌లెట్స్‌ ఉండగా, సుమారు రూ. 130 కోట్ల ఆదాయం ఉంటోందని జోనల్‌ హెడ్‌ శరత్‌ మోహన్‌ పేర్కొన్నారు.

Vijayashanti React On Chiranjeevi AND Balakrishna Movies10
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా 'అఖండ2'లో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి(Vijayashanti ) నటిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అందులో ఆమె నటిస్తే సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అవుతుందని మేకర్స్‌ కూడా ప్లాన్‌ చేశారని టాక్‌ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా కల్యాణ్‌రామ్‌తో అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిలో దుమ్మురేపారు. దీంతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలకృష్ణ( Nandamuri Balakrishna), చిరంజీవిలతో సినిమాలు చేస్తారని అభిమానులు భావించారు. అయితే, విజయశాంతి ఆలోచనలను భట్టి చూస్తే జరిగే పని కాదని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఆమె మాట్లాడారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయశాంతికి ఇలా ఒక ప్రశ్న ఎదురైంది. 'చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట కదా.. మళ్లీ వారితో చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చెరో సినిమా చేశాక మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు' అనే ప్రశ్నకు ఒక సెకను కూడా ఆలోచించకుండా విజయశాంతి సమాధానం ఇచ్చారు. 'నటించే చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు… పనిచేయాలి కదా.. అసలు కుదరదు' అని చెప్పారు. ఆ ప్రశ్నే పూర్తిగా అసంబద్ధం అనిపించేలా విజయశాంతి సమాధానం ఇచ్చారు.విజయశాంతికి టైమ్‌ ఉన్నా కూడా చిరంజీవి(Chiranjeevi )తో సినిమా చేయదని సోషల్‌మీడియాలో కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో ఒక సినిమాకు సంబంధించి వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని గుర్తుచేస్తున్నారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ కూడా విజయశాంతితో నటించడానిక ఇష్టపడకపోవచ్చు. దానికి ప్రధాన కారణం గతంలో వారికి సమానంగా స్టేటస్‌ను ఆమె అనుభవించారు. ఇప్పుడు వారి సినిమాల్లో ఆమెకు పాత్ర ఇవ్వాలంటే సమానమైన రోల్‌ ఇవ్వాలి. అందుకు వారిద్దరూ ఒప్పుకోరు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో మరో పాత్ర ప్రధానంగా హైలెట్‌ అవడం చాలా తక్కువని చెప్పవచ్చు. వారిద్దరి కంటే ప్రాముఖ్యత తక్కువగా ఉన్న రోల్‌ విజయశాంతికి ఇస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకోరు. అందుకే ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేయడం అంత సులభం కాదని నెటిజన్ల అభిప్రాయం.ఇప్పటి తరం యూత్‌కు అంతగా విజయశాంతి ఇమేజ్‌ గురించి తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోలకు ఎంత క్రేజ్‌ ఉంటుందో ఆమెకు కూడా అంతే స్థాయిలో ఇమేజ్‌ ఉండేది. అలాంటి స్టేటస్‌ను ఆమె అనుభవించారు. అందుకే రీసెంట్‌గా జరిగిన సినిమా వేడుకలో ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్‌రామ్‌ ఆమె పట్ల చాలా గౌరవంగానే మెలిగారు. కర్తవ్యం సినిమాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డ్‌ అందుకోవడంతో పాటు 4 నంది, 6 ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ను అందుకున్నారు. 1989లోనే ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడమే కాకుండా తమిళ్‌, మలయాళం, కన్నడ వంటి భాషల్లో మెప్పించారు. సుమారు 200 సినిమాల్లో ఆమె నటించారు. బాలయ్య, చిరుతో సహా ఆ నంబర్స్‌కు దగ్గర్లో లేరు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement