Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leader Pratap Reddy Injured In Attack Nandyal1
వైఎస్సార్‌సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి

నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించారని బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు.ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైఎస్సార్ సీపీ మండిపడింది చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని, ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.

We Are Doomed For Life Bengal Teachers 2
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే

ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.కాగా, వెస్ట్‌ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

IPL 2025 CSK vs DC: Toss Playing XIs Scores Updates And Highlights3
CSK vs DC: ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?

IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ అప్‌డేట్స్‌ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కాగా తొలి ఓవర్లోనే ఓపెనర్‌ మెగర్క్‌ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టును ఆదుకున్నాడు.Kamaal KL! 😎🏏KL Rahul brings up a sublime fifty as he leads the charge for #DC, eyeing a historic win at Chepauk, their first since 2010! Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW #IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar pic.twitter.com/bSx5mXAuoh— Star Sports (@StarSportsIndia) April 5, 2025వన్‌డౌన్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ (20 బంతుల్లో 33) ఆది నుంచే దంచికొట్టగా.. రాహుల్‌ మాత్రం తొలుత ఆచితూచి ఆడాడు. అనంతరం కాస్త స్పీడు పెంచిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో.. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.మిగతా వాళ్లలో కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 21) , సమీర్‌ రిజ్వీ (15 బంతుల్లో 21), ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (12 బంతుల్లో 24 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఇక సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్‌ అహ్మద్‌, మతీషా పతిరణ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.2:పతిరణ బౌలింగ్‌లో రాహుల్‌ (77) వికెట్‌ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.ధోని మ్యాజిక్‌.. ఐదో వికెట్‌ డౌన్‌19.3: పతిరణ బౌలింగ్‌లో అశుతోశ్‌ శర్మ (1) రనౌట్‌ అయ్యాడు. స్టబ్స్‌తో కలిసి పరుగు పూర్తి చేసుకున్న అశుతోశ్‌ను.. వికెట్ల వెనుక వేగంగా కదిలిన ధోని అద్బుత రీతిలో రనౌట్‌ చేసి వెనక్కి పంపాడు. నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ16.1: ఖలీల్‌ అహ్మద్‌ మరోసారి అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో మేగర్క్‌ రూపంలో కీలక వికెట్‌ తీసిన ఈ పేస్‌ బౌలర్‌.. తాజాగా సమీర్‌ రిజ్వీని వెనక్కి పంపాడు.అహ్మద్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వీ పెవిలియన్‌ చేరాడు. అతడి స్థానంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 148/4 (16.2)15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 138/3 (15)కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది 38వ ఫిఫ్టీ. మరోవైపు సమీర్‌ రిజ్వీ నిలకడగానే ఆడుతున్నాడు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాహుల్‌ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. రిజ్వీ 13 బంతుల్లో 19 రన్స్‌ చేశాడు.10.4: మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీఅక్షర్‌ పటేల్‌ రూపంలో ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అక్షర్‌ బౌల్డ్‌ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్‌ 21 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 90/3 (10.4). సమీర్‌ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు.10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 82/2 అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి అక్షర్‌ 12 బంతుల్లో 20, రాహుల్‌ 23 బంతుల్లో 29 రన్స్‌తో ఉన్నారు. రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్‌ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్‌ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి రాగా.. రాహుల్‌ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5) పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)పోరెల్‌ 32, రాహుల్‌ 19 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1రాహుల్‌ 8, పోరెల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2) ముకేశ్‌ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్‌ పోరెల్‌. 0,4, 6, 4, 4, 1. రాహుల్‌ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్‌ఖలీల్‌ అహ్మద్‌ చెన్నై బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్‌ చేసిన ఖలీల్‌... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్‌ పోరెల్‌ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)రుతు సారథ్యంలోనేఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.ఫాఫ్‌ లేడుమరోవైపు.. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వికెట్‌ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్‌ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.తుదిజట్లుచెన్నైరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌శివం దూబే, జేమీ ఓవర్టన్‌, షేక్‌ రషీద్‌, కమలేశ్‌ నాగర్‌కోటిఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌ముకేశ్‌ కుమార్‌, కరుణ్‌ నాయర్‌, దర్శన్‌ నాల్కండే, డొనోవాన్‌ ఫెరీరా, త్రిపురాణ విజయ్‌

YS Jagan Anantapur Visit Confirmed Check Details Here4
వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు

అనంతపురం, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Many Suspicions Are Being Raised In The Rajahmundry Naganjali Case5
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది.

Tollywood Actor Jayaprakash Reddy Daughter Mallika About Her Father6
గవర్నమెంట్‌ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. ఇద్దరి మరణం ఒకేలా..

జయప్రకాశ్‌ రెడ్డి (Jaya Prakash Reddy).. దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు చేశాడు. తన మేనరిజంతో, స్పెషల్‌ డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్‌గా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన 74 ఏళ్ల వయసులో మరణించారు. జయప్రకాశ్‌ కుమార్తె మల్లిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. మల్లిక మాట్లాడుతూ.. 'నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోపక్క స్టేజీపై నాటకాలు వేసేవారు. రూ.5 లక్షల అప్పుఆయన నటన చూసి సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. కొన్నాళ్లకు అక్కడ సెట్‌ కాకపోవడంతో నాన్న ఐదేళ్లకే తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు. రూ.5 లక్షల వరకు అప్పు కావడంతో మళ్లీ సినిమాల్లోకి వెళ్లకూడదనుకున్నారు. ఏడేళ్లపాటు టీచర్‌గానే ఉన్నారు. కానీ ఓసారి రామానాయుడు కంటపడటంతో ఆయన తిరిగి సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రేమించుకుందాం రా మూవీతో నాన్నకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. లాక్‌డౌన్‌లో మరణంనాన్నగారి కంటే రెండేళ్ల ముందు అమ్మ చనిపోయింది. నాన్నకు లో బీపీ. కరోనా సమయంలో నా తమ్ముడికి, అతడి పిల్లలకు కూడా వైరస్‌ సోకడంతో ఆయన భయపడిపోయాడు. షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర లేచాడు. స్నానానికి వెళ్లినప్పుడు ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో ఇంట్లో వాళ్లు డోర్‌ తెరిచి చూస్తే ఆయన నిర్జీవంగా పడి ఉన్నాడు.అఖండలో ఆఫర్‌ఆయన మరణం మమ్మల్ని అందరినీ షాక్‌కు గురి చేసింది. లాక్‌డౌన్‌ వల్ల నాన్న అంతిమయాత్రలకు సెలబ్రిటీలు ఎవరూ హాజరు కాలేకపోయారు. నాన్న చనిపోవడానికి ముందు అఖండ, క్రాక్‌ సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతలోనే ఇది జరిగిపోయింది. నాన్న ఎన్నో సహాయకార్యక్రమాలు చేశారు. చాలామందిని చదివించారు. నాన్న మరణించాక ఈ విషయాలు తెలిసి కన్నీళ్లు వచ్చాయి. అమ్మానాన్న ఇద్దరూ గుండెపోటుతోనే మరణించారు.నిర్మాతగా..తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు నిర్మాతగా మారాను. అలా నేను నిర్మిస్తున్న ఓ మూవీ షూటింగ్‌కు వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి మా కారు బోల్తా కొట్టింది. అప్పుడు నాకు శరీరంపై 42 కుట్లు పడ్డాయి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని నా సినిమాను పూర్తి చేశాను అని మల్లిక చెప్పుకొచ్చింది. ప్రేమించుకుందాం రా.., జయం మనదేరా, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, నిజం, కబడ్డీ కబడ్డీ, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, ఢీ, యమదొంగ, రెడీ, నాయక్‌.. ఇలా వందల సినిమాలతో వినోదం పంచిన జయప్రకాశ్‌ రెడ్డి 2020 సెప్టెంబర్‌ 8న మరణించారు.చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం..: మోహన్‌బాబు

A Pro Palestinian Employee Interrupts Microsoft AI CEO At Company 50th Anniversary Celebration Video Viral7
'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్‌ ఎదుటే నిరసన (వీడియో)

శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025

Union Home Minister Amit Shah Visit To Dantewada District8
మావోయిస్టులకు అమిత్‌ షా సవాల్‌

ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాండుం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్‌ షా అన్నారు.ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు ఆయన గట్టి సవాలు విసిరారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.మోదీ నుంచి తానొక సందేశం తెచ్చా.. వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తాం’’ అని అమిత్‌ షా ప్రకటించారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను బస్తర్‌కు తీసుకువస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.#WATCH | Dantewada, Chhattisgarh: Union Home Minister Amit Shah says, "Now the time has gone when bullets were fired and bombs exploded here. I have come to request all those people who have weapons in their hands, all the Naxalite brothers, to give up their weapons. No one is… pic.twitter.com/A2j2oOC7El— ANI (@ANI) April 5, 2025

Operation Cheyutha: 86 Maoists surrender to police in Telangana9
భద్రాద్రి కొత్తగూడెం: భారీగా దళ సభ్యుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా బీజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలుస్తోంది. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి.. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం.. అంటూ ఆపరేషన్‌ చేయూతను చేపట్టింది పోలీస్‌ శాఖ. ఈ కార్యక్రమం కింద.. లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ రూ. 25 వేల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు.లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారు. పైగా మావోయిస్టు పార్టీ పేరుతో కొందరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. తక్షణమే ఆ పనిని ఆపాలి. గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యుల లొంగిపోయారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 203 మంది లొంగిపోగా.. మరో 66 మందిని అరెస్ట్‌ చేశాం అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగ జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.కిందటి నెలలోనూ ఆపరేషన్‌ చేయూతకు విశేష స్పందన లభించింది. ఒకేరోజు 64 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఇదిలా ఉంటే.. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్ట్‌ రహిత భారత్‌కు కేంద్ర హోం శాఖ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, అవసరమైతే కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు ఓ లేఖ రాశారు.

IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin10
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య

జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్‌ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్‌ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్‌ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్‌ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement