
ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి
గోదావరిఖని(రామగుండం): రామగుండం కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోకుండా పలు నిర్మాణాలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎన్టీపీసీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. అనుమతి లేకుండా ఎన్టీపీసీటౌన్‌షిప్‌లోని ఆరు ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలపై రామగుండం కార్పొరేషన్ రూ.99.28 కోట్ల భారీ ఫెనాల్టీ విధించిన విషయాన్ని లేఖ ద్వారా గురువారం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ నిబంధనలను ఎన్టీపీసీ ఉల్లంఘించడం ఆక్షేపనీయమని, వాటిని గౌరవించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు భారీ ఫెనాల్టీ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా తీసుకుని తగిన పరిష్కార చర్యలను చేపట్టాలని, రామగుండం ప్రాంత అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఎంపీ సూచించారు.
కోనోకార్పస్ చెట్ల తొలగింపు
పెద్దపల్లిరూరల్: పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి కోనోకార్పస్ చెట్లు హాని కలిగిస్తాయంటూ ‘సాక్షి’లో ఈనెల 2న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లాకేంద్రంలో రాజీవ్‌రహదారి డివైడర్ల మధ్య ఉన్న కోనోకార్పస్ చెట్లను నరికివేయిస్తున్నారు. ఈ చెట్లకు నీళ్లు అవసరం లేదని, వీటిపై పిట్టకూడ వాలదు..ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్‌డయాకై ్సడ్ విడుదల చేసే మొక్కలను తొలగించాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అధికారులు ఈ చెట్లను నరికివేస్తుండడంతో మళ్లీ అవి తిరిగి పెరుగుతాయని, వాటిని సమూలంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
గోదావరిఖని/ కమాన్‌పూర్/యైటింక్లయిన్‌కాలనీ: కమాన్‌పూర్ పోలీసుస్టేషన్‌ను గురువారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తనిఖీ చేశారు. డీసీపీకి ఎస్సై కొట్టె ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా వ్యవహరించాలని, డయల్ 100 ఫిర్యాదుకు వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీసీపీ వెంట గోదావరిఖని ఏసీపీ రమేశ్‌గౌడ్ ఉన్నారు.
బాధితులకు భరోసా కల్పించాలి
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు తెలుసుకొని వారికి నమ్మకం కల్పించాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. గురువారం గో దావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టూటౌన్ పరిధిలోని రౌ డీషీటర్లు, తదితర వివరాలు తెలుసుకున్నారు.
మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరిస్తాం
రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని, మార్పురాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని డీసీపీ హెచ్చరించారు. గోదావరిఖని వన్‌టౌన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. హత్య నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.

ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి

ఎన్టీపీసీపై చర్యలు తీసుకోండి