
బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం
● ఉన్నతంగా ఎదిగేందుకు పూలే ఆదర్శం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ● జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
పెద్దపల్లిరూరల్: సమాజంలో గౌరవంతోపాటు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే చదువుతోనే సాధ్యమని గుర్తించి విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జ్యోతిబాపూలే అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబాపూలే జయంతిలో ఆయన మాట్లాడారు. బాలికావిద్యకు పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు బొంకూరి శంకర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, సి– విభాగం సూపరింటెండెంట్ బండి ప్రకాశ్, తహసీల్దార్ రాజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి ‘పూలే’
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్/రామగుండం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. జీడీకే–5గనిపై ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, బీసీ సంఘం ఫౌండర్ పంజాల శ్రీనివాస్, అధ్యక్షులు వసంత్‌కుమార్, పెరుమాళ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, అనిల్‌గబాలే, దీటి చంద్రమౌళి, మల్లేశం, వూట్ల దేవాచారి, ఏసీపీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక రాజేశ్ థియేటర్ సమీపంలో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి సభలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఏసీపీ రమేశ్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, దాసరి ఉమ, సాంబమూర్తి పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని శ్రీరేణుకా ఎల్లమ్యను కృష్ణయ్య దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆర్.కృష్ణయ్యకు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. నా యకులు చిలువేరు కుమార్, ఏరుకొండ తిరుపతి, బడికెల కరుణాకర్, కందుల పోశం పాల్గొన్నారు.
సీవరేజ్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి
వ్యర్థ జలాలను శుద్ధి చేసే సీవరేజ్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూ చించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రూ.88 కోట్లతో ఐదు సీవరేజ్ ప్లాంట్లు మంజూరయ్యాయని, పనులు త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. అధికారులు రామన్, దేవేందర్‌రెడ్డి, మౌనిక, మనోజ్, భాను తదితరులు పాల్గొన్నారు.

బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం