
బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి
పెద్దపల్లిరూరల్: రాష్ట్రాభివృద్ధి తమ పార్టీతోనే సా ధ్యమని, ప్రజలు తమకే మద్దతుగా నిలవాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎ మ్మె ల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గాం చలో.. ఘర్ చలో’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్థానిక బాలాజీనగర్‌లో ఇంటింటా పర్యటించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కిలో బియ్యం ఇస్తూ.. లబ్ధిదారుల ఇళ్లు వెళ్లి ఆ బియ్యమే తిని వస్తున్నారని ఎద్దేవా చేశారు. నాయకులు చక్రధర్‌రెడ్డి, సతీశ్, సదానందం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యో సమస్య పరిష్కరిస్తాం
కమాన్‌పూర్(మంథని): వచ్చే ఎన్నికల్లో తమ పా ర్టీని గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. ‘గాం చలో.. బస్తీ చలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అర్హులైన ప్రతీఒక్కరికి అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యడ సతీశ్, మచ్చగిరి రాము, దండె లక్ష్మీనారాయణ, మట్ట శంకర్, జంగపెల్లి అజయ్, మల్లారపు అరుణ్, భూంపెల్లి మొండయ్య, కొమ్ము శ్రీనివాస్, వడ్లకొండ తిరుపతిగౌడ్, రమేశ్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.