
డేంజర్ టర్నింగ్!
గోదావరిఖని(రామగుండం): మొన్న యాష్ ట్యాంకర్ లారీ.. నిన్న లోడ్ లారీ జీఎం ఆఫీస్‌మూలమలుపు వద్ద బోల్తాపడ్డాయి. కారణాలేమైనా మూలమలుపు ప్రమాదకరంగా మారింది. రాజీవ్‌రహదారి వెంట రామగుండం తహసీల్ కార్యాలయం నుంచి గంగానగర్ ఫ్లైఓవర్‌వరకు రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతం కావడంతో రోడ్లు నిత్యం బిజీగా ఉంటున్నాయి. జనసామర్థ్యానికి తగినట్లు రోడ్డు లేకపోవడంతో ఈప్రాంతాల్లో రోజూ ఎదోచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. మూలమలుపు వద్ద ప్రమాదాలు అరికట్టేందుకు స్టాపర్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసినా ప్రమాదాలు తప్పడం లేదు. గతంలో కర్రల లోడ్ లారీ బోల్తాపడడంతో కర్రలన్నీ చెల్లాచెదురుగా పడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హెచ్‌కేఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన రహదారి వెంట తహసీల్దార్ కార్యాలయం నుంచి గోదావరిబ్రిడ్జివరకు బ్లాక్‌స్పాట్‌లు ఎక్కువగా ఉన్నాయి. స్థానికఎమ్మెల్యే దృష్టిసారించి హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించగా, కొంత మేర సఫలీకృతం అయినా చాలా చోట్ల సర్వీస్ రోడ్లు పూర్తికాలేదు.
ప్రమాద స్థలాలు
● ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద కార్మికులు రోడ్డు దాటుతున్న క్రమంలో రాజీవ్‌రహదారిపై వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొని పలువురు మృతిచెందగా చాలామంది గాయాలపాలయ్యారు. ఇక్కడఫుట్‌బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బ్లాక్‌స్పాట్‌గా ఆర్‌ఎఫ్‌సీఎల్ క్రాస్‌రోడ్డు
● ఆర్‌ఎఫ్‌సీఎల్ క్రాస్‌రోడ్డు రాజీవ్‌రహదారిపై రోడ్డు క్రాస్‌చేస్తున్న క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
● రాజీవ్‌రహదారి మున్సిపల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. చౌరస్తా సమీపంలో మెడికల్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండటంతో జనసంచారం పెరిగింది. ఇక్కడ పాదచారులు రోడ్డు దాటేందుకు ఫుట్‌బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలంటున్నారు.
● బస్టాండ్‌కు కొద్ది దూరంలోనే జీఎం ఆఫీస్ మూలమలుపు ఉంది. మూలమలుపు గతంతో ఇరుకుగా ఉండటంతో రాఖీ కట్టేందుకు వెళ్తున్న అన్నాచెల్లెళ్లలను లారీ ఢీకొనగా, చెల్లెలు అక్కడికక్కడే మృతిచెందింది.
జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద తరచూ ప్రమాదాలు
ప్రైవేట్ బస్సును ఢీకొని బోల్తాపడిన లారీ
‘ఈనెల 1న వేకువజామున జీఎం ఆఫీస్ క్రాసింగ్ వద్ద యాష్‌ట్యాంకర్ లారీ వేగంగా వచ్చి అదుపు తప్పి బోల్తాపడింది. ఆసమయంలో అక్కడ ఏలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది’.
‘ఈనెల 3న గురువారం సాయంత్రం ఇదే మూలమలుపు వద్ద బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ వెనక నుంచి రాసుకుంటూ వెళ్లి బోల్తాపడింది. ఈఘటలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి’.
ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇటీవలే పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించాం. హైవే రోడ్డు కాంట్రాక్టర్ తప్పిదం ఉంటే నోటీసు ఇచ్చి సరిచేసేలా చూస్తాం.
– అంబర్‌కిషోర్‌ఝా, సీపీ, రామగుండం

డేంజర్ టర్నింగ్!

డేంజర్ టర్నింగ్!