
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు తీరును ఎక్స్ వేదికగా సీఎం జగన్ ఎండగట్టారు. ‘‘జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు. నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
జగన్ ఒక టిప్పర్ డ్రైవర్‌కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024
నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు… pic.twitter.com/Mo1DD2MRHG
8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. "ఒక టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్ నిలదీశారు.
"వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు.