
ఢిల్లీ: రాజ్యసభలో మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్డీఏ వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలని అనుకున్నారని, అందుకు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi) ఒప్పుకోలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ యూపీఏ హయాంలో చైర్మన్ పదవి పవర్ సెంటర్ గా ఉండేది. కానీ నరేంద్ర మోదీ ఎవరిని కూడా ఎన్డీఏ చైర్మన్ గా పెట్టలేదు. ప్రభుత్వంలో వేలు పెట్టే ప్రయత్నాలను అడ్డుకున్నారు
ఎన్డీఏ పార్టీల కమిటీ చైర్మన్ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. కనీసం ఎన్డీఏ పార్టీల వైస్ చైర్మన్ పదవి కోసం చంద్రబాబు ప్రయత్నించారు. ఎన్డీఏ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవిని చంద్రబాబు అడిగారు. కానీ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనికి మోదీ అస్సలు అంగీకరించలేదు. పరిపాలన ఎలా సాగించాలో నరేంద్ర మోదీకి బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. దేశంలో ప్రధాని మోదీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు’ అంటూ దేవెగౌడ వ్యాఖ్యానించారు.