హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌ భార్య సవాల్‌ | Ex Mp Nandigam Suresh Wife Challenged Home Minister Anita | Sakshi
Sakshi News home page

హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్‌ భార్య సవాల్‌

Published Wed, Sep 11 2024 10:48 AM | Last Updated on Wed, Sep 11 2024 11:24 AM

Ex Mp Nandigam Suresh Wife Challenged Home Minister Anita

తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని.. టీడీపీ ఆఫీస్‌పై దాడికి తన భర్త వెళ్లలేదని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత అన్నారు.

సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.

‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్‌ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! 

చంద్రబాబు సర్కార్‌ కుతంత్రం..
కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వర­దలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్‌ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.



 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement