
దుబాయ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో దీపాంశు శర్మ పసిడి పతకం సాధించాడు. దీపాంశు జావెలిన్‌ను 70.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
భారత్‌కే చెందిన రోహన్ యాదవ్ 70.03 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ప్రియాంశు రజత పతకం నెగ్గాడు. ప్రియాంశు 3 నిమిషాల 50.85 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ (53.01 మీటర్లు) రజత పతకం గెలిచాడు.