
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బీజీటీలో భారత్ ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌లో మట్టికరిపించడం ఖాయమని జోస్యం చెప్పాడు.
భారత్ తమ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇప్పటికీ ఒత్తిడి ఆస్ట్రేలియాపైనే ఉందని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి విన్నింగ్ కంటెండర్‌గా బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు బీజీటీ 2024-25పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే వారి నెర్వస్‌నెస్ స్పష్టంగా బయటపడుతుందని అన్నాడు. భారత్ తాజాగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్ శర్మ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.
కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్..
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండాల్సి వస్తే, అతని స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్ వ్యక్తిగత కారణాల చేత తొలి టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్ నిజంగా తొలి టెస్ట్‌కు దూరమైతే బూమ్రా టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్లూ ఇచ్చాడు. తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే.
KL Rahul, Shubman Gill & Yashasvi Jaiswal in today's practice session at WACA in Perth ahead of BGT. 🇮🇳⭐pic.twitter.com/91TCibESHx
— Tanuj Singh (@ImTanujSingh) November 12, 2024
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు..
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేశారు. విరాట్ సహా భారత్ బృందంలోని పలువురు సభ్యులు రెండు రోజుల కిందటే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టారు. విరాట్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు 10 రోజుల ముందే మ్యాచ్‌కు వేదిక అయిన పెర్త్‌కు చేరుకున్నారు.